ఆ సిల్లీ బెలూన్‌ ప్రతిదాన్ని మార్చేసింది! త్వరలో అన్ని సమసిపోతాయ్‌: బైడెన్‌ | Joe biden Said On China Ties Spy Balloon Changed Everything | Sakshi
Sakshi News home page

ఆ సిల్లీ బెలూన్‌ ప్రతిదాన్ని మార్చేసింది! త్వరలో అన్ని సమసిపోతాయ్‌: బైడెన్‌

Published Sun, May 21 2023 7:04 PM | Last Updated on Sun, May 21 2023 7:23 PM

Joe biden Said On China Ties Spy Balloon Changed Everything - Sakshi

అమెరికా రక్షణ స్థావరంలోని గగన తలంలపై ఎగిరిన చైనా గుఢాచారి బెలూన్‌ కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతకమునుపు నవంబర్‌లో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ 20 సదస్సులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడ బైడైన్‌ చర్చలు జరిపారు. అవి జరిగిన నెలరోజుల్లోనే చైనాతో సంబధాలు క్షీణించాయని ప్రకటించారు బైడెన్‌. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంలో ఎగిరిన స్పై బెలూన్‌తో ఒక్కసారిగా సంబంధాలు భగ్గుమన్నాయి. ఒకరకంగా ఈ స్పై బెలూన్‌ కారణంగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్యపరమైన విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది.

ఈ సంఘట కారణంగానే.. అమెరికా చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునే అంశంతో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ పర్యటనను కూడా అనూహ్యంగా రద్దు చేసింది. ఈ మేరకు జపాన్‌లోని హిరోషిమాలో జరగతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం బైడెన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చైనా యూఎస్‌ల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించగా..బాలి సమావేశంలో తాము ఇరువురం(బైడెన్‌, జిన్‌పింగ్‌) సమావేశమయ్యి, చర్చించాలని అనుకున్నాం కానీ ఆ సిల్లీ బెలూన్‌ ప్రతిదీ మార్చేసింది.

ఆ స్పై బెలూన్‌ రెండు కార్లు రవాణ చేసే పరికరాలను తీసుకెళ్లగల సామర్థ్యం కలది. దీన్ని తాము కాల్చడంతోనే అంతా ఒక్కసారిగా మారిపోయిందని, ఇవన్నీ త్వరలో సమసిపోవాలనే భావిస్తున్నా. అలాగే తమ చర్యని కూడా సమర్థించుకునే యత్నం చేశారు బైడెన్‌. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ యథావిధికి వచ్చేలా చేయగలిగినదంతా చేస్తానని బైడెన్‌ చెప్పారు. 

(చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్‌ అడిగిన జో బైడెన్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement