న్యూఢిల్లీ: భారత్‌లో నెలవారీ తలసరి గృహ వినియోగం గడిచిన దశాబ్ద కాలంలో రెండింతలకు పైగా పెరిగినట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. 2011–12 నాటికి తలసరి వినియోగం రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి ఇది పట్టణ ప్రాంతాల్లో రూ.6,459కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం రూ.1,430 నుంచి రూ.3,773కు చేరింది. గృహ వినియోగ వ్యయంపై ఎన్‌ఎస్‌ఎస్‌వో 2022 ఆగస్ట్–2023 జూలై మధ్య జరిపిన సర్వే వివరాలను విడుదల చేసింది.
ప్రతి వ్యక్తి సగటున చేసే గృహ వినియోగ ఖర్చును తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టింది. 2021–12 నాటి ధరల ప్రకారం చూస్తే.. సగటు ఎంపీసీఈ పట్టణ ప్రాంతాల్లో రూ.2,630గా ఉంటే, 2022–23 నాటికి రూ.3,510కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఎంపీసీఈ రూ.1,430 నుంచి రూ.2,008కి పెరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పట్టణ ప్రాంతాల నుంచి 1,55,014 గృహాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1,06,732 గృహాల సగటు శాంపిళ్లను ఈ అధ్యయనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌వో సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment