
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృతం అయ్యేటల్లు కనిపించడం లేదు. ‘ మేము వెనక్కి తగ్గం అంటే.. మేము కూడా వెనక్కి తగ్గేదే లేదు’ అన్నట్లుగా ఉంది ఇరు దేశాల పరిస్థితి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ అది కాస్తా విఫలయత్నంగానే మిగిలి ఉంది. ఒకవైపు వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన చర్చలు వాగ్వాదానికి దారి తీశాయే తప్ప వాటిలో ఎటువంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం 30 రోజుల శాంతి ఒప్పందంతో ఇరు దేశాల యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని ఆశించిన అమెరికాకు ఇరు దేశాల వైఖరి ఏమాత్రం మింగుడు పడటం లేదు.
అది ఉక్రెయిన్ ఆర్మీ ఊపిరి తీసుకునేందుకే..
తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ మికీ వాల్ట్ కు ఇదే విషయాన్ని రష్యా స్పష్టం చేసింది. 30 రోజుల మీ శాంతి ఒప్పందం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత కీలక విషయాలు చూసే యురీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్ లో అమెరికాకు తేల్చిచెప్పారు.
‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల‍్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు తేల్చిచెప్పారు. ఫలితంగా ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ తర్వాత.. రష్యా మళ్లీ ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. అదే సమయంలో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఉక్రెయిన్ సైతం తాము కూడా తాడో పేడో తేల్చుకుంటామనే రీతిలో యుద్ధ రంగంలోకి దూకింది. ఆ క్రమంలోనే రష్యాపై మెరుపు దాడి చేసింది. సుమారు 300 పైగా డ్రోన్ల సాయంతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడితో ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా అధికంగా వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, దానిపై రష్యా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు.
అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment