Household
-
ఒక్కో అమెరికా పౌరుడి తలపై 91 లక్షల అప్పు.. అప్పుల కుప్పగా అమెరికా
-
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్‌హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్‌హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్‌లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్‌హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం
సాక్షి, అమరావతి: దేశంలో గృహావసరాల వినియోగ వ్యయంలో వివిధ సామాజికవర్గాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయి. దశాబ్దకాలంలో దేశంలో సగటు గృహావసరాల వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహావసరాల వినియోగ వ్యయ(హెచ్సీఈఎస్) నివేదిక వెల్లడించింది. 2011–12 నుంచి 2022–23 మధ్యకాలంలో దేశ పౌరులు సగటున గృహావసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వినియోగ వ్యయం 9.20శాతం పెరిగింది. కాగా, ఇతర వర్గాల్లో 8.5శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహావసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగిందని తెలిపింది. హెచ్సీఈఎస్ నివేదికలోని ప్రధాన అంశాలు » 2011–12 దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం (ఎంపీసీఈ) రూ.1,430 ఉండగా, 2022–23లో రూ.3,773కు పెరిగింది. » పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011–12లో రూ.2,630 ఉండగా, 2022–23లో రూ.6,459కు పెరిగింది. » గృహావసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో 46శాతం ఆహార పదార్థాలకు, 54శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. » పట్టణ ప్రాంతాల్లో 39శాతం ఆహార పదార్థాలకు, 61శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. » సగటు గృహావసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ చివరి స్థానంలో ఉంది. » ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీసీఈ గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,870 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో రూ.6,782లుగా ఉంది. -
పేదరికం కనుమరుగవుతోంది
న్యూఢిల్లీ: దేశంలో పేదరికం మటుమాయం అవుతోందని ప్రధాని మోదీ చెప్పారు. గత పదేళ్లలో తలసరి గృహ వినియోగ వ్యయం రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు తార్కాణమన్నారు. ఆదివారం న్యూస్9 గ్లోబల్ సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘తలసరి వినియోగ పెరుగుదల పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కూడా సర్వేలో తేలింది. ప్రజలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాలు, పేదలు, రైతుల సంక్షేమంపై మేమిచ్చిన ప్రాధాన్యమే ఇందుకు కారణం. గ్రామీణ భారతాన్ని దృష్టి పెట్టుకుని పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశాం. మహిళల సాధికారత సాధించాం. అపారమైన ఉపాధి అవకాశాలు కలి్పంచాం. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా పెంచాం. పాలనతో పాటు దృక్కోణం తదితరాలన్నింట్లోనూ అపారమైన మార్పు తీసుకొచ్చాం’’ అని వివరించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను కావాలనే కరువు పరిస్థితుల్లో మగ్గేలా చేశాయంటూ కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. ‘‘ఈ కరువు, సంతుïÙ్టకరణ రాజకీయాలపై మాకు నమ్మకం లేదు. సంతృప్త పాలనే మా ధ్యేయం. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం’’ అని వివరించారు. గత పదేళ్లలో ప్రపంచ వేదికపై భారత్ విశ్వసనీయత ఎంతగానో పెరిగిందన్నారు. సమున్నత శిఖరాలకు సామర్థ్యం: కొన్నేళ్లుగా తమ ప్రభుత్వ పనితీరుకు ఆరి్టకల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటివి గీటురాయిగా నిలిచాయని మోదీ చెప్పారు. ‘‘గత పాలకులకు భారతీయుల సామర్థ్యంపై కనీస నమ్మకం కూడా లేదు. వారిని తక్కువగా అంచనా వేశారు’’ అంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. అప్పుడెప్పుడో 1960లు, 80ల్లో వారు మొదలు పెట్టిన పలు పథకాలను 2014లో తాము అధికారంలోకి వచ్చాక పూర్తి చేయాల్సి వచి్చందన్నారు. ‘‘మా పాలనలో దేశవ్యాప్తంగా సగటున రోజుకు రెండు కొత్త కాలేజీలు, వారానికో కొత్త యూనివర్సిటీ వచ్చాయి. అసాధ్యమంటూ ఏదీ లేదన్న విశ్వాసం ఇప్పుడు దేశ ప్రజల్లో తొణికిసలాడుతోంది’’ అని మోదీ అన్నారు. చెప్పారు. మూడో టర్ము పాలనలో దేశ సామర్థ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. -
గడచిన పదేళ్లలో... గృహ వినియోగం రెండింతలు
న్యూఢిల్లీ: భారత్‌లో నెలవారీ తలసరి గృహ వినియోగం గడిచిన దశాబ్ద కాలంలో రెండింతలకు పైగా పెరిగినట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. 2011–12 నాటికి తలసరి వినియోగం రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి ఇది పట్టణ ప్రాంతాల్లో రూ.6,459కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం రూ.1,430 నుంచి రూ.3,773కు చేరింది. గృహ వినియోగ వ్యయంపై ఎన్ఎస్ఎస్వో 2022 ఆగస్ట్–2023 జూలై మధ్య జరిపిన సర్వే వివరాలను విడుదల చేసింది. ప్రతి వ్యక్తి సగటున చేసే గృహ వినియోగ ఖర్చును తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది. 2021–12 నాటి ధరల ప్రకారం చూస్తే.. సగటు ఎంపీసీఈ పట్టణ ప్రాంతాల్లో రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి రూ.3,510కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఎంపీసీఈ రూ.1,430 నుంచి రూ.2,008కి పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పట్టణ ప్రాంతాల నుంచి 1,55,014 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,06,732 గృహాల సగటు శాంపిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా ఎన్ఎస్ఎస్వో సేకరించింది. -
కుటుంబాలకు మరిన్ని రుణాలు!
కోల్‌కతా: కుటుంబాల రుణ అవసరాల పరంగా మరింత విస్తరించి, తమ పంపిణీల పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేసుకోడానికి సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్ఐలు) దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ, డైరెక్టర్ అలోక్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల తక్కువ ఆదాయ రుణగ్రహీతలు ఉన్నారని, వీరు నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంఎఫ్ఐ రంగానికి రూ. 13 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో విస్తరణ సామర్థ్యం ఉందని ఆయన పేర్కొంటూ, ఈ నేపథ్యంలో వృద్ధికి భారీ అవకాశం ఉందని అన్నారు. ఒక్క పశి్చమ బెంగాల్లో 65 లక్షల మంది రుణగ్రహీతలకు సంబంధించి మొత్తం రూ. 35,000 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని అన్నారు. మొత్తం పోర్ట్‌ఫోలియోలో తొమ్మిది శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని చెప్పారు. లఘు ఎంఎఫ్ఐలకు రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటును ఈ రంగం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎంఎఫ్ఐ)పశి్చమ బెంగాల్ విభాగం ఈ నెల 22వ నిర్వహించనున్న 8వ ఈస్టర్న్ ఇండియా మైక్రోఫైనాన్స్ సమ్మిట్ సందర్భంగా అలోక్ మిశ్రా ఎంఎఫ్ఐ రంగానికి సంబంధించి ఈ కీలక అంశాలను వెల్లడించారు. ఈ రంగానికి చెందిన మరికొందరు చెబుతున్న అంశాలు ఇవీ... ► ప్రస్తుతం దేశంలో ఎంఎఫ్ఐ కవరేజీ తక్కువగా ఉందని ఆరోహన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎండీ మనోజ్ నంబియార్ తెలిపారు.ఈ రంగం మరింత విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. ► చారిత్రాత్మకంగా ఎంఎఫ్ఐ రంగంలో మొండిబకాయిల (ఎన్పీఏ) సగటు స్థాయిలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వీఎఫ్ఎస్ క్యాపిటల్ ఎండీ కులదీప్ మైథీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలో ఎంఎఫ్ఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మైథీ చెప్పారు. -
ఈ రోబో ఇంటి పనులన్నీ సులభంగా చేసేస్తుంది!
ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది. ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్‌ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్కి జోడించిన ఐఫోన్‌ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది . ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్‌లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్సిస్టమ్లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది. (చదవండి: భారత రెస్టారెంట్‌కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్‌గా అరోరా) -
పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లోకి రిలయన్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. గ్లిమర్ బ్యూటీ సోప్‌లు, ప్యూరిక్ హైజీన్ సబ్బులు, డోజో డిష్ వాష్ లిక్విడ్లు, హోమ్‌గార్డ్ టాయిలెట్.. ఫ్లోర్ క్లీనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ఉత్పత్తులతో ఆయా విభాగాల్లో దిగ్గజాలైన హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, రెకిట్ మొదలైన వాటితో రిలయన్స్ పోటీపడనుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఆవిష్కరించినట్లు ఆర్సీపీఎల్ ప్రతినిధి తెలిపారు. -
భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!
గత నాలుగు సంవత్సరాల నుంచి భారత జీడీపీ వృద్ది రేటు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కరోనా రాకతో జీడీపీ వృద్ధి రేటు భారీగా పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరంలో -7.96 శాతం వృద్ది రేటును భారత్‌ను నమోదు చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. జీడీపీ గ్రోత్ రేట్ 12 శాతం మేర పడిపోయింది. 2021-2022 జీడీపీ రేటు 8.3 శాతం..! తాజాగా ప్రపంచ బ్యాంకు భారత ఎకానమీపై కీలక వ్యాఖ్యలను చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ 8.3 శాతం నమోదుచేస్తోందని గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 20.1 శాతంగా నమోదుచేసింది. కరోనా రాకతో దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మునుపటి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా జీడీపీ 24.4 శాతం మేర తగ్గింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! గృహ ఆదాయాలే కీలకం లేకపోతే .. అంతే సంగతులు..! కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌తో సతమతమైనా భారత జీడీపీ వృద్దిరేటుపై ప్రపంచ బ్యాంకు తన నివేదికలో...కరోనా వ్యాక్సినేషన్, వ్యవసాయ, కార్మిక సంస్కరణలు, గృహ ఆదాయాల(నెలసరి, వార్షిక ఆదాయాలు) పెరుగుదల వంటి అంశాలు భారత జీడీపీ పెరుగుదలను నిర్ణయిస్తోందని పేర్కొంది. గృహా ఆదాయాల్లో రికవరీ ఉంటేనే..భారత ఎకానమీ పునరుద్దరణ ఉంటుందని తెలిపింది. గృహా ఆదాయాల్లో పెరుగుదల కన్పిస్తేనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో జీడీపీ పెరుగుదలలో మార్పు కన్పిస్తోందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఏదేమైనా, భారత్‌లో వివిధ రంగాలలో ఆర్థిక పునరుద్ధరణ అసమానంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. తయారీ, నిర్మాణ రంగాలు 2021 లో స్థిరంగా కోలుకున్నప్పటికీ, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మహిళలు, స్వయం ఉపాధి వ్యక్తులు, చిన్న సంస్థలు వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దాంతో పాటుగా దక్షిణాసియా దేశాల్లో అనేక ఆర్థిక రంగాల్లో లింగ అసమానతలు భారీగా పెరిగిందని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మెర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
కరోనా హీట్ ముందు దిగదుడుపే..!
సాక్షి, హైదరాబాద్: కరోనా భయం ఇంటింటిని తాకింది. బయటకు వెళ్తే వైరస్ వస్తుందన్న భయానికి తోడు ఇంటి పట్టునే ఉంటున్నా.. ఇంట్లో సైతం వైరస్ బారిన పడకుండా నగరవాసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు ఎండలు ముదిరి ఉక్కపోతలు మొదలైనా.. ఏసీలు, కూలర్ల వాడకానికి మెజారిటీ ప్రజలు దూరంగానే ఉంటున్నారు. రిఫ్రిజిరేటర్లలోనూ సాధారణ ఉష్ణోగ్రతలే మెయింటైన్ చేస్తున్నారు. దీంతో నగరంలో గృహ, వాణిజ్య కేటగిరీల్లో విద్యుత్ వినియోగం అమాంతం పడిపోయింది. గడిచిన ఏడాది (2019) ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో 2,763 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగితే, 2020 ఏప్రిల్ 5 వచ్చే సరికి 1826 మెగావాట్లకు పడిపోయింది. ఇలా తగ్గిన డిమాండ్‌లో అత్యధికంగా గృహ, వాణిజ్య (కేటగిరీ)దే కావటం విశేషం. డిస్కం అంచనాలు తారుమారు సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హైదరాబాద్‌లో రోజుకు 2,550 మెగావాట్ల నుంచి 2,800 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం జరగాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) కూడా అదే అంచనాలతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ, గతానికి భిన్నం గా ఈసారి ప్రస్తుతం రోజువారీ సగటు విద్యుత్ వినియోగం భారీగా పడిపోవటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇది నెలవారీ రెవెన్యూపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో భవిష్యత్తులో భారీ నష్టాలు చవి చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు 2,500 మెగావాట్లు.. గ్రేటర్ హైదరాబాద్‌లో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 45 వేలకు పైగా చిన్న, పెద్ద, భారీ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి. మరో 7 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. 48 లక్షలకు పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు మార్చి మొదటి వారంలో నగరంలో రోజు సగటు వినియోగం 2,500 నుంచి 2,800 మెగావాట్లుగా ఉంది. గతేడాది అయితే ఏకంగా 3 వేల మెగావాట్ల వరకు వెళ్లింది. ప్రస్తుతం చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల్లో చాలా వరకు మూతపడ్డాయి. ఐటీ, దాని అనుబంధ సంస్థలు సహా భారీ షాపింగ్ మాళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలూ పని చేయట్లేదు. ఫలితంగా రోజువారీ సగటు వినియోగం 2,500 నుంచి 1,800 మెగావాట్లకు పడిపోయింది. సమ్మర్ మార్కెట్ ఢమాల్.. వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ దుకాణాలన్నీ ఏసీ, కూలర్ల కొనుగోలుదారులతో నిండిపోయేవి. అబిడ్స్‌లోని ఎలక్ట్రానిక్ దుకాణాలన్నీ కూలర్లతో సందడిగా కన్పించేవి. కానీ, ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఆయా షాపులు మూతపడ్డాయి. ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే.. చలిగాలికి వైరస్ ఎక్కడ విస్తరిస్తుందో అని గ్రేటర్‌వాసులు భయపడుతున్నారు. ఏసీలను కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా చేయట్లేదు. దీంతో ఆయా ఎలక్ట్రానిక్ కంపెనీలు సహా డీలర్లు కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఏప్రిల్5న హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ ఇలా.. -
ఈ–వాహనాలకు ‘ఇంటి’ చార్జీలే..
సాక్షి, హైదరాబాద్ : ఇళ్ల వద్ద ప్రజలు సొంత ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు గృహ కేటగిరీ విద్యుత్ చార్జీలనే వర్తింపజేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లకు మాత్రం ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఖరారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ టారిఫ్‌ను వర్తింపజేయాలని కోరింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల వద్ద చార్జింగ్ సదుపాయం పొందే వారు విద్యుత్ చార్జీలతో పాటు సర్వీసు చార్జీలు సైతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. సర్వీసు చార్జీలను ఈఆర్సీ/రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 40 లక్షలకు పైగా జనాభా గల హైద రాబాద్ వంటి మహానగరాలు, వాటికి అనుబంధంగా ఉన్న రహదారుల వద్ద ఏడాది నుం చి మూడేళ్లలోగా ప్రైవేటు చార్జింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించింది. ఈ–వాహనాల చార్జింగ్ మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు.. గృహాలు/కార్యాలయాల వద్ద ప్రైవేటు చార్జింగ్‌ను అనుమతించాలి. డిస్కంలు ఆ మేరకు సదుపాయాలు కల్పించాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్)ల ఏర్పాటుకు ఈఆర్సీ నుంచి లైసెన్సు పొందాల్సి న అవసరం లేదు. ఏ వ్యక్తి/సంస్థ అయి నా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), కేంద్ర విద్యుత్ మం త్రిత్వ శాఖ జారీ చేసిన/జారీ చేసే మార్గదర్శకాలు, సాంకేతిక, భద్రత, నిర్వహణ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ నెలకొల్పాలనుకునే వ్యక్తులు విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. డిస్కంలు ప్రాధాన్యతనిచ్చి కనెక్షన్ జారీ చేయాలి. ఏదైనా చార్జింగ్ స్టేషన్/చైన్ ఆఫ్ చార్జింగ్ స్టేషన్లు నేరుగా ఓపెన్ యాక్సెస్ విధానంలో విద్యుదుత్పత్తి కంపెనీ నుంచి విద్యుత్‌ను పొందొచ్చు. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్‌కు ఉండాల్సిన కనీస సదుపాయాలు సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ ఉండాల్సిన అన్ని రకాల పరికరాలతో ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ 33/11 కేవీ లైన్/కేబుల్స్, అనుబంధ పరికరాలు ఆన్లైన్లో చార్జింగ్ స్లాట్ల బుకింగ్ సదుపాయం కల్పించేందుకు కనీసం ఒక ఆన్లైన్ నెట్వర్క్ సర్వీసు ప్రొౖవైడర్తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. చార్జింగ్ స్టేషన్ల లొకేషన్, చార్జర్ల రకాలు, సంఖ్య, లభ్యత, చార్జీల వివరాలను వాహనదారులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. సరైన సివిల్స్ వర్క్స్, సరైన కేబులింగ్/ఎలక్ట్రికల్ వర్క్స్ వాహనాల రాకపోకలతో పాటు చార్జింగ్కు సరిపడా స్థలం హౌసింగ్ సొసైటీలు, మాల్స్, కార్యాలయ సముదాయాలు, రెస్టారెంట్లు, హోటళ్ల తదితర ప్రాంతాల వద్ద చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సందర్శకుల వాహనాల చార్జింగ్కు అనుమతించొచ్చు. -
వేలానికి 23 చమురు బ్లాక్‌లు
గ్రేటర్ నోయిడా: ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద మూడో విడతలో కేంద్రం 23 చమురు, గ్యాస్, సీబీఎం బ్లాక్‌ల వేలం వేస్తోంది. దీనితో ఈ రంగంలోకి 600–700 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రావొచ్చని భావిస్తోంది. ఆదివారమిక్కడ పెట్రోటెక్ 2019 సదస్సులో ఓఏఎల్‌పీ మూడో రౌండును ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచేందుకు, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మూడో విడతలో అయిదు కోల్ బెడ్ మీథేన్ బ్లాక్‌లు కూడా ఉన్నాయని, మొత్తం 31,000 చ.కి.మీ. మేర అన్వేషణ ప్రాంతం విస్తరించి ఉంటుందని మంత్రి చెప్పారు. బిడ్డింగ్‌కు ఏప్రిల్ 10 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన ఓఏఎల్‌పీ రెండో విడతకు సమాంతరంగా మూడో విడత బిడ్డింగ్ కూడా జరుగుతుందని ఆయన వివరించారు. రెండో విడత కింద 29,333 చ.కి.మీ. విస్తీర్ణంలో 14 బ్లాక్‌లను వేలం వేస్తుండగా, మార్చి 12 బిడ్డింగ్‌కు ఆఖరు తేదీగా ఉంది. దీని ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా. ప్రస్తుతం లైసెన్సులు జారీ కాని ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చన్న అంచనాలు ఉన్న పక్షంలో ఆయా ప్రాంతాల కోసం ఓఏఎల్‌పీ కింద ఏడాది పొడవునా కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటన్నింటినీ పరిశీలించాకా కేంద్రం ఏటా రెండు సార్లు ఆయా ప్రాంతాలను బ్లాక్‌ల కింద వేలం వేస్తోంది. సంక్లిష్ట క్షేత్రాల్లో ఉత్పత్తికి ప్రోత్సాహకాలు.. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు దాదాపు 12 సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి కూడా గ్యాస్ ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, ముంబైలో ఓఎన్జీసీకి ఉన్న సంక్లిష్ట క్షేత్రాల్లో 35 బిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. -
నల్గొండకి అమృతభాండం ఇచ్చిన కేసిఆర్'
-
ఆదాయ పరిమితి పెంచిన కేసిఆర్ సర్కార్
-
ఖాతాల నుంచే కోత!
రుణాల రికవరీకి ఎత్తుగడ స్టేట్ బ్యాంకుల నిర్వాకం మునగపాక : మునగపాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి రుణాలు రికవరీ చేస్తున్నారు. ఖాతాదారుని అకౌంట్ నుంచి నగదు లావాదావీలకు ఖాతాదారుని అనుమతి తప్పనిసరి. బ్యాంక్ అధికారులు మాత్రం తమకు ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలువురు ఖాతాదారులు నివ్వెరపోతున్నారు. మునగపాకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చూచుకొండలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలున్నాయి. ఈ బ్యాంక్‌ల ద్వారా నగదు లావాదేవీలతో పాటు ఇళ్లు, వ్యవసాయ, వాహన రుణాలు పొందుతున్నారు. తమ ఖాతాల ద్వారా పొదుపులు కూడా చేస్తున్నారు. కొంతకాలంగా ఖాతాదారులకు తెలియకుండానే పొదుపు ఖాతాల్లో ఉన్న నగదును అధికారులు రుణాల రికవరీ చేసేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని ఆశిస్తున్న రైతులు బ్యాంక్ అధికారుల నిర్వాకానికి కంగుతింటున్నారు. నగదు లావాదేవీలకు తప్పనిసరిగా ఖాతాదారుని అనుమతి తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకూ రుణ మాఫీ చేస్తుందన్న ఆశతో మహిళలు సభ్యులు పొదుపులు చేసుకుంటున్నారు. ఆ నగదును సైతం అప్పుల రికవరీకి మళ్లిస్తుండడంతో వీరూ ఆందోళన చెందుతున్నారు. మునగపాకకు చెందిన బొడ్డేడ మహేష్ ఈ ఏడాది జనవరి 7న రూ.25 వేల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఆ వ్యక్తికి బ్యాంక్‌లో పొదుపు ఖాతా ఉంది. ఆయనకు తెలియకుండానే ఈనెల 5న రుణం చెల్లించలేదని రూ.25 వేలను పొదుపు నుంచి మళ్లించడంతో షాక్‌తిన్నాడు. ఇలా పలువురి పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ము రుణాల కింద రికవరీ చేస్తున్నారని తెలిసి లబోదిబోమంటున్నారు. దీనిపై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా రుణాలు తీసుకున్న వారు సకాలంలో తీర్చకపోతే వారి పొదుపు ఖాతాల నుంచి రికవరీ చేసుకోవాలన్న ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని తెలిపారు. -
‘మీసేవ’ ద్వారా డిస్కం సేవలు
తిరుపతి : సదరన్ డిస్కం పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ‘మీసేవ’ ద్వారా మరిన్ని విద్యుత్ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర బుధవారం తెలిపారు. సర్వీస్ పేరు, లోడ్ కేటగిరీల మార్పు, వీధి దీపాలు, పబ్లిక్ వాటర్వ ర్క్స్, గృహావసరాలు, వాణిజ్యం, కమర్షియల్ హోర్డింగ్స్ ఏర్పాటు తదితర కేటగిరీలకు సంబంధించి కొత్త సర్వీసులకు వినియోగదారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్ల నకళ్లను జతపరచి నిర్ధేశిత దరఖాస్తు ఫారాలను నింపి మీసేవ కేంద్రాల్లో సమర్పించాలన్నారు. ఆయా సేవలకు చెల్లించాల్సిన ఫీజులను కూడా మీసేవలోనే చెల్లించవచ్చన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే లక్ష ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యుత్ కాల్‌సెంటర్లతో పాటు మీసేవ కేంద్రాల్లో పైన పేర్కొన్న సేవల ను వినియోగదారులు పొందవచ్చునని, ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశా రు. వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి వీలుగా తిరుపతిలోని డిస్కం ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు 1800 425 1555333 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని దొర తెలిపారు. -
భగ్గుమన్న భూతగాదాలు
అలంపూర్, న్యూస్‌లైన్: భూ తగాదాలు భగ్గుమన్నాయి. దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని జిల్లెలపాడు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదయ్య వివరాలు..గ్రామానికి చెందిన నాగ్యనాయక్, ఉసేన్ మధ్య గత రెండురోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో చిన్న ఉసేన్ శుక్రవారం ఉదయం పేడ గంపను దిబ్బలో వేయడానికి వెళ్లగా నాగ్యానాయక్ అతని అనుచరులు కొందరు ఉసేన్‌పై దాడికిదిగారు. దీంతో ఉసేన్ కుటుంబసభ్యులు అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. మాటామాట పెరిగి ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అయ్యన్నను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ఘటనలో గాయపడిన చిన్న ఉసేన్, పెద్ద ఉసేన్, తిరుపతయ్యలను చికిత్సకోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిల్లెలపాడు గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మె ల్యే అబ్రహాం పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఘట నకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నరసింహులు, ఉండవెల్లి వెంకటన్న, నర్సన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.