
వాషింగ్టన్ డీసీ: రష్యా- ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మీడియాతో మాట్లాడుతూ రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి నిబంధనల దిశగా అమెరికా అధక్షుడు ట్రంప్ యోచిస్తున్నారన్నారు. గత వారం పుతిన్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ద నియంత్రణకు పరిష్కారాలు లభించాయని అన్నారు. కాగా పుతిన్ డిమాండ్లలో కుర్స్క్‌లో ఉక్రేనియన్ దళాల లొంగిపోవడం కూడా ఉందా అని ఆయనను మీడియా అడిగినప్పుడు..దానిని ధృవీకరించేందుకు ఆయన నిరాకరించారు.
వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. అయితే శాంతి ఒప్పందం కుదిరే ముందు పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్.. అమెరికా నుండి ఎటువంటి భద్రతా హామీని పొందబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కు ఘోర అవమానం
Comments
Please login to add a commentAdd a comment