Portfolio
-
ఎలాంటి తప్పులకు పాల్పడలేదు
న్యూఢిల్లీ: అదానీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీపై యూఎస్‌లో నమోదైన లంచంఅభియోగంపై గ్రూప్ సీఎఫ్‌వో జుగేశిందర్ రాబీ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. 11 లిస్టెడ్ సంస్థలతో కూడిన అదానీ గ్రూప్ పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో ఏ ఒక్కటీ ఎలాంటి తప్పులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరమైన ఆమోదాలు పొందిన తర్వాత యూఎస్‌లో నేరారోపణపై అదానీ గ్రూప్ వివరణాత్మక వ్యాఖ్యను చేస్తుందని సింగ్ చెప్పారు. ‘సంబంధం లేని అంశాలను ఎంచుకుని, శీర్షిక సృష్టించడానికి ప్రయత్నించే వార్తలు, నివేదికలు చాలా ఉన్నాయి. లీగల్ ఫైల్లో సమర్పించిన విషయాన్ని మేము వివరంగా సమీక్షించిన తర్వాత పూర్తి సమయంలో ప్రతిస్పందిస్తాం. నేరారోపణపై ఏ న్యాయస్థానం ఇంకా తీర్పు ఇవ్వలేదు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యొక్క న్యాయవాదులు వివరించినట్లుగా ఇవి ఆరోపణలు మరియు నిందితులు నిర్దోషిగా భావించబడతారు. నేరారోపణ అదానీ గ్రీన్ యొక్క ఒక ఒప్పందానికి సంబంధించినది. ఇది అదానీ గ్రీన్ యొక్క మొత్తం వ్యాపారంలో దాదాపు 10 శాతం. దీని గురించి చాలా ఖచ్చితమైన, సమగ్రమైన వివరాలు ఉన్నాయి. మేము తగిన వేదికలో విశదీకరిస్తాము’ అని జుగేశిందర్ రాబీ సింగ్ వివరించారు. అదానీ చైర్మన్‌కు సమన్లున్యూయార్క్: యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమీషన్ (ఎస్ఈసీ) చేసిన లంచం ఆరోపణలపై తమ వైఖరిని వివరించాల్సిందిగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ మరియు అతని మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సాగర్లకు సమన్లు అందాయి. 21 రోజుల్లోగా ఎస్ఈసీకి సమాధానం ఇవ్వాలని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ నివాసానికి, అదే నగరంలోని అతని మేనల్లుడు సాగర్ నివాసానికి సమన్లు జారీ అయ్యాయి.కెన్యాలో విమానాశ్రయ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకోలేదుకెన్యా ప్రధాన విమానాశ్రయాన్ని నిర్వహించడానికి తాము ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. యూఎస్‌లో లంచం ఆరోపణల నేపథ్యంలో 2.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఒప్పందాలను కెన్యా రద్దు చేసిందనే వార్తలపై బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ శనివారం స్పందించింది. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆ దేశ ప్రధాన విమానాశ్రయ ప్రాజెక్టు రద్దుకు ఆదేశించినట్లు వచ్చిన నివేదికలను ధృవీకరించుకోవడానికి స్టాక్ ఎక్సే్ఛంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ప్రతిస్పందించింది. విమానాశ్రయ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్.. ఈ ఏడాది ఆగస్టులో కెన్యాలో విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేయడానికి, ఆధునీకరణకు, నిర్వహణకై ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ఈ రోజు వరకు కంపెనీకి లేదా దాని అనుబంధ సంస్థలకు కెన్యాలో ఏ విమానాశ్రయ ప్రాజెక్ట్‌ను అప్పగించలేదని, ఏ విమానాశ్రయానికి సంబంధించి ఏదైనా కట్టుబడి లేదా ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని సంస్థ తెలిపింది.పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుపై.. కెన్యాలో 30 ఏళ్లపాటు కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్మించి, నిర్వహించడానికి గత నెలలో సంతకం చేసిన ఒప్పందంపై మాట్లాడుతూ.. సవరించిన సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్ 2015 యొక్క షెడ్యూల్–3, పార్ట్ ఏ, ప్యారా–బీ ఐటెం 4 పరిధిలోకి ప్రాజెక్ట్ రాదని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం దక్కించుకున్న, సవరించిన లేదా రద్దు అయిన కాంట్రాక్టుల గురించి ఎలాంటి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గ్రూప్ పేర్కొంది. రద్దును నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి గ్రూప్ నిరాకరించింది. పవర్ ట్రాన్స్మిషన్ లైన్లను నిర్వహించే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కెన్యాలో ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్టు అక్టోబర్ 9న ప్రత్యేక ఫైలింగ్‌లో తెలిపింది. దీనికి అనుగుణంగా కెన్యాలో అనుబంధ సంస్థను నెలకొల్పినట్టు వివరించింది. -
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్ డెట్‌లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. -
స్మాల్, మిడ్‌క్యాప్‌పై సెబీ అలర్ట్
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ఈ విభాగాల్లోకి వచ్చే తాజా పెట్టుబడులపై ఆంక్షలు, పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ తదితర చర్యలను పరిశీలించాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తన సభ్యులను కోరింది. సెబీ తరఫున యాంఫి ఈ సూచనలు చేసింది. నిజానికి గడిచిన ఏడాది కాలానికి పైగా స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో పెద్దగా దిద్దుబాటు రాలేదు. 2023లో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.22,913 కోట్లు రాగా, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.41,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీగా పెట్టుబడులు వస్తుండడం, స్టాక్స్ విలువలను మరింత పైకి తీసుకెళుతోంది. ఈ తరుణంలో సెబీ ఫండ్స్ సంస్థలను అప్రమత్తం చేయడం గమనార్హం. 21 రోజుల్లోగా నూతన విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త.. ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, ఎస్బీఐ, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్మాల్‌క్యాప్ పథకాలకు సంబంధించి లంప్సమ్ (ఏక మొత్తం/ఒకే విడత) పెట్టుబడులను అనుమతించడం లేదు. సిప్ పెట్టుబడిపైనా కొన్ని సంస్థలు పరిమితులు అమలు చేస్తున్నాయి. -
కుటుంబాలకు మరిన్ని రుణాలు!
కోల్‌కతా: కుటుంబాల రుణ అవసరాల పరంగా మరింత విస్తరించి, తమ పంపిణీల పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేసుకోడానికి సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్ఐలు) దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ, డైరెక్టర్ అలోక్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల తక్కువ ఆదాయ రుణగ్రహీతలు ఉన్నారని, వీరు నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంఎఫ్ఐ రంగానికి రూ. 13 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో విస్తరణ సామర్థ్యం ఉందని ఆయన పేర్కొంటూ, ఈ నేపథ్యంలో వృద్ధికి భారీ అవకాశం ఉందని అన్నారు. ఒక్క పశి్చమ బెంగాల్లో 65 లక్షల మంది రుణగ్రహీతలకు సంబంధించి మొత్తం రూ. 35,000 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని అన్నారు. మొత్తం పోర్ట్‌ఫోలియోలో తొమ్మిది శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని చెప్పారు. లఘు ఎంఎఫ్ఐలకు రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటును ఈ రంగం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎంఎఫ్ఐ)పశి్చమ బెంగాల్ విభాగం ఈ నెల 22వ నిర్వహించనున్న 8వ ఈస్టర్న్ ఇండియా మైక్రోఫైనాన్స్ సమ్మిట్ సందర్భంగా అలోక్ మిశ్రా ఎంఎఫ్ఐ రంగానికి సంబంధించి ఈ కీలక అంశాలను వెల్లడించారు. ఈ రంగానికి చెందిన మరికొందరు చెబుతున్న అంశాలు ఇవీ... ► ప్రస్తుతం దేశంలో ఎంఎఫ్ఐ కవరేజీ తక్కువగా ఉందని ఆరోహన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎండీ మనోజ్ నంబియార్ తెలిపారు.ఈ రంగం మరింత విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. ► చారిత్రాత్మకంగా ఎంఎఫ్ఐ రంగంలో మొండిబకాయిల (ఎన్పీఏ) సగటు స్థాయిలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వీఎఫ్ఎస్ క్యాపిటల్ ఎండీ కులదీప్ మైథీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలో ఎంఎఫ్ఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మైథీ చెప్పారు. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (అన్ని వసతులతో, పని చేయడానికి సిద్ధంగా ఉండే పని ప్రదేశాలు) మార్కెట్ మంచి జోరు మీద ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ 60 శాతం వృద్ధితో రూ.14,000 కోట్లకు చేరుకుంటుందని అప్‌ఫ్లెక్స్ ఇండియా సంస్థ తెలిపింది. అప్‌ఫ్లెక్స్ కూడా ఈ రంగంలోనే సేవలు అందిస్తుంటుంది. ఆపరేటర్లు ఒక్కో డెస్‌్కకు వసూలు చేసే చార్జీ పెరగడం, పోర్ట్‌ఫోలియో విస్తరణ మార్కెట్ పరిమాణం పెరిగేందుకు కారణమవుతాయని అప్‌ఫ్లెక్స్ నివేదిక వివరించింది. ఈ నివేదికను వీవర్క్ ఇండియా సీఈవో కరన్ విర్వాణి వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వార్షిక అద్దె ఆదాయం 2022–23లో రూ.8,903 కోట్లుగా ఉంటే, అది 2023–24లో రూ.14,227 కోట్లకు పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. అలాగే ఈ విభాగంలో సేవలు అందించే ఆపరేటర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం చివరికి 10.4 లక్షలుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 12.66 లక్షలకు పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ 47 లక్షల చదరపు అడుగుల పరిమాణం నుంచి 57 లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తుందని పేర్కొంది. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో ఒక్కో డెస్క్ నెలవారీ సగటు అద్దె 9,200 నుంచి 10,400కు.. అలాగే, అక్యుపెన్సీ (డెస్క్‌లు భర్తీ) రేటు 75 శాతం నుంచి 90 శాతానికి మెరుగుపడినట్టు వెల్లడించింది. హైబ్రిడ్ పని విధానాలతో డిమాండ్ ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ గడిచిన కొన్ని సంవత్సరాల్లో గుణాత్మకమైన మార్పును చూసింది. ఇందులో ఫ్లెక్స్ స్పేస్ తన వంతు పాత్ర పోషించింది. హైబ్రిడ్ పని విధానాల అమలు నేపథ్యంలో సౌకర్యవంతమైన పని ప్రదేశాలకు డిమాండ్ పెరుగుతోంది’’అని విర్వాణీ తెలిపారు. ‘‘కరోనా ముందు 55 పట్టణాల పరిధిలో 1500కు పైగా ప్రదేశాల్లో 400కు పైగా ఆపరేటర్లు పని చేసే వారు. ఇప్పుడు 90 పట్టణాల పరిధిలోని 2,320 ప్రాంతాల్లో 965కు పైగా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. దేశంలో ఫ్లెక్సిబుల్ వర్స్‌స్పేస్ దిశగా వస్తున్న మార్పు ఆశాజనకంగా ఉంది’’అని అప్‌ఫ్లెక్స్ ఇండియా సీఈవో ప్రత్యూష్ పాండే వివరించారు. పెద్ద కార్పొరేట్లు, సంస్థల నుంచి హైబ్రిడ్ పని విధానాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఇక మీదట ఈ మార్కెట్ ఇంకా విస్తరిస్తుందని చెప్పారు. ‘‘కార్పొరేట్లు సొంతంగా పెద్ద ప్రదేశాలపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి బదులు ఆఫీస్ పరిష్కారాలను అందించే వారి సేవలను పొందడాన్ని సౌకర్యంగా భావిస్తున్నారు. దీనివల్ల పనిలో సౌకర్యంతోపాటు, వ్యయాలు ఆదా చేసుకునేందుకు వీలు కలుగుతోంది’’అని పాండే వివరించారు. 2023 జూన్ నాటికి దేశ వాణిజ్య ఆఫీస్ లీజింగ్‌లో కోవర్కింగ్ వాటా 19 శాతంగా ఉన్నట్టు అప్‌ఫ్లెక్స్ తెలిపింది. -
ఎఫ్‌పీఐల దూకుడు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల పట్ల దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు సాగిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు, ఈ నెలలో మాత్రం భారీ పెట్టుబడులకు మొగ్గు చూపించారు. డిసెంబర్ నెలలో మొదటి ఆరు ట్రేడింగ్ రోజుల్లో (8వ తేదీ నాటికి) ఏకంగా రూ.26,505 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండడం, మూడు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ మెజారిటీ సాధించడంతో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందన్న స్పష్టత ఎఫ్‌పీఐల్లో సానుకూలతకు దారితీసింది. అక్టోబర్ నెలలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు ఆగస్ట్, సెపె్టంబర్ నెలలో రూ.39,300 కోట్ల మేర పెట్టుబడులను వారు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక మీదట ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందన్న సంకేతాల ఫలితమే ఎఫ్‌పీఐల పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని ఫిడెల్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ పేర్కొన్నారు. ‘‘2024 సాధారణ ఎన్నికల అనంతరం రాజకీయ స్థిరత్వం, భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యోల్బణం తగ్గడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ స్థిరంగా తగ్గుతూ వస్తుండడం, బ్రెండ్ క్రూడ్ ధరల్లో దిద్దుబాటు భారత్‌కు అనుకూలించే అంశాలు’’అని విజయ్ కుమార్ వివరించారు. వీటిల్లో పెట్టుబడులు ‘‘వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతం ఇవ్వడం, అధిక వడ్డీ రేట్ల వాతావరణం నుంచి మళ్లనున్నట్టు సూచించడమే అవుతుంది. దీంతో ఇతర కరెన్సీలతో యూఎస్ డాలర్ బలహీనపడడం మొదలైంది’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ క్షీణించడంతో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో ఉన్న రిస్్క–రాబడుల తీరును తిరిగి మదించడానికి దారితీసినట్టు చెప్పారు. బ్యాంకులు, ఐటీ, టెలికం, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల కొనుగోళ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీల్లో రూ.1.31 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్‌లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్‌లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
మెరుగైన పోర్ట్‌ఫోలియోకు 8 సూత్రాలు..
ఇన్వెస్ట్ చేసి వదిలేయడం కాకుండా మధ్య మధ్యలో మన పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ కూడా ఉండాలి. అవసరమైతే రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అయితే, ఎన్నాళ్లకు ఈ ప్రక్రియ చేపట్టాలంటే.. ఐదేళ్లకోసారి అనేది నా సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే జీవిత గమనంలో ఈ అయిదేళ్ల వ్యవధిలో లక్ష్యాలు, పరిస్థితులు, అవసరాలు మారిపోతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న పెట్టుబడులు, సాధనాలు, వాటి పనితీరును మదింపు చేసుకోవడానికి కూడా ఈమాత్రం సమయం అవసరం. నా అనుభవం మేరకు ఫండ్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడానికి సంబంధించిన ఎనిమిది కీలక అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవేమిటంటే.. ఫండ్/ఏఎంసీ ఎంపిక .. ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ సావర్ధ్యాలు ప్రాతిపదికగా ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ప్రతి ఏఎంసీకి ఒక స్పె షాలిటీ అంటూ ఉంటుంది. మిడ్‌క్యాప్, వేల్యూ లేదా గ్రోత్ అంటూ వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకానుభవం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఏఎంసీ/ఫండ్ పరిమాణం.. ఏఎంసీ పరిమాణమనేది అప్రస్తుతం. చిన్న ఏఎంసీలతో పోలిస్తే పెద్ద ఏఎంసీలు వెనకబడిన సందర్భాలు చాలానే చూశాను. ఆ చిన్న ఏఎంసీలు తర్వాత రోజుల్లో మీడియం ఏఎంసీలుగా ఎదిగాయి కూడా. భారీ బుడగలాగా పెరిగిపోయిన స్కీములకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ముఖ్యంగా ఎంత మంచి పనితీరు కనపర్చినా కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ విషయంలో దీన్ని మరింతగా దృష్టిలో పెట్టుకోవాలి. నిలకడ వర్సెస్ స్టార్ పెర్ఫార్మెన్స్.. స్టార్ రేటింగ్స్ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. నా కొత్త పోర్ట్‌ఫోలియోలో, టాప్ పోర్టల్ ర్యాంకింగ్స్ లేదా 5 స్టార్ ర్యాంకింగ్స్ లేదా అందరూ ఎక్కువగా మాట్లాడుకునే ఫండ్స్ ఏవీ లేవు. నిలకడగా రాణిస్తున్న వాటిని నేను షార్ట్ లిస్ట్ చేసుకుని, వాటిల్లో నుంచి ఎంచుకున్నాను. అత్యుత్తమ పనితీరుకన్నా నిలకడకే ప్రాధాన్యమివ్వొచ్చు. సిప్ మంచిదే.. నెలవారీ సిప్‌లు బాగా పనిచేస్తాయి. సిప్ల వల్లే ఫండ్ పనితీరు కన్నా ఓ ఇన్వెస్టరుగా నా పనితీరు దాదాపు మెరుగ్గా ఉంటోంది. ఎందుకంటే.. మార్కెట్లు పడినప్పుడు కూడా నేను యూనిట్స్ కొంటూనే ఉంటాను. అంతేగాకుండా సిప్ల పని తీరు సైతం మెరుగ్గా ఉంటోంది. బీఏఎఫ్ కేటగిరీల్లో 14 శాతం పైగా, మిడ్ క్యాప్ కేటగిరీల్లో 18 శాతం పైగా రాబడులు ఇస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే, పెరిగే ఆదాయాలకు అనుగుణంగా సిప్‌లను కూడా పెంచుకుంటూ ఉండటం మంచిది. పరిమిత సంఖ్యలో స్కీములు.. పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్ స్కీములు ఉండాలి అంటే.. 10 వరకూ ఫర్వాలేదు. అంతకు మించి ఉండొద్దు. స్కీముల సంఖ్యను ఒక స్థాయికి పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఫండ్స్‌లో చాలా కేటగిరీలు ఉన్నందున ఇది అంత సులభం కాదు. నా మటుకు నేను ఫండ్స్‌ను ఆరు కేటగిరీల కింద వర్గీకరించుకున్నాను. ఒకో కేటగిరీలో ఒకటి లేదా రెండు స్కీములు ఉంటాయి. మొత్తం మీద 10కి మించవు. వీటిల్లో ఫ్లెక్సీ లేదా లార్జ్, మిడ్‌క్యాప్; మిడ్‌క్యాప్; స్మాల్ క్యాప్; అసెట్ అలొకేషన్ ఫండ్స్; ఇండో గ్లోబల్ ఫండ్స్ (పన్ను ప్రయోజనాలు కలి్పంచేవి); పూర్తి గ్లోబల్ ఫండ్స్ ఉంటాయి. పన్నులపరమైన కారణాల రీత్యా చివరిది కొత్తగా జోడించాను. డైవర్సిఫికేషన్ ప్రధానం.. వైవిధ్యమైన స్టయిల్ పాటించే ఫండ్ హౌస్‌కు నేను ప్రాధాన్యం ఇస్తాను. ఏ ఏఎంసీలోనైనా ఒక్క స్కీములో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి సమయంలోనైనా మెరుగైన పనితీరు కనపర్చగలిగే వివిధ రకాల పెట్టుబడి విధానాల గురించి తెలుస్తుంది. యాక్టివ్, పాసివ్ విషయానికొస్తే నేను ఎక్కువగా యాక్టివ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతాను. రిస్క్ సామర్ధ్యాలు.. నా అసెట్ అలొకేషన్ విషయంలో నేను సంప్రదాయ పద్ధతిని పాటిస్తాను. అంటే నా ఫండ్ స్కీములు చాలా వాటిల్లో ఈక్విటీ పెట్టు బడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఇంటి కొ నుగోలు వంటి ఆర్థిక లక్ష్యం అవసరం లేనందున నేను కొంత దూకుడైన విధానం వైపు మ ళ్లుతున్నాను. మా అబ్బాయి కాలేజి చదువుకు అవసరమయ్యే డబ్బు కోసం నేను ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను కూడా ప్రారంభించాను. సంక్లిష్టమైన సాధనాల జోలికెళ్లొద్దు.. పెట్టుబడుల విషయంలో దూకుడైన తీరు ఉంటే ఉండొచ్చు, కానీ పోర్ట్‌ఫోలియోలో సంక్లిష్ట సాధనాలు లేదా క్లోజ్డ్ ఎండెడ్ సాధనాలను నివారించడమే మంచిది. మీరు ఇన్వెస్ట్ చేసే పథకం గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అలాగే ఉపసంహరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లిక్విడిటీ, అంటే కోరుకున్నప్పుడు నగదు రూపంలోకి మార్చుకోగలిగే వెసులుబాటు చాలా ముఖ్యం. -
ఈ–టూవీలర్ల విస్తరణపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడంపై దృష్టి పెట్టనుంది. అలాగే, తమ ప్రస్తుత సేల్స్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోనుంది. కొత్త సీఈవోగా నియమితులైన నిరంజన్ గుప్తా కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను ఈ మేరకు వివరించారు. ప్రీమియం సెగ్మెంట్లో (160–450 సీసీ) స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్ర స్థానాన్ని దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త ప్రీమియం వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు గుప్తా వివరించారు. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యే దిశగా ఈ–టూవీలర్ల కేటగిరీలో కొత్తగా ఎంట్రీ–లెవెల్ మోడల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణపరమైన మార్పులతో (ఫేమ్ స్కీము కింద సబ్సిడీలను తగ్గించడంలాంటివి) ఈవీ స్టార్టప్ విభాగంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని గుప్తా చెప్పారు. అటు 1,000 ప్రధాన డీలర్‌షిప్‌లలో 35–40 శాతం డీలర్‌షిప్‌లను దశలవారీగా అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, కొలంబియా వంటి 8–10 మార్కెట్లలో వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేయనున్నట్లు గుప్తా చెప్పారు. -
రూ.3.51 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ పరిశ్రమ
కోల్‌కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్‌ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు. -
ఈనామ్ నుంచి ఇండియా విజన్ పోర్ట్‌ఫోలియో
ముంబై: అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఈనామ్ ఏఎంసీ కొత్తగా ఈనామ్ ఇండియా విజన్ పోర్ట్‌ఫోలియో (ఈఐవీపీ)ని ఆవిష్కరించింది. మార్కెట్ క్యాప్, రంగాలతో సంబంధం లేకుండా పటిష్టమైన 15–30 కంపెనీల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ. 50 లక్షలు మదుపు చేసే ఇన్వెస్టర్ల కోసం దీన్ని ఉద్దేశించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జితేన్ దోషి తెలిపారు. దీని ద్వారా 1 బిలియన్ డాలర్ల వరకూ సేకరించనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈనామ్ ఏఎంసీ సుమారు 3.48 బిలియన్ డాలర్ల ఆస్తులను (ఏయూఎం) నిర్వహిస్తోంది. -
సూక్ష్మ రుణ సంస్థల రుణాలు రూ.3.25 లక్షల కోట్లు
కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలకు (ఎంఎఫ్ఐ) సంబంధించి వసూలు కావాల్సిన రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.3.25 లక్షల కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి ఇది రూ.2.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 20 శాతం పెరిగినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ రంగం 1.32 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. సూక్ష్మ రుణ రంగానికి స్వీయ నియంత్రణ మండలిగా ఎంఫిన్‌కు ఆర్బీఐ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2021, 2022లో రుణ వసూళ్ల సామర్థ్యంపై ప్రభావం పడిందని, ప్రస్తుతం వసూళ్లు 97 శాతానికి మెరుగుపడ్డాయని మిశ్రా చెప్పారు. ఇది కరోనా సమయంలో 70 శాతంగా ఉందన్నారు. ఎంఎఫ్ఐ సంస్థల పరిధిలో మొత్తం 6.2 కోట్ల మంది రుణ లబ్ధిదారులుగా ఉన్నారని.. దేశ జీడీపీకి ఎంఎఫ్ఐ రంగం 2.7 శాతం సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎంఎఫ్‌ఐల మొత్తం రుణాల్లో రూ.38,000 కోట్లు (17 శాతం) పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి ఉన్నట్టు తెలిపారు. 2022 మార్చిలో ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ రంగానికి ప్రకటించిన మార్గదర్శకాలపై మిశ్రా స్పందిస్తూ.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు, ఎన్బీఎఫ్సీ మధ్య తగిన పోటీకి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్ సంస్థలు వసూలు చేసే సగటు వడ్డీ రేటు రుణంపై ప్రస్తుతం 24 శాతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఇది 22.5 శాతమే ఉండేదంటూ, ఆర్బీఐ రెపో రేటు పెంచినందున ఎంఫిన్‌లు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరిగినట్టు వివరించారు. ఎంఫిన్ పరిధిలో 47 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. -
సూక్ష్మ రుణ సంస్థల రుణాలు రూ.3.25 లక్షల కోట్లు
కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలకు (ఎంఎఫ్ఐ) సంబంధించి వసూలు కావాల్సిన రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.3.25 లక్షల కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి ఇది రూ.2.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 20 శాతం పెరిగినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ రంగం 1.32 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. సూక్ష్మ రుణ రంగానికి స్వీయ నియంత్రణ మండలిగా ఎంఫిన్‌కు ఆర్బీఐ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2021, 2022లో రుణ వసూళ్ల సామర్థ్యంపై ప్రభావం పడిందని, ప్రస్తుతం వసూళ్లు 97 శాతానికి మెరుగుపడ్డాయని మిశ్రా చెప్పారు. ఇది కరోనా సమయంలో 70 శాతంగా ఉందన్నారు. ఎంఎఫ్ఐ సంస్థల పరిధిలో మొత్తం 6.2 కోట్ల మంది రుణ లబ్ధిదారులుగా ఉన్నారని.. దేశ జీడీపీకి ఎంఎఫ్ఐ రంగం 2.7 శాతం సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎంఎఫ్‌ఐల మొత్తం రుణాల్లో రూ.38,000 కోట్లు (17 శాతం) పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి ఉన్నట్టు తెలిపారు. 2022 మార్చిలో ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ రంగానికి ప్రకటించిన మార్గదర్శకాలపై మిశ్రా స్పందిస్తూ.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు, ఎన్బీఎఫ్సీ మధ్య తగిన పోటీకి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్ సంస్థలు వసూలు చేసే సగటు వడ్డీ రేటు రుణంపై ప్రస్తుతం 24 శాతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఇది 22.5 శాతమే ఉండేదంటూ, ఆర్బీఐ రెపో రేటు పెంచినందున ఎంఫిన్‌లు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరిగినట్టు వివరించారు. ఎంఫిన్ పరిధిలో 47 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్) -
బీపీసీఎల్ ‘నెట్ జీరో’ 2040
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్.. పునరుత్పాదక ఇంధనాల తయారీపై భారీ ప్రణాళికలతో ఉంది. 2040 నాటికి 10 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి (నెట్ జీరో) చేరుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. బీపీసీఎల్ ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఇది చమురు, గ్యాస్ వ్యాపారంలో ఆదాయ క్షీణతకు హెడ్జింగ్‌గా, అదనపు ఆదాయానికి మార్గం కల్పిస్తుందన్నారు. ‘‘ఆరు వ్యూహాత్మక విభాగాలను గుర్తించాం. పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, నూతన వ్యాపారాలు (కన్జ్యూమర్ రిటైలింగ్, ఈ మొబిలిటీ) భవిష్యత్తు వృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయి. వాటాదారులకు స్థిరమైన విలువను తీసుకొస్తాయి. ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ ఎప్పటి మాదిరే స్థిరంగా కొనసాగుతుంది’’అని సింగ్ వివరించారు. భిన్న వ్యాపారాలు.. పునరుత్పాదక ఇంధనంలో ప్రస్తుతం గిగావాట్ కంటే తక్కువ ఉత్పాదక సామర్థ్యం ఉందని.. దీన్ని 2040 నాటికి 10 గిగావాట్లకు తీసుకెళ్లనున్నట్టు అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న 20వేల ఫ్యుయల్ స్టేషన్లు, 6,200 ఎల్పీజీ పంపిణీదారుల నెట్వర్క్ అండతో కన్జ్యూమబుల్స్, డ్యురబుల్స్ విక్రయాలు చేపట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల వెంట చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును కూడా ప్రస్తావించారు. ప్రయోగాత్మక విధానంలో చెన్నై–తిరుచ్చి–మధురై హైవే 900 కిలోమీటర్లను తాము దత్తత తీసుకున్నామని, ప్రతి 100 కిలోమీటర్లకు చార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. బినా, కోచి రిఫైనరీల వద్ద పెట్‌కెమ్ ప్రాజెక్టులు చేపట్టామని, ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందన్నారు. కొత్తగా 8 భౌగోళిక ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీ లైసెన్స్‌లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. -
రూ.2.9 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ రుణ ఆస్తులు!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐలు) పరిధిలోని రుణాల పోర్ట్‌ఫోలియో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 10 శాతానికి పైగా వృద్ధి చెంది రూ.2.9 లక్షల కోట్లకు చేరినట్టు క్రెడిట్ సమాచార సంస్థ ‘క్రిఫ్ హై మార్క్’ తెలిపింది. 2021 మార్చి నాటికి రుణాల పోర్ట్‌పోలియో రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే మార్చి చివరికి స్థూల రుణాలు 8.6 శాతం పెరిగినట్టు తన తాజా నివేదికలో వివరించింది. దీని ప్రకారం.. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులు 37.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు 33.3 శాతం వాటాను శాసిస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల వాటా 17.1 శాతంగా ఉంది. 2021–22 చివరి మూడు నెలల్లో రూ.191 లక్షల రుణాలు మంజూరయ్యాయి. అంతకుముందు త్రైమాసికం గణాంకాలతో పోలిస్తే రుణ వితరణలో 15.5 శాతం వృద్ధి కనిపించింది. కానీ, 2020–21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే రుణాల మంజూరు 17.2 శాతం తగ్గింది. కస్టమర్ల బేస్ వార్షికంగా 1.7 శాతం, త్రైమాసికంగా 3.4 శాతం చొప్పున పెరిగింది. 2020 మార్చి నాటికి పట్టణ ప్రాంతాల్లో 5.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13.5 శాతం చొప్పన వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం సూక్ష్మ రుణాల్లో 83.4 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆస్తుల నాణ్యత 30 రోజులకు పైగా బకాయి ఉన్న సూక్ష్మ రుణాలు 2021 డిసెంబర్ నాటికి 9.2 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 6 శాతానికి తగ్గాయి. 90 రోజులకు పైగా బకాయి ఉన్న రుణ ఆస్తులు 3.7 శాతం నుంచి 2.7 శాతానికి దిగొచ్చాయి. -
కొటక్ చేతికి డీఎల్ఎల్ రుణాలు
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ డచ్ ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ డీఎల్ఎల్ ఇండియాకు చెందిన ఆస్తుల (రుణాలు)ను సొంతం చేసుకుంది. రూ. 650 కోట్లకుపైగా విలువైన అగ్రి, హెల్త్‌కేర్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోను చేజిక్కించుకున్నట్లు కొటక్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. వీటిలో రూ. 582 కోట్ల రుణాలను క్లాసిఫైడ్, స్టాండర్డ్‌గా వర్గీకరించగా.. మరో రూ. 69 కోట్లు మొండి బకాయిలు (ఎన్పీఏలు)గా తెలియజేసింది. తమ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకోవడం ద్వారా కొటక్ బ్యాంక్ 25,000 అత్యంత నాణ్యమైన కస్టమర్లను పొందనున్నట్లు రాబోబ్యాంక్కు అనుబంధ సంస్థ అయిన డీఎల్ఎల్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. -
కొనుగోళ్లపై జైడస్ దూకుడు
న్యూఢిల్లీ: విస్తరణకు మద్దతుగా.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇతర కంపెనీలను సొంతం చేసుకోవాలని కన్జూమర్ గూడ్స్ కంపెనీ జైడస్ వెల్నెస్ ప్రణాళికలు వేసింది. పోర్ట్‌ఫోలియోను విభిన్న విభాగాలకు విస్తరించే యోచనలో ఉన్న కంపెనీ కొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. మరిన్ని ప్రాంతాలకు అమ్మకాలు విస్తరించడం ద్వారా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నట్లు తాజా వార్షిక నివేదికలో తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఇతర కంపెనీల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. కంపెనీ కొనుగోళ్ల ద్వారానే గ్లూకోన్–డి, కాంప్లాన్, నైసిల్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను సొంతం చేసుకోవడం గమనార్హం! కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నట్లు జైడస్ వెల్నెస్ వెల్లడించింది. కంపెనీ రూ. 4,595 కోట్లను వెచ్చించి హీంజ్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీ దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాలలో విస్తరించే యోచనలో ఉంది. -
పోర్ట్‌ఫోలియో వైవిధ్యానికి ఈటీఎఫ్‌లు
హెల్త్‌కేర్, బ్యాంకింగ్, వినియోగం, టెక్నాలజీ మొదలైనవన్నీ కచ్చితంగా అవసరమైనవే కాబట్టి .. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఈ రంగాలు వృద్ధి బాటలోనే ఉంటాయి. కాబట్టి ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోకు కాస్త భద్రతతో పాటు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ వృద్ధి కూడా చెందుతుందని భావించవచ్చు. అయితే, ఆయా రంగాల్లో మెరుగైన కంపెనీలను వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవడం కష్టమైన ప్రక్రియే. ఇక్కడే ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సాధనాలైన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) అక్కరకొస్తాయి. నిర్దిష్ట సూచీపై ఆధారితమై ఉండే ఈటీఎఫ్‌లు.. షేర్ల ఎంపికలో రిస్కులను తగ్గించడంతో పాటు వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తోడ్పడతాయి. ఇవి ఎక్సే్చంజీలో ట్రేడవుతాయి కాబట్టి సులభంగానే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అందుకే ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ థీమ్‌లు, రంగాల ఆధారిత సూచీలు, ఈటీఎఫ్‌ల గురించి అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక కథనం. ► వినియోగం: ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్, ఆటో, టెలికం, హోటల్స్, మీడియా.. వినోదం, కన్జూమర్ గూడ్స్ .. సర్వీసులు, టెక్స్టైల్స్ వంటి వాటిపై ఖర్చు చేసే ధోరణులు కూడా పెరుగుతుంటుంది. మార్కెట్ క్యాప్ పరంగా భారీవైన 30 వినియోగ ఉత్పత్తుల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ సూచీ ద్వారా అవకాశం దొరుకుతుంది. ► హెల్త్‌కేర్: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, ఔషధాల తయారీ సంస్థలు, పరిశోధన.. అభివృద్ధి సంస్థలు మొదలైనవి హెల్త్‌కేర్ రంగం కిందికి వస్తాయి. ఇలాంటి 20 బడా హెల్త్‌కేర్ ఆధారిత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ సహాయపడుతుంది. ► టెక్నాలజీ: క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి టెక్నాలజీ రంగాన్ని నడిపిస్తున్నాయి. సమీప, దీర్ఘకాలికంగా భవిష్యత్తులో దాదాపు ప్రతీ రంగంలోనూ టెక్నాలజీ వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ద్వారా 10 పెద్ద ఐటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ► బ్యాంకింగ్: ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకింగ్ రంగంతో ముడిపడే ఉంటాయి. ఇంతటి కీలకమైన బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సహాయకరంగా ఉంటుంది. ఈ సూచీలో ప్రధానంగా 95.7 శాతం వాటా లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీలదే ఉంటోంది. ► బంగారం: సెంటిమెంటుపరంగానే కాకుండా ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా కూడా బంగారానికి ఉన్న ప్రాధాన్యతను వేరే చెప్పనక్కర్లేదు. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌లో ఇది ఎంతో ప్రత్యేకం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉపయోగపడతాయి. దొంగల భయం, స్టోరేజీ, ప్యూరిటీ మొదలైన వాటి గురించి ఆందోళన పడే పరిస్థితి ఉండదు. ► ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్): ఇటు ఈక్విటీ, అటు ఫిక్సిడ్ ఇన్‌కం .. రెండు సాధనాల్లోను ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మార్గం. ఇందులో వ్యక్తిగత ఇన్వెస్టరు.. దేశీ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలకు తగ్గ విధంగా రాబడులు అందించే దిశగా.. ఈ దేశీ ఫండ్ ఆ డబ్బును ఇతర దేశీయ లేదా అంతర్జాతీయ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లలోనూ పెట్టుబడుల కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు ఆస్కారం ఉంటుంది. ఈటీఎఫ్‌లతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు స్వల్పకాలిక ఒడిదుడుకుల నుంచి భద్రత ఉంటుంది. తక్కువ పెట్టుబడి వ్యయాలతో.. మార్కెట్లలో సత్వరం ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుంది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అవసరాలు తీరడం తో పాటు ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే భవిష్యత్‌లో మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి వీలు కాగలదు. అలాగే, పన్నుపరంగా చూసినా ఈటీఎఫ్‌లు ప్రయోజనకరంగానే ఉంటాయి. – అశ్విన్ పట్ని, ప్రోడక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విభాగం హెడ్, యాక్సిస్ ఏఎంసీ -
40 ఏళ్ల పాటు సిప్.. మార్గం ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకం రెగ్యులర్ ప్లాన్‌కు, డైరెక్ట్ ప్లాన్‌కు వేర్వేరు రేటింగ్‌ను ఎలా కలిగి ఉంటాయి?– ఆర్ణబ్ ఒక విభాగంలో పోటీ పథకాలతో పోలిస్తే రిస్క్‌ను సర్దుబాటు చేసుకుని ఇచ్చే రాబడులకు సంబంధించి పరిమాణాత్మక కొలమానమే రేటింగ్. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. డైరెక్ట్ ప్లాన్‌ను.. ఇతర పథకాల్లోని డైరెక్ట్ ప్లాన్లతోనే పోల్చి చూడడం జరుగుతుంది. అలాగే, రెగ్యులర్ ప్లాన్లను ఇతర పథకాల రెగ్యులర్ ప్లాన్లతోనే పోల్చి చూస్తారు. డైరెక్ట్ ప్లాన్‌కు, రెగ్యులర్ ప్లాన్‌కు మధ్య రేటింగ్ వేర్వేరుగా ఉండడానికి కారణం.. ఎక్స్పెన్స్ రేషియోనే. రెగ్యులర్ ప్లాన్లలో పోటీ పథకాలతో పోలిస్తే ర్యాంకు తక్కువగాను, సగటు కంటే తక్కువగా ఉండడం అన్నది అసాధారణం, అరుదైనదేమీ కాదు. అందుకనే మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపికలో ఎక్స్పెన్స్ రేషియోకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ డెట్ ఫండ్‌లో అయితే ఎక్స్పెన్స్ రేషియోకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. నా వయసు 20 ఏళ్లు. పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో 40 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? ఇందుకు అనుసరించే వ్యూహం ఎలా ఉండాలి? – శ్రీజన్సింగ్ కచ్చితమైన ప్రణాళిక గురించి మీరు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడమే ఇప్పుడు కీలకమైనది. మీకు పన్ను చెల్లించే ఆదాయం ఉండి ఉంటే.. అప్పుడు ఒకటి లేదా రెండు మంచి ఈఎల్ఎస్ఎస్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పన్ను ఆదా సాధనాలు) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఒకవేళ పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోతే కనుక మంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో సిప్‌ను మొదలు పెట్టొచ్చు. ఈ వయసులో ఎంతో క్రమశిక్షణగా మెలుగుతూ మార్కెట్లు పెరిగిన సమయాల్లో, పడిన సమయాల్లోనూ సిప్‌ను కొనసాగించడం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. సిప్ ప్రారంభంలో కొంత కాలం పాటు రాబడులు మీ అంచనాల స్థాయిలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ అది మీ పెట్టుబడులకు అవరోధంగా మారకుండా చూసుకోవాలి. పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. అదే విధంగా పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా సిప్ మొత్తాన్ని కూడా ఏటేటా పెంచుకుంటూ వెళ్లాలి. నేను ఒకే ఈక్విటీ ఫండ్‌లో సిప్ రూపంలో రూ.20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. వివిధ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య ఈ మొత్తాన్ని వైవిధ్యం చేసుకోవాలా? లేదంటే ఇప్పటి మాదిరే కొనసాగాలా? ఇందులో ఉండే లాభ, నష్టాల మాటేమిటి? – హేమంత్ వైవిధ్యం అవసరం ఎంతో ఉంది. కనీసం మరొక మ్యూచువల్ ఫండ్ సంస్థకు సంబంధించిన వేరొక పథకానికి అయినా మీ పోర్ట్‌ఫోలియోలో చోటివ్వాల్సిందే. అలా కాకుండా ఇప్పటి మాదిరే అదే పథకంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుంటే.. అప్పుడు ఆ పథకం విషయంలో ఏదైనా అనుకోని పరిణామం తలెత్తితే రాబడులన్నీ రిస్క్‌లో పడినట్టు అవుతుంది. వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకానికి (వేరే ఫండ్ సంస్థకు సంబంధించి) మీ పోర్ట్‌ఫోలియోలో చోటివ్వాలి. వైవిధ్యం విషయంలో అతిగా వ్యవహరించకుండా (మితిమీరిన వైవిధ్యం) ఉంటే ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న పథకం తర్వాతి కాలంలో అద్భుతమైన పనితీరును చూపించొచ్చు. అప్పుడు పెట్టుబడులను వైవిధ్యం చేసుకుని తప్పు చేశామా? అన్న సందేహం రావచ్చు. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకాన్ని ఎంపిక చేసుకోండి. - ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
యాపిల్ ఫోన్ లాంటిదే క్రిప్టో కరెన్సీ- టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు
Tim Cook says he owns cryptocurrency : యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాస్పద కరెన్సీగా చెలమని అవుతోన్న క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా మాట్లాడారు. ఎలన్‌మస్క్ , జాక్డోర్సేల తర్వాత మరో దిగ్గజ కంపెనీ సీఈవో క్రిప్టో పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. యాపిల్ లాంటిదే స్మార్ట్ఫోన్లలో యాపిల్ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉందో కరెన్సీ విషయంలో క్రిప్టో కరెన్సీ కూడా అలాంటిదేనంటూ క్రిప్టో కరెన్సీ , ఆగ్యుమెంటెడ్ రియాల్టీలకు సంబంధించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ మేరకు బిజినెస్ ఇన్సైడర్ ఓ కథనం ప్రచురించింది. తన పోర్ట్‌ఫోలియోలో క్రిప్ట్ కరెన్సీ కూడా ఉందని టిమ్ కుక్ చెప్పినట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది. అయితే ఏ క్రిప్టో కరెన్సీలో టిమ్ కుక్ ఇన్వెస్ట్ చేశారనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడే అనుమతించం క్రిప్టో కరెన్సీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసినంత మాత్రానా యాపిల్ ప్రొడక్టులకు సంబంధించిన లావాదేవీల్లో క్రిప్టోను ఇప్పుడప్పుడే అనుమతించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటీవల టెస్లా కార్ల కొనుగోలు సమయంలో క్రిప్టో కరెన్సీని అనుమతిస్తామంటూ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. చదవండి:ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు -
స్టాక్ మార్కెట్ కుబేరులు.. వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న కంపెనీలు ఇవే
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తు పట్ల నిశ్చింతంగ ఉండాలంటే మంచి కంపెనీలను ఎన్నుకోవడం ఎంతో ముఖ్యం. ఎప్పుడు ఒకే సంస్థపై కాకుండా నాలుగైదు విభిన్న రంగాలకు చెందిన బెస్ట్ కంపెనీలు సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మేలు. షేర్ మార్కెట్‌కి సంబంధించిన ప్రాథమిక సూత్రాల్లో ఈ రెండు ఎంతో ముఖ్యం. వీటిని తూచా తప్పకుండా పాటించిన వారికి స్టాక్ మార్కెట్లో కలిసి వచ్చింది. కాసుల వర్షం కురిపించింది. పట్టు పెంచుకోవాలి అయితే మంచి కంపెనీలను ఎంచుకోవడం, భవిష్యత్తు ఉన్న రంగాలను ముందుగానే పసిగట్టడం వంటి పనులు చేయాలంటే ఎంతో నేర్పు, మార్కెట్ పట్ల అవగాహన ఉండాలి. లేదంటే చాన్నాళ్లుగా మార్కెట్లో కొనసాగుతూ తమ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ లాభాలను ఆర్జిస్తున్న వారిని పరిశీలించడం బెటర్. తద్వారా మార్కెట్ మీద పట్టు పెంచుకోవచ్చనేది ఆర్థిక నిపుణుల సలహా. పోర్ట్‌ఫోలియో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, రాధాకిషన్ దమానీ, అజీమ్ ప్రేమ్‌జీ ఇలా స్టాక్ మార్కెట్లో చాలా కాలం నుంచి కొనసాగుతూ తమ పొర్ట్‌ఫోలియోలో వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీల స్టాక్లను మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కొన్సి షేర్ల ధరలు మార్కెట్ ఎంట్రీ లెవల్లో ఉన్న వారు భరించలేని ధరతో ఉన్నాయి. మరికొన్ని కొంచెం తక్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. బిగినర్లు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అనువుగా ఉన్నాయి. అందులో కొన్నింటి వివరాలు .. అజీమ్ ప్రేమ్‌జీ మన దేశంలో ఉన్న అపర కుబేరుల్లో ఒకడైన అజీమ్ ప్రేమ్‌జీ పోర్ట్‌ఫోలియోలో విప్రో, ట్యూబ్ ఇండియా, జైడస్ వెల్నెస్, ట్రెంట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో విప్రోలో బ్రాండ్ కింద హోంకేర్, పర్సనల్ కేర్, వెల్నెస్, మేల్‌గ్రూమింగ్, ఆఫీస్ సొల్యూషన్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో జైడస్, దుస్తుల విభాగంలో టాటా సబ్సిడరీ ట్రెంట్, ఆటోమొబైల్ విభాగంలో టీఐ కంపెనీల షేర్ల తన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకున్నారు అజీమ్ ప్రేమ్‌జి. - విప్రో షేరు ధర ప్రస్తుతం రూ.652లుగా ఉంది. గతేడాది ఈ షేరు ధర కేవలం రూ.351గా నమోదు అయ్యింది - ట్యూబ్ ఇండియా (టీఐ) షేరు ధర ప్రస్తుతం రూ.83.60లు ఉండగా ఏడాది కిందట రూ. 16.90లుగా ఉంది. - జైడస్‌వెల్ షేర్ ధర రూ.2050 ఉండగా ఏడాది కిందట రూ.1720గా ఉంది. - ట్రెంట్ షేర్ ధర రూ.1095 ఉండగా ఏడాది కిందట రూ. 681గా ట్రేడ్ అయ్యింది. రాకేశ్ అండ్ రాధకిషన్ - మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝన్‌ఝున్‌వాలా విషయానికి వస్తే ఆయన పోర్ట్‌ఫోలియోలో టైటాన్, ఎన్సీసీ, క్రిసిల్, టాటా కమ్యూనికేషన్స్‌లు ఉన్నాయి. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అసోసియేట్స్ పోర్ట్‌ఫోలియోలో పైన పేర్కొన్న మూడింటితో పాటు ఎస్కార్ట్ కూడా ఉంది. - డీమార్ట్ సంస్థల అధినేత ఒకప్పటి మార్కెట్ బేర్ రాధాకిషన్ దమానీ పోర్ట్‌ఫోలియోలో డీమార్ట్, ది ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. - ఆశీష్ దావన్ పోర్ట్‌ఫోలియోలో బిర్లాసాఫ్ట్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఐడీఎఫ్సీ, గ్లెన్‌మార్క్‌లు ఉన్నాయి - ముఖుల్ అగర్వాల్ పోర్ట్‌ఫోలియోలో ఇంటెలెక్ట్, రెలిగేర్, మాస్టెక్, ఏపీల్ అపోలోలు ఉన్నాయి. -
పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకునే మార్గం
ఈక్విటీ మార్కెట్ ఇటీవలి కాలంలో చక్కని ర్యాలీతో గరిష్ట విలువలకు చేరింది. కనుక అస్సెట్ అలోకేషన్ విధానాన్ని (ఒక్క విభాగంలోనే కాకుండా భిన్న సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం) అనుసరించాలంటూ ఆర్థిక సలహాదారులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకుని, రిస్క్ తగ్గించుకోవాలని భావించే వారికి అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. వివిధ సాధనాల మధ్య వ్యూహాత్మక స్థాయిలో కేటాయింపులు అనేవి అన్ని వేళలా ఇన్వెస్టర్లకు రిస్క్ నుంచి రక్షణ కల్పిస్తాయని మార్కెట్ పండితులు అభిప్రాయపడుతుంటారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మల్టీ అస్సెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎంతో పేరున్న ఎస్.నరేన్ ఈ ఫండ్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తుండడం సానుకూలాంశం. ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది. పెట్టుబడుల విధానం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ ఈక్విటీలకు.. పరిస్థితులకు అనుగుణంగా 10 శాతం నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్‌లకు 0–10 శాతం వరకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్ ఫండ్స్ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. రాబడులు మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ మెరుగైన, స్థిరమైన పనితీరు చూపిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని తప్పకుండా పరిశీలించొచ్చు. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో మల్టీ అస్సెట్ ఫండ్స్ విభాగం సగటు రాబడులు 32 శాతంగానే ఉన్నాయి. మూడేళ్లలో చూసినా కానీ, వార్షిక రాబడులు 18 శాతంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఏ కాలంలో చూసినా కానీ, మల్టీ అస్సెట్ విభాగం సగటుతో పోల్చి చూస్తే ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. ఈక్విటీతో కూడిన పథకం కనుక దీర్ఘకాలంలో 12 శాతం అంతకుమించి వార్షిక రాబడులను మెరుగైన పనితీరుగా భావించొచ్చు. 2002 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి చూస్తే ఒక యూనిట్ నికర అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) 39 రెట్లు వృద్ధి చెందింది. అంటే ఆరంభంలో చేసిన రూ.10 పెట్టుబడి రూ.390గా వృద్ధి చెందింది. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినా కానీ, నేటికి రూ.5.36 లక్షలుగా వృద్ధి చెందేది. ఈ పథకం ప్రారంభం నుంచి చూస్తే వార్షిక రాబడులు 14 శాతానికి పైనే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.12,405 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈక్విటీ పెట్టుబడులు 66 శాతంగా ఉన్నాయి. డెట్‌లో 10.9 శాతం మేర పెట్టుబడులు పెట్టి ఉంటే, 23 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. అంటే మూడు విభాగాల్లోనే ప్రస్తుతం పెట్టుబడులు పెట్టి ఉంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 9.41 భారతీ ఎయిర్టెల్ 7.90 ఐసీఐసీఐ బ్యాంకు 7.73 ఓఎన్జీసీ 5.59 సన్‌ఫార్మా 3.75 హిందాల్కో 3.31 ఇన్ఫోసిస్ 2.56 ఎస్బీఐ 2.26 ఐటీసీ 2.15 మారుతి సుజుకీ 2.01 -
తక్కువ రిస్క్‌తో స్టాక్ మార్కెట్‌పై పట్టు పెంచుకోవాలంటే..
స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడుండే రిస్క్ పట్ల చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అందువల్లే డీమమ్యాట్ ఖాతాలు పెరుగుతున్న తీరుకు మార్కెట్లోకి వస్తున్న పెట్టుబుడులకు మధ్య పొంతన ఉండటం లేదు. కానీతక్కువ పెట్టుబడితో మంచి పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకుంటే మార్కెట్‌పై అవగాహన వస్తుందని తద్వారా సక్సెస్ రూట్లో వెళ్లొచ్చని నిపుణులు అంటున్నారు. పెట్టుబడికి సిద్ధం ఇంటర్నెట్ యాక్సెస్ పెరిగిన తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలకు చెందిన వాళ్లకి సైతం స్టాక్‌మార్కెట్‌తో అనుసంధానం పెరిగింది. దీంతో పెట్టుబడులకు బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా షేర్ మార్కెట్ వైపు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్న డీ మ్యాట్ అకౌంట్లు ఇందుకు నిదర్శనం. పోటెత్తుతున్నారు డీమ్యాట్ అకౌంట్లకు సంబంధించి 2012-13 ఆర్థిక సంవత్సరంలో 2.1 కోట్ల ఖాతాలు ఉండేవి. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి డీ మ్యాట్ ఖాతాలు కలిగి ఉన్నవారి సంఖ్య ఏకంగా 6.90 కోట్లకు చేరుకుంది. బ్యాంకు వడ్డీ రేట్లు పడిపోవడం, రియల్ ఎస్టేట్ చాలా మందికి అందని ద్రాక్షగా మారడంతో షేర్ మార్కెట్ వైపు వస్తున్నారు. లాంగ్‌టర్మ్ బెటర్ షేర్మార్కెట్లో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు అందించే ఇంట్రాడే ట్రేడింగ్‌తో రిస్క్ ఎక్కువని చెబుతుంటారు. అయితే కొత్తగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభించిన వారికి తక్కువ మొత్తంతో తమ పోర్ట్‌ఫోలియోలో మంచి కంపెనీల షేర్లు చేర్చడం ఏలా అనేదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. బెస్ట్ పోర్ట్‌ఫోలియో స్టాక్మార్కెట్లో ఎప్పుడూ ఒకే కంపెనీపై పెట్టుబడి పెట్టొదనేది మార్కెట్ గురువుల సలహా. మంచి పనితీరు కనబరుస్తూ తక్కువ ధరకి అందుబాటులో ఉన్న స్టాక్స్‌ని ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాను అనుసరించి ప్రస్తుతం మార్కెట్లో తక్కువ పెట్టుబడితో అందుబాటులో ఉన్న కొన్ని స్టాక్స్ వివరాలు ఇలా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో - ఇండియన్ ఆయిల్ షేర్ ధర సెప్టెంబరు 27న రూ.118.65లుగా ఉంది. అక్టోబరు 25న ఈ కంపెనీ షేరు ధర రూ.131 దగ్గర ట్రేడ్ అవుతోంది. లాటుగా 20 షేర్లను కొనుగోలు చేయాలనుకుంటే అవసరం అయ్యే పెట్టుబడి కేవలం రూ.2,620 మాత్రమే. - ఇండియన్ ఆయిల్ తరహాలోనే సెయిల్, అశోక్ లేలాండ్, టాటా పవర్, జోమాటో, జ్యోతి ల్యాబ్స్, ది ఇండియా సిమెంట్స్, దేవ్యానీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థల షేర్ల ధరలు ప్రస్తుతం రూ. 120 నుంచి 200 రేంజ్లో ఉన్నాయి. కేవలం రూ. 20,000ల నుంచి రూ. 25,000లతో మంచి పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోవచ్చు. దీని వల్ల తక్కువ రిస్క్‌తో మార్కెట్‌ను అవగాహన చేసుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది. పరిశీలన ముఖ్యం ఇలా వివిధ సెక్టార్లలో మంచి పనితీరుని కనబరస్తూ తక్కువ ధరలో అందుబాటులో ఉన్న షేర్లను లాంగ్‌టర్మ్ పద్దతిలో కొనుగోలు చేయడం ఉత్తమం. అప్పుడే మన డబ్బుకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే షేర్లు కొనుగోలు చేసే ముందు మరోసారి మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. -
షార్ట్‌డ్యురేషన్ ఫండ్స్‌లో రాబడులు ఎలా ఉంటాయి?
