
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.
వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్-ఎక్స్‌లో ట్యాగ్)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.
‘షుగర్-ఫ్రీ’ లైఫ్‌స్టైల్
నీతా అంబానీ ఫిట్‌నెస్ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.
ఆరోగ్యానికి 30 నిమిషాలు
Unstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r
— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025
మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్‌నెస్ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్‌నెస్ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment