President Putin Orders Ceasefire in Ukraine over Orthodox Christmas - Sakshi
Sakshi News home page

Ukraine Russia War: రష్యా కాల్పుల విరమణ

Published Fri, Jan 6 2023 5:41 AM | Last Updated on Fri, Jan 6 2023 8:24 AM

Ukraine Russia War: Russian President Putin Orders Ceasefire in Ukraine - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో ఈ వారాంతంలో 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్‌ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్‌ క్రిస్‌మస్‌ సెలవు నేపథ్యంలో పుతిన్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాచీన జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం రష్యన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్‌ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లోని కొందరు  ఇదే రోజు క్రిస్‌మస్‌ జరుపుకుంటారు.

కాగా, ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ పునరుద్ఘాటించారు. కానీ, చర్చలు జరగాలంటే ఒక షరతు విధించారు. ఉక్రెయిన్‌ నుంచి తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాకు చెందిన భూభాగాలుగానే జెలెన్‌స్కీ ప్రభుత్వం అంగీకరించాలని తేల్చిచెప్పారు. ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌తో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాలను రష్యా బలప్రయోగంతో ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. డొనెట్‌స్క్, లుహాన్‌స్క్, జపొరిఝాజియా, ఖేర్చన్‌లలో రష్యా సైన్యం పాగా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement