![Enam AMC launches Enam India Vision Portfolio - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/31/Untitled-5_0.jpg.webp?itok=DPzt1iK6)
ముంబై: అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఈనామ్ ఏఎంసీ కొత్తగా ఈనామ్ ఇండియా విజన్ పోర్ట్‌ఫోలియో (ఈఐవీపీ)ని ఆవిష్కరించింది. మార్కెట్ క్యాప్, రంగాలతో సంబంధం లేకుండా పటిష్టమైన 15–30 కంపెనీల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది.
కనీసం రూ. 50 లక్షలు మదుపు చేసే ఇన్వెస్టర్ల కోసం దీన్ని ఉద్దేశించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జితేన్ దోషి తెలిపారు. దీని ద్వారా 1 బిలియన్ డాలర్ల వరకూ సేకరించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈనామ్ ఏఎంసీ సుమారు 3.48 బిలియన్ డాలర్ల ఆస్తులను (ఏయూఎం) నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment