దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో బ్రిటీష్ ద్విచక్ర వాహన దిగ్గజం ట్రైయంఫ్ మోటార్ సైకిల్ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్‌తో బజాజ్ ఆటో ఈక్విటీయేతర ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశాయి. గత ఆరు నుంచి తొమ్మిది నెలల నుంచి చర్చలు నిర్వహించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా మధ్యస్థాయి సామర్థ్యంగల ట్రయంప్ మోటార్ సైకిళ్లను దేశీ మార్కెట్లో బజాజ్ ఆటో విక్రయించనుంది. ఈ ఒప్పందం ద్వారా మిడ్-టాస్క్ సెగ్మెంట్ లో ఇరుసంస్థలు లబ్ది చేకూరనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎలా సహకరించబోతున్నాయి అనేదానిపై ఖచ్చితమైన వివరాలపై రాబోయే రోజులలో మరింత సమాచారం పంచుకుంటామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
ట్రైయంఫ్ మోటార్ సైకిళ్లతో జతకట్టడం ద్వారా తన పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు బజాజ్ ప్రయత్నిస్తోంది. అలాగే డుకాటి మోటార్స్ తో తాము జత కట్టడం లేదని బజాజ్ ప్రకటించింది. ట్రయంప్ బ్రాండ్, మోటార్ సైకిళ్లను విక్రయించడం ద్వారా తాము కూడా లబ్ది పొందగలమని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో పేర్కొంది. తమ భాగస్వామ్యం ద్వారా ట్రయంప్ వర్థమాన మార్కెట్లలో మరింతగా విస్తరించనున్నామని తెలిపింది.
ట్రయంఫ్తో బజాజ్ ఆటో గ్లోబల్ భాగస్వామ్యం
Published Tue, Aug 8 2017 7:48 PM | Last Updated on Mon, Sep 11 2017 11:36 PM
Advertisement