కోల్‌కతా: కుటుంబాల రుణ అవసరాల పరంగా మరింత విస్తరించి, తమ పంపిణీల పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేసుకోడానికి సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్‌ఐలు) దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్‌వర్క్ (ఎంఎఫ్‌ఐఎన్) సీఈఓ, డైరెక్టర్ అలోక్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల తక్కువ ఆదాయ రుణగ్రహీతలు ఉన్నారని, వీరు నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయి ఉన్నారని ఆయన వెల్లడించారు.
ఎంఎఫ్‌ఐ రంగానికి రూ. 13 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో విస్తరణ సామర్థ్యం ఉందని ఆయన పేర్కొంటూ, ఈ నేపథ్యంలో వృద్ధికి భారీ అవకాశం ఉందని అన్నారు. ఒక్క పశి్చమ బెంగాల్‌లో 65 లక్షల మంది రుణగ్రహీతలకు సంబంధించి మొత్తం రూ. 35,000 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని అన్నారు. మొత్తం పోర్ట్‌ఫోలియోలో తొమ్మిది శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని చెప్పారు.
లఘు ఎంఎఫ్‌ఐలకు రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటును ఈ రంగం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎంఎఫ్‌ఐ)పశి్చమ బెంగాల్ విభాగం ఈ నెల 22వ నిర్వహించనున్న 8వ ఈస్టర్న్ ఇండియా మైక్రోఫైనాన్స్ సమ్మిట్ సందర్భంగా అలోక్ మిశ్రా ఎంఎఫ్‌ఐ రంగానికి సంబంధించి ఈ కీలక అంశాలను వెల్లడించారు. ఈ రంగానికి చెందిన మరికొందరు చెబుతున్న అంశాలు ఇవీ...
► ప్రస్తుతం దేశంలో ఎంఎఫ్‌ఐ కవరేజీ తక్కువగా ఉందని ఆరోహన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎండీ మనోజ్ నంబియార్ తెలిపారు.ఈ రంగం మరింత విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు.
► చారిత్రాత్మకంగా ఎంఎఫ్‌ఐ రంగంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ) సగటు స్థాయిలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వీఎఫ్‌ఎస్ క్యాపిటల్ ఎండీ కులదీప్ మైథీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలో ఎంఎఫ్‌ఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మైథీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment