నీతా అంబానీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! | Nita Ambanis Diet And Fitness Plan That Help Her Weight Loss | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ ఫిట్‌నెస్‌ రహస్యం ఇదే! ఏకంగా 18 కిలోలు..

Published Fri, Mar 15 2024 6:39 PM | Last Updated on Fri, Mar 15 2024 7:19 PM

Nita Ambanis Diet And Fitness Plan That Help Her Weight Loss - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. కేవలం ముఖేశ్‌ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తనను తానుగా గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు. రిలయన్స్‌ బోర్డు మెంబర్‌గా, ఐపీఎల్‌లో ముంబై ప్రాంచైజ్‌ ఓనర్‌గా మంచి విజయాలను అందుకున్నారు. ఆ సక్సెస్‌ ఆమెను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా. ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో హడావిడి అంత ఆమెదే. ఏ డ్రెస్‌లు వేసుకోవాలి..? ఈవెంట్‌ ఎలా చేయాలి..? వంటివన్నీ తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత్‌ అంబానీనే చెప్పారు కూడా.

54 ఏళ్ల నీతా అంబానీ తన కోడళ్లకు, కూతురుకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్‌ ఆమె సొంతం. చూడటానికి ఓ హిరోయిన్‌ మాదిరిగా మంచి ఫిజిక్‌ మెయింటెయిన్‌ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అందం, ఫిట్‌నెస్‌ ముందు సినీ సెలబ్రెటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఇంతలా చలాకీగా ఫిట్‌నెస్‌గా ఉండటానికి ఆమె ఎలాంటి డైట్‌ ఫాలో అవుతారు?. ఆమె ఫిట్‌నెస్‌ రహస్యం తదితరాలు గురించి చూద్దామా!. 

నీతా అంబానీ మొదట్లో 90 కిలోల బరువు ఉండేవారు. తన చిన్న కొడుకు అనంత్‌ అంబానీ ఆస్మా, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరవు పెరిగిపోయాడు. దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు కూడా. తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకుకి స్ఫూర్తినిచ్చారు. పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు. అలా అనంత్‌ కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా.

అదీగాక నీతా మంచి శాస్త్రీయ నృత్యకారిణి కావడంతో ఆమె రోజువారీ దినచర్యలో భాగంగా నృత్యం చేస్తుంటారు. ఇదే ఆమెను మంచి ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్‌ కదిలికలు, శరీరానికి ఓ మంచి వ్యాయామంలా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నీతా క్రమం తప్పకుండా బీట్‌ రూట్‌ జ్యూస్‌ తగ్గుతారు. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్‌లో అ‍ద్భుతమైన డిటాక్స్‌లు ఉంటాయి. అవి అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇది నిధానంగా బరువు తగ్గడంలో తోడ్పాడుతుంది. ఎలాంటి సైడ్‌ ఎఫ్‌క్ట్‌లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువుని అదుపులో ఉంచుతుంది. పైగా మంచి మానసికొల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, చికాకులు, టెన్షలు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది. ఇదే ఆమె ఫిటనెస్‌ రహస్యం. అందువల్లే నీతా ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే ఆమె శక్తిమంతమైన బిజినెస్‌ విమెన్‌గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారని కూడా అనొచ్చు. 

(చదవండి: ట్రెండీ షార్ట్‌ బాబ్‌ హెయిర్‌ స్టయిల్‌..ఎక్కడి నుంచి వచ్చిందంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement