enterprenuers
-
నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..
ఓ టెక్కీ ఫ్యాషన్ రంగంలోకి అడుపెట్టి అద్భుతమైన డిజైన్లను క్రియేట్ చేసి ఫ్యాషన్‌కే సరికొత్త అర్థం ఇచ్చాడు. మహామహా ఫ్యాషన్ డిజైనర్లకు పోటీ ఇచ్చేలా లెహాంగాలు తీర్చిదిద్ది ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఏడాదికి రూ 5 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతూ స్టైలిష్ రంగంలో తనదైన ముద్ర వేశాడు. ఎవరతను..? ఎలా ఈ రంగంలోకి వచ్చారు. మనీష్ మల్హోత్రా, అనామిక ఖన్నా, నాన్సి త్యాగి వంటి ప్రముఖ డిజైనర్లు భారతీయ ఫ్యాషన్‌ని తమదైన శైలిలో పునర్నిర్వచించారు. ఆ కోవలోకి సూరత్‌కి చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మయూర్ భరత్‌భాయ్(Mayur Bharatbhai) కూడా చేరిపోయాడు. ఆయన మహిళల కోసం తయారు చేసే ప్రసిద్ధ పెళ్లి లెహంగాల(Lehenga Business) బీఎల్ ఫ్యాబ్రిక్ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ మూడు రకాల ఎంబ్రాయిడరీ లెహంగాలను తయారు చేస్తుంది. థ్రెడ్‌వర్క్, జరీ వర్క్, సీక్విన్ వర్క్‌లతో రూపొందిస్తుంది. ఈ కంపెనీకి చెందిన సెమీ-స్టిచ్డ్ లెహంగాలు చాలా సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయి. ఈస్టార్టప్ వెంచర్ తన ఉత్పత్తులను సాంప్రదాయ మార్కెట్ల కంటే దాదాపు 65% నుంచి 70% వరకు తక్కువ ధరకే విక్రయిస్తుంది. అంతేగాదు వినియోగదారులు తమకు నచ్చిన రీతిలో లెహంగాలను డిజైన్ చేయించుకునే వెసులబాటు కూడా అందిస్తోది. అందుకోసం ఈ కంపెనీలో దాదాపు 25 మంది అంతర్గత కళాకారుల బృందం ఉంటారు. ప్రస్తుతం ఈ ఎల్బీ ఫ్యాబ్రిక్ వద్ద దాదాపు 200 డిజైన్ల అద్భుతమైన కలెక్షన్లు ఉన్నాయి ప్రారంభమైంది..మయూర్ తన దుస్తుల వ్యాపారాన్ని 2021లోనే ప్రారంభించారు. అంతకుముందు తన సోదరుడి దుస్తుల వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేశారు. ఆయన సృజనాత్మకతతో కూడిన పనికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ ఆసక్తే ఆయన్ను సాఫ్ట్వేర్ రంగం నుంచి ఫ్యాషన్వైపు అడుగులు వేసేలా చేసింది. గతేడాది సెప్టెంబర్ నాటికి బీఎల్ ఫ్యాబ్రిక్ 10 శాతం నికర లాభల మార్జిన్‌తో సుమారు రూ. 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే ఈ కంపెనీ 2025 నాటికి రూ. 18 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంతేగాదు సోనీ టెలివిజన్ సీరీస్ షార్క్‌ట్యాంక్ ఇండియా 4(Shark Tank India 4)సీజన్లో న్యాయూమర్తులుగా వ్యవహరించే కునాల్ బహల్, రితేష్ అగర్వాల్ నుంచి కూడా 5% ఈక్విటీకి ఒక కోటి రూపాయల ఉమ్మడి షరతులతో కూడిన ఆఫర్‌ని అందుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అంతేగాదు ఈ షో కోసం తానే స్వయంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు మయూర్. కుర్తా డిజైన్ కోసం నల్లటి ఫాక్స్ జార్జెట్ ఫాబ్రిక్ను ఎంచుకున్నారు. నీలం, గులాబీ, ఆకుపచ్చ , తెలుపు రంగుల బహుళ వర్ణ షేడ్స్‌లో సంక్లిష్టమైన ప్రకృతి-ప్రేరేపిత అలంకరణతో పరిపూర్ణ వైవిధ్యాన్ని అందించారు. ఒక ఇంజనీర్ ఫ్యాషన్ పరిశ్రమలో తన క్రియేషన్స్‌తో అద్భుతాలు సృష్టించి, ఆధాయాలు ఆర్జించడం విశేషం. View this post on Instagram A post shared by 🅑🅛 🅕🅐🅑🅡🅘🅒 (@blfabric) (చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!) -
స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలు
స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తల జాబితాను ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీ వివరాలను తెలియజేశాయి. అందులో దేశవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలుగా పేరున్న డీమార్ట్, జొమాటో, స్విగ్గీ, మేక్ మై ట్రిప్, మ్యాక్స్ హెల్త్‌కేర్, డ్రీమ్11..వంటి సంస్థలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్విగ్గీర్యాంకు: 3వ్యవస్థాపకులు: నందన్‌రెడ్డి, శ్రీహార్ష మాజేటి కంపెనీ విలువ: రూ.1,01,300 కోట్లు. ఈ సంస్థను 2013లో ఏర్పాటు చేశారు.దెక్కన్ ఫైన్ కెమికల్స్ర్యాంకు: 25వ్యవస్థాపకులు: వంశీ గోకరాజు, జీఎస్ రాజు.కంపెనీ విలువ: రూ.31,600 కోట్లుఈ సంస్థను 2006లో స్థాపించారు.ఎంఎస్ఎన్ లేబోరేటరీస్ర్యాంకు: 31వ్యవస్థాపకులు: సత్యనారాయణ రెడ్డికంపెనీ విలువ: రూ.26,200 కోట్లుఈ సంస్థను 2003లో స్థాపించారు.లారస్ ల్యాబ్స్ర్యాంకు: 34వ్యవస్థాపకులు: సత్యనారాయణ చావకంపెనీ విలువ: రూ.24,900 కోట్లుఈ సంస్థను 2005లో స్థాపించారు.కిమ్స్ర్యాంకు: 40వ్యవస్థాపకులు: భాస్కర్రావుకంపెనీ విలువ: రూ.21,900 కోట్లుఈ సంస్థను 2000లో స్థాపించారు.ర్యాపిడోర్యాంకు: 98వ్యవస్థాపకులు: అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లికంపెనీ విలువ: రూ.9,200 కోట్లుఈ సంస్థను 2015లో స్థాపించారు.ఇదీ చదవండి: ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!మెడ్ప్లస్ర్యాంకు: 119వ్యవస్థాపకులు: మధుకర్ గంగిడికంపెనీ విలువ: రూ.8,200 కోట్లుఈ సంస్థను 2006లో స్థాపించారు.బొండాడ ఇంజినీరింగ్ర్యాంకు: 142వ్యవస్థాపకులు: రాఘవేంద్ర రావుకంపెనీ విలువ: రూ.6,400 కోట్లుఈ సంస్థను 2012లో స్థాపించారు.జాగిల్ ప్రీపెయిడ్ర్యాంకు: 160వ్యవస్థాపకులు: రాజ్ఫణికంపెనీ విలువ: రూ.5,300 కోట్లుఈ సంస్థను 2011లో స్థాపించారు.టీమ్‌లీజ్ సర్వీసెస్ర్యాంకు: 162వ్యవస్థాపకులు: అశోక్ రెడ్డికంపెనీ విలువ: రూ.5,200 కోట్లుఈ సంస్థను 2000లో స్థాపించారు. -
టీన్ప్రెన్యూర్స్: తల్లిదండ్రుల సంరక్షణలో పెరగకపోయినా..!
‘ఆర్ఎమ్పి ఫ్లవర్స్’ అధినేత 14 ఏళ్ల పూజిత. ఆర్డీవై ఫ్రేమర్స్ యజమాని యశస్వి. ఎకో ఫ్రెండ్లీ షాంపూ తయారీతో ఎంటర్ప్రెన్యూర్ కావాలనే ఆలోచనలో ఉన్నాడు మహబూబ్. వీళ్లందరూ స్కూల్ విద్యార్థులే. వీళ్లలో ఎవరూ సంపన్నులు కాదు. పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచనే వారి మూలధనం. మరో విషయం... వీళ్లెవరూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతున్న పిల్లలు కాదు. హైదరాబాద్‌లోని టచ్ ఫౌండేషన్ ఆర్ఫనేజ్‌లో పెరుగుతున్న అనాథ పిల్లలు.పూజిత తొమ్మిదవ తరగతి. ఆమె తల్లిని, ఒక చెల్లిని తండ్రి పాశవికంగా హతమార్చాడు. ఆ సంఘటనతో పూజిత చెల్లితోపాటు టచ్ ఫౌండేషన్‌కు వచ్చింది. ఆర్ఫనేజ్‌కు వచ్చిన తర్వాత కూడా మిగిలిన పిల్లలతో కలవకుండా విచారంగా, కోపంగా ఉండేది. ఒంటరిగా గడిపేదని తెలియచేశారు నిర్వహకులు విజయ్‌కుమార్. అలాంటి పూజిత ఈ రోజు ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కాళ్ల మీద నేను నిలబడగలననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని చెబుతోంది. ఆశ్రమం ఆవరణలో ఉన్న పూలు, ఆకులతో బొకేలు చేసి అమ్మవచ్చని స్నేహితులకు చెప్పి వారిని ప్రోత్సహించింది పూజిత. అలా ఓ చిన్నపాటి వ్యాపారవేత్తగా మారింది. ఇక యశస్వి విషయానికి వస్తే... ‘హైదరాబాద్‌లో జరిగిన 2024 స్టార్టప్ ఫెస్టివల్లో ఐదు ఫొటోఫ్రేములు అమ్మగలిగాను. ఈ నంబర్ చిన్నదే కావచ్చు. ఈ ఈవెంట్లో పాల్గొనడం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం చాలా పెద్దది. నా ఉత్పత్తుల గురించి కస్టమర్‌కి ప్రెజెంటేషన్ ఇవ్వడం ద్వారా నేర్చుకున్న మెళకువలను అమలు చేయడం తెలుసుకున్నాను’ అంటోంది.ఆమె తల్లిదండ్రులను కోవిడ్ పొట్టన పెట్టుకుంది. బంధువులు యశస్విని, ఆమె సోదరుడిని ఆర్ఫనేజ్‌కు తీసుకువచ్చారు. రీ యూజ్డ్ మెటీరియల్‌తో ఫొటోఫ్రేములను చేస్తోంది యశస్వి. స్నేహితులతో కలిసి పేపర్, కార్డ్బోర్డ్, రాళ్లు వంటి తమకు అందుబాటులో ఉన్న వస్తువులకు తమ క్రియేటివిటీ జోడించి ఫొటోఫ్రేములను తయారుచేస్తోంది. మహమ్మద్ మహబూబ్ పదవ తరగతి విద్యార్థి. అతడు తామున్న హోమ్ ఆవరణలో ఉన్న కుంకుడు కాయలతో ఎకోఫ్రెండ్లీ షాంపూ తయారు చేసి సమీపంలో ఉన్న దుకాణాలకు సప్లయ్ చేయాలనుకుంటున్నాడు. పిల్లల్లో వ్యాపారవేత్త కావాలనే ఆలోచనను ప్రోత్సహించడానికి ‘యంగ్ టింకర్ ఫౌండేషన్’ ఒక్కో స్టూడెంట్‌కి వెయ్యి రూపాయలిస్తోంది. ఆ డబ్బుతో ఏం చేయాలి, ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి తిరిగి మరింత డబ్బు సంపాదించడం ఎలా? ఇందుకోసం వారి బుర్రల్లో ఎలాంటి ఆలోచనలు ఆవిష్కరిస్తాయనే అంశాలను పిల్లలకే వదిలేస్తారు. ఈ ప్రయత్నంలోనే పూజితకు ఫ్లవర్ బొకే ఆలోచన వచ్చింది. యశస్వికి ఫొటో ఫ్రేములు చేయాలనిపించింది. మహబూబ్ షాంపూ తయారు చేయాలనుకున్నాడు. పిల్లలకు అవకాశం ఇస్తే వారి మెదళ్లు ఎంత చురుగ్గా ఆలోచిస్తాయో తెలియచేసే గొప్ప నిదర్శనం ఇది. (చదవండి: కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..) -
కళనే లాభదాయకమైన వృత్తిగా మలిచింది! హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీకే..
గోవా కళాప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహిళ శారదా కేర్కర్. ఆమె యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసింది. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్పెషలైజేషన్ చేసింది. ఇండియాకి వచ్చి గోవాలో మ్యూజియం ఆఫ్ గోవా (ఎంఓజీ)కి చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. చిల్డ్రన్ ఆర్ట్ స్టూడియో స్థాపించి పిల్లలకు కళారంగం కోసం కొంత సమయాన్ని కేటాయించే అవకాశం కల్పించింది. కళారంగంలో ఉపాధి పొందడానికి అవసరమైన భరోసా కల్పిస్తూ కళాసాధనను లాభదాయకమైన వృత్తిగా మార్చింది.గోవా రాష్ట్రాన్ని కళలు, కళారంగం, వాటికి మార్కెట్ కల్పిస్తూ సామాజిక వ్యవస్థాపనల దిశగా నడిపిస్తోంది శారదాకేర్కర్. సాహిత్యం, రంగస్థలం, విజువల్ ఆర్ట్స్, సంగీతం, నాట్యరీతులను సుసంపన్నం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలనిస్తోంది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులను ఒక్కో విభాగాన్ని ఒక్కో కేటగిరీగా వర్గీకరించి వారి కళారూపాల ప్రదర్శనలను నిర్వహిస్తోందామె. అలాగే సాంకేతికత సహకారంతో సృజనాత్మక రంగంలో ఎన్ని ప్రయోగాలు చేయవచ్చనేది ఆచరణలో చూపిస్తోంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, యానిమేషన్, గేమింగ్, ఆర్ట్ డైరెక్షన్, సౌండ్ ఇంజనీరింగ్ వంటి సృజనాత్మకమైన ఉపాధి రంగాలను కళల విభాగంలోకి తీసుకువస్తూ కళారంగాన్ని విస్తరిస్తోంది శారద కేర్కర్. గడచిన తొమ్మిదేళ్లలో 600 మంది హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో ఎమ్ఓజీ నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు. దివ్యాంగులైన కళాకారుల చిత్రాలతో ‘ఆర్ట్ ఇంక్’, పిల్లల చిత్రాలతో ‘ఏ వరల్డ్ ఆఫ్ మై ఓన్’, మహిళా చిత్రకారులతో ‘అన్ ఎర్త్డ్’ చిత్రకళా ప్రదర్శనలను నిర్వహించింది శారద. ఎమ్ఓజీని రోజుకు 200 మంది సందర్శిస్తారు.సంస్కృతి ప్రతిబింబాలుమ్యూజియం ఆఫ్ గోవా కోసం శారద పాతికమంది గోవా ఆర్టిస్టులు చిత్రించిన గోవా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను సేకరించింది వీటిని ఎమ్ఓజీ నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌లోనూ ప్రదర్శిస్తారు. ప్రస్తుతం ‘హోమోలూడెన్స్: ద ఆర్ట్ ఆఫ్ ప్లే’ ప్రదర్శన జరుగుతోంది. అందులో గోవా ఆర్టిస్టులతోపాటు అనేక రాష్ట్రాలు, నెదర్లాండ్ దేశం నుంచి కూడా ఆర్టిస్టులు మొత్తం వంద మంది చిత్రకారుల కళారూపాలున్నాయి. బీచ్ కంటే మ్యూజియం సందర్శనలోనే ఎక్కువ ఎంజాయ్ చేశాం అని ఫీడ్‌బ్యాక్ బుక్‌లో రాస్తున్నారు. ఏడాదికి పదివేల మంది స్టూడెంట్స్ సందర్శిస్తున్నారు. వాళ్లు సమకాలీన కళలతోపాటు గోవా చరిత్రను తెలుసుకుంటున్నారు.కళాకృతులకు మార్కెట్ వేదికగడచిన ఎనిమిదేళ్లుగా ప్రతి ఆదివారం ఎంఓజీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వివిధ రంగాలకు చెందిన నాలుగు వందల మంది నిపుణులు హాజరై ప్రసంగించారు. ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్, మేనేజ్మెంట్, బిజినెస్, ఎన్విరాన్మెంట్, పాలసీ మేకింగ్, యాక్టివిజమ్ అంశాల్లో కళాకారులకు సమగ్రమైన అవగాహన కల్పించారు. ‘ఆమి గోవా’ నాన్‌ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజ్ ద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు తయారు చేసే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులను విక్రయించడానికి ఒక వేదిక ఏర్పాటు చేసింది శారద. ఇందులో మహిళల స్వావలంబన సాధికారత, గోవా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ అనే రెండు రకాల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. శారద కేర్కర్ చొరవతో గోవా హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ కొత్త రూపు సంతరించుకుంటోంది. (చదవండి: కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..) -
'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్‌తో ఏడాదికి ఏకంగా..!
బెంగళూరులో మేఘనా జైన్ కూడా ఈ దీపావళికి ఒక కళ. ఆమె నడుపుతున్న ‘డ్రీమ్ ఎ డజన్ ’ నుండి ప్రత్యేక ఆర్డర్లపై వెళ్లే గిఫ్టు హ్యాంపర్లు అక్కడి కార్పోరేట్ ఆఫీస్‌లను మతాబుల్ని మించిన తియ్యటి వెలుగులతో కాంతిపుంజాల్లా మార్చేస్తుంటాయి. 6 రకాల కప్‌కేక్‌లు, 12 రకాల కేక్ వెరైటీలు, వేర్వేరు రుచుల్లోని కేక్కప్స్, చీజ్ కేక్స్‌ను అందమైన హ్యాంపర్లో చుట్టి డెలివరీ చేస్తుంటుంది ‘డ్రీమ్ ఎ డజన్ ’. ఆ స్వీట్ స్టార్టప్ యువ అధిపతే మేఘన! ఒక్క దీపావళికి మాత్రమే కాదు, అన్ని సందర్భాలకు, అన్ని సీజన్లలో ఇక్కడి కప్కేక్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఇంత చిన్న వయసులో మేఘన ఏడాదికి కోటి రూపాయల బిజినెస్ చేస్తుందంటే ఇక చూడండి!మేఘన రాజస్థానీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వీట్లంటే ఇష్టమే కానీ, స్వీట్స్ బిజినెస్ చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేని 18 ఏళ్ల వయసులో ఓ రోజు తమ పొరుగున ఉన్న వాళ్లు సమ్మర్ బేకింగ్ క్లాసులు పెడితే వెళ్లింది మేఘన. కేక్‌ను బేక్ చేయటం నేర్చుకుంది. తర్వాత్తర్వాత తను బేక్ చేసిన కేక్‌లను ఇంట్లో, బయట, కాలేజ్‌లో అంతా మెచ్చుకోవటం ఆమెకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు, తిరుచ్చిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ‘బిజినెస్ ఐడియా’ల పోటీ పెడితే మేఘన చెప్పిన కప్‌కేక్‌ల ఐడియాకు మూడో ప్రైజ్ లభించింది! వెంటనే ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ వాళ్లొచ్చి ‘‘అమ్మాయ్.. మేము ఇన్వెస్ట్ చేస్తాం. నువ్వు కేక్‌ల బిజినెస్‌కి సిద్ధమేనా? అని అడిగారు! మేఘన డైలమాలో పడిపోయింది. చదువా? బిజినెస్సా? కొంత ఆలోచన తర్వాత చదువు వైపే మొగ్గు చూపింది. డిగ్రీ అయ్యాక మేఘన బెంగళూరులోని ‘ఇన్నర్ చెఫ్’లో డెజర్ట్ విభాగంలో చేరింది. ఫుడ్ టెక్నాలజీ కంపెనీ అది. తర్వాత ‘కేక్వాలా’లో ట్రై నింగ్ తీసుకుంది. తర్వాత ‘స్టార్‌బక్స్’లో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. అది రాలేదు. అప్పుడే సొంత బిజినెస్ గురించి ఆలోచించింది. అప్పటికే మేఘన కప్‌కేక్‌ల తయారీ తోపాటు, హ్యాంపర్ డిజైనింగ్‌లో మంచి నైపుణ్యం సంపాదించింది. అయితే 2018లో ‘డ్రీమ్ ఎ డజన్‌ను ప్రారంభించబోతుండగా ‘ఉద్యోగం ఇస్తాం రమ్మని’ స్టార్‌బక్స్ నుంచి పిలుపు! ఈసారి డైలమాలో పడలేదు మేఘన. స్టార్ బక్స్‌ను వద్దనుకుంది. కొద్ది పెట్టుబడితో కేక్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. కరోనా సమయంలో కాస్త ఒడిదుడుకులకు లోనైనా తన ‘డ్రీమ్’ను నిలబెట్టుకుంది.మేఘన దగ్గర ప్రస్తుతం 20 మంది ముఖ్య విభాగాలలో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. అలాగే హ్యాంపర్స్తోపాటు ఇచ్చే పెయింటెడ్ మాస్క్‌లు, ప్రమిదలు, కొవ్వొత్తుల తయారీని స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలకు అప్పగిస్తోంది మేఘన. ఆ విధంగా వారికి కూడా ఆర్థికంగా చేదోడుగా ఉంటోంది. చేతిలో నైపుణ్యం ఉండి, బిజినెస్ చేయాలన్న తపన ఉన్న యువతరానికి మేఘన కచ్చితంగా ఒక రోల్ మోడల్. (చదవండి: -
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!
ఓ మహిళ ఇద్దరు పిల్లలు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ గొప్ప మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగడం అంత ఈజీ కాదు. ఓపక్క అమ్మగా పిల్లలకు అన్ని ఇవ్వలేకపోతున్న ఆవేదనను తట్టుకుంటూ.. పురషాధిక్య పారిశ్రామిక ప్రపంచంలో నెగ్గుకొచ్చి.. తానెంటో చూపించింది. పైగా అందరిచేత ప్రశంసలందుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..భారతీయ కాస్మెటిక్ రూపరేఖలను మార్చిన వినీత సింగ్ ప్రస్థానం చాలా సవాళ్లుతో కూడుకున్నది. మగవాళ్లు ఆధిపత్యం ఉండే రంగంలో రాణించి అందరికీ స్ఫూర్తిగా నిచింది. అదికూడా ఇద్దరు పిల్లల తల్లిలా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ సౌందర్య సాధనాల సీఈవో స్థాయికి చేరుకుంది. 2021వ సంవత్సంరో బ్యూటీ మార్కెట్లో తన షుగర్ కాస్మోటిక్స్ కంపెనీతో సంచలనం సృష్టించింది. 2015లో వినీత తన భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి ఈ షుగర్ కాస్మటిక్స్‌ని ప్రారంభించిది. అప్పుడే మహిళపట్ల ప్రజల్లో వేనూళ్లుపోయిన భావాలను ఎదుర్కొంది. ఆమె తన షుగర్ బ్రాండ్స్‌తో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా దూసుకుపోవడమే గాక డిజిటల్ యుగం ఫ్లాట్‌ఫాంని క్యాష్ చేసుకుంది. భారతీయ యువుతులు తమ బ్రాండ్‌కి మారేలా చేయడంలో విజయం సాధించింది వినీత. అయితే వినిత గొప్ప మహిళా పారింశ్రామిక వేత్తగా మారడం అంత జీగా జరగలేదు. తన కంపెనీ ప్రారంభదశలో వెంచర్‌ని కాపాడుకునేలా ఇన్వెస్టర్లని తీసుకోవడం అత్యంత సవాలుగా మారింది. ఎందుకంటే వారందరీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట..కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీకెందుకు ఇంత పెద్ద పనులు అనే విమర్శలు, ఉచిత సలహాలకు కొదువలేదు అన్నట్లుగా వచ్చాయి. అయినా సరే ఆమె వెనక్కి తగ్గకుండా తన వ్యాపారాన్ని మంచిగా నిర్మించడంపైన దృష్టి పెట్టింది. 17 ఏళ్ల వయసులో తన ప్రొఫెసర్ వ్యవస్థాపకత కోసం నాటిన బీజాలు ఆమె నరనరాల్లో నిక్షిప్తమయ్యాయి. అదే ఆమెను వెనడుగు వేయనివ్వలేదు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించడంపై ఫోకస్ అయ్యేలా చేసింది. లక్షల వేతనం లభించే బ్యాంక్ జాబ్‌ని వదిలి మరీ..స్వంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్సాటు చేయాలని ప్రగాఢంగా నిశ్చయించుకుంది వినీత. ఆ దృఢ నిశ్చరయం ఆమెను షుగర్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు సంబంధించిన సీవోవో స్థాయికి చేరుకునేలా చేసింది. అయితే తనని ఎప్పుడూ అమ్మ అపరాధం వెంటాడుతూ ఉండేదని అన్నారు. అలాగే ఈ కంపెనీ ప్రారంభ రోజుల్లో తన పెద్ద కొడుకు పుట్టడంతో పెద్ద కొడుకు పాలు ఇవ్వడం, పని చేయడం, ఆఫీసు కాల్‌లను నిర్వహించడం చాలా కష్టంగా ఉండేదని అన్నారు. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో 'అమ్మ అపరాధాన్ని' ఎదుర్కొన్నానని వివరించారు వినిత. అలాగే తన చిన్న కొడుకు ఆరవనెల కడుపున ఉన్నప్పుడూ మారథాన్‌లో పరిగెత్తానని అన్నారు. అంతేగాదు ఆమె తరుచుగా ఆఫీస్ ఫైల్స్, మరో చేత్తో తన బిడ్డను లాలించేది. చెప్పాలంటే ఏకకాలంలో అన్ని పనులు నిర్వహించేదాన్ననని, అందువల్లో అమ్మగా వాళ్లకు అన్ని సమకూరుస్తున్నానా లేదా అనే భావం కలుగుతుండేదని అన్నారు వినీత. చివరిగా వినీత 'అమ్మ అపరాధం' చాలా విలువైనదని, దాన్ని నిర్వర్తించడం అంత ఈజీ కాదని చెప్పారు. ఏదీఏమైన ఓ తల్లిగా ఇద్దరూ పిలల్లను సాకుతూ..విజయవంతమైన పారిశ్రామికవేత్త ఎదగడం అనేది మాములు విషయం కాదు..!(చదవండి: కన్నూర్ జైలు బిర్యానీ: ఖైదీలే స్వయంగా వండుతారట..!) -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
Anushka Sen: బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా..
అనుష్కా సేన్.. టీవీ.. సినిమా.. ఓటీటీ స్క్రీన్స్‌కి న్యూ ఫేస్ కాదు.. గ్లామర్ ఫీల్డ్కి న్యూ నేమ్ కాదు. ఆ ఫేమ్ కూడా ఆమెకు కొత్త కాదు. బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చిన్న వయసులోనే ఎంతో ఘనతను సాధించేసింది.అనుష్కా పుట్టింది రాంచీ (జార్ఖండ్)లో. పెరిగింది ముంబైలో. నాన్న.. అనిర్వాణ్ సేన్, బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. అమ్మ.. రాజ్రూపా సేన్, గృహిణి. కూతురి ఉన్నతి వెనుకున్నది ఆ ఇద్దరే! అనుష్కా ప్రస్తుతం.. సినిమాటోగ్రఫీలో డిగ్రీ చదువుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా జీటీవీ ‘యహా మై ఘర్ ఘర్ ఖేలీ’ అనే సీరియల్‌తో పరిచయం అయింది. ‘దేవోంకా దేవ్ మహాదేవ్’లో బాల పార్వతి, ‘బాల్ వీర్’లో మెహెర్ పాత్రతో పాపులర్ అయింది. తర్వాత క్రికెటర్ ధోనీతో కలసి చేసిన ఒక కమర్షియల్ యాడ్‌తో మరింత ఫేమస్ అయింది. అంతేకాదు ఆ యాడ్‌తో ధోనీకి ఆమెకూ మధ్య చిక్కీ అండ్ చాచూ (చిక్కీ అండ్ బాబాయ్)గా అనుబంధమూ బలపడింది.చైల్డ్ ఆర్టిస్ట్‌గానే అనుష్కా ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చదువు మీద శ్రద్ధ పెట్టింది. 2018లో ‘ఇంటర్నెట్ వాలా లవ్’తో మళ్లీ బుల్లితెర మీద కనిపించసాగింది. యంగ్ ఆర్టిస్ట్‌గా అనుష్కాకు కీర్తి సంపాదించిపెట్టిన సీరియల్ ‘ఝాన్సీ కీ రాణీ’. అందులో ఆమెది టైటిల్ రోల్! ‘లిహాఫ్ .. ద క్విల్ట్’ అనే సినిమాలో అనుష్కా సేన్ యుక్తవయసు ఇస్మత్ చుగ్తాయ్గా నటించింది. అది ఆమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చింది.ఓ వైపు సీరియళ్లు, సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వీడియో ఆల్బమ్స్‌లోనూ తన అభినయ కళను చాటసాగింది. ఇటు ఓటీటీ అవకాశాలూ వరుసకట్టాయి. అలా ‘క్రాష్’, ‘స్వాంగ్’ సిరీస్‌లలో నటించింది. తాజాగా ‘దిల్ దోస్తీ డైలమా’లోనూ ప్రధాన భూమిక పోషించింది. అందులోని ఆమె నటన అభిమానులవే కాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోంది.అనుష్కా సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లకే కాదు సోషల్ మీడియా పోస్ట్‌లకూ వీర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్, కోట్లలో ఫాలోవర్స్‌తో చిన్నవయసులోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఈ పాపులారిటే ఆమెకు కొరియన్ సినిమా చాన్స్‌నూ తెచ్చిపెట్టింది. అలా అనుష్కా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయింది.కొరియన్ డ్రామాస్ అంటే కళ్లింత చేసుకుంటా. అలాంటి నాకు కొరియన్ మూవీలో చాన్స్ వచ్చిందని తెలియగానే క్లౌడ్ 9లో తేలిపోయా! ఇదంతా నా అభిమానుల బ్లెస్సింగ్స్ వల్లే పాజిబుల్ అయిందని నమ్ముతా! ఫ్యాన్సే నా సైన్యం! సోషల్ మీడియాలో వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడల్లా పాజిటివ్ ఎనర్జీతో చార్జ్ అవుతాను. కాన్ఫిడెంట్‌గా ఫీలవుతాను! – అనుష్కా సేన్ -
Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్!
అద్భుతాలు ఆకాశం నుంచి ఊడిపడవు. ఆలోచనల్లో నుంచి పుడతాయి. దిల్లీకి చెందిన ఆర్యన్ చౌహాన్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద విజయం సాధించడానికి ఆ ఆలోచనలే కారణం. కొత్తదనాన్ని ఆవిష్కరించే ఆలోచనలు అవి. కొత్త తరం ఆలోచనలు అవి...ఇరవై రెండు సంవత్సరాల ఆర్యన్ చౌహాన్ ట్రాక్ రికార్డ్ ‘ఆహా’ అనేలా ఉంటుంది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే స్టార్టప్‌లకు సహాయపడే స్టార్టప్‌ను మొదలుపెట్టాడు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రసిద్ధ జెరోమ్ ఫిషర్ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీకి ఎంపికైన తక్కువ మందిలో ఆర్యన్ ఒకడు.కోవిడ్ సమయంలో స్వదేశానికి తిరిగివచ్చాడు ఆర్యన్. ఆ సమయంలో అతడి మనసు నిండా కొత్త స్టార్టప్ ఆలోచనలు నిండి ఉన్నాయి. అయితే ఏమీ చేయలేని అనిశ్చితి బయట నెలకొని ఉంది. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాడు ఆర్యన్. 2021లో ‘జీవోవ్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు.తన తల్లితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘జీవోవ్’ పేరుతో రెండో కంపెనీ స్టార్ట్ చేశాడు. టెక్–ఫస్ట్ అ్ర΄ోచ్తో డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచే కంపెనీ ఇది. పర్సనలైజ్ రెమిషన్ ΄్లాన్స్ నుంచి నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) పరికరాల వరకు కంపెనీలో ఎన్నో ఉంటాయి. ఇంతకీ ఆర్యన్‌కు ‘జీవోవ్’ ఆలోచన ఎలా వచ్చింది?‘డయాబెటిస్ బాధితులను దగ్గరి నుంచి చూశాను. మా తాతయ్యలు ఇద్దరూ డయాబెటిస్తో బాధలు పడ్డారు. ఆ సమయంలోనే ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నాను’ అంటాడు ఆర్యన్. క్రానిక్ కేర్ బిజినెస్‌గా ్ర΄ారంభమైన ‘జీవోవ్’ కంపెనీ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్స్, సైకాలజిస్ట్‌లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ సమయంలోనే కంపెనీ 70,000లకు పైగా వినియోగదారులతో విజయపథంలోకి వచ్చింది.ప్రొడక్ట్‌ను క్రియేట్ చేయడం నుంచి మార్కెట్లో విజయవంతం చేయడం వరకు ఆర్యన్‌లో అద్భుత సామర్థ్యం ఉంది. వేగంగా నేర్చుకునే తత్వం, నిర్మాణాత్మక పనివిధానం అతడి సొంతం. ఏ ్ర΄ాజెక్ట్ చేపట్టినా విజయవంతం చేయాలనే పట్టుదలతో పనిచేస్తాడు. నెవర్–సే–డై స్పిరిట్ ఆర్యన్‌ను క్వాలిటీ ఫౌండర్‌ని చేసింది’ అంటాడు ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’ ఫౌండర్ కునాల్ బహల్. కునాల్ బహల్ జెరోమ్ ఫిషర్ ప్రోగ్రామ్ పూర్వ విద్యార్థి.‘జీవోవ్’కు ముందు కునాల్‌తో కలిసి పనిచేశాడు ఆర్యన్. ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’లో ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, డీ2సీ సెగ్మెంట్లను లీడ్ చేశాడు. ‘ఇది చాలు’ అనుకోవడం లేదు ఆర్యన్ చౌహాన్. ‘జాయిన్ ది రెవల్యూషన్’ నినాదంతో నెక్ట్స్ గ్రోత్ పేస్పై దృష్టి పెట్టాడు. -
తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యా రాయ్ లుక్స్‌కి వెస్ట్రన్ వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. మనకూ కొత్తగా కనిపించింది. అలా ఆమెను తీర్చిదిద్దిన స్టయిలిస్ట్ ఆస్థా శర్మ. ఆమె అంట్రప్రెన్యూర్ కూడా!ఆస్థా స్వస్థలం ఢిల్లీ. ఫ్యాషన్ ప్రపంచంతో అసలు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది లాయర్ల కుటుంబం. ఆమె తండ్రి.. ఢిల్లీలో పేరుమోసిన అడ్వకేట్. కెరీర్ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని ఇంటర్ అయిపోగానే ‘లా’ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది కూడా. కానీ ఆస్థా వాళ్ల నాన్న.. తన కూతురు లాయర్ కాకుండా ఇంకేదైనా రంగంలో స్థిరపడితే బాగుండు అనుకున్నాడు. అదే విషయాన్ని బిడ్డతో చెప్పాడు.. ‘నేను లాయర్ అయ్యాను కాబట్టి.. నువ్వూ కావాలనే మైండ్‌సెట్‌తో లా చదవకు. నీకేది ఇష్టమో అదే చెయ్’ అని. అప్పుడు ఆలోచించింది ఆస్థా.. నిజంగా తనకు లా చదవాలని ఉందా? అని! ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు.దాంతో అది వదిలేసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్‌లో చేరింది. అది చదువుతున్నప్పుడే ఆస్థాకు క్రియేటివ్‌గా ఏదో చేయాలనే తపన మొదలైంది. ఆ శోధనలోనే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఏ అయిపోగానే ‘పర్ల్ అకాడమీ’ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్స్‌లో జాయిన్ అయింది. కానీ అదేమంత ఇష్టంగా తోచలేదు. అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా ‘స్టయిలింగ్’ గురించి తెలుసుకుంది.ఫ్యాషన్ మార్కెటింగ్ కోర్స్ పూర్తవగానే స్టయిలింగ్లోకి దిగింది. మ్యాగజైన్ స్టయిలిస్ట్ రిన్ జాజో దగ్గరికి ఇంటర్న్‌గా వెళ్లింది. అదే సమయంలో మరో స్టయిలిస్ట్ ఆదిత్య వాలియాకూ అసిస్టెంట్‌గా పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రహించింది స్టయిలింగ్ అనేది తన కైండ్ ఆఫ్ వర్క్ అని. ఆ ఇంటర్న్‌షిప్ అయిపోగానే ఆమెకు ఏ్చటp్ఛట’టఆ్చ్డ్చ్చట మ్యాగజైన్లో ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కొలువు దొరికింది. అది ఆమెకు పనిలో అనుభవాన్నే కాదు.. ఫ్యాషన్ లోకపు కాంటాక్ట్స్నీ పెంచింది. గొప్ప ఎక్స్పోజర్నిచ్చింది.అది ఒక పంజాబీ సినిమాలోని అగ్రతారలకు స్టయిలింగ్ చేసే చాన్స్‌ని తెచ్చిపెట్టింది. అంతే మ్యాగజైన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసా, ఆమె కొలీగ్ మోహిత్ ఇద్దరూ ఆ ప్రాజెక్ట్‌లో తలమునకలయ్యారు. సక్సెస్ సాధించారు. దానిద్వారా వచ్చిన పెద్దమొత్తాన్ని తీసుకుని ముంబై చేరారు. ‘వార్డ్‌రోబిస్ట్’ అనే ఫ్యాషన్ స్టార్ట్ప్ పెట్టారు. అది ఆస్థాకు బాలీవుడ్ ఎంట్రెన్స్ని కల్పించింది. ఐశ్వర్యా రాయ్‌ని పరిచయం చేసింది. తన పనితనాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చింది. ఐశ్వర్యా రాయ్ మెచ్చి ఆమెను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకుంది.ఆ వాసి మరింత మంది తారలకు చేరి.. దిశా పాట్నీ, మృణాల్ ఠాకుర్, నోరి ఫతేహీ, విద్యా బాలన్, భూమి పెడ్నేకర్లకూ స్టయిలింగ్ చేసే ఆపర్చునిటీస్ని అందించింది. అంతేకాదు అంట్రప్రెన్యూర్‌గా ‘ద వెడ్డింగ్ స్టయిల్’ ప్రాజెక్ట్‌నూ లాంచ్ చేసే దశకు చేర్చింది. ఆస్థా ఇప్పుడు.. బాలీవుడ్ సెలబ్రిటీస్‌కి ఫేవరెట్ స్టయిలిస్ట్.. బడ్డింగ్ స్టయిలిస్ట్లకు రోల్ మోడల్!స్టయిలిస్ట్ అవడానికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్‌లో చదువు, ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్, అంతులేని ఈ పోటీ రంగంలో అలుపెరగని శ్రమ, ఊహకందని సృజన చాలా ఇంపార్టెంట్! అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ మీద అవగాహన, స్టడీ, రీసెర్చ్ తప్పనిసరి! ఇవన్నీ ఉంటేనే స్టయిలింగ్‌లో మన మార్క్ చూపించగలం.. బెస్ట్ అనిపించుకోగలం! – ఆస్థా శర్మఇవి చదవండి: ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది! -
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్‌వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్‌కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లాగా సినిమాలను కరిర్‌గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్‌ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్‌లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్‌పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్‌శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
అమ్మ చెప్పిన మాటే.. ఇప్పుడీ స్థాయికి!
ప్రీతిక మెహతాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘గ్లోబల్ షార్పర్’గా గుర్తించింది. చండీగఢ్‌కు చెందిన ప్రీతిక బహుముఖ ప్రజ్ఞాశాలి. గణిత మేధావి, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రీతిక ‘బటర్నట్ ఏఐ’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రాణిస్తోంది. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. మార్గనిర్దేశం చేస్తోంది.లెక్కలు అంటే చాలామంది పిల్లలకు భయం. అయితే చిన్నప్పటి నుంచి ప్రీతికకు లెక్కలు అంటే చెప్పలేనంత ఇష్టం. బొమ్మలు వేయడం అంటే కూడా ఇష్టం. పద్నాలుగు సంవత్సరాల వయసులో కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక ప్రొడక్ట్ స్టార్టప్‌లో తొలి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆసక్తి పెరిగింది. దాంతో ఉద్యోగాన్ని వదులుకొని న్యూయార్క్‌లోని స్టేట్ యూనివర్శిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ చేసింది.ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఖర్చుల కోసం ఒక రెస్టారెంట్లో పనిచేసేది. గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ప్రీతిక తల్లి అమెరికాకు వచ్చింది. తల్లిని తన ప్రొఫెసర్‌కు పరిచయం చేసింది. ‘మీ అమ్మాయి బ్రైట్ స్టూడెంట్. క్లాస్‌రూమ్‌లో లోతైన ప్రశ్నలు అడిగేది. మీ కూతురికి మంచి భవిష్యత్ ఉంది’ అంటూ ఆ ప్రొఫెసర్ ప్రీతికపై ప్రశంసల వర్షం కురిపించాడు.ప్రొఫెసర్ మాటలు విన్న తరువాత ప్రీతికకు తన మీద ఉన్న నమ్మకం రెట్టింపు అయింది. ‘యస్. నేను సాధించగలను’ అనుకుంది. బోస్టన్లోని ‘బాంక్ ఆఫ్ అమెరికా’లో పనిచేసే అవకాశం ప్రీతికకు వచ్చింది. అయితే సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో అధిక వేతనంతో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రీతిక నిర్ణయం కుటుంబ సభ్యులతో సహా చాలామందికి నచ్చలేదు.‘బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగ జీవితం బాగున్నప్పటికీ నాలో ఉన్న అన్ని టాలెంట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం దొరకలేదు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రీతిక. అమెరికా నుంచి వచ్చిన తరువాత పిల్లలకు కోడింగ్ నేర్పించడానికి ‘కిడ్డీకోడర్స్’ను స్టార్ట్ చేసి పన్నెండు దేశాలకు వెళ్లింది. ఆ తరువాత సాక్సోహో.కామ్‌తో మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.‘మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయని రిసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఈ స్పేస్‌లో గ్లోబల్ స్టార్టప్ నిర్మించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాక్సోహో మొదలు పెట్టాను’ అంటుంది ప్రీతిక.తనకు పట్టు ఉన్న డేటా, ఏఐ సబ్జెక్ట్లతో కస్టమర్ల వ్యక్తిగత అనుభవాలతో కంపెనీని బిల్డ్ చేసింది. యూఎస్‌లో చదువుకునే రోజుల్లోపార్ట్టైమ్ ఉద్యోగిగా ఒక ఇటాలియన్ రెస్టారెంట్లో పనిచేసింది. అది కస్టమర్–ఫేసింగ్ జాబ్ కావడం వల్ల ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది. ఆ జ్ఞానం ‘సాక్సోహో’కు ఉపయోగపడింది. డైరెక్ట్–టు–కన్జ్యూమర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘సాక్సోహో’ తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది ప్రీతిక. ‘మనపై మనకు ఉన్న నమ్మకమే శక్తి. దానితో ఎన్ని విజయాలైనా సాధించవచ్చు’ అంటుంది ప్రీతిక మెహతా.మార్గనిర్దేశం..‘ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళలకు తమ స్థాయిని కా΄ాడుకోవడానికి రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లక్ష్యసాధనకు సంబంధించి అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి వారికి సమయం దొరకదు’ అంటున్న ప్రీతిక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికి లక్ష్యసాధన విషయంలో అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి ఎన్నో సమావేశాల్లోపాల్గొంది. ఎంటర్ప్రెన్యూర్గానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ‘థింక్. లెర్న్. డిసైడ్ విత్ యువర్ ఓన్ హెడ్ అండ్ హార్ట్’ అనేది ఎన్నో సమావేశాలలో ప్రీతిక నుంచి వినిపించే మాట.అమ్మ చెప్పిన మాట..చదువుకునే రోజుల్లో ఎందరో విజేతల కథలు నాకు స్ఫూర్తి ఇచ్చాయి. అదే సమయంలో ‘ప్రతి రంగంలో పురుషులతో పోల్చితే మహిళా విజేతలు ఎందుకు తక్కువగా ఉన్నారు?’ అని ఆలోచించేదాన్ని. ఈ ఆలోచనలతోనే నా వంతుగా ఏదైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. చిన్నప్పుడు స్కూల్ మార్చమని ఇంట్లో గొడవ చేశాను. దీనికి కారణం క్లాసులో 80 మంది స్టూడెంట్స్ ఉండడం. ‘ఇంత మంది మధ్య నేను టాపర్‌గా ఎలా ఉండగలను’ అన్నాను.‘ఇరవైమందిలో ఎలాగైతే టాపర్‌గా నిలిచావో 80 మందిలో కూడా టాపర్‌గా నిలవాలి’ అని అమ్మ చెప్పింది. వందమందిలో రాణించగలిగినప్పుడు వెయ్యిమందిలో కూడా రాణించగలం అనే సత్యం బోధపడింది. మనలో సామర్థ్యం ఉన్నప్పుడు సంఖ్య ముఖ్యం కాదు. ఒకవైపు భవిష్యత్ లక్ష్యాలు. మరోవైపు ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు.‘ఈ డ్రెస్‌తో బయటికి వెళతావా?’ ‘అబ్బాయిలా పొడుగ్గా పెరుగుతున్నావేమిటి?’... ఇలాంటి నాన్సెన్స్ మైండ్‌సెట్ కామెంట్స్ చిరాకు కలిగించేవి కానీ నా భవిష్యత్ లక్ష్యాలను నీరుగార్చలేకపోయాయి. మన దేశంలోనే కాదు అమెరికాలోనూ వృత్తిజీవితంలో లింగవివక్షతను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి వాటికి చిన్నబుచ్చుకోకుండా టాలెంట్‌తోనే సమాధానం చె΄్పాను.– ప్రీతిక మెహతా -
వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!
పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్‌చైర్‌కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్‌లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్‌పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీల్ చైర్లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్చైర్లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా) -
మన తెలుగువాడి బయోపిక్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం. మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు. -
‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీల ఆర్థికపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికర సర్వేలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా దేశంలోని మహిళా ఉద్యోగుల్లో అత్యధికులు ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలని భావిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆన్లైన్ మార్కెటీర్ ఇండియాలెండ్స్ చేపట్టిన ఈ సర్వేలో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోగల 24-55 ఏళ్లకు చెందిన 10వేలకుపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. వీరిలో ఏకంగా 76 శాతం మంది తమకు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉన్నట్టు చెప్పడం విశేషం. ఇక 86 శాతం మంది బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, సేవింగ్, ఇతర ఆర్థిక అంశాలపై నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరిచినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై డేటాను అందించే ఆన్లైన్ వేదిక ఇండియాలెండ్స్ తెలిపింది. పెరుగుతున్న రుణాలు.. గత ఏడాది మహిళలు తీసుకున్న రుణాల్లో 19 శాతం వృద్ధి కనిపించింది. 2023లో రూ.30.95 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. 2022లో రూ.26 లక్షల కోట్లేనని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ఇక అంతకుముందుతో పోల్చితే గతేడాది వ్యక్తిగత రుణాలు 26 శాతం పెరిగి రూ.12.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు.. ప్రధాన స్థానాల్లో.. తాము ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సంస్థల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 3,138 కంపెనీలకు బీఏఏ, ఆపై రేటింగ్‌నే ఇచ్చామని, వీటి బోర్డుల్లో సగటున 29 శాతం మహిళలే ఉన్నారని చెప్పింది. ఇదిలావుంటే ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం కంపెనీలకే మహిళలు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఫార్చూన్ ఇండియా నెక్స్ 500 కంపెనీల్లో మహిళల సారథ్యంలో పనిచేస్తున్నవి 5 శాతంగా ఉన్నాయి. -
30 ఏళ్ల వయసున్న టాప్ వ్యాపారస్థులు వీరే..
ముప్పై ఏళ్లలోపు యువతకు ఎక్కువగా స్నేహితులతో గడపాలని, మంచి బైక్‌పై చక్కర్లు కొట్టాలని, మంచి దుస్తులు కొనాలని.. ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రం సమయం వృథా చేయకుండా జీవితంలో స్థిరపడాలనుకుంటారు. అయితే అది అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ, ఆ వయసులోనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి విజయవంతంగా నడుపుతూ వందల కోట్లకు అధిపతి కావడం అనేది అనూహ్యమైన విజయం. తాజాగా హురున్ ఇండియా అలాంటి 100 మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితా విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది ఉన్నారు. ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ముంబయికి చెందిన జెప్టో క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైన కైవల్య వోహ్రా (21 ఏళ్లు), ఆదిత్ పలిఛ (22 ఏళ్లు)లకు అగ్రస్థానం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఎడ్టెక్ సంస్థ, భాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం అయిదుగురు మహిళలు ఉండగా.. ‘స్కిల్‌మ్యాటిక్స్’కు చెందిన దేవాన్షి కేజ్రీవాల్ (27 ఏళ్లు) అందరి కంటే చిన్నవారు. 8 మంది యువ వ్యాపారవేత్తలు స్పేస్‌టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలో అధికంగా సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీల వ్యవస్థాపకులు 19 మంది ఉన్నారు. ఫిన్‌టెక్, ఎడ్టెక్ రంగాలకు చెందిన 11 కంపెనీల ప్రతినిధులకు ఇందులో చోటు దొరికింది. బెంగళూరుకు చెందిన కంపెనీలు/ వ్యవస్థాపకుల సంఖ్య ఈ జాబితాలో అధికంగా ఉంది. తదుపరి స్థానాల్లో ముంబయి, దిల్లీకి చెందిన వారు ఉన్నారు. బెంగళూరు నుంచి 10 మంది, ముంబయి నుంచి 9 మంది, దిల్లీ నుంచి 8 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన యువ వ్యాపారవేత్తల్లో ఐఐటీ-రూర్కీ పట్టభద్రులైన 8 మంది ఉండటం గమనార్హం. ఐఐటీ- కాన్పూర్ నుంచి ఏడుగురు, ఐఐటీ- దిల్లీ నుంచి ఆరుగురు, ఐఐటీ- బాంబే, మద్రాస్ నుంచి అయిదుగురు చొప్పున ఉన్నారు. మనదేశంలోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తి, సామర్థ్యాలను ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ ప్రతిబింబిస్తోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రహమాన్ జునాయిద్ వివరించారు. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో వినూత్న వ్యాపార వ్యూహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించగల సామర్థ్యం ఉన్న యువ వ్యాపారవేత్తల అవసరాలు ఎంతో అధికంగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు, బహుళజాతి వ్యాపార సంస్థలు ఇటువంటి సత్తా ఉన్న యువ వ్యాపారవేత్తలు, సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అయిదుగురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు పిన్న వయసు లోనే మంచి విజయాలు నమోదు చేసి హురున్ జాబితాలో స్థానం సంపాదించారు. హైదరాబాద్ నుంచి నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు, భాంజు, ఎడ్యుటెక్ కంపెనీ)తో పాటు, శశాంక్ రెడ్డి గుజ్జుల (27 సంవత్సరాలు, నెక్ట్స్‌వేవ్, ఎడ్యుటెక్ కంపెనీ), రాకేష్ మున్ననూరు (29 ఏళ్లు, విజిల్‌డ్రైవ్, సాస్ కంపెనీ), అనురాగ్ మాలెంపాటి (30 ఏళ్లు, లీప్ ఇండియా ఫుడ్, లాజిస్టిక్స్ సేవల కంపెనీ) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన అనుపమ్ పెడర్ల (29 ఏళ్లు, నెక్ట్స్‌వేవ్, ఎడ్టెక్ కంపెనీ)కు సైతం ఈ జాబితాలో స్థానం దక్కింది. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే.. -
స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్! ఆటకు సాంకేతికతను జోడించి..
ఆటలు, సాంకేతిక పరిజ్ఞానం వేరు వేరు విషయాలు కాదు. సాంకేతికత సహాయంతో ఆటల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు... అనే లక్ష్యంతో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా ‘స్తూప స్టోర్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయపథంలో దూసుకుపోతోంది మేఘా గంభీర్. ఎలాంటి ప్లాన్ లేకుండానే పెద్ద కార్పొరేట్ కంపెనీలో తాను చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పింది మేఘా గంభీర్. అదే సమయంలో ఆమె భర్త, టేబుల్ టెన్నిస్ కోచ్ దీపక్ మాలిక్ ‘టెక్నాలజీ సహాయంతో ట్రైనీల పెర్ఫార్మెన్స్ను ఎలా మెరుగుపరచవచ్చు...’ అనే అంశంపై ఆలోచిస్తున్నాడు. మేఘకు వెంటనే స్టార్టప్ ఐడియా తట్టింది. డేటా, ఎనలటిక్స్ సహాయంతో ప్లేయర్స్ తమ ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి రెండు సంవత్సరాల క్రితం ‘స్తూప స్పోర్ట్స్ ఎనలటిక్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. దీనికిముందు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, పెప్సికో... మొదలైన కంపెనీలలో పదిహేను సంవత్సరాల పాటు టెక్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. మేఘకు ఆటలు అంటే చాలా ఇష్టం. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆటలలో నిపుణుౖలైన ఎంతోమందితో మాట్లాడిన తరువాత తన స్టార్టప్ ఐడియాను పట్టాలకెక్కించింది. డేటాను కాప్చర్ చేసే ఆటోమేటెడ్ ఇంజిన్‌ను తయారు చేయడానికి సంవత్సరానికి పైగా టైమ్ పట్టింది. ఆటలో ప్రతి కోణాన్ని విశ్లేషించుకునేలా కోర్టులో 8–10 కెమెరా సెటప్‌కు రూపకల్పన చేశారు. కంపెనీకి సంబంధించి ప్రత్యేక టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీకి పదిహేనుకు పైగా గ్లోబల్ క్లయింట్స్ ఉన్నారు. ‘టెక్నాలజీ వైపు నుంచి స్పోర్ట్స్ ఎనలటిక్స్ వైపు మేఘ రావడానికి కారణం ఏమిటి?’ జవాబు ఆమె మాటల్లోనే... ‘ఒక పెద్ద కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నప్పటికీ నేను చేస్తున్న ఉద్యోగంతో సంతోషంతో లేను. ఉద్యోగం కాకుండా నెక్ట్స్ ఏమిటి... అని ఆలోచించడానికి గ్యాప్ తీసుకోవాలనుకున్నాను. ఆ సమయంలో నా భర్త వల్ల స్టార్టప్ ఆలోచన వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ కాంగ్రెస్‌లో నా కాన్సెప్ట్‌ను ప్రెజెంట్ చేస్తే మంచి స్పందన వచ్చింది. జూనియర్స్, యూత్, సీనియర్స్... ఇలా రకరకాల విభాగాలు ఆటలో ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు, ప్రతి ప్లేయర్‌కు సంబంధించిన సమాచారాన్ని కాప్చర్ చేయడం కోచ్‌లకు కష్టం అవుతుంది. ట్రైనింగ్ సెషన్స్ ప్రారంభించడానికి వారి దగ్గర తగిన సమాచారం ఉండాలి. ఒక ప్లేయర్ టోర్నమెంట్‌కు సంబంధించి అయిదు లేదా పది మ్యాచ్‌లు చూడాల్సి వస్తే డేటా రాయడానికి రెండు మూడు వారాల సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఎనలటిక్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్‌ను తీసుకువచ్చాం. దీనిద్వారా ప్లేయర్స్ తమ మ్యాచ్ వీడియోలను అప్లోడ్ చేసి విశ్లేషణ రిపోర్ట్‌ను తీసుకోవచ్చు. ఇదే సమయంలో కామెంటర్స్కు ఉపయోగపడే ఏఐ ప్రాడక్ట్స్ రూపొందించాం. టేబుల్ టెన్నిస్‌తో మొదలుపెట్టాం. బ్యాడ్మింటన్లాంటి ఇతర ఆటల్లోకి కూడా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాం’ అంటుంది మేఘా గంభీర్. నాణ్యతతో కూడిన వర్చువల్ కోచింగ్, ప్లేయర్స్‌కు ఉపయోగపడే సెన్సర్–బేస్డ్ టెక్నాలజీపై ప్రత్యేక కృష్టి పెట్టింది కంపెనీ. యూరప్ మార్కెట్లో పట్టు సంపాదించిన ‘స్తూప’ ఆసియా, యూఎస్ మార్కెట్లోకి కూడా విస్తరించడానికి తగిన ప్రణాళికలు రూపొందించుకుంది. ‘మహిళా స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్లు తక్కువగా కనిపిస్తారు. చాలామంది లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ఫుడ్‌లాంటి రంగాలను ఎంపిక చేసుకుంటారు. స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను విజయం సాధించడానికి కారణం చక్కని సలహాలు ఇచ్చిన అనుభవజ్ఞులు, విషయ నిపుణులు, ప్లేయర్స్, కోచ్‌ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్’ అంటుంది మేఘా గంభీర్. (చదవండి: ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! వెడ్డింగ్ విత్ టికెట్!) -
నిఫ్టీ50 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా..
భారతీయ కంపెనీల్లోని మహిళా ఉద్యోగుల జీతాలు సగటున పురుష ఉద్యోగుల జీతాల కంటే దాదాపు పదో వంతు తక్కువగా ఉన్నాయని కొన్ని కథనాలు ప్రకారం తెలుస్తుంది. నిఫ్టీ50 కంపెనీల్లోని స్త్రీ, పురుష ఉద్యోగుల జీతాలను విశ్లేషించి కొంత డేటాను సేకరించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నిఫ్టీ50లోని 31 కంపెనీల్లో మహిళల జీతాల కంటే పురుషుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. సగటు స్త్రీల జీతాలు పురుషుల జీతాల కంటే 9.2% తక్కువగా ఉన్నాయి. ఇది సుమారు సంవత్సరానికి రూ.1.2 లక్షల వేతన వ్యత్యాసానికి సమానం. పురుషుల జీతాలు దాదాపు ఏటా రూ.12.9 లక్షలు అయితే మహిళా ఉద్యోగుల జీతాలు రూ.11.7 లక్షలుగా ఉన్నాయి. టాప్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అధిక కుటుంబ బాధ్యతలు, కెరీర్ బ్రేక్‌లు, కెరీర్ స్విచ్‌లు వంటి అంశాలు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ మైండ్‌ట్రీ కంపెనీల్లో పురుషుల జీతాలు 30-46% ఎక్కువగా ఉన్నాయి. టాటా కన్జ్యూమర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీల్లో మహిళల వేతనాలు 20-73% ఎక్కువగా ఉన్నాయని డేటా తెలుపుతుంది. -
సాహోరే.. టాప్ స్పీడ్ స్టార్స్!
‘ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దేన్ నాలెడ్జ్’ అంటూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ‘ఊహాశక్తి’కి ఉండే అపారమైన శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ ఇద్దరు మిత్రులకు ఊహాశక్తితో పాటు సాంకేతిక నైపుణ్యశక్తి కూడా ఉంది. ఈ రెండు శక్తులను సమన్వయం చేసుకుంటూ కాలేజీ రోజుల నుంచి చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆ ప్యాషన్ వారిని ఎంటర్ప్రెన్యూర్లుగా మార్చి బైక్ మార్కెట్లోకి అడుగు పెట్టేలా చేసింది. ఈవీ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’తో స్పీడ్‌గా దూసుకుపోతున్నారు...2006లో... బెంగళూరులోని బీఎంఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నారాయణ్ సుబ్రమణ్యం, నీరజ్ రాజ్‌మోహన్‌లు ఐఐటీ, మద్రాస్ నిర్వహించిన పోటీలో ఎయిర్–ప్రొపెల్డ్ వాటర్ క్రాఫ్ట్ రూపొందించి ‘బెస్ట్ డిజైన్’ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా ఎన్నో ఐఐటీ టీమ్‌లు పాల్గొన్నాయి. కట్ చేస్తే... ఈ ఇద్దరు ఎలక్ట్రిక్ సూపర్ బైక్ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నారాయణ్, నీరజ్‌లకు స్కూలు రోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోట్స్ అంటే ఇష్టం. కాలేజీలో చేరే నాటికి ఆ ఇష్టం మరోస్థాయికి చేరింది. అన్నిరకాల ఎయిర్ క్రాఫ్ట్‌లు, రోబోట్స్,హైడ్రోప్లెయిన్స్, ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు తయారుచేసేవారు. దేశవ్యాప్తంగా ఎన్నో పోటీల్లో పాల్గొనేవారు. సూపర్‌బైక్ తయారు చేయాలనేది వారి కల. కాలేజీ చదువు పూర్తయిన తరువాత ఇద్దరి దారులు వేరయ్యాయి. పై చదువుల కోసం నీరజ్ కాలిఫోర్నియా, నారాయణ్ స్వీడన్ వెళ్లారు. ఆ తరువాత టాప్ ఆటోమోటివ్ కంపెనీలలో పనిచేశారు. అయితే ఇద్దరిలోనూ ఏదో అసంతృప్తి ఉండేది. వారు అనేకసార్లు మాట్లాడుకున్న తరువాత ‘ఏదైనా సాధించాలి’ అనే నిర్ణయానికి వచ్చారు. అలా బెంగళూరు కేంద్రంగా ఈవీ స్టార్టప్ ‘అల్ట్రావయోలెట్’కు శ్రీకారం చుట్టారు. ఆటోమోటివ్, కన్జ్యూమర్ టెక్, ఏరో స్పేస్ నిపుణులతో గట్టి బృందాన్ని తయారుచేసుకున్నారు. ఈ మిత్రద్వయం మోటర్ఫీల్డ్కు కొత్త కాబట్టి వారి టీమ్‌లో చేరడానికి తటపటాయించేవారు. అయితే కాస్త ఆలస్యంగానైనా ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందరిలాగే తమ స్టార్టప్‌కు కరోన కష్టాలు మొదలయ్యాయి. తమ ఫస్ట్ ఆల్–ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ బైక్ ఎఫ్ 77 మోడల్ తయారీని నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటున్న సమయంలో ‘ఎఫ్77’ను రీవ్యాంప్ చేశారు. ‘భిన్నమైన సంస్కృతులు, అభిరుచులు ఉన్న మనలాంటి దేశంలో ఈవీలతో మెప్పించడం అనేది పెద్ద సవాలు. ఈ టెక్నాలజీ గురించి చాలామంది అపోహలతో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి మైండ్‌సెట్‌ను మార్చాలనుకున్నాం. ఈవీలో మాకు సాధ్యమైన కొత్త ఫీచర్లు తీసుకువచ్చాం. మా అల్ట్రావయోలెట్‌కు ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు స్ఫూర్తి. మాకు కొత్త ఆవిష్కరణలు అంటే ఆసక్తి’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్’ కో–ఫౌండర్, సీయివో నారాయణ్. ఇక ఇద్దరి అభిరుచుల విషయానికి వస్తే...నీరజ్ పుస్తకాల పురుగు. పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా తనకు కొత్త ఐడియాలు వస్తాయి అంటాడు. ఇక నారాయణ్‌కు ‘క్రియేటివిటీ అండ్ ఫిట్నెస్’ ఇష్టమైన సబ్జెక్ట్. అయితే టెక్నికల్ స్కిల్స్ విషయంలో మాత్రం ఇద్దరికీ సమ ప్రతిభ ఉంది. నారాయణ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్‌లో, రాజ్‌మోహన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్‌లో ఎక్స్పర్ట్. ‘మేము అద్భుతాన్ని సృష్టించాలనుకున్నాం. అనుకోవడానికైతే ఎన్నైనా అనుకోవచ్చు. ఆచరణలో మాత్రం రకరకాల సవాళ్లు ఎదురొస్తుంటాయి. వాటిని తట్టుకొని నిలబడడమే అసలు సిసలు సవాలు. అలాంటి సవాలును అధిగమించి మా కలను నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది’ అంటున్నాడు ‘అల్ట్రావయోలెట్’ ఫౌండర్లలో ఒకరైన నీరజ్. (చదవండి: చీట్ ఆఫ్ ది డే! దొంగ డీల్స్!) -
బొల్లి వ్యాధి బయటకు రానివ్వకుండా కుంగదీసినా..కళ గెలిపించింది!
స్కూలు అకడమిక్ పరీక్షల్లో కాస్త వెనకబడితేనే కుంగిపోతుంటారు. పిల్లలు. అలాంటిది పదేళ్ల వయసులో తన శరీరం మీద తెల్లని మచ్చలు రావడం చూసిన ఆశా ఖత్రికి ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులు, చుట్టుపక్కల వారి శరీరం మీద అలాంటి మచ్చలు ఏవీ కనపడకపోవడంతో తను ఏదో ప్రత్యేకంగా ఉన్నట్లు భావించి.. అందరిలా తను లేదని చాలా బాధపడింది. తనకొచ్చిన బొల్లి మచ్చలు పోవడం లేదని తీవ్ర నిరాశకు లోనైంది. ఏది ప్రయత్నించినా తనకి ఎదురే వచ్చాయి. అయినా తన చిన్ననాటి అలవాటునే ఉజ్వల భవిష్యత్‌గా మార్చుకుని, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ముఫ్పైరెండేళ్ల ఆశాఖత్రి. రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్కు చెందిన ఆశా ఖత్రి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మిగతా పిల్లల్లా కాకుండా ఒళ్లంతా తెల్లని మచ్చలతో కొంచెం అసాధారణంగా ఉండేది. తన రూపాన్ని చూసుకుని చిన్నారి ఆశా చాలా కుంగిపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతూ, వైద్యం చేయించేవారు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినప్పటికీ పెద్ద మార్పు రాలేదు. కుంగిపోయినప్పటికీ... తన పరిస్థితి చూసుకుని ఎప్పుడూ బాధపడే ఆశ.. మందులు, హార్మోన్లలో మార్పుల వల్ల విపరీతమైన బరువు పెరిగిపోయింది. దీంతో సమాజంలో తిరగాలంటే చాలా బిడియంగా ఉండేది తనకు. అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా అందరూ తనని చూసేవారు. ఇంత బాధలోనూ ధైర్యం తెచ్చుకుని ఎం.ఏ., బీఈడీ. చేసింది. చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. సంవత్సరాలపాటు కష్టపడినప్పటికి కాలం కలిసిరాక ఉద్యోగం రాలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్లమీద తనే నిలబడాలనకునే ఆశ.. ఏదోఒకటి చేసి సంపాదించాలన్న కోరికతో రకరకాలుగా ప్రయత్నిస్తూ చివరికి క్రొచెట్ను ఎంచుకుంది. అలవాటునే సంపాదనగా... క్రొచెట్ టాయిస్‌ను తయారు చేసే కళ ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అవుతుంటుంది. ఆశ చిన్నప్పుడు అల్లికలతో బొమ్మలు తయారుచేసే క్రొచెట్కళను తన అమ్మ, అమ్మమ్మల దగ్గర నేర్చుకుంది. వివిధ రకాల బొమ్మలు చేస్తుండేది. ఆ అలవాటే తన డెస్టినీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అనేకప్రయత్నాలు విఫలం అయ్యి దిక్కుతోచని రోజులవి. అది 2021 నవంబర్. ఒకరోజు ఆశ...తన చుట్టాల పిల్లలు క్రొచెట్ టాయిస్‌తో ఆడడం చూసింది. క్రొచెట్ టాయిస్‌తో ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండడం గమనించిన ఆశ.. తను కూడా ఆ టాయిస్‌ను తయారు చేసి ఆన్లైన్లో విక్రయించవచ్చన్న ఆలోచన వచ్చింది. అనుకున్న వెంటనే తనకు తెలిసిన క్రొచెట్ కళతో చిన్న ఆక్టోపస్‌ను తయారు చేసి అందరికి చూపించింది. అది చూసిన వారంతా చాలా బావుంది. క్యూట్‌గా ఉంది అని చెప్పడంతో.. మరికొన్ని టాయిస్ తయారు చేసి, ఎగ్జిబీషన్‌లో ప్రదర్శించింది. అక్కడ ఆ టాయిస్‌ను చూసిన వారంతా ఇష్టపడి కొనడం, ఆశకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తన బొమ్మలకు వస్తోన్న ఆదరణను చూసి మరిన్ని టాయిస్‌ను రూపొందించి చిన్నచిన్న ఎగ్జిబిషన్లలో విక్రయించేది. అక్కడ వచ్చిన స్పందనతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. తను తయారు చేసే టాయిస్‌ను ఇన్స్టాగ్రామ్, ఇంకా వెబ్సైట్ ఆశి. టాయిస్.స్టూడియో పేరిట విక్రయిస్తోంది. రెండువేలకుపైగా బొమ్మలు అమ్ముడయ్యాయి. ఆశ టాయిస్కు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఇల్లు,ఆఫీసు అలంకరణకు వాడే వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. జైపూర్‌లో బాగా పాపులర్ అయిన ‘‘టాటూ కేఫ్’’ కు డ్రీమ్ క్యాచర్స్‌ను తయారు చేసి ఇవ్వడం విశేషం. ఒకపక్క బొల్లి, మరోపక్క అధిక బరువు ఉన్నప్పటికీ... తన టాలెంట్‌తో అందమైన క్రొచెట్ టాయిస్‌ను రూపొందిస్తూ కస్టమర్ల మనసులు గెలుచుకుంటోంది ఆశాఖత్రి. దారులన్నీ మూసుకు పోయినప్పటికీ... ఏదో ఒకదారి తెరిచే ఉటుంది. ఒపిగ్గా ఆ దారిని వెతికి పట్టుకుంటే బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమం అవుతుందనడానికి ఆశాఖత్రి ఉదాహరణగా నిలుస్తోంది. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) స్టూడెంట్ అయిన ఆష్క గొరాదియకు బాలీవుడ్లో బ్రేక్ రాలేదు. అయితే ఆ అసంతృప్తి ఆమె మాటల్లో ఎప్పుడూ తొంగి చూసేది కాదు. ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం కనిపించేది. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది. ‘రెనీ కాస్మెటిక్స్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనవిజయాన్ని సాధించింది.. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టింది ఆష్క గొరాదియ. తన ప్రయాణంలో రకరకాల సవాళ్లు, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. వాటివల్ల పోరాటం ఎలా చేయాలో తనకు తెలిసింది. హిందీ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే హాలీవుడ్ కలలతో అమెరికా వెళ్లింది. అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఎన్నో టీవి సీరియల్స్‌లో నటించి ‘టీవి స్టార్’గా పేరు తెచ్చుకున్న ఆష్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టాలనుకుంది. అయితే అది అంత తేలిక కాదనేది తనకు తెలియని విషయమేమీ కాదు. తన కళ్ల ముందే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే అవేమీ తనకు అడ్డు కాలేదు. మొదటి అడుగుగా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టిన ఆష్క ఎన్నో సక్సెస్ఫుల్ టీవీ షోలు చేసింది. ఆ తరువాత ట్రావెలర్స్ కోసం ఒక మొబైల్ యాప్ వెంచర్‌ను లాంచ్ చేసింది. ఆ తరువాత స్నేహితులతో కలిసి ప్రారంభించిన ‘రెనీ కాస్మెటిక్స్’ ఆమెను స్టార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆష్క ఘనవిజయం ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునే వారికి ఆమె చెప్పిన కొన్ని సలహాలు.. కల కనాలి... ముందుకదలాలి: ఒకరి నుంచి స్ఫూర్తి పొందిన తరువాత కల శ్రీకారం చుట్టుకుంటుంది. అయితే అది సాకారం కావాలంటే ఆచరణలోకి రావాలి. పనికి సంబంధించి స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అంకింతభావం ప్లస్ కష్టం: నటన అయినా వ్యాపారమైనా సక్సెస్ కావాలంటే అంకితభావంతో పాటు బాగా కష్టపడాలి. ఒకవేళ విజయం సాధించకపోయినా మనం కన్న కలకు దూరం కావద్దు. ఓటమి నేర్పే పాఠాలతో ముందుకు వెళ్లాలి. సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రిస్క్‌కు భయపడితే రిస్క్: ఈతకొట్టడానికి నీళ్లలోకి దిగిన తరువాత నీళ్లకు భయపడితే ఎలా! వ్యాపారం అన్నాక రిస్క్ ఉంటుంది. అంతమాత్రాన వెనక్కి తగ్గనవసరం లేదు. మూస ఆలోచనలకు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తే విజయం మన చెంతకు నడిచొస్తుంది. కోవిడ్ కల్లోల సమయంలో ఎన్నో వ్యాపారాలలాగే మా వ్యాపారం కూడా దెబ్బతింది. ‘ఇక నీకు నటనే దిక్కు’ అనేవాళ్లు. అయితే నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. మంచిరోజులు వస్తాయని గట్టిగా నమ్మాను. అది నిజమైంది. నెట్వర్క్: నటనకైనా, వ్యాపారానికైనా పదిమందితో పరిచయం ముఖ్యం. ఈవెంట్స్, వర్క్‌షాప్‌లకు హాజరుకావడంతో పాటు ఆన్లైన్ కమ్యూనిటీలతో టచ్‌లో ఉండాలి. సామాజిక సంబంధాల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచన పరిధి విస్తరిస్తుంది. ముందుకు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం లభిస్తుంది. యుఎస్పీ: ‘మా బ్రాండ్ ఇది’ అని మాత్రమే కాదు ‘మా యూఎస్పీ ఇది’ అని గర్వంగా చెప్పుకోగలగాలి. మా బ్రాండ్ విషయానికి వస్తే హై–క్వాలిటీ, గతంలో ఎప్పుడూ చూడని ప్యాకేజీ, పాకెట్–ఫ్రెండ్లీ ప్రైస్ అనేవి మా యూఎస్పీ. మార్కెట్ ప్లేస్‌లకు వెళుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ తెలుసుకోవాలి. ఆష్కకు నటన, యోగా, పోల్ డ్యాన్స్, ట్రావెల్ అంటే ఇష్టం. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది వాటికంటే రెండు రెట్లు ఎక్కువ ఇష్టమైనది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఆష్క‘బిజినెస్ ఉమన్’ పాత్ర ధరించలేదు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె ‘బిజినెస్ ఉమన్’గా అద్భుత విజయాన్ని సాధించింది. ‘ది బాస్ లేడీ’ అని స్నేహితులతో పిలిపించుకుంటోంది. (చదవండి: పద్నాలుగేళ్లకే ఎలన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా..) -
రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ!
