
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా పుతిన్ తన ఇష్టానుసారం ఉక్రెయిన్‌పై మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని వైమానిక రక్షణ పరికరాలను అందంచనున్నట్టు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజాగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ పరికరాలను యూరప్ నుంచి పంపించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే దాడులకు దిగింది. రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. మరోవైపు.. మాస్కోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని కీవ్ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment