న్యూఢిల్లీ: విస్తరణకు మద్దతుగా.. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇతర కంపెనీలను సొంతం చేసుకోవాలని కన్జూమర్ గూడ్స్ కంపెనీ జైడస్ వెల్‌నెస్ ప్రణాళికలు వేసింది. పోర్ట్‌ఫోలియోను విభిన్న విభాగాలకు విస్తరించే యోచనలో ఉన్న కంపెనీ కొత్త ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. మరిన్ని ప్రాంతాలకు అమ్మకాలు విస్తరించడం ద్వారా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నట్లు తాజా వార్షిక నివేదికలో తెలియజేసింది.
ఇందుకు అనుగుణంగా ఇతర కంపెనీల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. కంపెనీ కొనుగోళ్ల ద్వారానే గ్లూకోన్–డి, కాంప్లాన్, నైసిల్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను సొంతం చేసుకోవడం గమనార్హం! కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను చేజిక్కించుకునేందుకు చూస్తున్నట్లు జైడస్ వెల్‌నెస్ వెల్లడించింది. కంపెనీ రూ. 4,595 కోట్లను వెచ్చించి హీంజ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీ దక్షిణాసియా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాలలో విస్తరించే యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment