Triumph Motorcycles
-
రూ.8.89 లక్షల కొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' (Triumph Motorcycle).. భారతదేశంలో రూ. 8.89 లక్షల (ఎక్స్ షోరూమ్) విలువైన 'స్పీడ్ ట్విన్ 900' (Speed Twin 900) లాంచ్ చేసింది. ఇది దాను మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైకులో 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 65 హార్స్ పవర్, 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ లేటెస్ట్ యూరో 5 ప్లస్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇచ్చి చూడటానికి స్పీడ్ ట్విన్ 1200ని పోలి ఉంటుంది. అయితే ఇందులో యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, బ్రాండెడ్ రేడియల్ కాలిపర్‌ను కలిగి ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు 900 మిమీ వరకు ఉంది. సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్ప్లే స్థానంలో TFT యూనిట్ ఉంటుంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్పీడ్ ట్విన్ 900 పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.Your journey to making every ride exceptional begins here. The new Speed Twin 900 is priced from ₹ 8 89 000* /- Ex showroom Delhi.Discover more: https://t.co/AUDQTKfjrc#SpeedTwin900 #MeetTheNewOriginal #MakeEveryRideExceptional #TriumphMotorcycles #ForTheRide pic.twitter.com/gMiAku7wtS— TriumphIndiaOfficial (@IndiaTriumph) December 23, 2024 -
ట్రయంఫ్ లిమిటెడ్ ఎడిషన్ బైక్ (ఫోటోలు)
-
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్‌లు, వెనుక స్లైడింగ్ కాలిపర్‌తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
భారత్ మార్కెట్లోకి ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. విడుదల ఎప్పుడంటే
ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ ‘డేటోనా 660’ స్పోర్ట్ టూరర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. యమహా ఆర్7, కవాసాకి నింజా 650, హోండా సీబీఆర్ 650ఆర్ మోటారు సైకిళ్లతో ట్రయంఫ్ డేటోనా 660 బైక్ పోటీ పడనున్న ఈ బైక్ భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లో వచ్చేనెల 9న ఆవిష్కరించేందుకు ట్రయంఫ్ యాజమాన్యం సిద్ధమైంది. భారత్ మార్కెట్లో డేటోనా ఎక్స్ షోరూమ్ ధర రూ.9.50 లక్షలుగా నిర్ణయించారు. టైగర్ స్పోర్ట్ 660, ట్రైడెంట్ 660 మోటారు సైకిళ్లలో వాడిన ఇంజిన్, 660సీసీ ట్రయంఫ్ ఇంజిన్ త్రీ-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ యూనిట్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 81 హెచ్‌పీ విద్యుత్, 64 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్‌తోపాటు 6-స్పీడ్ గేర్ బాక్స్, 2-వే క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. 2-రైడింగ్ మోడ్స్- రెయిన్, రోడ్ మోడ్స్‌లో లభిస్తుంది. డ్యుయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్, క్లిప్ హ్యాండిల్ బార్, ట్రైడెంట్, టైగర్ స్పోర్ట్ మోటారు సైకిళ్లలో మాదిరిగా స్విచ్ గేర్స్, లీవర్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లు ఉంటాయి. ఫ్రంట్‌లో నాన్ అడ్జస్టబుల్ అప్‌సైడ్ యూఎస్డీ డౌన్ఫోర్క్, రేర్‌లో మోనో షాక్ యూనిట్, రెండు వీల్స్‌పై డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. -
విశాఖలో ట్రయంఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
విశాఖపట్టణం: ట్రయంఫ్ మోటార్ సైకిల్ ఎక్సీపీరియన్స్ సెంటర్ విశాఖపట్టణంలో ప్రారంభమైంది. ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్, వరుణ్‌గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్దేవ్లు ఈ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ విశాఖ మార్కెట్లోకి 400 సీసీ ట్రయంఫ్ బైక్‌లను ప్రవేశపెట్టామన్నారు. కొత్త కస్టమర్లకు 16వేల కిలోమీటర్ల సరీ్వసు విరామంతోపాటు, రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో, మూడేళ్ల వారంటీని అందిస్తున్నామన్నారు. 400 సీసీ బైక్, షోరూం ధర రూ.2.33 లక్షలు నుంచి అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోబైకింగ్ సరీ్వసు వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పింగ్లే, ప్రోబైకింగ్ సర్కిల్ హెడ్ గౌతమ్, రీజినల్ మేనేజర్ రాహుల్‌లు పాల్గొన్నారు. -
భారత్‌లో ట్రయంఫ్ కొత్త బైక్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ తాజాగా భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ వీటిలో ఉన్నాయి. బజాజ్ ఆటో, ట్రయంఫ్ సంయుక్తంగా ఈ రెండు మోడళ్లను అభివృద్ధి చేశాయి. 2017లో ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఎక్స్‌షోరూంలో ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.23 లక్షలు ఉంది. ఈ నెల నుంచే లభిస్తుంది. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధర ఇంకా ప్రకటించలేదు. అక్టోబర్ నుంచి ఈ మోడల్ డెలివరీలు ఉంటాయి. పెద్ద ఎత్తున అమ్మకాలను ఆశిస్తున్నట్టు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర పుణే సమీపంలోని చకన్ వద్ద ఉన్న కొత్త ప్లాంటులో ఈ బైక్స్ తయారు చేస్తామన్నారు. 2024 మార్చి నాటికి 80 నగరాలు, పట్టణాల్లో ట్రయంఫ్ వరల్డ్ షోరూంలు 100కుపైగా రానున్నాయి. -
మార్కెట్లోకి కొత్త స్పోర్ట్స్ బైక్‌లు.. ధరలు, ఫీచర్లు ఇవే..
ట్రయంఫ్ (Triumph) మోటార్‌సైకిల్స్ ఇండియా కొత్త ప్రీమియం బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్, స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ మోడళ్లను పరిచయం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర రూ. 10.17 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 11.81 లక్షలు. (ఎక్స్ షోరూమ్) కలర్స్ ఇవే.. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. అలాగే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ సిల్వర్ ఐస్, కార్నివాల్ రెడ్, కాస్మిక్ ఎల్లో అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. స్పెసిఫికేషన్లు 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో లిక్విడ్-కూల్డ్, 765 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఇంజిన్ 11,500 ఆర్పీఎం వద్ద 118.4 బీహెచ్పీ, 9,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 80 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇక స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ 12,000 ఆర్పీఎం వద్ద 128.2 బీహెచ్పీ అధిక అవుట్‌పుట్‌ను 9,500 ఆర్పీఎం వద్ద 80 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఫీచర్స్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్, లీన్-యాంగిల్ సెన్సిటివిటీతో ట్రాక్షన్ కంట్రోల్, లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. మరోవైపు 2023 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ నాలుగు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లో ఎల్సీడీ డిస్ప్లే, ఆర్ఎస్ మోడల్లో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్టీ స్క్రీన్ ఉన్నాయి. ల్యాప్ టైమర్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ట్రాక్ ఉపయోగం కోసం ఆర్ఎస్ వేరియంట్‌ను మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించారు. StreetTriple 765 R-the new definitive street fighter-is priced from INR 10,17,000 Ex-Showroom, and StreetTriple 765 RS-the most powerful #StreetTriple ever-is priced from INR 11,81,000 Ex-Showroom.#StreetTriple765R #StreetTriple765RS #RacePowered #StreetTriple765 #TriumphIndia pic.twitter.com/2sOfixWOSc — TriumphIndiaOfficial (@IndiaTriumph) June 16, 2023 -
బ్రిటీష్ కంపెనీ ఇప్పుడు బజాజ్ చేతుల్లోకి..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఇప్పుడు భారతదేశంలో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌కి సంబంధించి విక్రయాలు, సర్వీస్ మొదలైన వాటన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కొన్ని సంవత్సరాలకు ముందు ప్రకటించిన వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది ఒక భాగం. బజాజ్ ఆటో ఇప్పుడు ట్రయంఫ్ భాగస్వామ్యంతో కొత్త ఎంట్రీ-లెవల్ మిడ్-కెపాసిటీ ట్రయంఫ్ మోడల్లను అభివృద్ధి చేయడంలో భాగంగా బజాజ్ తన చకాన్ ఫెసిలిటీలో తయారు చేస్తుంది. ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం సుమీత్ నారంగ్ నేతృత్వంలోని బజాజ్ ప్రోబైకింగ్ కిందికి వస్తాయి. బజాజ్ కంపెనీ చేసిన ఈ అధికారిక ప్రకటనలో భాగంగా 2023లో మొదటి బజాజ్-ట్రయంఫ్ బైక్ విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఇందులో అది ఏ బైక్ అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. దీనికి సంబంధించిన వివరాలు రానున్న రోజుల్లో విడుదలవుతాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) బజాజ్-ట్రయంఫ్ నేతృత్వంలో మరింత సరసమైన ట్రయంఫ్ మోడల్లను అందించడానికి, కంపెనీ డీలర్ నెట్వర్క్ కూడా రాబోయే 2 సంవత్సరాలలో దాని నెట్వర్క్ పెంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ దేశంలోని 120 నగరాల్లో తన షోరూమ్‌లను ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. -
హమ్మ బాబోయ్! ఈ బైక్ ధరకు కారు వచ్చేస్తుందిగా
ప్రీమియం మోటార్‌సైకిల్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ తాజాగా భారత్‌లో సరికొత్త టైగర్ స్పోర్ట్ 660 ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్లో ధర ఎక్స్‌షోరూంలో రూ.8.95 లక్షలు. ఈ మోడల్ రాకతో మధ్యస్థాయి బరువుగల అడ్వెంచర్ బైక్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు అయిందని కంపెనీ తెలిపింది. 660 సీసీ ట్రిపుల్ సిలిండర్ పవర్‌ట్రెయిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, 81 పీఎస్ పవర్, 17 లీటర్ల ఇంధన ట్యాంక్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బ్లూటూత్ రెడీ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్విచేబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి హంగులు ఉన్నాయి. డిజైన్ పరంగా...రాబోయే టైగర్ స్పోర్ట్ 660..ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఎయిర్ వెంట్, బైక్‌కు ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్‌తో స్పోర్టీ లుక్‌ను పొందనుంది. రేడియేటర్ కౌల్‌ను కూడా కలిగి ఉంటుంది.ట్రయంఫ్ మోటార్స్ టైగర్ స్పోర్ట్ 660, మిడ్-సైజ్ స్పోర్ట్ టూరర్గా ఉండనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్‌తో రానుంది. ఈ బైక్ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. ఇది కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి వంటి బైక్‌లకు పోటీగా నిలవనుంది. (చదవండి: 2022–23 బడ్జెట్..దూసుకుపోనున్న దేశ ఆర్థిక వ్యవస్థ: నిర్మలా సీతారామన్!) -
అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..!
ప్రముఖ లగ్జరీ బైక్‌ల తయారీదారు ట్రయంఫ్ మోటార్స్ సరికొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ట్రయంఫ్ టైగర్ లైనప్‌లో భాగంగా ‘టైగర్ స్పోర్ట్ 660'ను మార్చి 29, 2022న భారత్‌లో విడుదల చేయనుంది. టైగర్ లైనప్‌లో ఎంట్రీ లెవల్, అత్యంత సరసమైన ధరలో ‘ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్స్ 660’ నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత వారం ట్రయంఫ్ మోటార్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొత్త బైక్ టీజర్ లాంచ్ చేసింది. భారత్‌లోని తమ టైగర్ లైనప్‌లో 850 స్పోర్ట్, టైగర్ 900 బైక్స్ ఉన్నాయి. వీటితోపాటుగా హై-పెర్ఫార్మెన్స్ టైగర్ 1200ని త్వరలోనే లాంచ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. డిజైన్ పరంగా...రాబోయే టైగర్ స్పోర్ట్ 660..LED హెడ్‌ల్యాంప్‌తో ఎయిర్ వెంట్, బైక్‌కు ముందు భాగంలో పొడవైన విండ్‌స్క్రీన్‌తో స్పోర్టీ లుక్‌ను పొందనుంది. రేడియేటర్ కౌల్‌ను కూడా కలిగి ఉంటుంది.ట్రయంఫ్ మోటార్స్ టైగర్ స్పోర్ట్ 660, మిడ్-సైజ్ స్పోర్ట్ టూరర్గా ఉండనుంది. ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED సెటప్‌తో రానుంది. టైగర్ స్పోర్ట్ 660 ఇంజన్ విషయానికి వస్తే...ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ఇంజన్‌ను పోలీ ఉండనుంది. 660cc ఇన్లైన్-త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 81 hp శక్తిని, 64 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ట్రెయిన్ అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్మిషన్కు జత చేసే అవకాశం ఉంది. ఈ బైక్ బరువు సుమారు 206 కిలోలు, 17. 2 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. రాబోయే ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 బైక్ ధర రూ. 8.5 లక్షలుగా ఉండవచ్చని అంచనా. కవాసకి వెర్సిస్ 650, సుజుకి వి-స్ట్రోమ్ 650 ఎక్స్‌టి వంటి బైక్‌లకు పోటీగా నిలవనుంది. చదవండి: ఆర్ఆర్ఆర్ ఎంట్రీ..పీవీఆర్‌తో కొత్త దోస్తీ..ఊహించిన లాభాలు సొంతం...! -
ప్రపంచంలోనే అత్యధిక పీక్ టార్క్ బైక్..! భారత్‌లోకి నయా ట్రయంఫ్ బైక్..!
యూకేకు చెందిన టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లలోకి ట్రయంఫ్ రాకెట్ 3ఆర్ 221 స్పెషల్ ఎడిషన్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ బైక్ ఆర్, జీటీ అనే ట్రిమ్స్ వేరియంట్లో లభించనుంది. ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 ఆర్ ట్రీమ్ ధర రూ 20.80 లక్షలు కాగా, జీటీ ట్రీమ్ వేరియంట్ ధర రూ 21.40 లక్షలుగా ఉంది. న్యూ 221 స్పెషల్ ఎడిషన్స్ న్యూ పెయింట్ స్కీమ్‌తో రాకెట్ మాస్క్యులర్ స్టైల్, హ్యాండ్లింగ్, టూరింగ్ సామర్ధ్యాలతో రానుంది. అత్యధిక పీక్ టార్క్‌తో..! ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 బైక్ సుమారు 221ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ప్రపంచంలోనే అత్యధిక పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోన్న బైక్ ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బైక్ ఇంటిరియర్స్ విషయానికి వస్తే..! ఈ బైక్ ఇంటిరియర్స్ బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ ముందు భాగంలో ట్విన్ హెడ్‌లైట్స్, ట్రయంఫ్ సిగ్నేచర్ షేప్‌తో కూడిన ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్, రియర్ సైడ్ టెయిల్ లైట్స్, ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ లైట్స్‌ను కల్గి ఉంది. దాంతో పాటుగా హై-స్పెసిఫికేషన్ ఏవాన్ కోబ్రా క్రోమ్ టైర్స్‌తో రానుంది. 20-స్పోక్ డిజైన్‌తో తేలికైన, కాస్ట్ అల్యూమినియంతో తయారుచేశారు. టైర్లకు అసాధారణమైన గ్రిప్, అధిక మైలేజ్ డ్యూరబిలిటీని అందించనున్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే..! ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ బైక్ సుమారు 2500సీసీ ట్రిపుల్ ఇంజన్‌తో రానుంది. హై పర్ఫామెన్స్ 6 స్పీడ్ హెలికల్-కట్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఇది 6,000 rpm వద్ద గరిష్టంగా 165bhp శక్తిని అందిస్తుంది. ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ రోడ్, రెయిన్, స్పోర్ట్, రైడర్ వంటి నాలుగు రైడింగ్ మోడ్స్ ఫీచర్లను కలిగిఉంది. చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఒకినావా రికార్డు..! -
ట్రయంఫ్ కొత్త స్ట్రీట్ స్క్రాంబ్లర్
సూపర్‌బైక్స్ తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఆధునీకరించిన స్ట్రీట్ స్క్రాంబ్లర్‌ను ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.9.35 లక్షలు. 65 పీఎస్ పవర్‌తో 900 సీసీ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుపరిచారు. రోడ్, రెయిన్, ఆఫ్–రోడ్ రైడింగ్ మోడ్స్‌లో రూపొందించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఎల్సీడీ డిస్ప్లేతో అనలాగ్ స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచేబుల్ ఏబీఎస్, టార్క్ అసిస్ట్ క్లచ్, డిస్టింక్టివ్ ఎల్ఈడీ రేర్ లైట్, యూఎస్బీ చార్జర్, ఇమ్మొబిలైజర్ వంటి హంగులు ఉన్నాయి. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. వాహనం 223 కిలోల బరువు ఉంది. గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. -
జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..!
Triumph Tiger 900 Bond Edition: ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. నిర్మాణ సంస్థలు అదే స్థాయిలో విలువలను పాటిస్తూ బాండ్ సినిమాలను రూపొందిస్తాయి. సినిమా అయ్యే ఖర్చు గురించి అసలు పట్టించుకోరు. త్వరలోనే జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 25వ చిత్రం‘నో టైం టూ డై’ ప్రేక్షకులకు ముందు రానుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! జేమ్స్ బాండ్ 007 ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంఫ్ మోటార్స్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను ప్రకటించింది. ట్రయంఫ్ టైగర్ 900 బాండ్ ఎడిషన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ని మార్కెట్లలోకి కంపెనీ టీజ్ చేసింది. ట్రయంఫ్ మోటార్స్ కేవలం 250 బైకులను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. గతంలో ట్రయంఫ్ మోటార్స్ జేమ్స్ బాండ్ ప్రాంఛైజీ భాగస్వామ్యంతో ట్రయంప్ స్క్రాంబ్లర్ 1200 బాండ్ ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది. టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్ విషయానికి వస్తే..ప్రత్యేకమైన మాట్ సఫైర్ బ్లాక్ పెయింట్‌తో 007 గ్రాఫిక్స్‌తో ఈ బైక్ రానుంది. బిల్లెట్ మెషిన్డ్ హ్యాండిల్ బార్ క్లాంప్‌తో పాటు బైక్ ప్రత్యేకమైన లిమిటెడ్-ఎడిషన్ నంబర్‌తో వస్తుంది. బైక్‌లో ఫ్రేమ్, హెడ్‌లైట్ ఫినిషర్లు, సైడ్ ప్యానెల్లు, సంప్ గార్డ్, పిలియన్ ఫుట్‌రెస్ట్ హ్యాంగర్లు, ఇంజిన్ గార్డ్లు అన్నీ ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్‌తో రానున్నాయి. బైక్ స్పీడో మీటర్ 007బాండ్ సిగ్నేచర్‌ను ఏర్పాటుచేశారు. అదనపు పెర్ఫార్మెన్స్ కోసం మిచెలిన్ అనకీ వైల్డ్ ఆఫ్-రోడ్ టైర్స్‌ను అమర్చారు. కాగా ఈ బైక్ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు, టైగర్ 900 బాండ్ ఎడిషన్ బైక్ యూరోప్, యుఎస్ఏ, కెనడాలోని కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: No Time Time To Die: గన్నులున్న జేమ్స్‌బాండ్ కారు.. అమ్మకానికి రెడీ ! -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
భారీ ఇంజిన్‌తో ఖరీదైన బైక్
సాక్షి, న్యూఢిల్లీ: యూకేకు చెందిన మోటార్‌సైకిల్ తయారీ దిగ్గజం ట్రయంఫ్ రాకెట్ 3 బ్రాండ్ లో అత్యంత ఖరీదైన కొత్త మెటార్ బైక్ లాంచ్ చేసింది. భారీ ఇంజిన్‌తో రాకెట్ 3 జీటీ పేరుతో దీన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ .18.4 లక్షలుగా నిర్ణయించింది. కరోనా సంక్షోభం కాలంలో అమ్మకాలు లేక దేశం నుంచి వైదొలగాలని మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్సన్ భావిస్తున్న తరుణంలో ట్రయంఫ్ అద్భుత ఫీచర్లతో ఈ కొత్త మోటార్ సైకిల్ తీసుకువడం విశేషం. రాకెట్ 3 జీటీ స్పెసిఫికేషన్లు ట్రిపుల్ మెటారు ప్రధాన ఆకర్షణ. అతిపెద్ద 2,500 సీసీ ఇన్ లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ 6000 ఆర్ పీఎమ్ వద్ద 167 బిహెచ్పి శక్తిని, 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది గత వెర్షన్ కంటే 11 శాతం ఎక్కువ. కొత్త క్రాంక్కేస్ అసెంబ్లీ, ఇంటిగ్రల్ ఆయిల్ ట్యాంక్, బ్యాలెన్సర్ షాఫ్ట్ కలిగి ఉంది. ఇంజిన్ బరువును 18 కిలోలకు పరిమితం చేసింది. పాత తరం బైక్‌తో పోలిస్తే బరువును సుమారు 40 కిలోలు తగ్గించింది. టూరింగ్ స్టయిల్ హ్యాండిల్‌బార్, పొడవైన విండ్‌స్క్రీన్, గో ప్రో కంట్రెల్స్ తో బ్లూటూత్-ఎనేబుల్డ్ ఫుల్-కలర్ టిఎఫ్టి డాష్, హిల్-హోల్డ్ కంట్రోల్, 4 రైడ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకా టార్క్ అసిస్టెడ్ క్లచ్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ఎక్స్టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్, తేలికపాటి 20-స్పోక్ అల్యూమినియం వీల్ లాంటి ఇతర ఫీచర్లు ఈ బైక్ సొంతం. తమ కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ ఔత్సాహికుల బైక్ అని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షుయెబ్ ఫారూక్ తెలిపారు. అత్యుత్తమ టెక్నాలజీ, ఎర్గోనామిక్స్, ఆశ్చర్యపరిచే పనితీరుతో ఇదొక లెజెండ్ బైక్ అన్నారు. -
మార్కెట్లోకి ట్రయంఫ్ ‘స్పీడ్ ట్విన్’
న్యూఢిల్లీ: దిగ్గజ సూపర్‌బైక్స్ తయారీ కంపెనీ ట్రయంఫ్.. ‘స్పీడ్ ట్విన్ 2019’ ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1200–సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్‌బైక్ ధర రూ.9.46 లక్షలు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ మాట్లాడుతూ.. ‘భారత రైడర్స్ కోసం ట్రయంఫ్ లగ్జరీ మోటార్ సైకిళ్ల పరిధి చాలా విస్తృతంగా ఉంది. మా ఉనికిని చాటుకునేలా అత్యాధునిక సూపర్‌బైక్స్‌ను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేయడంపై దృష్టి పెట్టాం’ అన్నారు. ఇక సంస్థ జూలై– జూన్ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తుండగా.. ఈ కాలంలో 1,150 నుంచి 1,250 యూనిట్ల వరకు విక్రయించే అవకాశం ఉందని వెల్లడించింది. రూ.5లక్షల బైక్స్ విభాగంలో ఈ కంపెనీకి 16 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ట్రయంఫ్ నుంచి మరో ఖరీదైన బైక్
న్యూఢిల్లీ: బ్రిటిష్ ప్రీమియమ్ మోటార్ సైకిల్ కంపెనీ ట్రయంఫ్ టైగర్ 800 సిరీస్‌లో మరో ఖరీదైన బైక్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. టైగర్ 800 ఎక్స్‌సీఏ పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.15.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). మరింత మెరుగైన ఫీచర్లతోఈ ఆఫ్–రోడ్ బైక్‌ను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా తెలిపింది. 800 సీసీ ఇంజిన్‌తో రూపొందిన ఈ బైక్‌లో ఆరు రైడింగ్ మోడ్స్ ఉన్నాయని కంపెనీ జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ చెప్పారు. ఈ బైక్‌లో ఎల్ఈడీ లైట్లు, జాయ్‌స్టిక్ కంట్రోల్, అల్యూమినియమ్ ఫినిష్డ్ రేడియేటర్ గార్డ్, టీఎఫ్టీ స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. -
‘ట్రయంఫ్’ కొత్త బైక్‌లు...
న్యూఢిల్లీ: బ్రిటన్ సూపర్‌బైక్ బ్రాండ్ ట్రయంఫ్ రెండు మోడళ్లలో కొత్త వేరియంట్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్ట్రీట్ ట్విన్, స్ట్రీట్ స్క్రాంబ్లర్ మోడళ్లలో కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా తెలిపింది. వీటి ధరలు రూ.7.45 లక్షల నుంచి రూ.8.55 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్) ఉన్నాయని కంపెనీ జనరల్ మేనేజర్ షౌన్ ఫారూఖ్ పేర్కొన్నారు. ఈ రెండు బైక్‌లను 900 సీసీ హై–టార్క్ ప్యారలాల్ ట్విన్ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. స్ట్రీట్ ట్విన్ బైక్ ధర రూ.7.45 లక్షలని, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.55 లక్షలని తెలిపారు. ఈ బైక్‌ల ‘పవర్’ను 18 శాతం పెంచామని, దీంతో వీటి పవర్ 65 పీఎస్‌కు పెరిగిందని వివరించారు. పవర్ పెంపుతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లతో ఈ వేరియంట్లను అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల తయారీ వారంటీని (కిలోమీటర్లతో సంబంధం లేకుండా) ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలల్లో మరిన్ని వేరియంట్లు.. రానున్న మూడు నెలల్లో మరిన్ని కొత్త వేరియంట్లను అందుబాటులోకి తెస్తామని షారూఖ్ తెలిపారు. భారత 500 సీసీ కేటగిరీ బైక్‌ల్లో ప్రస్తుతం తమ మార్కెట్ వాటా 16 శాతంగా ఉందని వివరించారు. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియమ్ బైక్ బ్రాండ్ తమదేనని ఆయన తెలిపారు. -
ట్రయంఫ్‌తో బజాజ్ ఆటో గ్లోబల్ భాగస్వామ్యం
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో బ్రిటీష్ ద్విచక్ర వాహన దిగ్గజం ట్రైయంఫ్ మోటార్ సైకిల్ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్‌తో బజాజ్ ఆటో ఈక్విటీయేతర ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన విడుదల చేశాయి. గత ఆరు నుంచి తొమ్మిది నెలల నుంచి చర్చలు నిర్వహించినట్టు తెలిపారు. దీనిలో భాగంగా మధ్యస్థాయి సామర్థ్యంగల ట్రయంప్ మోటార్ సైకిళ్లను దేశీ మార్కెట్లో బజాజ్ ఆటో విక్రయించనుంది. ఈ ఒప్పందం ద్వారా మిడ్-టాస్క్ సెగ్మెంట్ లో ఇరుసంస్థలు లబ్ది చేకూరనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎలా సహకరించబోతున్నాయి అనేదానిపై ఖచ్చితమైన వివరాలపై రాబోయే రోజులలో మరింత సమాచారం పంచుకుంటామని హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ట్రైయంఫ్ మోటార్ సైకిళ్లతో జతకట్టడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు బజాజ్ ప్రయత్నిస్తోంది. అలాగే డుకాటి మోటార్స్ తో తాము జత కట్టడం లేదని బజాజ్ ప్రకటించింది. ట్రయంప్ బ్రాండ్, మోటార్ సైకిళ్లను విక్రయించడం ద్వారా తాము కూడా లబ్ది పొందగలమని బజాజ్ ఆటో ఒక ప్రకటనలో పేర్కొంది. తమ భాగస్వామ్యం ద్వారా ట్రయంప్ వర్థమాన మార్కెట్లలో మరింతగా విస్తరించనున్నామని తెలిపింది. -
ఈ బైక్ ధర రూ.7.78 లక్షలు
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ భారత్‌లో ప్రవేశ పెట్టిన కొత్త సూపర్ బైక్ ఇది. టీ100 పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ బైక్ ధర రూ.7.78 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ). రూ.5 లక్షలకు మించిన 500 సీసీ బైక్‌ల మార్కెట్లో అగ్రస్థానం సాధించడం తమ లక్ష్యమని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లి పేర్కొన్నారు. -
అమ్మకాల్లో ట్రయింఫ్ స్పీడు
ఈ ఏడాది మరో రెండు మోడళ్లు ‘సాక్షి’తో ట్రయంఫ్ ఎండీ విమల్ సంబ్లీ ఇంటర్వ్యూ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ, ప్రీమియం బైక్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారతీయ రోడ్లపై తన హవా కొనసాగిస్తోంది. ఒకేసారి 10 మోడళ్లతో 2013 నవంబరు 28న దేశంలో అడుగుపెట్టిన ఈ బ్రిటిష్త బ్రాండ్.. ఏడాదిలోనే 1,300 పైగా రైడర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ‘తొలి ఏడాది 250 వాహనాలను విక్రయిస్తామని భావించాం. కానీ అంచనాలను మించిన స్పందన చూస్తున్నాం’ అన్నారు ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లీ. అంతర్జాతీయంగా సంస్థ విక్రయిస్తున్న మోడళ్లను దశలవారీగా ఇక్కడ పరిచయం చేసేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ఉన్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. బైక్‌పైనే మక్కువ.. ప్రీమియం బైక్‌లపై సరదాగా షికారుకెళ్లడం ఇప్పుడు కొత్త ట్రెండ్. అందుకే బైక్ ఖరీదెంతైనా భారతీయులు వెనుకాడడం లేదు. యాక్సెసరీస్ కోసమే రూ.2 లక్షలకుపైగా వెచ్చించే రైడర్లూ ఉన్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఉద్యోగి ఒకరు ఇల్లుకు బదులు బైక్ కొన్నాడంటే రైడర్ల ఆసక్తి అర్థం చేసుకోవచ్చు. రాకెట్-3 రోడ్‌స్టర్ ఖరీదు రూ.21 లక్షలపైనే. ఈ మోడల్లో ఇప్పటికి 50 యూనిట్లు విక్రయించాం. మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నా కస్టమర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్‌లో 500 సీసీ ఆపై సామర్థ్యమున్న బైక్‌ల మార్కెట్ 2008-09లో 450 యూనిట్లు. 2014-15లో ఇది 10 వేల యూనిట్లకు చేరుకుంది. డిసెంబరుకల్లా మరో 5 షోరూమ్‌లు.. ప్రపంచవ్యాప్తంగా ఆరు విభాగాల్లో 28 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అయిదు విభాగాల్లో 12 మోడళ్లను భారత్‌లో విక్రయిస్తున్నాం. ఆగస్టుకల్లా మరో రెండు మోడళ్లు రానున్నాయి. 10 విక్రయ కేంద్రాలున్నాయి. డిసెంబరుకల్లా మరో 5 తెరుస్తాం. రైడర్లయితేనే డీలర్షిప్ అప్పగిస్తాం. హైదరాబాదీలు స్మార్ట్.. ఫుడ్, లగ్జరీ, గోల్డ్, ప్లాటినం, బైక్.. విషయం ఏదైనా హైదరాబాదీలు అనుభూతిని కోరుకుంటారు. ఇది రిచ్ మార్కెట్. ఫలానా మోడల్ కావాలని డిమాండ్ చేస్తారు. కస్టమర్లకు వాహనం గురించి పూర్తి అవగాహన ఉంటుంది. ఇక్కడ రైడర్లున్నారు. దేశంలో తొలి షోరూం బెంగళూరులో ప్రారంభమైనా, దానికంటే ముందే హైదరాబాద్ షోరూం సిద్ధమైంది. కొన్ని కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. షోరూం తెరవకపోయినా బుకింగ్స్ నమోదయ్యాయంటే భాగ్యనగరవాసులకు ట్రయంఫ్ బ్రాండ్‌పట్ల ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన రాకెట్-3 రోడ్‌స్టర్‌ను అయిదుగురు హైదరాబాద్ కస్టమర్లు చేజిక్కించుకున్నారు. హైదరాబాద్ షోరూం నుంచి మొత్తం 125 బైక్‌లు రోడ్డెక్కాయి -
మరో లగ్జరీ బైక్ వచ్చింది
-
మరో లగ్జరీ బైక్ వచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్లుగానీ, బైక్‌లు గానీ హైదరాబాద్‌లో దొరకని బ్రాండ్ లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని బ్రాండ్లయితే దేశంలో తొలి షోరూమ్‌ను ఇక్కడే ఆరంభించాయి కూడా. ఆ జాబితాలో ఇపుడుమరో అంతర్జాతీయ బ్రాండ్ ‘ట్రయంఫ్’ చేరింది. బ్రిటన్‌కు చెందిన ‘ట్రయంఫ్’ హైదరాబాద్‌లో మొట్టమొదటి షోరూంను గురువారం ప్రారంభించింది. షోరూం ప్రారంభానికి ముందే 50 బైక్‌లు బుక్ అయినట్లు ట్రయంఫ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విమల్ సుంబ్లీ చెప్పారు. మొత్తం పది మోడల్స్‌ను అందుబాటులో ఉంచామని, వీటి ప్రారంభ ధర రూ.5.9 లక్షలని, గరిష్ట ధర రూ.20 లక్షల వరకు ఉందని ఆయన వివరించారు. గురువారం షోరూంను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం విమల్ విలేకరులతో మాట్లాడారు. దేశీయ లగ్జరీ బైక్‌ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఈ విభాగంలో ఏటా 3,000 బైక్‌లు అమ్ముడవుతున్నాయని చెప్పారు. ‘‘ఈ ఏడాది 500 బైక్‌లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రెండేళ్ళలో ఈ సంఖ్య 1,500 దాటుతుం దన్న ధీమా మాకుంది. ముఖ్యంగా దక్షిణాది, పశ్చిమ మార్కెట్లపైనే దృష్టి పెట్టాం’’ అని తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు షోరూంలను ఆరంభించామని, మార్చి నాటికి ఈ సంఖ్య 8కి చేరుకుం టుం దని చెప్పారు. ‘‘షోరూం లను ప్రారంభించడం మాత్రమే కాదు. అమ్మిన తర్వాత అవసరమైన సేవలు, అలాగే లగ్జరీ బైక్‌లను ఏ విధంగా వాడాలన్న దానిపై అవగాహన పెంచేలా బైక్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం హర్యానాలోని మనేసర్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. తొలి ఉత్పత్తి కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. ఇది 2015-16 నాటికి అందుబాటులోకి వస్తుంది’’ అని వివరించారు.