అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీల ఆర్థికపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికర సర్వేలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా దేశంలోని మహిళా ఉద్యోగుల్లో అత్యధికులు ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలని భావిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆన్‌లైన్ మార్కెటీర్ ఇండియాలెండ్స్ చేపట్టిన ఈ సర్వేలో స్పష్టమైంది.
దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోగల 24-55 ఏళ్లకు చెందిన 10వేలకుపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. వీరిలో ఏకంగా 76 శాతం మంది తమకు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉన్నట్టు చెప్పడం విశేషం. ఇక 86 శాతం మంది బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, సేవింగ్, ఇతర ఆర్థిక అంశాలపై నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరిచినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై డేటాను అందించే ఆన్‌లైన్ వేదిక ఇండియాలెండ్స్ తెలిపింది.
పెరుగుతున్న రుణాలు..
గత ఏడాది మహిళలు తీసుకున్న రుణాల్లో 19 శాతం వృద్ధి కనిపించింది. 2023లో రూ.30.95 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. 2022లో రూ.26 లక్షల కోట్లేనని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ఇక అంతకుముందుతో పోల్చితే గతేడాది వ్యక్తిగత రుణాలు 26 శాతం పెరిగి రూ.12.76 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు..
ప్రధాన స్థానాల్లో..
తాము ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సంస్థల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 3,138 కంపెనీలకు బీఏఏ, ఆపై రేటింగ్‌నే ఇచ్చామని, వీటి బోర్డుల్లో సగటున 29 శాతం మహిళలే ఉన్నారని చెప్పింది. ఇదిలావుంటే ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం కంపెనీలకే మహిళలు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఫార్చూన్ ఇండియా నెక్స్ 500 కంపెనీల్లో మహిళల సారథ్యంలో పనిచేస్తున్నవి 5 శాతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment