ties
-
మాల్దీవులు-భారత్ వివాదం ముగియాలంటే ఇదే మార్గం..!
మాలే: భారత్-మాల్దీవుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు, డెమోక్రాటిక్ పార్టీ ఛైర్పర్సన్ ఫయ్యాజ్ ఇస్మాయిల్ చక్కని ఫార్ములా సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన వైఖరి ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ద్వారానే ఇద్దరి వ్యక్తులు వివాదం రెండు దేశాల మధ్య వివాదంగా మారిందని అన్నారు. 'భారత్-మాల్దీవుల మధ్య వివాదం ప్రభుత్వాలను దాటిపోయింది. సోషల్ మీడియా ద్వారానే ఇరుదేశాల సామాన్య ప్రజలకు కూడా ఈ అంశం చేరింది. ఇరుపక్షాల నుంచి వాదించుకుంటున్నారు. ఒకరినొకరు అవమానించుకుంటున్నారు. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేయడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశం లేదని మనం స్పష్టంగా తెలియజేయాలి. ప్రభుత్వంలో స్థానం కల్పించిన వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయలు మాత్రమేనని ఇరుపక్షాలకు తెలిపేలా చర్యలు తీసుకోవాలి' అని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఇరుదేశాల మధ్య సంబంధాలను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందా? అని అడిగిన ప్రశ్నకు.. ఈ సమస్య ఇరుదేశాల ఆర్థిక ప్రయోజనాలకు మించినదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వ నేతలు ఇండియా-మాల్దీవుల మధ్య మంచి బంధాలను ఏర్పరిచారని తెలిపిన ఇస్మాయిల్.. కేవలం ఇద్దరు వ్యక్తులు రెండు మెసేజ్‌లతో చెడగొట్టారని మండిపడ్డారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మళ్లీ నెలకొల్పడంపైనే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అది సహజమే.. ఇరుదేశాల్లో జాతీయవాదులు వైరుధ్యంగా మాట్లాడవచ్చు. భారత్ పాత్ర లేకుండానే మాల్దీవులు రాణించగలదని, అలాగే.. మాల్దీవులు చిన్న దేశం అని ఇరుపక్షాలు చెప్పవచ్చు. కానీ ఇది సరైన విధానం కాదు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకోవడం మాత్రమే ప్రధానం.' అని ఇస్మాయిల్ అన్నారు. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా పర్యటనపై స్పందించిన ఇస్మాయిల్.. ప్రభుత్వాలు మారినప్పుడు విదేశాంగ విధానం మారడం సహజమేనని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో భారత్‌కు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం.. ప్రస్తుత ప్రభుత్వం చైనాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంలో సమస్యేమి లేదని అన్నారు. ఒక్క ఇజ్రాయెల్ తప్పా.. ప్రపంచంలో అన్ని దేశాలతో మాల్దీవులు మంచి సంబంధాన్నే కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: మాల్దీవుల వివాదం.. భారత్‌పై చైనా మీడియా అక్కసు -
'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: కొత్త ఏడాది 2024లోనూ ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొనడానికి భారత్ రాజకీయంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తాను రాసిన నూతన పుస్తకం 'Why Bharath Matters' ఆవిష్కరణ సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు. దేశ స్వాంతంత్య్రం తొలినాళ్లలో మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశీ విధానాలను జైశంకర్ విమర్శించారు. భారత ప్రయోజనాలకే నెహ్రూ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునేవాళ్లం కాదని జై శంకర్ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, పండిట్ నెహ్రూకు మధ్య చైనా అంశంపై జరిగిన లేఖల మార్పిడి ఇందుకు సాక్ష్యంగా ఉందని చెప్పారు. చైనా అంశంలో నెహ్రూకు, పటేల్‌కు మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు. భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ వ్యవహరించారని జైశంకర్ అన్నారు. ‘‘భద్రతా మండలిలో ముందుగా చైనా చోటు దక్కించుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖ కూడా ఉందని పేర్కొన్నారు. చైనాతో యుద్ధం విషయంలో అమెరికా సహాయాన్ని నెహ్రూ నిరాకరించారని గుర్తుచేశారు. పటేల్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉందని జై శంకర్ అన్నారు. "మనం అమెరికాపై ఎందుకు అపనమ్మకంతో ఉన్నాం.. మన ప్రయోజనాల దృష్టిలోనే చూడాలి. చైనా-అమెరికా బంధం కోణంలో కాదు." అని పటేల్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎప్పుడంటే..? -
భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా-భారత్ సంబంధాలపై ఆ దేశ ఆర్థిక మంత్రి మేరీ ఎన్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు దర్యాప్తులో భారత్ సహకరించిన తర్వాతే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. నిజ్జర్ హత్యకేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ గురువారం తెలిపిన విషయం తెలిసిందే. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశానికి హాజరైన కెనడా ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్జీ మీడియాతో మాట్లాడుతూ.. "మా దృష్టంతా నిజ్జర్ కేసు దర్యాప్తుపైనే ఉంది. అందుకు భారత్ సహకరించేలా చేయడంపైనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని పూర్తైన తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచిస్తాం. మా దేశానికి చెందిన వ్యక్తి హత్యలో విదేశీ జోక్యం ఉందని ఆరోపణలు రావడాన్ని సీరియస్‌గా తీసుకున్నాం.' అని అయన చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదానికి దారి తీసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ఈ పరిణామాల తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసాలను కూడా రద్దు చేసుకున్నారు. ఈ కేసులో భారత్ దర్యాప్తుకు సహకరించాలని కెనడా ఒత్తిడి చేస్తోంది. ఇదీ చదవండి: ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి -
Trudeau: భారత్‌పై స్వరం మార్చి ఆ వెంటనే..
మాంట్రియల్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. ఒక్కసారిగా స్వరం మార్చారు. భారత్‌తో సత్సంబంధాల విషయంలో కెనడా కట్టుబడి ఉందని.. ఆ విషయంలో వెనక్కి తగ్గబోదంటూ వ్యాఖ్యానించారాయన. గురువారం మాంట్రియల్లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గ్లోబల్ స్థాయిలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత చూస్తున్నాం. ఇలాంటి టైంలో కెనడా, దాని మిత్రపక్షాలు భారత్‌తో సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలనే తీవ్రంగా ప్రయత్నిస్తాయి’’ అని వ్యాఖ్యానించారాయన. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కిందటి ఏడాది మేం(కెనడా) ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అందించాం. తమ దేశం ఇప్పటికీ భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి కట్టుబడి ఉంది అని తెలిపారు. అమెరికా మాతోనే.. అయితే అదే సమావేశంలో ఆయన కాసేపటికి మళ్లీ పాతపాటే పాడారు. నిజ్జర్ హత్యోదంతాన్ని మళ్లీ హైలైట్ చేశారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరోవైపు నిజ్జర్ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. భారత్ విదేశాంగ మంత్రితో భేటీ సమయంలో ఈవిషయాన్ని లేవనెత్తుతానని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాటిచ్చారని ట్రూడో వెల్లడించారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్య దేశాలు సీరియస్‌గా తీసుకోవాలని ట్రూడో పిలుపు ఇచ్చారు. ‘‘కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్ హత్య విషయంలో మాతో కలిసి భారత్ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలి. కెనడియన్‌కు మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధారించే విషయంలో అమెరికా మాతోనే ఉంది’’ అని పేర్కొన్నారు. -
నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం..!
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్‌ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం. ఇండియా-కెనడా వివాదం.. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
ఆ సిల్లీ బెలూన్ ప్రతిదాన్ని మార్చేసింది! త్వరలో అన్ని సమసిపోతాయ్: బైడెన్
అమెరికా రక్షణ స్థావరంలోని గగన తలంలపై ఎగిరిన చైనా గుఢాచారి బెలూన్ కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఒక్కసారిగా క్షీణించాయి. అంతకమునుపు నవంబర్‌లో ఇండోనేషియాలో బాలిలో జరిగిన జీ 20 సదస్సులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడ బైడైన్ చర్చలు జరిపారు. అవి జరిగిన నెలరోజుల్లోనే చైనాతో సంబధాలు క్షీణించాయని ప్రకటించారు బైడెన్. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంలో ఎగిరిన స్పై బెలూన్‌తో ఒక్కసారిగా సంబంధాలు భగ్గుమన్నాయి. ఒకరకంగా ఈ స్పై బెలూన్ కారణంగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్యపరమైన విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. ఈ సంఘట కారణంగానే.. అమెరికా చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునే అంశంతో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ పర్యటనను కూడా అనూహ్యంగా రద్దు చేసింది. ఈ మేరకు జపాన్‌లోని హిరోషిమాలో జరగతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చైనా యూఎస్‌ల మధ్య సంబంధాల గురించి ప్రశ్నించగా..బాలి సమావేశంలో తాము ఇరువురం(బైడెన్, జిన్‌పింగ్) సమావేశమయ్యి, చర్చించాలని అనుకున్నాం కానీ ఆ సిల్లీ బెలూన్ ప్రతిదీ మార్చేసింది. ఆ స్పై బెలూన్ రెండు కార్లు రవాణ చేసే పరికరాలను తీసుకెళ్లగల సామర్థ్యం కలది. దీన్ని తాము కాల్చడంతోనే అంతా ఒక్కసారిగా మారిపోయిందని, ఇవన్నీ త్వరలో సమసిపోవాలనే భావిస్తున్నా. అలాగే తమ చర్యని కూడా సమర్థించుకునే యత్నం చేశారు బైడెన్. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ యథావిధికి వచ్చేలా చేయగలిగినదంతా చేస్తానని బైడెన్ చెప్పారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు!
సమస్తీపూర్: తాను బతికి ఉన్నంతకాలం బీజేపీతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదని బిహార్ ముఖ్యమంత్రి,, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని బీజేపీపై మండిపడ్డారు. ఆయన శుక్రవారం సమస్తీపూర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించి.. ప్రసంగించారు. వారు గతంలో లాలూ గారిపై(ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్) కేసు పెట్టారు. దాని వల్ల ఆయనతో నాకు సంబంధాలు తెగిపోయాయి. వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మేము మళ్ళీ కలిసి ఉన్నప్పుడు, వాళ్లు మళ్లీ కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల పనితీరు శైలి ఎలా ఉందో మీరు గమనించవచ్చు అంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ప్రస్తుత బీజేపీ నాయకత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ హయాం నాటి బీజేపీ ఇప్పుడే లేదన్నారు. అందుకే తాను తుదిశ్వాస విడిచేవరకు జేడీయూ.. బీజేపీతో కలవబోదని అన్నారాయన. జేడీ(యూ), కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలకు కూడిన ‘మహాఘట్బంధన్’ ఎప్పటికీ కలిసే ఉంటుందని తేల్చిచెప్పారు. దేశ ప్రగతి కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: మోయలేని భారం మోపే వాడే మోదీ -
వింతైన ట్రిక్ : ఇంధనం పొదుపు చేయడం కోసం నెక్కి 'టై' ధరించొద్దు!