ఇటీవలి సమీక్షలో ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయించింది. కీలక రేట్లలోనూ మార్పులు చేయలేదు. రేట్ల పెంపు 2022లోనే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కనుక భవిష్యత్తు రేట్ల విషయమై అనిశ్చితి ఉన్న సమయంలో.. మూడేళ్లకాలం కోసం ఇన్వెస్టర్లు డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఏఏఏ రేటెడ్ డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంపిక చేసుకోవడం సురక్షితం. ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ (ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్), కోటక్ బాండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ (కోటక్ ఎస్టీఎఫ్) రెండూ ఈ విభాగంలో నాణ్యమైన పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తూ మెరుగైన పనితీరును చూపిస్తున్నాయి. పెట్టుబడుల విధానం షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ సాధారణంగా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లు అయిన కార్పొరేట్ బాండ్లు, డిబెంచర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సాధారణంగా వీటి కాల వ్యవధులు 1–3 ఏళ్ల మధ్య ఉంటుంది. అంటే దీర్ఘకాలం సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయమే రాబడి అవుతుంది. ఇలా తక్కువ కాల వ్యవధి కలిగి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగితే ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ మేరకు ప్రయోజనం అందుకోవచ్చు. అదే మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఫండ్స్ కొంచెం ఎక్కువ కాలంతో కూడిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాయి కనుక.. వాటిల్లో వెంటనే ప్రయోజనం ఉండదు. అందుకే స్వల్పకాలానికి షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలం. రాబడులు.. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ విభాగం కంటే ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్, కోటక్ ఎస్టీఎఫ్ మెరుగైన పనితీరును చూపిస్తున్నాయి. కనీసం ఐదేళ్లకు పైగా పనిచేస్తూ.. రూ.300 కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులున్న పథకాలతో పోలిస్తే ఈ రెండు పథకాలు మెరుగ్గా ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 7.6 శాతంగా ఉంటే.. ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్, కోటక్ ఎస్టీఎఫ్ మాత్రం 7.9 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ విభాగం సగటు వార్షిక రాబడి 7.2 శాతంగాను, ఐదేళ్లలో 7.4 శాతం చొప్పున ఉండగా.. కోటక్ ఎస్టీఎఫ్, ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్ సగటున మూడేళ్లలో 7.6 శాతం, ఐదేళ్లలో 7.9 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించాయి. రాబడులను చూసేవారు ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విభాగంలో అధిక రాబడులను అందించే ఇతర పథకాలు కూడా ఉన్నాయి. కానీ, వాటితో పోలిస్తే ఈ రెండు పథకాలు పెట్టుబడుల పరంగా నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుసుకోవచ్చు. ఏఏఏ రెటెడ్ పేపర్లను ఎక్కువ భద్రతకు భరోసాగా చూడొచ్చు. పోర్ట్‌ఫోలియో.. ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎస్టీఎఫ్ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.12,700 కోట్ల పెట్టుబడులున్నాయి. వీటిల్లో 94 శాతం ఏఏఏ రేటెడ్ పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. అదే విధంగా కోటక్ ఎస్టీఎఫ్ 95 శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు.. గత పెట్టుబడులను పరిశీలించినా కానీ ఏఏఏ రేటెడ్ సాధనాల్లో ఈ రెండు పథకాలు సగటున 90 శాతం, అంతకుపైనే నిర్వహిస్తున్నాయి. ఐడీఎఫ్సీ ఎస్టీఎఫ్ పోర్ట్‌ఫోలియోలోని డెట్ సాధనాల సగటు మెచ్యూరిటీ (గడువు తీరే కాలం) 2.1 సంవత్సరాలుగా ఉంటుంది. కోటక్ ఎస్టీఎఫ్ మాత్రం రిస్క్‌ను వైవిధ్యం చేసేందుకు వీలుగా.. భిన్న కాల వ్యవధులతో కూడిన డెట్ సాధనాలను ఎంపిక చేసుకుంటోంది. కనుక ఈ పథకం పోర్ట్‌ఫోలియో సగటు మెచ్యూరిటీ 1.4 నుంచి 3.9 సంవత్సరాల మధ్య గత ఐదేళ్లలో ఉంది. ఈ రెండు పథకాలు 2021 ఏప్రిల్ నుంచి జీ–సెక్యూరిటీల్లో పెట్టుబడులను పెంచుకుంటున్నాయి. స్వల్ప కాలం కోసం (2–3 ఏళ్లు) ఇన్వెస్టర్లు ఈ పథకాలను పరిశీలించొచ్చు. చదవండి : ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
World Top 100 Billionaires: బిలియనీర్ల క్లబ్లో మరో భారతీయుడు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో వ్యాపారం పుంజుకుంటోంది. మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. ప్రపంచ కుబేరుల సరసన నిలుస్తున్నారు. తాజాగా ఇండియా నుంచి మరోకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల జాబితాలో చేరారు. 97వ స్థానం ఇండియల్ బిగ్‌బుల్‌గా పేరొందిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గురులాంటి వ్యక్తి రాధకిషన్ దమానీ. ఏన్నె ఏళ్లుగా ఆయన స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల ఆయన పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి పడింది. దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ స్థానంలో నిలిచినట్టు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. డీమార్ట్ నుంచే రాధాకిషన్ దమానీకి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్. దమానీ ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న డిమార్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. డీమార్ట్‌లో రాధాకిషన్ దమానీకి 65.20 శాతం వాటా కలిగిని ఉన్నారు. డీమార్ట్ షేర్ వాల్యూ జనవరి 1న రూ.2,789 ఉండగా ఆగస్టు 17న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649కి చేరుకుంది. కేవలం ఎనిమిది నెలల్లో షేరు విలువ 31 శాతం పెరిగింది. దీంతో డీమార్ట్ ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది. మిగిలినవి దమానీ సంపదలో డీమార్ట్ తర్వాత సుందర్ ఫైనాన్స్ నుంచి రూ.634 కోట్లు, ట్రెంట్గ్రూపు ద్వారా రూ.488 కోట్లు, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలిస్ హెల్త్‌కేర్ ద్వారా రూ. 229 కోట్ల సంపదను ఆయన కలిగి ఉన్నారు. చదవండి: ఏడుగురు మహిళలు..రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్