
కీవ్: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇంకా పాజిటివ్ స్టెప్ పడలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ఢ్ ట్రంప్ ప్రత్యేక ఇంట్రెస్ట్ తో డీల్ చేస్తున్న ఇరు దేశాల 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా కొలిక్కి రాలేదు. దానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి సరైన సమాధానం రాలేదు. కేవలం తాత్కాలికంగా ఆపడానికి మాత్రమే మంగళవారం నాడు ఒప్పుకున్న పుతిన్.. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రం ముందడుగు వేయడం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలనే రష్యా అంటొంది. అదే పంతంతో కూర్చోని ఉంది. ఆ క్రమంలోనే తమ యుద్ధాన్ని కొనసాగించడానికే మొగ్గుచూపుతోంది.
‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల‍్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు ఇప్పటికే తేల్చిచెప్పింది రష్యా,

గంటల వ్యవధిలోనే ఎయిర్ స్ట్రైక్స్
గత రెండు రోజుల నుంచి చూస్తున్న పరిణామాల్ని బట్టి అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న 30 రోజుల శాంతి ఒప్పందంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దాన్ని రష్యా పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శాంతి చర్చలకు తాము రెడీ అంటున్నా రష్యా కవ్వింపు చర్యలతో బదులివ్వక తప్పడం లేదు.
ఇరు దేశాల అధ్యక్షులు స్వల్ప కాలిక కాల్పుల విరమణకు ఒప్పుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఇరు దేశాలు ఎయిర్ స్ట్రైక్స్ ను ప్రారంభించాయి. కేవలం మంగళవారం నాడు దాడులను ఆపడానికి ఏదో సూత్రప్రాయంగా ఒప్పుకున్న పుతిన్.. దానికి కట్టుబడలేదు. ఉక్రెయిన్ ఇంధన వనరులను దెబ్బ తీసే దిశగా ఎయిర్ స్ట్రైక్ జరిపింది రష్యా, పుతిన్ తాత్కాలికంగా దాడులు ఆపుతానని ఫోన్ లో తనకు మాటిచ్చినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే రష్యా దాడులకు దిగింది. అందుకు ఉక్రెయిన్ కూడా ధీటుగానే బదులిచ్చింది.
ట్రంప్ తో మాట్లాడతా.. చూద్దాం ఏం సమాధానం వస్తుందో?
నేను నియంత్రణగా ఉండాలిని కోరుకుంటున్నాను. నా నియంత్రణకు ప్రధాన కారణం మాకు మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అని నేను నమ్ముతున్నాను. మేము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నాం. కానీ మా వనరులను దెబ్బ తీసే ప్రయత్నం జరిగితే.. మేము అదే చేస్తాం.. మీరు కూల్ గా ఉంటే మేము కచ్చితంగా కూల్ గా ఉంటాం.
ఏదో కాల్పులు విరమణ అని చెప్పి మాపై దాడి జరిగితే మేము చూస్తూ ఊరుకోం. మాకు ఇంధన వనరుల విషయంలో సాయం చేయడానికి అమెరికాతో పాటు మా మిత్రదేశాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. నేను ట్రంప్ తోనే తేల్చుకుంటా.. కాల్పుల విరమణ అంటూ ప్రకటించిన గంటల వ్యవధిలోనే దాడి చేస్తే.. ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించిన కాసేటికే రష్యా ఉల్లంఘిస్తే ఏం చేయాలి. ట్రంప్‌తోనే మాట్లాడుతా.. ఏం సమాధానం వస్తుందో చూద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం?। అని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment