
ప్రపంచ వ్యాప్తంగా.. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా, వారిని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'ప్రియాంక చిగురుపాటి' (Priyanka Chigurupati) ఓ సందేశాన్ని ఇచ్చారు.
మహిళా దినోత్సవం అనేది.. ఒక వేడుక కంటే ఎక్కువ. ఇది ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తిసామర్త్యాల జ్ఞాపకం. మన దేశంలో మహిళా వ్యవస్థాపకులు కేవలం వ్యాపారాలను మాత్రమే కాకుండా.. భవిష్యత్తులను రూపొందిస్తున్నారు. నేడు స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెడుతున్న నలుగురు వ్యక్తులలో ఒకరు స్త్రీ కావడం గమనార్హం, గర్వించదగ్గ విషయం. ఇది కేవలం గణాంకాల కోసం చెప్పుకునే సంఖ్య కాదు.. వారు సొంతంగా నిలబడుతున్నారు అనేదానికి నిదర్శనం అని ప్రియాంక అన్నారు.
మహళలు పురోగతి సాధించాలంటే.. ఒంటరి ప్రయత్నం కాకుండా, సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి, ఆర్థిక.. వృత్తిపరమైన అభివృద్ధికి, స్త్రీ సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్రాన్యూల్స్.. నిజమైన సాధికారత పని ప్రదేశానికంటే ఉత్తమంగా ఉంటుంది. మహిళలను నాయకులుగా, ఆవిష్కర్తలుగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే పర్యావరణ వ్యవస్థలను రూపొందించడమే కంపెనీ ఉద్దేశ్యం. వీరు శాస్త్రీయ పురోగతులను నడిపిస్తున్నా, విజయవంతమైన సంస్థలను నడుపుతున్నా లేదా ఆర్థిక భవిష్యత్తును రూపొందిస్తున్నా వారిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి. దీనికోసం మహిళా దినోత్సవం నుంచే పాటు పడాలని చెప్పారు.