డబ్బలు వృధాగా ఖర్చుపెట్టకుండా ఉండటం కోసం, కాలుష్య నివారణ కోసం తదితర వాటిన్నంటికి నిపుణులు చిన్న లాజికల్ ట్రిక్‌లు సూచించడం మాములే. ఇది అందరికి తెలిసిన విషయమే. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిదేశం ఈ సంక్షోభం తలెత్తకుండా ఉండేలా తమదైన తరహాలో పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఐతే ఈ విషయమై స్పెయిన్ ప్రధాని తమ ప్రజలకు ఒక విభిన్నమైన ట్రిక్ అనుసరించమని సూచించాడు. ఆ ప్రధాని చెప్పిన పరిష్కార మార్గం వింటే చాలా వింతగానూ, అర్థం లేనిదిగానూ అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే...స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశాడు. పైగా వృధాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి అంటూ ఒక వింతైన ట్రిక్ గురించి చెప్పాడు. ఈ మేరకు ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ... ఇంధనాన్ని ఆదా చేసేందుకు నెక్కి 'టై' లు ధరించవద్దని చెప్పాడు. అంతేకాదు ఆయన కూడా ఆ ప్రసంగంలో నెక్కి టై ధరించకుండా ఉన్నాడు. ఇంధనం ఆదా చేయడానికికి నెక్కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో అర్థం కాదు ప్రజలకు. అంతేకాదు తాను కూడా టైం ధరించకపోవడాన్ని గమనించండని చెబుతుంటాడు. అంతేకాదు తన ప్రజలను మంత్రులను దీన్ని అనుసరించాలని కూడా కోరాడు. ఐతే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు యూటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. (చదవండి: భూ వాతావరణంలోకి చైనా రాకెట్ శకలాలు.. వీడియో వైరల్) -
Nirmala Sitharaman: అమెరికాకు నిర్మలమ్మ రిప్లై
రష్యా - భారత్ వాణిజ్య మైత్రి పట్ల అమెరికా అభ్యంతరాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పొరుగు దేశంతో రక్షణ పరమైన సవాళ్లు ఉన్న దృష్ట్యా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి ఊహించిందేనన్నారు. అమెరికా దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. ‘‘అమెరికాకు భారత్ మిత్రదేశం. కానీ ఆ స్నేహితుడు బలహీనంగా ఉండకూడదు. బలహీన పడకూడదు’’ అని మంత్రి సీతారామన్ కామెంట్ చేశారు. తద్వారా భారత్ ను బలహీనపరిచే చర్యలకు దూరంగా ఉండాలన్న పరోక్ష సంకేతం పంపించారామె. భారతదేశం ఉదారవాద ప్రపంచంతో బలమైన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటుంది. అయితే సరిహద్దులను రక్షించుకోవడానికి రష్యా సహాయం కావాల్సిందేనని ఆమె వాషింగ్టన్లో బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అర్థం చేసుకున్నాం, కానీ.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన. నిర్మలా సీతారామన్ తిరిగొచ్చారు. అయితే.. అమెరికా వైఖరిని అర్థం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘భారత్ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలని అనుకుంటుంది. అమెరికా కూడా స్నేహితుడు కావాలని అనుకుంటే.. ఆ ఫ్రెండ్ బలహీన పడకూడదు. భౌగోళికంగా మేము ఉన్న చోట బలంగా నిలదొక్కుకోవాలి’’అని మంత్రి పేర్కొన్నారు. ఈయూతో పాశ్చాత్య దేశాల నుంచి భారత్ స్నేహం కొరుకుంటోందని, కానీ, సరిహద్దు అంశాల దృష్ట్యా రష్యా సహకారం అవసరమేనని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు భద్రతా సవాళ్లను మంత్రి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఉత్తర సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు తలెత్తడాన్ని ప్రస్తావించారు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను గుర్తు చేశారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధా, చమురు ఒప్పందాల విషయంలో రష్యాకు దూరంగా ఉండాలని వెస్ట్, అమెరికా చెప్తున్నా భారత్ వాణిజ్యాన్ని, ఒప్పందాల్ని కొనసాగిస్తోంది. -
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్
మాస్కో : ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో ప్రపంచదేశాలు ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ట్రంప్ కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకోవాలంటూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్లో కోరారు. అయితే ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకునేది లేదని పుతిన్ స్పష్టం చేసినట్లు రష్యా మీడియా వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే ఉత్తర కొరియామీద కఠినమైన ఆంక్షలను విధించారని.. అంతమించి చర్యలు తీసుకోవాల్సి అవసరం లేనట్లు అమెరికాకు రష్యా తెలిపింది. అమెరికా తీసుకుంటున్న చర్యలు.. ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని రష్యా పేర్కొంది. ఇటీవల ఉత్తర కొరియా జరిపిన ఖండాంతర క్షిపణి ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా యుద్ధానికి కాలుదువ్వుతోందని చెప్పారు. ఒక వేళ యుద్ధమే సంభవిస్తే.. ఉత్తరకొరియాను ధ్వంసం చేస్తామని ఆమె హెచ్చరించారు. -
చైనాను ఢీకొట్టే శక్తి.. భారత్‌కు మాత్రమే
న్యూఢిల్లీ : చతుర్భుజ కూటమి ఏర్పాటు.. అదే సమయంలో ’ఇండో-పసిఫిక్‘ అనే పదాన్ని డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించడం అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు చైనాకు పోటీగా చతుర్భుజ కూటమిగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్‌తో బంధాలను మరింత ధృఢపరచుకునే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఇండియన్ ఓషియన్ రీజియన్ (ఐఓఆర్)లో భాగంగా భారత్‌తో ఉన్నత స్థాయి చర్చలకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. మనీలాలో జరిగిన ఇండియా-ఏసియన్ సదస్సులో చతుర్భుజ కూటమి చర్చల అనంతరం భారత్ బంధంపై ఫ్రాన్స్ మరింత ఆసక్తి చూపుతోంది. ఇదే విషయాన్ని భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగేల్మర్ వివరించారు. ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో చైనా ఆధిపత్యాన్ని నిలువరించాలంటే.. భారత్‌తో బంధాన్ని మరింత ధృఢం చేసుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఫ్రాన్స్ విదేశాంగ శాఖ మంత్రి జేన్ యువాస్ డ్రెన్, 2018 ఆరంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రాన్ భారత్‌లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఫ్రాన్స్ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన అన్నారు. హిందూ మహాసముద్రంలో నౌకా స్థావరాల ఏర్పాటు, ద్వీపాల రక్షణ, ఇతర అంశాల్లో భారత్ సహకారం తమకు అవసరమని ఫ్రాన్స్ పేర్కొంది. -
భారత్‌తో బంధం చాలా ముఖ్యం
వాషింగ్టన్ : భారత్‌తో మరింత బలమైన రక్షణ సంబంధాలను అమెరికా కోరుకుంటోందని ఆ దేశ దక్షిణ, మధ్య ఆసియా సంబంధాల కార్యదర్శి జీ వెల్స్ స్పష్టం చేశారు. ధృఢమైన ద్వైపాక్షిక సంబంధాల వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఎప్-16, ఎఫ్-18 యుద్ధ విమానాల అమ్మకాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆమె చెప్పారు. అమెరికా రక్షణ కార్యదర్శి రెక్స్ టెల్లర్‌సన్స్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్‌ల పర్యటన ముగించుకుని తిరిగి రాగానే.. ముఖ్య విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారు. భారత్, అమెరికాల మధ్య ఏర్పడ్డ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 21వ శతాబ్దాన్ని ప్రభావంతం చేస్తుందని ఆమె తెలిపారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయడం వల్ల చైనా, ఇతర దేశాలను నిలువరించవచ్చన్నారు. భారత్‌తో అమెరికా మరింత లోతైన రక్షణ సంబంధాలను కోరుకుంటోందోని ఆమె తెలిపారు. ఈ దశాబ్దం ఆరంభంలో అధమస్థాయిలో ఉన్న రక్షణ వాణిజ్యం ప్రస్తుతం 15 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆమె అన్నారు. ఇరు దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇక 115 బిలియన్ డాలర్ల విలువ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 140 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఆమె సూచించారు. -
ట్రయంఫ్‌తో బజాజ్ ఆటో గ్లోబల్ భాగస్వామ్యం
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో బ్రిటీష్ ద్విచక్ర వాహన దిగ్గజం ట్రైయంఫ్ మోటార్ సైకిల్ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్‌తో బజాజ్ ఆటో ఈక్విటీయేతర ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశాయి. గత ఆరు నుంచి తొమ్మిది నెలల నుంచి చర్చలు నిర్వహించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా మధ్యస్థాయి సామర్థ్యంగల ట్రయంప్ మోటార్ సైకిళ్లను దేశీ మార్కెట్లో బజాజ్ ఆటో విక్రయించనుంది. ఈ ఒప్పందం ద్వారా మిడ్-టాస్క్ సెగ్మెంట్ లో ఇరుసంస్థలు లబ్ది చేకూరనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎలా సహకరించబోతున్నాయి అనేదానిపై ఖచ్చితమైన వివరాలపై రాబోయే రోజులలో మరింత సమాచారం పంచుకుంటామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ట్రైయంఫ్ మోటార్ సైకిళ్లతో జతకట్టడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు బజాజ్ ప్రయత్నిస్తోంది. అలాగే డుకాటి మోటార్స్ తో తాము జత కట్టడం లేదని బజాజ్ ప్రకటించింది. ట్రయంప్ బ్రాండ్, మోటార్ సైకిళ్లను విక్రయించడం ద్వారా తాము కూడా లబ్ది పొందగలమని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో పేర్కొంది. తమ భాగస్వామ్యం ద్వారా ట్రయంప్ వర్థమాన మార్కెట్లలో మరింతగా విస్తరించనున్నామని తెలిపింది. -
మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో
-
మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో
సియోల్: అరంగేట్రంతోనే సంచలనం సృష్టించి ఇతర నెట్ వర్క్ లకు కోలుకోలేని దెబ్బ తీసిన రిలయన్స్ జియో.. మరో సంచలనాకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉచిత డేటా, కాలింగ్ తదితర ఆఫర్లతో రికార్డ్ స్థాయిలో వినియోగదారులను సొంతంచేసుకున్న జియో.. తాజాగా మరోమారు ఇతర కంపెనీలను దెబ్బ కొట్టే వ్యూహంతో పావులు కదుపుతోంది. దేశంలో 5జీ సేవలను అందించేందుకు జియో మరో ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తో జతకట్టింది. మొబైల్ వరల్డ్ 2017 సమావేశంలోని ఒక క్లోజ్డ్ ఈవెంట్ లో ఈ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో శాంసంగ్ 5జీ సేవల హోం రౌటర్, రేడియో బేస్ స్టేషన, 5 జీ మోడం చిప్ సెట్లను ఇదే సమాశాల్లో లాంచ్ చేయడం విశేషం. గతవారం వెల్లడించిన ప్రైమ్ మెంబర్ షిప్ పథకం ప్రకారం కొత్త జియో వినియోగదారులకు త్వరలో 5జీ సేవలను అందించేందుకు సమాయత్తమవుతోంది. ముఖ్యంగా హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ త్వరలోను ముగియనుండంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త తారిఫ్ లను అమలు చేయనుంది. తన ప్రైమ్ యూజర్లకు అన్ లిమిటెడ్ ప్రయోజనాలు మార్చి 31, 2018 వరకూ అందించేలా కొత్త ప్రోత్సాహకాలను అందించనున్నామని రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించారు. ఈ క్రమంలో జియోటీవీ, జియో మ్యూజిక్, జియో మాగ్స్, జియో సినిమా, జియోఎక్స్ ప్రెస్ లాంటి మీడియా సేవలను అందించనుంది. అంతేకాదు 5 జీ స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. మరోవైపు నోకియా ఇప్పటికే 5 జీ సేవలపై దృష్టిపెట్టింది. ఈ మేరకు స్పెయిన్ బార్సిలోనా సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. కాగా 5జీ సర్వీసులతోపాటు జియో టీవీ అనే కొత్త సర్వీస్ ను కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ డీటీహెచ్ సర్వీస్ ద్వారా అతి తక్కువ ధరతో 360కి పైగా చానల్స్ ను చూడవచ్చని గతంలో రిలయన్స్ పేర్కొంది. అయితే ఈ సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభ మవుతుందన్నవిషయాన్ని స్పష్టంచేయనప్పటికీ నార్మల్ టీవీనుంచి స్మార్ట్ టీవీకిమారేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తోడ్పాటు అందిస్తాం
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై న్యూజిలాండ్ ప్రధాని - మోదీతో జాన్కీ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ - ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిర్ణయం - పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం కల్పించే అంశంపై తమ దేశం నిర్మాణాత్మక తోడ్పాటు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్ కీ హామీ ఇచ్చారు. అయితే ఎన్ఎస్జీలో భారత్‌కు చోటుపై న్యూజిలాండ్ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి సంబంధించి పూర్తిస్థాయి చర్చ జరగలేదని, ఎన్ఎస్జీలోని 48 సభ్య దేశాలు సాధ్యమైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని జాన్ కీ తెలిపారు. బుధవారం ఢిల్లీలో జాన్ కీ.. ప్రధాని మోదీతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించాయి. అనంతరం మోదీ, జాన్ కీ సమక్షంలో సైబర్ సెక్యూరిటీ, డబుల్ ట్యాక్సేషన్, పన్ను ఎగవేతకు సంబంధించి మూడు ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. అలాగే పలు కీలకాంశాలపై విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం ప్రధాని మోదీ, జాన్కీ సంయుక్త సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక, బహుపాక్షికంగా అన్ని రంగాల్లో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినట్టు మోదీ చెప్పారు. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు మద్దతు ఇవ్వడంపై జాన్ కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా భద్రత, నిఘా అంశాల్లో ఇరు దేశాల మధ్యా సహకారాన్ని పటిష్టపరిచేందుకు నిర్ణయించినట్టు మోదీ చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, టై నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయాలని, వారికి నిధులు అందే మార్గాలను నిలుపుదల చేయాలని నిర్ణయించామన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలపై కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా ఆర్థిక సంబంధాలను విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందని మోదీ పేర్కొన్నారు. ఎన్ఎస్జీ అంశంపై చర్చలు ప్రోత్సాహకరంగా సాగాయని, భారతదేశ క్లీన్ ఎనర్జీ అవసరాలను న్యూజిలాండ్ అర్థం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ దరఖాస్తులను పరిష్కరించండి: మోదీ న్యూఢిల్లీ: కార్మికులు, ఈపీఎఫ్ లబ్ధిదారుల దరఖాస్తులు భారీసంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను ఖరారుచేసే విధానాన్ని ఒక సంవత్సరం ముందుగానే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో భాగంగా మోదీ కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో మాట్లాడారు. దేశ ప్రగతిలో రేయింబగలు కష్టపడి పనిచేసే కార్మికుల భాగస్వామ్యం చాలా ఉందని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ఈపీఎఫ్ దరఖాస్తుల పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. విన్నపాల పరిష్కారానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ చలాన్, ఎస్ఎంఎస్లు, యూఏఎన్‌ను ఆధార్‌కు అనుసంధానించడం, టెలిమెడిసిన్‌ను ప్రవేశపెట్టడంలాంటి వాటిని అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులపైనా మోదీ సమీక్ష నిర్వహించారు. కాగా, పథకాల అమలును మరింత వేగవంతం చేసేందుకే కేంద్ర బడ్జెట్‌ను నెల ముందుకు జరిపామని, దీన్ని దృష్టిలోపెట్టుకొని అన్ని రాష్ట్రాలు తమ ప్రణాళికలను చూసుకోవాలని మోదీ చెప్పారు. -
నాగుపాముపై పగ...
రాయ్‌పూర్ : పాము పగపడుతుందనేది నానుడి. కానీ తనను కాటేసిన పాము పగబట్టాడో రైతు. ఆ విష సర్పాన్ని వెంటాడి మరీ పట్టుకుని దానికి శిక్ష వేసిన వైనం ఆశ్చర్యకరంగా మారింది. పాము కనిపించగానే బెంబేలెత్తిపోవడం.. పారిపోవడం కామన్. లేదంటే దాన్ని చంపడమో లేక పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడమో కూడా తెలిసిందే. అయితే చత్తీస్ ఘడ్ లోని ఓ రైతు వీటికి భిన్నంగా ప్రవర్తించాడు. ఛత్తీస్‌గఢ్ కోబ్రా జిల్లాలోని లహంగ్ బహారా గ్రామంలో నాగుపాముకు శిక్ష వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. లహరి లాల్ అనే రైతు తన పంట పొలంలో పని చేసుకుంటుండగా ఓ నాగుపాము అతడిని కాటేసింది. అంతే..లహర్ కు ఎక్కడి లేని కోపం ముంచుకువచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కాటేసిన బాధ మరిచి పాముపై కోపం పెంచుకున్నాడు . దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలనే పట్టుదలతో దాన్ని వెంబడించాడు. ఎట్టకేలకు సర్పాన్ని పట్టుకున్నాడు లాల్. తన ఇంటికి తీసుకువచ్చి తాడుతో స్తంభానికి కట్టేశాడు. దీంతో విస్తుపోయిన పాము కూడా యథావిధిగా పడగెత్తి బుసకొట్టింది. -
ఇరాన్ తో భారత్ కీలక ఒప్పందం
టెహ్రాన్: ఇరాన్ పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ తో 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో మోదీ ఆ దేశాధ్యక్షుడు హాసన్ రౌహానితో సమావేశమయ్యారు. దైపాక్షిక సంబంధాల్లో భాగంగా కీలకమైన చాబహార్ పోర్టు నిర్మాణానికి భారత్ 500 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేస్తుందని మోదీ ప్రకటించారు. చాహాబర్ పోర్టు భారత్-ఇరాన్ ల మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని హాసన్ అన్నారు. భారత్, ఇరాన్ లు కొత్త స్నేహితులేంకారని పూర్వం నుంచే ఇరాన్ తో భారత్ కు మంచి సంబంధాలున్నాయని మోదీ తెలిపారు. కాగా, భారత్ ఇతర దేశాల కోసం నిర్మించనున్న మొదటి పోర్టు ఇదే కావడం గమనార్హం. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాల నుంచి భారత్ కు సముద్ర మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఎగుమతులు, దిగుమతులకు రవాణా సులభతరం కానుంది. పాకిస్తాన్ కు చెందిన సముద్రభాగం నుంచి ఎటువంటి రవాణాకు ఆ దేశం అంగీకరించకపోవడంతో ఇప్పటివరకు మధ్య ఆసియా దేశాలతో భారత్ కు పెద్దగా వ్యాపార సంబంధాలేవీ లేకుండా పోయాయి. దీంతో భారత్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా.. అటువైపు పాకిస్తాన్ కు గ్వాదర్ పోర్టు నిర్మించి ఇస్తూ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్న చైనాకు కూడా చెక్ పెట్టేసింది. పనిలో పనిగా ఇరాన్ లోని పోర్టు నుంచి అక్కడి ముఖ్యనగరాల్లో ఒకదానికి 500 కిలోమీటర్ల మేర వేయనున్న రైల్వే మార్గానికి కూడా సాయం చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎకనమీ, ట్రాన్స్ పోర్టెషన్, పోర్టు డెవలప్ మెంట్, కల్చర్, సైన్స్, అకడమిక్ కో-ఆపరేషన్ తదితరాలపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. చివరగా15 ఏళ్ల కిందట అప్పటి భారత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఇరాన్ లో పర్యటించారు.