International Women's Day 2025 : మీకు స్ఫూర్తినిచ్చిన వనితను గుర్తు చేసుకోండి!
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళల హక్కులను గుర్తించడం, వారి విజయాలను, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింసపై పోరాటం, సమాన హక్కులు అంశాలపై విస్తృతంగా చర్చించుకోవడం అవసరం. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా మహిళ పాత్ర మన జీవితాల్లో చాలా కీలకమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ప్రభావం చూపిన, లేదా మీరు మెచ్చిన నచ్చిన మహిళ గురించి ఒక నిమిషం వీడియో చేయండి. ఆమెతో మీ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. దీనికి #VanithaVandanam యాడ్ చేయడం మర్చిపోద్దు!