![Triumph Rocket 3 221 Special Edition Launched In India - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/21/Triumph-Rocket-3-GT-221.jpg.webp?itok=CnBcbgnB)
యూకేకు చెందిన టూవీలర్ ఆటోమొబైల్ దిగ్గజం ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లలోకి ట్రయంఫ్ రాకెట్ 3ఆర్ 221 స్పెషల్ ఎడిషన్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ బైక్ ఆర్, జీటీ అనే ట్రిమ్స్ వేరియంట్‌లో లభించనుంది. ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 ఆర్ ట్రీమ్ ధర రూ 20.80 లక్షలు కాగా, జీటీ ట్రీమ్ వేరియంట్ ధర రూ 21.40 లక్షలుగా ఉంది. న్యూ 221 స్పెషల్ ఎడిషన్స్ న్యూ పెయింట్ స్కీమ్‌తో రాకెట్ మాస్క్యులర్ స్టైల్, హ్యాండ్లింగ్, టూరింగ్ సామర్ధ్యాలతో రానుంది.
అత్యధిక పీక్ టార్క్‌తో..!
ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 బైక్ సుమారు 221ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ప్రపంచంలోనే అత్యధిక పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోన్న బైక్ ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బైక్ ఇంటిరియర్స్ విషయానికి వస్తే..!
ఈ బైక్ ఇంటిరియర్స్ బైక్ లవర్స్‌ను ఇట్టే కట్టిపడేస్తుంది. ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ ముందు భాగంలో ట్విన్ హెడ్‌లైట్స్, ట్రయంఫ్ సిగ్నేచర్ షేప్‌తో కూడిన ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్, రియర్ సైడ్ టెయిల్ లైట్స్, ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ లైట్స్‌ను కల్గి ఉంది. దాంతో పాటుగా హై-స్పెసిఫికేషన్ ఏవాన్ కోబ్రా క్రోమ్ టైర్స్‌తో రానుంది. 20-స్పోక్ డిజైన్‌తో తేలికైన, కాస్ట్ అల్యూమినియంతో తయారుచేశారు. టైర్లకు అసాధారణమైన గ్రిప్, అధిక మైలేజ్ డ్యూరబిలిటీని అందించనున్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే..!
ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ బైక్ సుమారు 2500సీసీ ట్రిపుల్ ఇంజన్‌తో రానుంది. హై పర్ఫామెన్స్ 6 స్పీడ్ హెలికల్-కట్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఇది 6,000 rpm వద్ద గరిష్టంగా 165bhp శక్తిని అందిస్తుంది. ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ రోడ్, రెయిన్, స్పోర్ట్, రైడర్ వంటి నాలుగు రైడింగ్ మోడ్స్ ఫీచర్లను కలిగిఉంది.
చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఒకినావా రికార్డు..!
Comments
Please login to add a commentAdd a comment