
భారతీయ మహిళలే చిన్న తరహా వ్యాపారాల (Indian Female Small Business Owners) ద్వారా తమ కుటుంబాలను నడిపిస్తున్నారు. తమ చిన్న వ్యాపారాలకు మరింత శక్తిని అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) స్వీకరణకు కూడా సై అంటున్నారు. సాంకేతిక సేవలకు పేరొందిన గోడాడీ (GoDaddy) సంస్థ నిర్వహించిన తాజా గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. మహిళలు స్థిరత్వంతో విజయాన్ని పునర్నిర్వచించు కుంటున్నారని, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, వ్యాపార అవకాశాలు ఆవిష్కరణల కొత్త శకానికి ప్రేరణనిచ్చేందుకు సాంకేతికతను ఉపయోగిస్తు న్నారని వెల్లడించింది. లఘు, చిన్న తరహా వ్యాపారాలలో పావు వంతు (27%) కంటే ఎక్కువ మహిళల యాజమాన్యంలో ఉన్నాయని అధ్యయనం తేల్చింది, వీటిలో 74% సాంకేతికత విస్తరించిన గత ఐదు సంవత్సరాలలోనే తమ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కూడా తెలిపింది.
మహిళలు తమ సొంత వ్యాపారాలను నడపడమే కాదు, అచంచలమైన విశ్వాసంతో రాణిస్తున్నారు. ప్రతీ ఐదుగురిలో నలుగురు (79%) తమ వ్యాపారాలు వచ్చే సంవత్సరంలో పెద్ద, మెరుగైన వనరులు కలిగిన కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఉదాహరణకు, భారతీయ మహిళలు ఏఐఆర్‌వో వంటి ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వారానికి 12 గంటలు ఆదా చేస్తున్నారని కూడా వెల్లడైంది.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి 63%మంది, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా ప్రస్తుత వాటిని మెరుగుపరచడానికి 55%మంది వ్యాపార భవిష్యత్తును ప్లాన్ చేయడానికి 46% మంది సమయం వెచ్చిస్తున్నారు.
చదవండి: ప్రముఖ గాయనితో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాహం, ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment