International Women's Day
-
సృష్టికి మూలం.. సీఎం జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: జగనన్న సంకల్పంతో.. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజకీయ, పాలనా పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృద… pic.twitter.com/u8SkR9hoP7 — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 -
మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు. దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా.. ఆరోగ్య బీమా ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి. తీవ్ర వ్యాధులకు.. కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. వాహన బీమా మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ టర్మ్ పాలసీ ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీల ఆర్థికపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికర సర్వేలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా దేశంలోని మహిళా ఉద్యోగుల్లో అత్యధికులు ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలని భావిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆన్లైన్ మార్కెటీర్ ఇండియాలెండ్స్ చేపట్టిన ఈ సర్వేలో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోగల 24-55 ఏళ్లకు చెందిన 10వేలకుపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. వీరిలో ఏకంగా 76 శాతం మంది తమకు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉన్నట్టు చెప్పడం విశేషం. ఇక 86 శాతం మంది బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, సేవింగ్, ఇతర ఆర్థిక అంశాలపై నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరిచినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై డేటాను అందించే ఆన్లైన్ వేదిక ఇండియాలెండ్స్ తెలిపింది. పెరుగుతున్న రుణాలు.. గత ఏడాది మహిళలు తీసుకున్న రుణాల్లో 19 శాతం వృద్ధి కనిపించింది. 2023లో రూ.30.95 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. 2022లో రూ.26 లక్షల కోట్లేనని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ఇక అంతకుముందుతో పోల్చితే గతేడాది వ్యక్తిగత రుణాలు 26 శాతం పెరిగి రూ.12.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు.. ప్రధాన స్థానాల్లో.. తాము ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సంస్థల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 3,138 కంపెనీలకు బీఏఏ, ఆపై రేటింగ్‌నే ఇచ్చామని, వీటి బోర్డుల్లో సగటున 29 శాతం మహిళలే ఉన్నారని చెప్పింది. ఇదిలావుంటే ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం కంపెనీలకే మహిళలు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఫార్చూన్ ఇండియా నెక్స్ 500 కంపెనీల్లో మహిళల సారథ్యంలో పనిచేస్తున్నవి 5 శాతంగా ఉన్నాయి. -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం!
‘మహిళలను గౌరవిద్దాం’ అనే మాట తరచూ వింటుంటాం. మహిళ గురించి మాట్లాడే ఉన్నతమైన పదాలు మహిళా దినోత్సవం వరకే పరిమితం అవడం కూడా చూస్తుంటాం. ‘సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించే క్రమంలో స్త్రీ గౌరవానికి, రక్షణకు వెన్నుదన్నుగా నిలిచేది కూడా మొదట మహిళే అయి ఉండాలి’ అంటూ వివిధ రంగాలలోని మహిళలు తమ మాటల ద్వారా ఇలా వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఆ మాటలను ఆచరణలోనూ పెట్టి మంచి ఫలితాలను చూద్దాం. ప్రయత్నించడం మానకూడదు.. మగవారితో పోల్చితే ఇంట్లో, ఆఫీసులోనూ స్త్రీల పాత్ర ఎక్కువే. రెండుచోట్లా నిబద్ధతతో పని చేస్తుంటారు. కానీ, రెండు చోట్లా అర్థం చేసుకునేవారుండరు. విసుగు అనిపిస్తుంటుంది. అలాగని, మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ముప్పై ఏళ్ల క్రితం నేను పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాసులో అమ్మాయిలు ఐదు శాతం కన్నా తక్కువే ఉండేవారు. ఇప్పుడు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌లో 60 నుంచి 70 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్స్‌లో కొన్నింటిని గర్ల్స్ హాస్టల్‌గా మార్చేద్దామని కూడా చూస్తున్నాం. పీహెచ్‌డి చేసే అమ్మాయిల సంఖ్యా పెరిగింది. పోరాడి సీట్లు, పదవులు దక్కించుకుంటున్నాం. అయితే, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ హోదాలో ఉన్న ముందు ఎవరిని వారు గౌరవించుకోవాలి. చదువులో, హోదాలో సమానత్వం కోసం పాటుపడాలనే కాదు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలనుకోవాలి. కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలమనే ధైర్యం ఉండాలి. రక్షించడానికి ఎవరో ఒక మగవాడైనా ఉండాలి అనే ఆలోచనను దూరం పెట్టాలి. అప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకు తగిన సత్తాను సంపాదించుకోవడం మన లక్ష్యం అవ్వాలి. ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ సమాజంలో మనల్ని ఉన్నతంగా చూపుతుంది. –ప్రొఫెసర్ సి.వి. రంజని, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఓయూ వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు.. స్లోగన్స్ చెబుతున్నారు. కానీ, పాటించడం లేదు. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. కానీ, మగవారు స్త్రీని శారీరకంగా బలహీనులుగానే చూస్తారు. ఆమె శక్తి తెలిస్తే మగవారిలో ఆ ఆలోచనే రాదు. ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైనా ఉంటే ఆ సంఘటనను, సదరు వ్యక్తులను కాకుండా ముందు ఆమె వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తుంటారు. ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశంలోకి ఒక మహిళ రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అక్కడా వేధింపులు తప్పవు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లి చేసుకున్న అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే, పుట్టింటి సహకారం అందక ఆ అమ్మాయి బతుకుదెరువులో చాలా వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె జీవనం గురించి తప్పుగా మాట్లాడే మగవాళ్లు ఉన్నారు. సమస్యను ఎదుర్కోవడంలో గొడవ తప్పక జరుగుతుంది. కానీ, సింగిల్ ఉమెన్ గొడవ పడితే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. తల్లి తన కూతురుకి ఒంటరిగా ఎలా జీవించాలో చెబుతూనే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ‘ఆమె’గౌరవానికి సంబంధించిన దారుణమైన వీడియోలు చూస్తున్నాం. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ‘అమ్మాయి ఎలాంటిది?’ అని ఆమెను నెగిటివ్ంగాప్రొజెక్ట్ చేస్తున్నారు. స్వలాభం కోసం చేసే ఇలాంటి ఎన్నో పనులు ‘ఆమె’ గౌరవాన్ని తీసేస్తూ బతికేస్తున్నారు. – డాక్టర్ జయశ్రీ కిరణ్, కాకతీయ ఫౌండేషన్, హైదరాబాద్ మన మీద మనకు నమ్మకం! మగవారితో పోల్చుకుంటే టైమ్ మేనేజ్ చేయగల శక్తి స్వతహాగా స్త్రీకి ఉంటుంది. ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడితే అది ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గర కావల్సిందే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యం బాగా లేదనో, సరైన చదువు లేదనో, కుటుంబ బాధ్యతలు ఉన్నాయనో.. ఇలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన కలలను మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు. నాకు స్కూల్ వయసులో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అయినా యోగా ట్రైనర్‌గా, బ్యుటీషియన్‌గా మేకప్ అకాడమీ నడుపుతున్నాను. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే నా పనులు చేసుకుంటూ వచ్చాను. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా కెందుకు ఈ సమస్య వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సానుభూతి తప్ప బయటి నుంచి గౌరవం కూడా లభించదు. మనమీద మనకున్న నమ్మకమే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. – రూప, యోగా టీచర్ అండ్ బ్యూటీషియన్ భయం బిడియంతో శక్తి తగ్గుతుంది.. స్త్రీలను గౌరవించండి అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఆ మాట వినటమే మన దౌర్భాగ్యం. ఎందుకంటే స్త్రీని గౌరవించాలి అని చెబితే గాని తెలియని సమాజంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు స్త్రీకి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయే వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. మారుతున్న టెక్నాలజీతో పాటు మనలో కూడా మార్పు రావాలి. భయం, బిడియం అనే భావాలతో స్త్రీ తన శక్తిని గుర్తించటం లేదు. ఒక తల్లి యవ్వనంలో ఉన్న తన కూతురుతోనో కొడుకుతోనో తన చిన్నప్పటి కబుర్లు, నెరవేరని కలలు, రక్తసంబంధాలు, స్నేహితుల గురించి, జీవితంలో అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొనే నేర్పరితనం... చర్చించడం లేదనిపిస్తోంది. నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా స్త్రీ ఎప్పుడూ మెలకువతో తనను తాను కాపాడుకోవాలనే స్పృహతో ఉండాలి. పాలకులు కూడా స్త్రీని అన్ని రంగాల్లో పైకి తెస్తున్నాం అని చెబుతుంటారు. కానీ, అమ్మాయిలపై అఘాయిత్యాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. స్వతంత్ర దేశం కోసం ఎందరో స్త్రీలు తమ ్రపాణాలర్పించారు. వారి ్రపాణత్యాగాన్ని స్మరణ చేసుకున్నా మహిళగా ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనలో మనకు ఐకమత్యం ఉండాలి. ఏ కారణం వల్ల ఒంటరిగా ఉంటున్న స్త్రీని సాటి స్త్రీ అర్థం చేసుకొని, ఆమెకు మద్దతునివ్వగలిగితే చాలు ధైర్యం పెరుగుతుంది. స్త్రీలు ఒకరికి ఒకరుగా నిలవాలి. పనిమనిషి పనిని కూడా గౌరవించడం కుటుంబంలో వారికే అర్ధమయ్యేలా తెలపాలి. పారిశుద్ధ్య కార్మికురాలి, పనిమనిషి, రోజువారీ పనుల్లో తారసపడే ప్రతి స్త్రీని గౌరవించాలని పిల్లలకు చె΄్పాలి. రేపటి తరంలో వచ్చే మార్పు కూడా సమాజానికి మేలు కలుగజేస్తుంది. – వి. ప్రతిభ, బిజినెస్ ఉమెన్ ఇవి చదవండి: International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ -
సాధారణ మహిళలు సృష్టించిన చరిత్ర
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2024లో స్త్రీ పురుష సమానత్వం కోసం పెట్టుబడిని పెట్టమని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. నినాదాలు ఎంత గొప్పగా ఉన్నా ఆచరణ ఉంటేనే మార్పు వస్తుంది. సాధారణ మహిళలు సృష్టించిన అసమాన్య చరిత్ర మహిళా దినోత్సవానికి నాంది పలికింది. పారిశ్రామికీకరణ మొదట్లో 19వ శతా» ్దం ఆరంభంలో ఇటలీ, ఇంగ్లాండ్, పోలండ్, రష్యా వంటి వివిధ దేశాల నుండి అమెరికాకు వలస వచ్చినవారు పరిశ్రమలలో పని చేస్తుండే వారు. కనీస సౌకర్యాలు లేకుండానే అతి తక్కువ వేతనంతో రోజుకు 15 గంటలు పని చేస్తుండేవారు. యూనియన్ చేసే సమ్మెలలో కూడా మగవారి డిమాండ్లనే పరిష్కరించేవారు. దీనితో 1820ల కాలంలోనే మహిళలు యూనియన్లుగా సంఘటితమవడం మొదలు పెట్టారు. 1857 మార్చి 8న పెద్ద సంఖ్యలో మహిళలు కవాతు చేశారు. పది గంటల పనిదినం, పురుషులతో సమాన హక్కులు, కనీస సౌకర్యా లను డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీచార్జిని, కిరాయి రౌడీల దౌర్జ న్యాన్ని ఎదుర్కొన్నారు. 1900లో అంతర్జాతీయ మహిళా దుస్తుల శ్రామిక యూనియన్ ఏర్పడి మార్చి 8న మరిన్ని నిరసన ప్రదర్శ నలు జరిగాయి. 1908లో 1857 నాటి మార్చి 8 నిరస నను గుర్తు చేసుకుంటూ... పని గంటల తగ్గింపు, మెరుగైన పని పరిస్థి తులు, సమాన హక్కులతో పాటు చైల్డ్ లేబర్‌ను నిషేధించాలని ప్రదర్శన చేశారు. 1909లో 20వేల మందితో సుదీర్ఘకాలం పాటు సమ్మె చేశారు. సమ్మె పాక్షికంగా విజయం సాధించింది. కానీ చదువు రాని మహిళలు ఏమి చేయలేరని భావనను ఇది సవాలు చేసింది. వారిలో ఆత్మగౌరవాన్నీ, శక్తినీ నింపింది. ఇదే కాలంలో అమెరికా సోషలిస్టుల మద్దతు వీరికి లభించింది. ఈ పోరాటాలను పరిశీలిస్తూ ఎంతో స్ఫూర్తి పొందిన జర్మన్ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రీకరించాలని 1910లో ‘కోపెన్ హెగెన్’లో జరిగిన రెండవ కాన్ఫరెన్స్‌లో ప్రతిపాదించింది. 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు దీనిని ఏక గ్రీవంగా ఆమోదించారు. అప్పటినుంచి సోషలిస్టు పార్టీ పిలుపు నందుకొని మరిన్ని దేశాలలో మార్చి 8న మహిళా సమస్యలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. 1912లో గౌరవప్రదమైన జీవితం కోసం ‘మాకు రొట్టెలే కాదు గులాబీలు కావాలి’ అంటూ ప్ల కార్డ్స్ పట్టుకొని ప్రదర్శన చేశారు. ‘బ్రెడ్ అండ్ రోజెస్‘ పాట మార్చి 8 కవాతు గీతం అయింది. 1917లో రొట్టె, శాంతి కోసం డిమాండ్ చేస్తూ జరిపిన మహిళా దినం రష్యా విప్లవాన్ని ఒక మలుపు తిప్పింది. సోషలిస్టు దేశాలలో మొదటగా ఈ డిమాండ్లను పరిష్కరిస్తూ మార్చి 8న సెలవు దినంగా ప్రకటించారు. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని ‘అంతర్జాతీయ మహిళా దినో త్సవం’గా జరపాలని ప్రకటించింది. శ్రామిక మహిళలు చేసిన పోరాట ఫలితాలు ఆఫీసుల్లో పనిచేసే కొద్ది మంది మహిళలకే దక్కాయి. రాజకీయ పార్టీలు మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి తర్వాత మరచిపోతున్నాయి. తమ సమస్యలపై ప్రశ్నిస్తూ మార్చి 8 స్ఫూర్తితో పోరాడితేనే మహిళల జీవితాలలో మార్పు వస్తుంది. – రాధ, చైతన్య మహిళా సంఘం -
పరువు, ప్రతిష్ఠ – స్త్రీల భద్రత
ఇటీవల ఝార్ఖండ్ పర్యటన కోసం వచ్చిన ఒక విదేశీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన విషయం అనేక చర్చలకి దారితీసింది. బాధితుల తరుపున వేసే ప్రశ్నని నేరంగా చూసే కర్మభూమి మనది. ఈసారి బాధ్యతని జాతీయ మహిళా కమిషన్ చైర్ విమన్ రేఖా శర్మ తీసుకున్నారు. అర్ధరాత్రి, అటవీ ప్రాంతంలో గుడారం వేసుకుని పడుకున్న స్పానిష్, బ్రెజిలియన్ జంటమీద ఏడుగురు వ్యక్తులు దాడిచేసి వారిని కొట్టి, కత్తి చూపి చంపుతామని బెదిరించి, వారి విలువైన వస్తువులు దోచుకుని, మహిళని సామూహికంగా రేప్ చేశారు. ఆసియా పాత్రికేయ రంగంలో పదిహేనేళ్లుగా పని చేస్తున్న డేవిడ్ జోసెఫ్ వోలోజ్కో అనే జర్నలిస్ట్ తన అనుభవాల మేరకి భారతదేశంలో విదేశీ మహిళలు ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదని చెప్పాడు. ఇది వైరల్ అయి రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. అందులో రేఖా శర్మ వేసిన రీట్వీట్– జాతీయ మహిళా కమిషన్ వైఖరిని స్పష్టం చేసింది. ‘ఇటువంటి ఘటనల మీద మీరెప్పుడైనా పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే మీరు పూర్తిగా భాధ్య తారహితమైన మనిషి. కేవలం సోషల్ మీడియాలో రాసుకుంటూ దేశ పరువుని తీయాలనుకోవడం మంచిది కాదని’ హితవు పలికారు. పాతకాలపు సిని మాల్లో, సాహిత్యంలో స్త్రీలమీద అత్యాచారం జరిగిన ఘటనలు చూపించాల్సి వచ్చినపుడు కొన్ని విచి త్రాలు జరిగేవి. ‘ప్రాణం కన్నా మానం విలువైనదని’ చెప్పి ఆ స్త్రీపాత్రని చంపేయడమో, జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావమని సూచించడమో లేదా అత్యాచారం చేసినవాడు పెద్దమనసు చేసు కుని పెళ్లికి సిద్ధపడ డమో చూపించేవారు. పరువు ప్రతిష్ఠలన్నీ స్త్రీల శరీర శీలం చుట్టూ కమ్ముకుని ఉంటాయనీ, శీలంపోతే పరువుపోతుందనీ నమ్మేవారు కనుక మూతముప్పిడి వ్యవహారాలు నడిచేవి. కాలం మారింది. స్త్రీల మీద లైంగికహింస తగ్గకపోయినా, కనీసం అత్యాచారాన్ని ఎలా చూడాలన్న దృష్టికోణంలో కొన్ని మార్పుల యితే వచ్చాయి. అత్యాచారానికి గురైన ఆ విదేశీ మహిళ కూడా, ‘వారు నన్ను చంపకుండా వదిలి పెట్టారు. థాంక్ గాడ్’ అన్నది. దాడికి గురైన వాస్తవం తప్ప ఇందులో పరువు గోల లేదు. భారతదేశంలో విదేశీ స్త్రీలకే కాదు, స్వదేశీ స్త్రీలకి కూడా రక్షణ లేకపోవడం వాస్తవం. ఇటువంటి వర్త మానం ఉన్నచోట భారత మహిళల భద్రత కన్నా దేశపరువు గురించి ఆలోచించే రేఖా శర్మ లాంటివారు ‘కొత్త స్త్రీలు’. వీరు మహిళలని మధ్యయుగాలకి నడి పించుకు వెళ్లగల సమర్థులు. ఈ ఘటన అటవీప్రాంతంలో జరిగింది. లైంగికంగా వేధించడం, అత్యాచారం చేయడం వంటి హింసాపద్ధతులని ప్రేరేపించే బైటి ప్రభా వాలకి అక్కడ ఆస్కారం తక్కువ. అటువంటిది మారుమూల ప్రాంతాల్లోకి కూడా కల్చరల్ పొల్యూషన్ వ్యాపించడమనేది జాగ్రత్త పడాల్సిన విషయం. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువచ్చి, వారిని చూపించిన తీరుని బట్టి నిందితులు బహుశా స్థానికులు, అట్టడుగువర్గాల వారయ్యే అవకాశం ఉంది. బాధితురాలు విదేశీ మహిళ, అందునా ధైర్యంగా రిపోర్ట్ చేసిన మహిళ అని సంకోచం ఉన్నట్లుంది గానీ లేకపోతే ఈపాటికే ‘ఎన్కౌంటర్ న్యాయం’ డిమాండ్ ఎల్లెడలా వూపు అందుకునేదే. నేరానికి కూడా కులమూ, వర్గమూ ఉంటుంది కనుక, అనువుగా దొరికే నేరస్థుల విషయంలో నేరాన్ని మించిన శిక్షలను విధించి ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారు కనుక, నిందితుల నేరానికి తగినశిక్ష మాత్రమే పడాలన్న మాటని పదేపదే ఇపుడు గుర్తు చేసుకోవాలి. వ్యాసకర్త ప్రరవే (ఏపీ శాఖ) కార్యదర్శి -
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అకౌంట్స్ అధికారులతో పాటు అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటేలా వినూత్నంగా వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. కొందరు డాన్స్‌తో అలరిస్తే.. మరికొందరు పాటలు పాడారు. మహిళలు అన్నింటా సమానమని చాటి చెప్పేలా తమ పాఠవాలను ప్రదర్శించారు. మిగతా కార్యక్రమాలల్లోనూ చురుగ్గా పాల్గొని ఎంజాయ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అసొసియేషన్ ప్రతినిధి దీపారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా జాయింట్ డైరెక్టర్ రజిని, శైలజా రాణి, చీఫ్ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గీతా చౌదరీ తదితరులు హాజరయ్యారు. -
మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి వివాదంలో చిక్కుకున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంపీని చిక్కుల్లో పడేశాయి. అసలేం జరిగిందంటే.. ఎంపీ మునిస్వామి మహిళా దినోత్సవం రోజు కోలార్ జిల్లాలో ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్లోని దుకాణాలను పరిశీలిస్తున్న ఎంపీ.. ఓ వస్త్ర దుకాణంలోని మహిళా వ్యాపారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళను నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. మీ భర్త బతికే ఉన్నారుగా అని అంటూనే అ అమ్మాయికి బొట్టు ఇవ్వండి అని ఇప్పిస్తాడు. ‘నీ పేరేంటి? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ స్టాల్‌కు వైష్ణవి అని పేరు పెట్టి, బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీకు కామన్ సెన్స్ లేదా? మీ భర్త ఇంకా బతికే ఉన్నారు కదా. ముందు బొట్టు పెట్టుకోండి’ అంటూ దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంపీ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళా దినోత్సవం నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. బీజేపీ దుర్మార్గపు సంస్కృతికి ఈ వీడియో అద్దం పడుతోందని విమర్శించింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పీ చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ భారత్‌ను హిందూత్వ ఇరాన్‌గా మారుస్తుందని మండిపడ్డారు. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? "Wear a Bindi first. Your husband is alive, isn't he. You have no common sense" says this #BJP MP #Muniswamy to a woman vendor.#Karnataka #Kolar #WomensDay pic.twitter.com/YSedSDbZZB— Hate Detector 🔍 (@HateDetectors) March 9, 2023 -
ఇండస్ట్రీ కళకళ.. లేడీస్ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్ స్పెషల్’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్ను రిలీజ్ చేశాయి. ఆ పో స్టర్స్ పై ఓ లుక్ వేయండి. ఫారిన్ అన్విత ఫారిన్ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్ చేస్తున్నారు మిస్ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శకుంతల ప్రేమ ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి చేరువలో.. ఉమెన్స్ డే రోజున ‘మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేశారు హన్సిక. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక. మిస్ భైరవి ‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పో స్టర్‌ను రిలీజ్ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. గీత సాక్షిగా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించారు. ఇవే కాదు.. మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్ కూడా విడుదలయ్యాయి. -
మహిళల కోసం ‘సింగిల్ విండో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వారికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం టీఎస్–ఐపాస్ తరహాలో త్వరలో ఓ ‘సింగిల్ విండో’విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులు, మహిళా వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని, త్వరలోనే పేరు పెట్టి అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీ హబ్ 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పలువురికి ఉపాధి కల్పిస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీ హబ్ వేదికగా ఉన్నత స్థాయికి మహిళలు రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల క్రితం వీహబ్‌ను ప్రారంభించామని, దాన్ని వేదికగా చేసుకుని ఎందరో మహిళలు ఉన్నతస్థాయికి చేరుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా మహిళా ఉత్పాదకులను భాగస్వామ్యం చేయడంలో వీ హబ్ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా.. స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి కింద వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని చెప్పారు. తాజాగా రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మాయి తక్కువ అనే భావన తగదు ‘పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలి. వారికి ఇష్టమైన చదువును చదివించాలి. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. స్త్రీ, పురుషులకు ప్రతిభ సమానంగానే ఉంటుంది. కానీ కొందరు తెలిసీ తెలియక ‘అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ’అనే భావన నేర్పిస్తున్నారు. అలా వివక్ష చూపించకుండా ఇద్దర్నీ సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారు. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. మా ఇంట్లో నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారు. మా పిల్లలను కూడా మేం సమానంగా చూస్తున్నాం. ఏం అవ్వాలనుకుంటే ఆ దిశగా ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వగలిగితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారు. నా కూతురు 9వ తరగతి చదువుతోంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె ఏ రంగంలో ఉన్నా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను..’అని కేటీఆర్ అన్నారు. ‘బాస్’కి భయపడాల్సిందే.. ‘మహిళలు ఎక్కువ నిబద్ధతతో ఫోకస్డ్గా, బాధ్యతాయుతంగా ఉంటారు. మమ్మల్ని తొక్కేస్తున్నారు కూడా. మేం బయటకి ఎంత నటించినా ఇంట్లో మహిళలే బాస్‌లు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాక బాస్‌కి భయపడాల్సిందే..’అంటూ కేటీఆర్ చమత్కరించారు. ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలు వ్యాపారాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. మహిళలను వివిధ రంగాల్లో ప్రోత్సహించడంలో వీ హబ్ పాత్రను వివరించారు. వీహబ్ ద్వారా గత ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, 1,247 మంది విద్యార్థులు, 986 మంది సామాజికంగా ప్రభావశీలురైన పారిశ్రామికవేత్తలు, 609 మంది పట్టణ పారిశ్రామికవేత్తలతో వీ హబ్ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదిగిన తీరును వీ హబ్ సీఈవో దీప్తి రావుల వివరించారు. పలువురు మహిళలు తమ విజయానికి వీ హబ్ ఎలా తోడ్పడిందీ తెలిపారు. -
కేసీఆర్ పాలన మహిళలకు ల్యాండ్‌మైన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్‌మైన్‌లా తయారయ్యిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎక్కడ బయటకు అడుగేస్తే ఎవరు వేధిస్తారోననే భయం మహిళల్లో నెలకొందన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రక్షణ కరువైందని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై నల్లబ్యాడ్జీలతో షర్మిల మౌనదీక్ష చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు సంబంధించి వేల కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా ఘటనలకు పాల్పడిన వారిలో ఎక్కువగా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను మహిళా ద్రోహిగా అభివర్ణించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ డమ్మీగా మారిందని, ఒక మహిళా గవర్నర్‌కు కనీస గౌరవం సైతం లభించడం లేదని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత, చైతన్యారెడ్డి, కల్పనాగాయత్రీ, ఝాన్సీరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ వాడుక రాజ్‌గోపాల్, అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. కాగా, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. కాగా, దీక్షకు ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిలింనగర్లో బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల ‘బస్తీబాట’ వాయిదా:.. వైఎస్ షర్మిల తలపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ బస్తీ బాటపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గ్రేటర్ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ఆరోపించారు. గురువారం చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బస్తీబాట వాయిదా పడిందన్నారు. -
భారతదేశంలోని టాప్ 10 మహిళా స్వాతంత్ర్య సమరయోధులు (ఫోటోలు)
-
మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఈకార్వో) ప్రెసిడెంట్ పారిజాత సత్పతి.. వైస్ ప్రెసిడెంట్స్ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కలిసి ఈ రైలును మంగళవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలుకు సహనాకుమారి లోకోపైలట్‌గా, కె.నాగమణి అసిస్టెంట్ లోకోపైలట్‌గా, ఎం.కళ్యాణి ట్రైన్ మేనేజర్‌గా, ఎస్.అంబిలి, జి.అచ్యుతాంబ, కె.సంతోíÙరావు, డి.రాధ టికెట్ తనిఖీ సిబ్బందిగా విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈకార్వో ప్రెసిడెంట్ పారిజాత సత్పతి మాట్లాడుతూ విశాఖ నుంచి మహిళా సిబ్బందిచే ప్రత్యేక రైలును నడిపించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆపరేషన్స్, కమర్షియల్, ఆరీ్పఎఫ్.. ఇలా అన్ని విభాగాల్లోను మహిళలే విధులు నిర్వర్తించారని తెలిపారు. వాల్తేర్ డివిజన్ మహిళా సాధికారత విషయంలో ముందుంటుందని, అనేకమంది మహిళలను ట్రాక్ మెయింటెనెన్స్‌లో, ట్రైన్ ఆపరేషన్స్‌లో, ఆర్‌ఆర్‌ఐలో, ట్రైన్ మేనేజర్స్‌గా, టికెట్ తనిఖీ సిబ్బందిగా, కార్యాలయాల్లోను విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వాల్తేర్ డివిజన్ ప్రత్యేకంగా మహిళల చేత కొన్ని విభాగాలనే నడుపుతున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈకార్వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్కే బీచ్‌లో వాకథాన్ నిర్వహించినట్లు చెప్పారు. -
ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐదు రోజుల ముందు ముంబై మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్ల నిర్వహణ బాధ్యతను మొత్తం మహిళా సిబ్బందికే అప్పగించింది. మహిళా సాధికారతను చాటిచెప్పెందుకు ఇలా చేసింది. దీంతో ఈ రెండు మెట్రో స్టేషన్లలో పూర్తిగా మహిళా సిబ్బందే కన్పించనున్నారు. స్టేషన్ మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు మొత్తం 76 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించున్నారు. వీరికి మూడు షిఫ్టుల్లో డ్యూటీ ఉంటుంది. రవాణా రంగంలోలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తాత్కాలికంగా ఈ రెండు స్టేషన్లను మహిళా సిబ్బందికి అప్పగించలేదని, ఇకపై ఈ స్టేషన్ల బాధ్యత శాశ్వతంగా మహిళా ఉద్యోగులే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మహిళా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్లు ఈ ఏడాది జనవరిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం గమనార్హం.నెల రోజుల్లోనే వీటి బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు. చదవండి: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ.. -
ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్
‘సబల’... మహిళకు భరోసానిచ్చే పదం ఇది. తన మీద తనకు అనిర్వచనీయమైన నమ్మకాన్ని కలిగించే పదం. తరతరాలుగా నువ్వు ‘అబలవి, బలహీనురాలివి’ అన్నది సమాజం. ‘నువ్వు సబలవి’ అని చెప్పడమే ఓ ముందడుగు. ‘ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ మహిళ మనసును తాకే నినాదం. తరతరాలుగా మన సమాజం ‘అబలవి, బలహీనురాలివి’ అనే భావాన్ని మహిళల నరనరాన ఇంకింప చేసింది. ‘నువ్వు అబలవి కాదు, సబలవి’ అని ఎంతగా నినదించినప్పటికీ ‘అబల’ అనే భావం మెదడు నుంచి తొలగిపోయేది కాదు. ఏ మాత్రం అవాంఛనీయం కానీ ఆ భావాన్ని ‘సబల’ అనే మూడక్షరాల పదం క్షణం సేపట్లోనే తుడిచేస్తోంది. తాను సబలననే భావనే మహిళను శక్తిమంతం చేస్తుంది. నామకరణంలోనే విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ రూపొందించింది. మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగే కార్యాచరణ. కమిషనే మహిళ దగ్గరకు మహిళాకమిషన్ బాధ్యతలు రాజధానిలో ఆఫీస్‌లో కూర్చుంటే పూర్తయ్యేవి కావు. కమిషన్ దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తే సరిపోదు. బాధిత మహిళలందరూ రాజధానిలో ఉండే కమిషన్ కార్యాలయానికి వెళ్లలేకపోవచ్చు. అందుకే ‘తామే బాధిత మహిళల దగ్గరకు వెళ్లాలి. కష్టంలో నీకు మేము తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. నీ కష్టం నుంచి బయటపడడానికి దారి ఉంది అని చెప్పాలి, ఆ దారిని చూపించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మహిళాకమిషన్. నిస్సహాయ మహిళ ‘ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ నాకు తోడుగా ఉంది. నాకేం భయం అక్కరలేదు’ అనుకున్నప్పుడే కమిషన్ తన బాధ్యతలను విజయవంతం గా నిర్వహించినట్లు... అంటున్నారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. చైతన్య సమావేశాలు ‘సబల’ గురించి అవగాహన కల్పించడానికి రీజియన్ల వారీగా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రీజియన్‌కు గుంటూరులో, కృష్ణ, గోదావరి జిల్లాలకు ఏలూరులో సమావేశాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలకు కడపలో ఈ నెల 30వ తేదీన, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నంలో ఏప్రిల్ ఆరవ తేదీన జరగనున్నాయి. ‘‘మహిళాచైతన్యం విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుందని భావించాం. కానీ ప్రభుత్వ ఉద్యోగినులకు చాలామందికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలో రిపోర్ట్ చేయవచ్చనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ప్రభుత్వాలు ఆ మేరకు ఉద్యోగినులను డార్క్‌లో ఉంచేశాయని తెలిసినప్పుడు ఆవేదన కూడా కలిగింది. దాంతో ఈ సమావేశాలకు ఉద్యోగినుల తరఫున ప్రతినిధులుగా జిల్లా, మండల స్థాయి ఉమెన్ అసోసియేషన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఉమెన్ లీడర్లు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ‘పోష్ యాక్ట్ (పీఓఎస్‌హెచ్) 2013, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ 2013’ గురించి ఉద్యోగినులను చైతన్యవంతం చేస్తారు’’ అని చెప్పారామె. క్యాంపస్ కాప్స్ కాలేజీలు, యూనివర్సిటీల్లో క్యాంపస్ కాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది సబల. ఈ కాప్స్ తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. వాళ్ల స్థాయిని మించిన అంశం అయితే ఉమెన్ కమిషన్‌కు నేరుగా తెలియచేయడానికి వీలుగా ఇందుకోసమే ఒక మెయిల్ఐడీ ఉంటుంది. అలాగే ప్రతి విద్యాసంస్థలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ జాబితాను తప్పకుండా నోటిస్ బోర్డులో ఉంచాలి. గృహ హింస– గడపదాటని శక్తి రక్షణ కల్పించాల్సిన నాలుగ్గోడలే కత్తులబోనుగా మారితే ఇక ఆ మహిళ ఏం చేయాలి? సమాజంలోని హింసలో 30 శాతం గృహహింస కేసులేనంటే నమ్ముతారా? వరకట్న నిరోధక చట్టం ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. మహిళల భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించిన కనీస అవగాహన కూడా ఆ మహిళలకు లేకుండా జాగ్రత్త పడడం ఎంత అనైతికం? మహిళను చైతన్యవంతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు నైతిక విధి కూడా. ‘నువ్వు అబలవి కాబట్టి మేము ఆసరా ఇస్తాం’ అని చెప్పడం లేదు. ‘నువ్వు సబలవి, నీ శక్తి తెలుసుకో’ అని చెబుతోంది. గృహహింసకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఆ యోధ చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది మహిళాకమిషన్. చర్యలు కఠినంగా ఉండక తప్పదు! పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి, భవిష్యత్తులో దాడులను నియంత్రించడానికి ఏకైక మార్గం... చర్యలు కఠినంగా తీసుకోవడమే. అలాగే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడమూ అవసరమే. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం గురించి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేస్తోంది సబల. అలాగే మహిళకు ఎదురయ్యే వేధింపుల్లో తరాలుగా ఎదురవుతున్న సమస్యలిలా ఉంటే... ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వంచనలు తోడయ్యాయి. ఈ సైబర్ నేరాలు, ప్రలోభాల బారిన పడకుండా మహిళలను రక్షించాలంటే ఆ నేరాల పట్ల అవగాహన కల్పించడమే అసలైన మార్గం. ఈ చట్టాల మీద, భద్రత మీద చైతన్యం కలిగించే పోస్టర్లను పంచాయితీ ఆఫీస్‌లో అతికించడంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్ల సహాయంతో గ్రామీణ మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తోంది ‘సబల’. మహిళలు చేతిలో ఉన్న ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి, సమస్యను తెలియాల్సిన చోటకు చేర్చడానికి సులువుగా వాట్సాప్ నంబర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అండగా నిలుద్దాం! సబల ద్వారా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే మహిళాకమిషన్ ఉద్దేశం. అత్యాచారం, లైంగికవేధింపులు, హింసను ఎదుర్కోవడానికి మహిళకు ఆసరాగా ఉన్న చట్టాలేమిటో తెలియచేస్తోంది. బాధితుల్లో, బాధిత కుటుంబాల్లో ౖధైర్యం నింపే బాధ్యతను తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ వంటి ప్రత్యేక చట్టం గురించి కూడా అవగాహన కల్పిస్తోంది సబల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆమె’కు అండగా నిలబడుతోంది. ‘ఆమె’ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో సమాజంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ‘ఆమె’కు అండగా నిలబడాలి. – వాకా మంజులారెడ్డి బాధితుల పక్షాన... పనిప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బాధను దిగ మింగుకునే వారెందరో!. పైగా ఫిర్యాదిచ్చిన వారినే దోషిగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వైనాలు అనేకం. ’సబల– ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ అభాగినులకు అండగా నిలుస్తుంది. ఐసీసీ కమిటీల ఏర్పాటుతో పాటు సబల వాట్సప్ నెంబర్ ను ఉద్యోగినులకు అందుబాటులోకి తేవడం సముచితం. – జి.నిరీష, జూనియర్ అసిస్టెంట్, గుంటూరు మహిళకు మనోధైర్యం లైంగిక వేధింపులు, అవమానాలతో కుంగిపోతున్న మహిళలకు ’సబల’ కొండంత అండ. మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది. – బి. సుశీల, చైర్ పర్సన్, ఏపీజేఏసీ అమరావతి చైతన్యవారధి ‘సబల – అఅఅ’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ (ట్రిపుల్ ఏ) నినాదాన్ని బలంగా వినిపిస్తున్న సబల ప్రభుత్వానికి మహిళలకు మధ్య చైతన్యవారధి. సంక్షేమంతో పాటు రక్షణ, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోన్న తరుణంలో.. ఇంటర్నల్, లోకల్ కమిటీల ఏర్పాటు ఉద్యమంగా సాగుతోంది. – జి. నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్. (రాష్ట్ర జీఎస్టీ) విజయవాడ మహిళల బలం సబల సదస్సులు అర్ధవంతమైన చర్చలకు అవకాశమిచ్చాయి. లైంగిక వేధింపులు, హింసనే కాకుండా అనేక సమస్యల సత్వర పరిష్కారానికి సబల సదస్సులు దోహదపడతాయి. చట్టాల పై అవగాహన కల్పించడం మంచిదైంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని పోష్ చట్టం సబల వేదికల ద్వారా అందరికీ తెలిసి వస్తోంది. – రాజ్యలక్ష్మి, మెంబర్, ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుంటూరు ‘సబల’ పోటీలు! ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ, దిశ చట్టం గురించి స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పిల్లలకు ఒక విషయాన్ని పదిసార్లు పాఠం చెప్పినట్లు చెప్పడం కంటే ఒక పోటీ ద్వారా వాళ్ల మెదడులో ఆ అంశం ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పోటీలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలకు కూడా. రాబోయే తరాలు కూడా ఇదే విషయం మీద శక్తియుక్తులను ధారపోయకుండా ఈ సమస్య ఈ తరంతో ఆగిపోవాలంటే... అమ్మాయిలను చైతన్యవంతం చేయడంతోపాటు అబ్బాయిలను సెన్సిటైజ్ చేయడం కూడా అవసరం. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళాకమిషన్, ఆంధ్రప్రదేశ్ -
క్రికెటర్ల భార్యలైతే స్వేచ్ఛ ఉండకూడదా?
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అర్థాంగి సాక్షి సింగ్ ధోని వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్ క్యాంపెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనితో పాటే భార్య సాక్షి సింగ్ ధోని, కూతురు జీవా కుడా వచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎస్కే యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక సెషన్లో సాక్షి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''వంద కోట్ల మందిలో 11 మంది మాత్రమే ఆడే జట్టులో ఉన్న క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా క్రికెట్‌ని మతంగా భావించే దేశంలో అభిమానుల ప్రేమను తట్టుకోలేం. ఒక క్రికెటర్‌ను పెళ్లాడితే మా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే భర్తను పెళ్లాడితే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే ఒక ఆటగాడిని పెళ్లి చేసుకుంటే చాలా మార్పులు వస్తాయి. స్వేచ్ఛ ఉండదు. కెమెరాలు వెంటాడుతున్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ దొరకదు. కొందరికి కెమెరాలతో ఇబ్బంది ఉండదు. మరికొందరు చాలా ఇబ్బంది పడతారు. అదీకాకుండా జనాలు, మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు పోస్టు చేయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఎంత క్రికెటర్ల భార్యలమైనా మాకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. బయట మాకు ఎలాగు అవకాశం లేదు.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మా స్వేచ్చను ఉపయోగించుకోవాలనుకుంటాం. కానీ కొందరు దీనిని కూడా దూరం చేస్తున్నారు. ఇలాంటివి పట్టించుకోవడం వల్ల ఒత్తిడి తప్ప ఇంకేమి ఉండదు'' అంటూ తెలిపింది. ఇక గతేడాది ఐపీఎల్లో విజేతగా నిలిచిన సీఎస్కే మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అందరికంటే ముందే ప్రాక్టీస్‌ను ప్రారంభించిన ధోని సేన ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్ కేకేఆర్, సీఎస్కే మధ్య జరగనుంది. చదవండి: WI vs ENG: పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు IPL 2022: వార్న్ అంత్యక్రియలకు వార్నర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్ View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
భారతీయ మహిళలది విశిష్ట స్థానం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన చాంబర్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయని వెల్లడించారు. -
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
ఉమెన్స్ డే రోజున పురుషులకు థ్యాంక్స్ చెప్పిన స్వీటీ
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. చివరిగా నిశబ్దం మూవీతో పలకిరించిన స్వీటీ.. ఆ తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియలో అయిన ఫ్యాన్స్ పలకరిస్తుంది అనుకుంటే ఏదైన స్పెషల్ డే రోజునే దర్శనం ఇస్తుంది. పండగలు, కొద్ది మంది సెలబ్రెటీల బర్త్‌డేలకు మాత్రమే స్వీటీ నెట్టింట కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాకు వచ్చింది. నిన్న(మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా స్వీటీ ఆసక్తికరంగా పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్‌లో.. ‘అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతీ ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చదవండి: రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా? ప్రొఫెషనల్, ఫిజికల్, మెంటల్, సోల్ ఫుల్లీ అందరూ బెస్ట్ ఉండేందుకు ప్రయత్నించాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతీక్షణాన్ని అనుభవించాలి. రోజురోజుకూ ఎదుగుతూ ఉండాలి. తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, ఫ్రెండ్‌గా, భర్తగా ఇలా ఎన్నో రకాలుగా ప్రేమను పంచుతూ, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం, ప్రేమను పంచడం వంటివి చేస్తోన్న మగాళ్లందరికీ థ్యాంక్స్’ అని అనుష్క చెప్పుకొచ్చింది. ఇక స్వీటీ చాలా గ్యాప్ తర్వాత వరస ప్రాజెక్ట్స్ ఒకే అంటుంది. ఇప్పటికే ఆమె యూవీ క్రియేషన్స్‌లో రెండు, మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
మహిళలకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుతారు: జీవితా రాజశేఖర్
-
సాధికార యజ్ఞం
-
విదేశీ యువతిపై అత్యాచారయత్నం
సైదాపురం/గూడూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లిథువేనియా దేశానికి చెందిన ఓ యువతి (26) భా రత దేశం పర్యటనకు వచ్చింది. సోమవారం శ్రీలం క నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. గో వా వెళ్లేందుకు చెన్నై నుంచి బెంగళూరుకు బస్సులో బయల్దేరింది. ఆమె వద్ద ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను బస్సు నుంచి దించేశా డు. అదే బస్సులోనే ఉన్న నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళెం గ్రామానికి చెందిన ఇంగిలాల రమణయ్య కుమారుడు సాయికుమార్ ఆమెకు తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చాడు. ఆమెను పరిచయం చేసుకున్నాడు. సందర్శనీయ స్థలాలు చూపిస్తానని నమ్మించి తన స్వగ్రామం బద్దెవోలు వెంకన్నపాళెంకు తీసుకొచ్చాడు. గూడూరు రూరల్ పరిధిలోని ఎల్ఏపీ స్కూల్ ప్రాంతంలోని శారదానగర్‌కు చెందిన తన స్నేహితుడు షేక్ అబిద్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పథకం రూపొందించాడు. మంగళవారం ఆమెకు కృష్ణపట్నం పోర్టు చూపుతామని చెప్పి, అబీద్‌తో కలిసి మోటార్ బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయాలనుకున్నారు. ఆ ప్రాంతం అనుమానాస్పదంగా ఉండడంతో వారి నుంచి తప్పించుకుని ఆ యువతి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా భయంతో నిలబడ్డ ఆ యువతిని చూసి స్థానికులు సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఈలోగా యువకులిద్దరూ పరారయ్యారు. జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాలతో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులరెడ్డి, సైదాపురం, గూడూరు రూరల్, మనుబోలు ఎస్సైలు టీంలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్టు చేశారు. -
హోప్ ఆధ్వర్యంలో ‘అచీవర్స్’ అవార్డులు
మాదాపూర్: మాదాపూర్‌లోని శిల్పారామంలో హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి, సీతారెడ్డిలు హజరయ్యారు. కోవిడ్ సమయంలో అత్యుత్తమ సేవ చేసినందుకు డాక్టర్ మనీష్ రాందాస్, సంస్కృతంలో డాక్టరేట్ చేసినందుకు డాక్టర్ మృదుల అశ్విన్, మొదటి సారే సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయినందుకు కుమారి మేఘనలకు అఛీవర్స్ అవార్డులను అందజేశారు. -
వనితా వందనం
సాక్షి, నెట్వర్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో స్థానిక మండల ప్రజా పరిషత్, ఉప్పల చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదని వక్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో ఆయా రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సన్మానించారు. దేవరకొండలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ ప్రధాన స్టేడియంలో జరిగిన వేడుకల్లో పలువురు మహిళలను స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, కార్మికులను సన్మానించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంగన్వాడీ కార్యకర్తల నృత్యాలు అలరించాయి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మహిళా పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారు. సిరిసిల్లలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుతూ సాగిన కార్యక్రమంలో 2 వేల మంది మహిళలు ఓ మహిళా చిత్రం రూపంలో నిలబడగా అద్భుత దృశ్యం ఆవిష్క్రతమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో నృత్యం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా పడకల్లో అమ్మ పాదపూజకు హాజరైన మహిళలు హైదరాబాద్‌లోని విద్య కమిషనరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా టీచర్లు నిర్మల్‌లోని కార్యక్రమంలో కూర్చున్న మహిళలు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, సురేఖ దంపతులు నిర్మల్‌లో అవమానం... నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులకు అవమానం జరిగింది. వేడుకలు జరుగుతున్న సమావేశ మందిరంలో మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లకు కనీసం కుర్చీలు వేయలేదు. పైగా వేదికపై మొత్తం పురుషులే కూర్చున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు, సిబ్బందిలో కొందరు నిల్చోగా.. మరికొందరు నేలపై కూర్చున్నారు. గర్భిణుల కోసం త్వరలో కొత్త పథకం గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ తరహాలో గర్భీణీ స్త్రీల కోసం త్వరలో ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఆర్.లక్ష్మీరెడ్డి, ఐపీఎస్ అధికారి సుమతి, ‘సాక్షి’సీనియర్ జర్నలిస్టు సరస్వతి రమ, జానపద గాయని కనకవ్వలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న 40 మంది మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. నా బలం సురేఖనే: చిరంజీవి బంజారాహిల్స్: ‘నేను సినిమాలపై పూర్తి దృష్టిపెడితే ఆమె అన్నీ చూసుకునేది. నేను ఇంతవాన్ని కావడానికి కారణం, నా బలం ఆమే’ అని భార్య సురేఖను మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన మహిళా కార్మికులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధైర్యంగా ఫిర్యాదు చేయాలి.. సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రతా విభాగం తమ రీడిజైన్డ్ వెబ్సైట్ అత్యా«ధునిక హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం వెబ్‌సైట్‌ను మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి ఆవిష్కరించారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదుచేయాలని.. తమ వెబ్సైట్ https:// womensafetywing. telangana. gov. in సంప్రదించగలరని సూచించారు. 317 జీవోపై మహిళా టీచర్ల ఆందోళన.. మహిళాదినోత్సవం రోజున మహిళాటీచర్లు పాఠశాల విద్య కమిషనరేట్ ఎదుట గంటల తరబడి బైఠాయించారు. 13 జిల్లాలకు చెందిన మహిళాటీచర్లు, వారి భర్తలు, పిల్లలుసహా తరలి వచ్చి మంగళవారం ఆందోళనకు పూనుకున్నారు. 317 జీవో కారణంగా తాము పడుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు విన్నవించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు : కవిత మహిళా దినోత్సవాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఆడబిడ్డలందరికీ ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. తన నివాసంలో మంగళవారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి కవిత కేక్ కట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కేక్ కట్ చేస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ జి.రాధాదేవి, జస్టిస్ పి.మాధవీ దేవి తదితరులు.