Aditi Avasthi founder and CEO of Embibe: మహిళలు అనుకుంటే సాధించలేనది ఏదీ లేదు. ఏ రంగంలోనైనా తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. అలాంటి విజయవంతమైన మహిళల్లో ఒకరే అదితి అవస్తీ. బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఎంబైబ్ వ్యవస్థాపకురాలు, సీఈవో. టాప్ ఎడ్టెక్ కంపెనీల్లో ఒకటిగా నిలిచి బైజూస్, ఫిజిక్స్ వాలా, అనకాడెమీ వంటి పెద్ద ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది ఎంబైబ్. ఇదీ చదవండి: Divis Laboratories: ఎవరీ నీలిమ మోటపర్తి? ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు! అదితి అవస్తీ నేపథ్యం అదితి అవస్తీ పంజాబ్‌లోని లూథియానాలో జన్మించించారు. 2003లో థాపర్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశారు. చికాగో యూనివర్సటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఫైనాన్స్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేసిన అదితి అవస్తి తర్వాత బార్క్లేస్లో ఆఫ్రికాలోని మొబైల్ బ్యాంకింగ్ విభాగానికి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ స్ట్రాటజీ హెడ్‌గా పనిచేశారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ సహాయంతో 7 లక్షల డాలర్ల నిధులతో 2012లో ఎంబైబ్ సంస్థను స్థాపించారు. తర్వాత కలారి క్యాపిటల్, లైట్‌బాక్స్ వెంచర్స్ నుంచి కూడా పెట్టుబడులను సాధించారు. రిలయన్స్ పెట్టుబడులు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను మెప్పించి తన ఎంబైబ్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించింది. 2018లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 180 మిలియన్ డాలర్లను ఎంబైబ్‌లో ఇన్వెస్ట్ చేసింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంబైబ్‌లో 73 శాతం వాటాను కొనుగోలు చేయింది. అలాగే 2020లోనూ అదనంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. గుర్తింపులు, అవార్డులు అదితి అవస్తి 2021లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు. 2017లో బీబీసీ టాప్ 100 మంది మహిళలలో స్థానం సాధించారు. 2018లో వోగ్ ఆమెను 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేసింది. రూ.1600 కోట్లకుపైగా నిధులు నివేదికల ప్రకారం.. ఎంబైబ్ నాలుగు రౌండ్లలో మొత్తం 196.7 మిలియన్ డాలర్లు( రూ.1600 కోట్లకుపైగా) నిధులను సేకరించింది. కంపెనీ చివరి సారిగా 2020 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్నోవెన్ క్యాపిటల్‌తో సహా నాలుగు సంస్థలు ఎంబైబ్కు నిధులు సమకూరుస్తున్నాయి. గోవా ప్రభుత్వంతో భాగస్వామ్యం గోవా ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎంబైబ్తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఉన్న 594 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని సుమారు లక్ష మంది విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించనుంది ఎంబైబ్. బిజినెస్ రంగంలో ఇలాంటి విజయగాథలు, స్పూర్తివంతమైన కథనాల కోసం సాక్షి బిజినెస్ పేజీని చూస్తూ ఉండండి. -
లాయర్ల కుటుంబం నుంచి వచ్చి.. కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్‌తో ఎదిగి..
జార్ఖండ్‌లోని రాంచిలో పుట్టి పెరిగింది రోమిత. తండ్రి న్యాయవాది. తల్లిదండ్రులు తన పట్ల ఎప్పుడూ వివక్ష ప్రదర్శించలేదు. సోదరుడితో సమానంగా పెంచారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బిజినెస్ ఎకనామిక్స్ చదువుకునే రోజుల్లో కూడా తనకు వివక్ష ఎదురు కాలేదు. హార్బర్ రిడ్జ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది రోమిత. ఆ తరువాత వెంచర్ క్యాపిటలిస్ట్(వీసి)గా కూడా తనను తాను నిరూపించుకుంది. ఒకానొకరోజు...తనకు వ్యాపారరంగంలోకి ప్రవేశించాలని ఆలోచన వచ్చింది. లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన రోమితకు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని అనుకొని ఉంటే తన కలను నెరవేర్చుకునేది కాదు. కాస్మోటిక్స్ బేస్డ్ స్టార్టప్ గురించి ఆలోచనతో నిధుల సమీకరణకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు తనను బాధ పెట్టే ఎన్నో అనుభవాలు, ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు మాత్రమేనా?’ ‘మేల్ కో–ఫౌండర్ ఎవరూ లేరా? ‘మీకు పెళ్లి అయిందా? అయితే పూర్తి సమయం కంపెనీ కోసం ఎలా కేటాయించగలరు?’ ‘మీరు సీరియస్‌గా వ్యాపారరంగంలోకి వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఏదో సరదాగా వచ్చినట్లు అనిపిస్తుంది’... ఇవి మనసులోకి తీసుకునే ఉంటే రోమిత మజుందార్ తిరిగి వెనక్కి వెళ్లేదే తప్ప ముందుకు అడుగు వేసేది కాదు. ఎన్నో రకాల అనుమానాలు, అవమానాలను ఎదుర్కొని ఎట్టకేలకు కాస్మోటిక్ బేస్డ్ స్టార్టప్ ‘ఫాక్స్‌టేల్’తో తన కలను నిజం చేసుకుంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ నాలుగు రకాల ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశించి కొద్దికాలంలోనే విజయకేతనం ఎగరేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రోమిత మజుందార్ మంచి పేరు తెచ్చుకుంది. చదవండి: Viral: 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా! ఆ తండ్రికి పుత్రికోత్సాహం.. వీడియో వైరల్ -
Hyderabad: ఐఐటీలో మొదలైన ఉద్యోగ ప్రస్థానం! ఇప్పుడేమో సొంతంగా ఇలా..
ఐఐటీ చెన్నైతో మొదలైంది ఆమె ఉద్యోగ ప్రస్థానం. బిర్లా ఫార్మా, అద్వానీ ఆర్లికాన్, జండు ఫార్మా గ్రూప్ కంపెనీల్లో సాగింది. పెళ్లి తరవాత హైదరాబాద్‌కు వచ్చారామె. హైదరాబాద్‌లో టాటా క్రెడిట్ కార్ట్స్‌లో ఉద్యోగం. ఎంబీయే హెచ్ఆర్ చేసిన కాత్యాయని రెండు దశాబ్దాలకు పైగా ప్రఖ్యాతి చెందిన పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. ఓ సారి ప్రశాంతంగా సింహావలోకనం చేసుకున్నప్పుడు తెలిసింది ఏమిటంటే... ఇప్పటి వరకు తన మేధను, శ్రమను ఆయా కంపెనీల వృద్ధికే వెచ్చించడమైంది. ఇన్నేళ్ల తర్వాత తన ఐడెంటిటీ ఏమిటి? ఫలానా, ఫలానా కంపెనీల మాజీ ఉద్యోగి అనేది మాత్రమే. రిటైర్మెంట్ వరకు ఉద్యోగం చేసినా తన గుర్తింపు ఇదే. ‘జీవితం అంటే ఇది కాదు’ అని ఆమెకి అనిపించిన క్షణాలు చాలా బలమైనవే కావచ్చు. తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలా సాగిన ఆలోచనలకు ప్రతిరూపమే త్రిష ట్రెండ్స్. ఇప్పుడామె త్రిష ట్రెండ్స్ ఫౌండర్‌నని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటున్నారు. ప్రయోగాల పర్వం! ‘‘మా కుటుంబ మూలాలు కడప జిల్లాలో ఉన్నాయి. నాన్న వ్యాపార ఉద్యోగాల రీత్యా నేను పెరిగింది, చదువు చెన్నైలోనే. పెళ్లితో హైదరాబాద్ వచ్చాను. ఈ నగరంతో మమేకమైపోయాననే చెప్పాలి. నా లైఫ్ జర్నీని ఉద్యోగం చేసిన రోజులు, ఉద్యోగాలిస్తున్న రోజులుగా విభజించుకోవచ్చు. సృజనాత్మకతకు అవకాశం ఉండాలి, నా మార్కు ప్రతిబింబించే పని చేయాలి, నా ఆలోచనలకు ఒక రూపం ఇవ్వాలి... ఇలా ఆలోచించి డిజైనర్ ట్రెండ్స్‌తో కొత్త పంథాలోకి వచ్చేశాను. డిజైనర్ క్లాత్ ఇండస్ట్రీ నిర్వహణ ఎంత సంతృప్తినిస్తోందంటే... ఏ రోజుకారోజు చైతన్యవంతంగా ఉంచుతోంది. ఒక కొత్త డిజైన్‌కి రూపకల్పన చేయడంలో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. మధురై, కంచి, కోయంబత్తూర్, భాగల్పూర్, కోట, అస్సాం, కోల్‌కతాల నుంచి మెటీరియల్ తెస్తాను. దక్షిణాది మెటీరియల్ మీద ఉత్తరాది ట్రెడిషనల్ డిజైన్స్, అక్కడి వస్త్రాల మీద మన దక్షిణాది డిజైన్ల సమ్మేళనంతో అనేక ప్రయోగాలు చేయడం... కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మ్యాగజైన్లు, ఇంటర్నెట్ సర్ఫింగ్‌తో దేశంలోని అన్ని ప్రాంతాల ట్రెడిషనల్ డిజైన్లను, ఆలయాల మీద చెక్కిన శిల్పాల నుంచి కొత్త డిజైన్లను సేకరిస్తాను. ఆ పేపర్ని బ్లాక్ మేకర్స్‌కి ఇచ్చి బ్లాక్ చేయించుకుంటాను. అలా నేను సేకరించిన కళల నిధి, జ్ఞాన నిధి వేలాది బ్లాక్‌ల రూపంలో ఉంది. ప్రతి బ్లాక్ డిజైన్ వెనుక ఓ చరిత్ర, సంస్కృతి ఉంటుంది. గుజరాత్, సింద్, రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన అజ్రక్ ప్రింట్ మీద కూడా స్టడీ చేసి బ్లాక్‌లు చేయించాను. మహిళలకు మార్గదర్శనం సగటు మహిళల విషయానికి వస్తే... సొంతంగా ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు సరైన దిశానిర్దేశం చేసే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎమ్ఎస్ఎమ్ఈ ద్వారా ఇండస్ట్రీ పెట్టాను. నా దగ్గరకు వచ్చిన వాళ్లకు మొదట నేను అనుసరించిన విధానాన్ని వివరిస్తాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్ప్రైజెస్) ద్వారా ప్రభుత్వ పథకాలను ఎలా అందుకోవాలో వివరిస్తాను. ఏదైనా చేయాలనే ఉత్సాహం ఉండి ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండే మహిళలకు నా సూచన ఒక్కటే... సమాజంలో అవసరాన్ని గుర్తించి ఆ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి. ఓ ఇరవై ఏళ్ల కిందట టెలిఫోన్ బూత్‌లు వీథికి రెండు–మూడు ఉండేది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అవి కనుమరుగయ్యాయి. మొబైల్ ఫోన్లు, రీచార్జ్, యాక్సెసరీస్ షాపులు కనిపిస్తున్నాయి. ఇక ఎప్పటికీ డిమాండ్ తగ్గని రంగాలు ప్రధానంగా మూడు... ఆహారం, ఔషధాలు, దుస్తులు. మనిషి పుట్టినప్పటి నుంచి ఆయుష్షు ఉన్నంత వరకు వీటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత స్థానం బ్యూటీ ఇండస్ట్రీది. తమ అభిరుచిని, మార్కెట్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఇండస్ట్రీ గ్రోత్ రెండూ ఉంటాయి’’ అని తన జీవనప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు కాత్యాయని. స్కూళ్లు, కాలేజీల్లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్‌కి ఈ పాఠాలు, ప్రాజెక్ట్ వర్క్‌లు ఉంటున్నాయి. మా యూనిట్‌కి వచ్చే పిల్లలకు రంగులు కలపడం, డిజైన్ అద్దడం, బ్లాక్‌ల గురించి థియరీ వివరిస్తాను. మనం నేర్చుకున్న విద్య ఇచ్చే సంతోషం మాటల్లో వర్ణించనలవి కాదు. ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన పిల్లలు వాళ్లు నేర్చుకున్న ఆర్ట్‌ని క్లాత్ మీద ముద్రించుకుని ఎంతగా మురిసిపోతారో! దానిని భద్రంగా పట్టుకోవడం, నలగకుండా జాగ్రత్తగా బుక్‌లో పెట్టుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. నేను ఈ రంగంలో దాదాపుగా రీసెర్చ్ చేశాననే చెప్పాలి. నేను సేకరించిన వివరాలు, తెలుసుకున్న విషయాలను శాస్త్రబద్ధంగా గ్రంథస్తం చేయాలి. – పులికుంట కాత్యాయని, ఫౌండర్, త్రిష ట్రెండ్స్ – వాకా మంజులారెడ్డి చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. International Disability Day: నిశ్శబ్ద విజయం -
మీ కోడలు సంపాదించాల్సిన అవసరం ఏముందంటూ నాడు మాటలు.. ఇప్పుడేమో
అనల్ కొటాక్ను గుజరాత్ ఎంగెస్ట్ ఫుడ్ ఎక్స్‌పర్ట్‌గా శ్లాఘిస్తారు. చిన్న వయసులో జాతీయ స్థాయిలో గుజరాతీ వంటలకు గుర్తింపు తేవడమే ఆమె ఘనత. యూ ట్యూబ్‌లో వీడియోలతోపాటు మూడు నగరాల్లో ‘ది సీక్రెట్ కిచెన్’ పేరుతో నడుపుతున్న సొంత రెస్టరెంట్లు కిటకిటలాడుతుంటాయి. ఇంటి ఫంక్షన్లో వంటవాళ్లు రాకపోయేసరికి అనుకోకుండా గరిటె పట్టిన అనల్ నేడు బాండీలో కరెన్సీకి పోపేస్తోంది. పెళ్లయ్యాక, కోడలి హోదాలో ఒక రెస్టరెంట్ ప్రారంభించాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో అనల్ని అడగాలి. ‘నేను వడోదరాలో నా తొలి రెస్టరెంట్‌ను ప్రారంభించాలనుకున్నాను. దాని పని రాత్రి పది దాకా జరిగేది. అప్పుడు ఇల్లు చేరేదాన్ని. అది చూసి ఇరుగుపొరుగు వారు మా అత్తగారి దగ్గరకు వెళ్లి ఏమిటేమిటో చెప్పేవారు. మీ కోడలు హోటలు నడిపితే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అత్తగారు అయ్యాక కూడా మీరే వండుతున్నారా? మీకు ఇప్పుడు మీ కోడలు సంపాదించాల్సినంత డబ్బు అవసరం ఏమొచ్చింది? బాగనే ఉన్నాయిగా మీకు... ఇలా మాట్లాడేవారు. కాని మా అత్తగారు, మామగారు, నా భర్త ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అందుకే మొదలైన రెండు నెలల్లో నా రెస్టరెంట్– ది సీక్రెట్ కిచెన్ సూపర్ హిట్ అయ్యింది’ అంటుంది అనల్ కొటాక్. అనల్కు ఇప్పుడు వడోదర, సూరత్, అహ్మదాబాద్‌లలో ‘ది సీక్రెట్ కిచెన్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. ఇవి కాక కెఫేలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా చైన్ రెస్టరెంట్లు ఉన్నాయి. ఇవన్నీ భర్త సపోర్ట్‌తో అనల్ నడుపుతోంది. ఫుడ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆమె సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. వంట పిచ్చి ‘చిన్నప్పటి నుంచి నాకు వంట అంటే ఆసక్తి ఉండేది. మాది కలిగిన కుటుంబం. అమ్మమ్మ, నానమ్మ రకరకాల వంటలు చేసేవారు. వారిలాగా వండటం ఇప్పటికీ నాకు అసాధ్యం. కాని నేర్చుకున్నాను. నాకు హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉండేది. మా నాన్న ‘ఏంటి వంట చదువు చదువుతావా?’ అన్నారు. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నిఫ్ట్‌లో. కాని వంట మీద ఆశైతే చావలేదు. అప్పుడే ‘కలర్స్ గుజరాతీ’ చానల్లో ‘రసోయి షో’ అని వచ్చేది. అందులో పాల్గొనాలని వెళితే నీకింకా 19 ఏళ్లే. ఇక్కడంతా 40 ఏళ్ల గృహిణులు ఉన్నావు... నువ్వు నెగ్గలేవు అని పంపించేశారు. మరుసటి సంవత్సరం నా పెళ్లికి మెహందీ జరుగుతుండగా ఆ చానల్ నుంచి అదే షో కోసం ఆడిషన్‌కు పిలిచారు. ఇంట్లో అమ్మకు మస్కా కొట్టి వెళ్లి ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. పెళ్లయ్యాక ఆ షోలో పాల్గొంటే ఫైనల్ స్టేజ్‌కు చేరి ‘యంగెస్ట్ చెఫ్ ఆఫ్ గుజరాత్’గా అవార్డు అందుకున్నాను. ఆ పాపులారిటీతో అదే చానల్‌వారు వంట షోకు నన్ను యాంకర్‌గా తీసుకున్నారు. అలా నేను వంటల ప్రపంచంలో అడుగుపెట్టాను’ అంటుంది అనల్. డిప్రెషన్ ‘రెస్టరెంట్ బాగా నడుస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను. దాంతో అమ్మానాన్న, అత్తమామలు పని తగ్గిచ్చుకో... బాబుకు టైమ్ ఇవ్వాలి అనడం మొదలెట్టారు. గర్భంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో నా పని నేను చేసుకోలేనా అని డిప్రెషన్ మొదలయ్యింది. చాలా బాధ పడ్డాను. కాని లోపలి నుంచి నా బిడ్డ నాకు ధైర్యం చెప్పినట్టు అనిపించింది. నేను నీకు బలమే అవుతానమ్మా... బలహీనతగా మారను అన్నట్టుగా భావించి మళ్లీ మామూలుగా పనిలో పడ్డాను. కొడుకు పుట్టాడు. వాడికి మూడేళ్లు. పొద్దున వెళ్లి తిరిగి రాత్రి ఎనిమిదికే వాణ్ణి చూస్తాను. కాని ఉన్నంతసేపు వాడికి పూర్తి సమయం ఇస్తాను. వాడికి మంచి అమ్మగా ఉంటూనే నేను సాధించాల్సిన విజయాలన్నీ సాధిస్తాను’ అంది అనల్. అనల్ ఇప్పుడు గృహిణుల కోసం తన సొంత మసాలాలను ‘టిఎస్కె’ బ్రాండ్ మీద అమ్ముతోంది కూడా. ఇంట్లో నలుగురి కోసం వండేది వంటే. కాని అందులో ప్రావీణ్యం, ప్రయత్నం ఉంటే వంటతో కూడా ఐశ్వర్యం పొందవచ్చు. అందుకు అనల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మసాలా రహస్యం ‘నాకు రెస్టరెంట్ ప్రారంభించాలనిపించింది. కాని జనం డబ్బు తీసుకుని ఆహారం అమ్మాలి. అది ఎంత రుచిగా ఉండాలి. మన దేశం మసాలాలకు పట్టుగొమ్మ. ఆ మసాలాల రహస్యం తెలుసుకోవాలనుకున్నాను. సొంతగా మసాలాలు తయారు చేశాను. ఆ రహస్య మసాలాలతో నా రెస్టరెంట్ ‘ది సీక్రెట్ కిచెన్’లో వంటలు చేశాను. రెండు నెలల్లో పేరు వచ్చింది. ఎంత పేరంటే ముంబై నుంచి గుజరాతీలు వడోదరా వచ్చి మరీ తినడం మొదలెట్టారు’ అంటుంది అనల్. గుజరాత్లో సౌత్ ఇండియన్ రెస్టరెంట్‌ను ‘సౌత్ఏకె’ పేరుతో తెరిచిందామె. చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే! -
సౌమిత బసు.. వీల్‌చైర్ నుంచి సీఈవో వరకు
జీవితమంటేనే కష్టసుఖాల కలయిక. సాఫీగా ఆనందంగా సాగిపోతున్న ప్రయాణంలో కొన్నిసార్లు తగిలే దెబ్బలు మనిషిని పాతాళంలోకి నెట్టేస్తాయి. నాట్యమయూరిలా నాట్యం చేస్తోన్న సౌమిత బసుని కూడా అనుకోని ఉపద్రవం అథఃపాతాళంలోకి తోసేసింది. అయినా ఆమె ఏమాత్రం అధైర్యపడలేదు. తనకెదురైన చేదు అనుభవాలకు ఏమాత్రం కృంగిపోకుండా, వాటిని ప్రేరణగా తీసుకుని ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. కోల్‌కతాకు చెందిన చెందిన సౌమిత బసు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేది. భరతనాట్యం నేర్చుకుని అనేక స్టేజి ప్రదర్శనలతోపాటు, మంచి క్రియేటివ్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న 32 ఏళ్ల సౌమితను 2014లో సోరియాటిక్ ఆర్థరైటిస్ కబళించేసింది. దీంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. క్రమంగా ఆరోగ్యం క్షీణించి ఎనభై శాతం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైంది. రెండేళ్లపాటు అన్నింటికి దూరంగా అలా పడుకుని ఉండాల్సి వచ్చింది. బట్టలు వేసుకోవాలన్న మరొకరి సాయం తీసుకోవాలి. ఏ పనీ సొంతంగా చేసుకోలే ని పరిస్థితిలో.. అప్పటివరకు తనలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా కోల్పోసాగింది. ఒకరోజు అనుకోకుండా ‘‘నాకు ఈ ఆర్థరైటిస్ వచ్చిన దగ్గర నుంచి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. కానీ పుట్టుకతోనో, ప్రమాదాల వల్లనో అవయవాలు కోల్పోయినవారు సైతం ఇటువంటి ఇబ్బందులే పడుతున్నారు. అలాంటి వారు ఎలా బట్టలు వేసుకుంటున్నారా..’’ అనిపించింది సౌమితకు. అప్పటినుంచి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాలని ఆలోచించసాగింది. వీల్‌చైర్ నుంచి సీఈవోగా.. ఒకపక్క తన బట్టలు తను వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మరొకరి సాయం తీసుకోకుండా వేసుకునేలా బట్టలు ఉండాలి. తనలాంటి వాళ్లు సులభంగా వేసుకునే బట్టలు మార్కెట్లో ఏమేం ఉన్నాయా అని వెతకడం ప్రారంభించింది. ఈ వెతుకులాటలో ప్రత్యేక అవసరాలు కలిగిన వాళ్లకు బట్టలు అందించే బ్రాండ్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవికూడా అంత సౌకర్యంగా లేవు అని గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో వికలాంగుల జనాభా శాతం అంత తక్కువేమి కాదు. వీరికి నప్పే బట్టలను డిజైన్ చేయగలిగితే ..వారికి సాయం చేయడంతోపాటు ఆదాయం వస్తుందని గ్రహించి తనకు తెలిసిన వారి దగ్గర కొంత డబ్బుని అప్పుగా తీసుకుని 2020 జనవరిలో తల్లితో కలిసి ‘జైనిక’ బ్రాండ్‌ను ప్రారంభించి స్టార్టప్‌కు సీఈవో అయ్యింది. తన కోసం చేసుకున్నవి.. ప్రారంభంలో సౌమిత తను వేసుకోవడానికి వీలుగా ఉండే వస్త్రాన్ని ఎంపికచేసి, దానితో డ్రెస్‌లు డిజైన్ చేసుకుంది. ఆ డిజైన్లు కస్టమర్లకు నచ్చి తమకూ కావాలని అడగడంతో..వారి కోరిక మేరకు డ్రెస్‌లు రూపొందించి విక్రయించేది. తరువాత ‘‘పూర్తిగా ఒకరిమీద ఆధారపడడం, కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోని వారు, పాక్షికంగా ఇతరుల మీద ఆధారపడే వారు’’ ఇలా కస్టమర్లను మూడు కేటగిరీలుగా తీసుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా దుస్తులను డిజైన్ చేస్తోంది. వృద్ధులు, ఆర్థరైటిస్, పార్కిన్సన్స్, ఫైబ్రోమైలాగి, దీర్ఘకాలిక వ్యాధులు, ఆటిజం, మస్తిష్క పక్షవాతం, క్యాన్సర్, ఫ్రోజెన్ షోల్డర్స్ వంటి అనేకరకాల సమస్యలతో బాధపడుతోన్న వారికి జైనిక డ్రెస్‌లను అందిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్లదాక.. ప్రత్యేక అవసరాలు కలిగిన స్త్రీ పురుషులకేగాక, పిల్లలకు కూడా జైనిక డ్రెస్‌లను రూపొందిస్తోంది. క్యాజువల్సే కాకుండా, వృత్తిపరమైన డ్రెస్‌లు, కొంచెం కూడా వంగకుండా వేసుకోగల ట్రౌజర్లు, డ్రెస్‌లా కట్టుకునే చీరలు, టాప్‌లు, స్త్రీలు, పురుషులు ధరించే లోదుస్తులు కూడా అందిస్తోంది. జైనిక డ్రెస్‌లు వాడుతోన్న ఎంతోమంది వికలాంగులు ఎంతో సౌకర్యంగా ఉన్నాయని చెబుతుండడం విశేషం. బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులు సైతం టాయిలెట్స్ వాడుకునే విధంగా డ్రెస్‌లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేవలం ఇరవై ఒక్కవేల పెట్టుబడితో ప్రారంభించిన జైనిక నేడు లక్షల టర్నోవర్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం నలభై ఏళ్ల వయసులో వీల్ చెయిర్లో తిరుగుతూ సౌమిత .. కోల్‌కతాలో ఉన్న తయారీ యూనిట్‌ను మిగతా ప్రాంతాలకు విస్తరించి మహిళలు, వికలాంగులకు ఉపాధి కల్పిచడం, నాణ్యతతోపాటు, పర్యావరణ హితంగా ఉండే డ్రెస్‌లు రూపొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సెకన్లలో ధరించవచ్చు ప్రత్యేక అవసరాలు కలిగిన వారు ఒక షర్ట్ వేసుకోవాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది. ఇది నా స్వానుభవమేగాక నాలాంటి వారు ఎంతోమంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు. నేను డిజైన్ చేసిన షర్ట్ కేవలం తొంబైసెకన్లలో వేసుకోవచ్చు. చీర అయితే ముఫ్పై సెకన్లలోనే కట్టుకోవచ్చు. ఇప్పటి ఫ్యాషన్‌కు తగ్గట్టుగా శరీర తత్వాన్ని బట్టి సౌకర్యవంతంగా... ఫ్యాషన్‌బుల్‌గా ఉండే డిౖజñ న్లను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నాను. నా ఆరోగ్యం బాగోనప్పుడు అమ్మే అన్నీ తానై చూసుకుంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. – సౌమిత బసు, సీఈవో జైనిక -
గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కాల్‌సెంటర్
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్ఏపీ కలిసి సంయుక్తంగా ’డిజివాణి కాల్‌సెంటర్’ ఏర్పాటు చేశాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్లు నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ తెలిపారు. ప్రాథమికంగా 20,000 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు దీని ద్వారా సేవలు అందించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమకు ఉపయోగపడే వివిధ పథకాలు, వ్యాపార వృద్ధికి సహాయపడే స్కీములు లేదా ఇతరత్రా సమాచారం మొదలైన వాటన్నింటి గురించి డిజివాణి ద్వారా తెలుసుకోవచ్చని భాసిన్ వివరించారు. దీనికి అవసరమైన నిధులను గూగుల్ సమకూరుస్తోందని, ఏడాది తర్వాత డిజివాణి సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ (ఐఎస్ఏపీ)కి చెందిన ఢిల్లీ, లక్నో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్లలో 19 మంది సిబ్బంది ఉన్నారు. -
నైకా ఫాల్గుని నాయర్ ఖాతాలో మరో ఘనత
చిన్న వయసులోనే సెల్ఫ్‌మేడ్ బిలియనీర్‌గా రికార్డు సృష్టించిన నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ఎంటర్‌ప్యూనర్ ఆఫ్ ది ఇయర్ 2021 (ఈవై) అవార్డు గెలుచుకున్నారు. రెగ్యులర్ మార్కెట్లో మాత్రమే అమ్ముడయ్యే సౌందర్య ఉత్పత్తులను ‘నైకా’తో ఈ కామర్స్‌లోకి తీసుకెళ్లి ఘన విజయం సాధించారు ఫాల్గుని నాయర్. అంతేకాదు గతేడాది నైకా ఐపీవోకి బంపర్ హిట్ సాధించింది. రాత్రికి రాత్రే ఫాల్గుని నాయర్ బిలియనీర్‌గా మారింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో అస్థితర నెలకొన్నా నైకాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. జూన్‌లో జరగబోయే వరల్డ్ ఎంటర్‌ప్యూనర్ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో ఆమె ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎల్ అంట్ టీ చైర్మన్ ఎఎం నాయక్‌కి లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రకటించింది ఈవీ సంస్థ. 1965లో ఎల్ అంట్ టీలో చేరిన నాయక్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2003లో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయంలో ఎల్ అండ్ టీ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రపంచ వ్యాప్తంగా చేపట్టింది. -
పది లక్షల పెట్టుబడితో మొదలుపెట్టి... దేశవ్యాప్తంగా..
ఏంచేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా కులాసాగా కూర్చోవడం కంటే... ‘ఎందుకిలా చేయకూడదు’ అని రిస్క్ తీసుకునేవారికే గొప్ప సక్సెస్‌లు దక్కుతాయి. అలాంటిదే జష్ షా సక్సెస్ స్టోరీ... గొప్ప ఐడియాలు కిచెన్రూమ్లో పుడతాయనే మాట మరోసారి నిజమైంది. ఎలా అంటే... ముంబైకి చెందిన జష్ షా జిమ్‌లో కసరత్తులు చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, ఆరోగ్యకరమైన ఆహారానికి అంతే ప్రాధాన్యత ఇస్తాడు. అయితే జష్కు ఐస్‌క్రీమ్‌లు తినడం అంటే మాత్రం చెప్పలేనంత ఇష్టం. రోజూ ఉండాల్సిందే! బయటి ఐస్‌క్రీమ్‌ల జోలికి వెళ్లకుండా ఆరోజు ‘ఐస్‌క్రీమ్ కావాలి’ అని తల్లిని అడిగాడు. అలా తల్లి, అక్కలతో పాటు కిచెన్‌లోకి చేరాడు జష్ షా. ఈ క్రమంలో వారి మధ్య ప్రొటీన్ ఐస్‌క్రీమ్ గురించి చర్చ జరిగింది. ‘అసలు మనమే ఎందుకు ప్రయత్నించ కూడదు’ అన్నాడు షా. అలా రకరకాల ప్రొటీన్లతో ఆరోజు ఐస్‌క్రీమ్ తయారైంది. ఆహా ఏమిరుచి! మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన జష్ షాకు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం చేయడం అంటే ఇష్టం. ఏ వ్యాపారం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు తల్లి తన కోసం తయారుచేసిన ఐస్‌క్రీమ్ గుర్తుకువచ్చింది. అలా ‘గెట్–ఏ–వెయ్’కి అంకురార్పణ జరిగింది. పది లక్షల పెట్టుబడితో ‘గెట్–ఏ–వెయ్’ పేరుతో ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీ మొదలు పెట్టారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పాలను మాత్రమే ఉపయోగిస్తారు. షుగర్‌కు బదులుగా ఆర్గానిక్ స్వీటెనర్ ఎరిత్రిటాల్ ఉపయోగిస్తారు. ఐస్‌క్రీమ్ తయారీలో ‘వెయ్ ప్రొటీన్’ రా ను ఉపయోగిస్తారు. బెల్జియన్ చాక్లెట్, స్ట్రాబ్రెర్రీ బనానా....ఇలా ఎనిమిది రకాల ఫ్లేవర్స్‌తో రూపొందించారు. కొత్తగా ప్రారంభమయ్యే అన్ని వ్యాపారాల మాదిరిగానే ప్రారంభ ప్రతికూలతలు పలకరించాయి. అయితే షా వెనక్కి తగ్గలేదు. ప్రముఖులు, న్యూట్రీషనిస్ట్ల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ రిటైల్ షాప్‌లలో వీరి ఉత్పత్తులకు తిరస్కారమే ఎదురయ్యేది. మనలాంటి దేశాల్లో ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా ఆన్లైన్ బ్రాండ్‌ను సృష్టించలేము. అలా అని ఆన్లైన్ వేదికను నిర్లక్ష్యం చేయలేము. రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేశాడు. గుడ్ క్వాలిటీ ఉన్నప్పటికీ సరిౖయెన ప్రచార వ్యూహం లేకపోతే దెబ్బతింటాం. ఈ విషయాన్ని అవగతం చేసుకున్న షా ప్రచారంపై దృష్టి పెట్టాడు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్‌ను ఉపయోగించుకున్నాడు. గూగుల్ షీట్ ద్వారా కస్టమర్స్ నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాడు. ఇప్పుడు గెట్–ఏ–వెయ్ పెద్ద బ్రాండ్‌గా మారింది. ముంబైలో పుట్టిన గెట్–ఎ–వెయ్ పుణె, నాగ్‌పూర్,సూరత్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్...మొదలైన నగరాలకు విస్తరించడం, షార్క్ టాంక్ ఇండియా(బిజినెస్ రియాల్టీ టెలివిజన్ షో) ఫస్ట్ ఎడిషన్‌లో అష్నీర్ గ్రోవర్, అయన్ గుప్తా, వినీత్సింగ్లాంటి ఎంటర్ప్రెన్యూర్లు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడం.... 26 సంవత్సరాల జష్ షా సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తున్నాయి. చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి? -
ఒక క్లిక్‌తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
Swasti Mehta: పుదీనా పంచ్.. లీటర్ బాటిల్ రూ. 2 వందలు.. 30 మంది తాగొచ్చు!
‘‘ఉదయం పది గంటలకు నిద్రలేచి, ఫ్రెష్ అయ్యాక వెంటనే జ్యూస్ చేయడం ప్రారంభిస్తాను. ఇలా మధ్యాహ్నం రెండు గంటల వరకు జ్యూస్ తయారు చేసి తర్వాత భోజనం చేస్తాను. పని పూర్తయ్యాక, నాకెంతో ఇష్టమైన ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ షో ను చూసి బాగా ఎంజాయ్ చేస్తాను’’ అని చెబుతోంది స్వస్తి మెహతా. ఇందులో కొత్త ఏముంది ఏ అమ్మాయిని అయినా రోజూ ఏం చేస్తావ్? అని అడిగితే ఇలానే చెబుతారు కదా! అనుకోవచ్చు. కానీ స్వస్తి అందరి అమ్మాయిల్లాంటి కాదు. డౌ సిండ్రోమ్‌తో పుట్టిన అమ్మాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు సవ్యంగా నడవడం, మాట్లాడడం అంతంత మాత్రమే. సాధారణ పిల్లల్లా వీళ్లు అన్ని పనులు చేయలేరు. అలాంటిది స్వస్తి మెహతా ఏకంగా జ్యూస్ తయారు చేసి విక్రయిస్తూ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ముంబైకు చెందిన స్వస్తికి పుట్టుకతో డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్నప్పటికీ .. మిగతా పిల్లలకంటే ఎంతో చురుకుగా ఉండేది. స్పీచ్ థెరపీ ద్వారా తన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. దీంతో డౌన్ సిండ్రోమ్ పిల్లలకోసం ప్రత్యేకంగా నడుపుతోన్న దిల్ఖుష్ స్కూల్లో తల్లిదండ్రులు చేర్పించారు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలతో కలవడం వల్ల ఇంగ్లిష్, మరాఠీ గుజరాతీ, హిందీ భాషలను నేర్చుకుంది. డౌన్ సిండ్రోమ్ పిల్లలు అకడమిక్ పరీక్షలలో ఉత్తీర్ణులవ్వడం కష్టమైనప్పటికీ, వొకేషనల్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోగలుగుతారు. స్వస్తికూడా ఈ నైపుణ్యాలను అవపోసన పట్టింది. మొదటి లాక్డౌన్లో.. స్కూలునుంచి ఇంటికి వచ్చిన స్వస్తి.. తీవ్ర మానసిక సంఘర్షణకు గురైంది. ఈ సమయంలో మొండిగా, దూకుడుగా ఉండేది. దీంతో స్కూల్లో నేర్చుకున్న నైపుణ్యాలన్నీ వృధా అయిపోయాయి అనుకున్నారు తల్లిదండ్రులు. తర్వాత మానసిక వైద్యుల సలహాలు, ఇచ్చిన మందులతో క్రమంగా కోలుకుని మామూలు స్థితికి వచ్చింది. కాస్తకోలుకుని స్కూలు వెళ్తున్న సమయంలో కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో స్కూలుకు వెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక వివిధరకాల వంటలు వండుతూ ప్రయోగాలు చేసేది. ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు. ఈ క్రమంలోనే ‘పుదీనా’ డ్రింక్‌ను తయారు చేసింది. పుదీనా పంచ్.. స్వస్తి తయారు చేసిన పుదీనా డ్రింక్ రుచికరంగా ఉండడంతో ఎక్కువ మొత్తంలో జ్యూస్‌ను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టింది. స్వస్తి స్వయంగా మార్కెట్ నుంచి పుదీనా తీసుకువచ్చి శుభ్రంగా కడిగి పేస్టు చేస్తుంది. తర్వాత ఈ పేస్టులో నిమ్మరసం, పంచదార కలిపి జ్యూస్ తయారు చేస్తుంది. ఈ జ్యూస్ పేరే ‘పుదీనా పంచ్’. ఈ జ్యూస్ నాణ్యంగా, రుచికరంగా ఉండడంతో ఆనోటా ఈనోటా తెలిసి పుదీనా పంచ్‌ను చాలా మంది ఎగబడి కొంటున్నారు. ఒకరిద్వారా మరొకరికి చివరికి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడంతో పుదీనా పంచ్ విక్రయాలు బాగా పెరిగాయి. లీటర్ బాటిల్‌ను రెండు వందల రూపాయలకు విక్రయిస్తోంది. ఈ బాటిల్ జ్యూస్‌ను ముఫ్పై మంది వరకు తాగవచ్చు. చాలా ఓపిక ఉండాలి.. ‘‘తమ బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉందంటే ఒక్కనిమిషం జీవితం అంధకారమైనట్టు అనిపిస్తుంది. నిమిషం తరువాత తేరుకున్నాక బిడ్డ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన ఏర్పడుతుంది. అయినా ఓపిక, సహనంతో పిల్లలను చూసుకోవాలి. వారి ఆసక్తులను గమనించి ఆ దిశగా ప్రోత్సహించాలి. తద్వారా వారి అభ్యున్నతికి కృషిచేయాలి. స్వస్తి విషయంలో ఇదే చేశాము. దాని ఫలితమే పుదీనా పంచ్ బ్రాండ్. కరోనా సమయంలో విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకి ఇరవైకి పైగా ఆర్డర్లు వస్తున్నాయి’’ అని స్వస్తి తల్లి దర్శనా మెహతా సంతోషంగా చెప్పారు. -
15 ఏళ్లకే చూపు పూర్తిగా తగ్గింది... అయినా ధైర్యంగా.. ఇప్పుడు నెలకు 50 వేలు సంపాదిస్తూ
Visually Impaired Woman Geetha Inspiring Journey In Telugu: గీత పదమూడేళ్ల అమ్మాయి. బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదని తరచూ చెప్తోంది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. రకరకాల పరీక్షలు చేశారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అని తేల్చారు. అది అత్యంత అరుదైన జన్యుపరమైన సమస్య. వైద్యం ద్వారా పోయిన చూపును తీసుకురావడం కాదు కదా దృష్టి మరింత క్షీణించకుండా ఆపడమూ సాధ్యం కాలేదు. పదిహేనేళ్లు వచ్చేటప్పటికి చూపు పూర్తిగా తగ్గిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు 39 ఏళ్ల సక్సెస్ఫుల్ ఉమన్. సొంత కుటీరపరిశ్రమ ద్వారా నెలకు యాభై వేలు సంపాదిస్తోంది. ‘గీతాస్’ అని తన పేరుతోనే తన ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంది, తన విజయాన్ని తన పేరుతోనే నమోదు చేసుకుంది. తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకుంది. నచ్చని పదం ‘రెస్ట్’ కేరళలోని త్రిశూర్కి చెందిన గీత దృష్టిలోపం కారణంగా దేనినీ ఆపలేదు. ఆత్మవిశ్వాసంతో చదువును బ్రెయిలీలో కొనసాగించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఏమీ చేయకుండా ఊరుకోవడం తనకు నచ్చలేదు. దాంతో భర్త సహకారంతో చిన్న రెస్టారెంట్ ప్రారంభించింది. ఆమె స్వయంగా వండేది కూడా. ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ అది. వంటకాలు, పండ్ల రసాలు అన్నీ సేంద్రియ పద్ధతులతో పండించిన పండ్లు, కూరగాయలు, ధాన్యాలతోనే. ఆ ప్రయత్నం ఆమెను విజయపథంలో నడిపించింది. కాలం పరీక్షలు పెట్టకుండా ఆగదు. ఆ రెస్టారెంట్ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆమె మరో ప్రదేశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కొంతకాలం ఇల్లు, పిల్లల పెంపకంలో విశ్రాంతిగా గడపమని భర్త సలీశ్ సూచించాడు. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్. గీతకు ఇష్టంలేని మాట ‘విశ్రాంతి’. సొంత పరిశ్రమ అయితే ఎక్కువ సమయం పరిశ్రమ కోసమే కేటాయించాల్సి వస్తోంది. ఉద్యోగం అయితే కొంత వెసులుబాటు ఉంటుందని ఆలోచించింది. కానీ అప్పటికే ఆమె రెస్టారెంట్ నడిపి తనను తాను నిరూపించుకుని ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఎవరూ ఇవ్వకపోతే ఏంటి? నేనే మరొకరికి ఉద్యోగం ఇస్తాను అనుకుంది గీత దృఢంగా. తనకు బాగా పట్టున్న వంట పనినే ఈ సారి ఇంటి నుంచి మొదలు పెట్టింది. అలాగే షెల్ఫ్‌లైఫ్ ఎక్కువ కాలం ఉండే పదార్థాలను వండసాగింది. వాటిని ఆన్లైన్లో మార్కెట్ చేయడమూ మొదలుపెట్టింది. ‘గీతాస్ హోమ్ టు హోమ్’ బ్రాండ్ మీద ఆమె తయారు చేస్తున్న నెయ్యి, పచ్చళ్లు, బాలింతలు తినాల్సిన ఔషధ ఆహారానికి మార్కెట్ కేరళ నుంచి కశ్మీర్ వరకు విస్తరించింది. గీత ప్రపంచాన్ని చూడలేదు. కానీ ప్రపంచం ఆమెను చూసేలా చేసుకోగలిగింది. ఇది గీత గ్రహించిన జీవితసారం. తన కంటిచూపును హరించిన విధిని సవాల్ చేస్తోంది. చదవండి: లోన్ కావాలంటే 2 నిమిషాలే.. క్లిక్ చేశారో ఇక అంతే?! -
కేటీఆర్ చేసిన ఆ పనికి పారిశ్రామికవేత్తలు ఫిదా
పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టైలే వేరు. పారిశ్రామికవేత్తలను కలవడం దగ్గర నుంచి పెట్టుబడులకు వారిని ఒప్పించడం వరకు మంత్రిగా ఎంతో చొరవ చూపిస్తారు. ఇటీవల ఆయన చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా అనేక మంది ఇండస్ట్రియలిస్టులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్యశాఖ మంత్రి కేటీఆర్ పనితీరుని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. చిన్నపిల్లల దుస్తుల తయారీ రంగంలో అమెరికాకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న కైటెక్స్ సంస్థ కేరళలో వస్త్ర పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నాల్లో ఉండగా అనుమతుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. దీంతో ఆ సంస్థ అక్కడ పరిశ్రమ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయం పత్రికల్లో చదివిన మంత్రి కేటీఆర్ వెంటనే కైటెక్స్ సంస్థ ఎండీ సాబు జాకబ్‌తో ఫోన్లో మాట్లాడారు. అంతటితో ఆగలేదు. సాబు జాకబ్ హైదరాబాద్ వచ్చేందుకు ప్రత్యేకంగా విమానం కూడా ఏర్పాటు చేశారు. అలా తెలంగాణ వచ్చిన సాబు జాకబ్ వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2,400 కోట్ల వ్యయంతో రెండు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఓ బిజినెస్‌మాన్‌ను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ ఫ్లైట్ పంపించడాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. గోయెంకా ట్వీట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది నెటిజన్లు స్పందించారు. మంత్రి కేటీఆర్ పనితీరుని మెచ్చుకున్నారు. హర్ష్ గోయెంకా ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. పారిశ్రామిక వేత్తలను గౌరవించడం మన విధి అని చెబుతూ.. అలా చేయడం ద్వారా త్వరగా ఉపాధి కల్పించడంతో పాటు సంపదను పెంచేందుకు అవకాశం లభిస్తుందని బదులిచ్చారు. దీనికి ప్రతిగా మీ లాంటి నేతలు ఈ దేశానికి కావాలంటూ హర్ష్ అన్నారు. Harsh Ji, Many thanks for your kind words🙏 We as a nation need to start respecting & celebrating our entrepreneurs, make it easy for them to create employment & wealth which in turn will spur growth Telangana offers a red carpet welcome to investors with unique TS-iPASS policy https://t.co/pzSNjLdQ2q — KTR (@KTRTRS) September 23, 2021 చదవండి : ‘కైటెక్స్’ పెట్టుబడి మరో 1,400 కోట్లు -
Shradha Sharma: మీ కథే.. ఆమె కథ.. పబ్లిష్ చేసుకోండిలా!
యువర్ సక్సెస్ స్టోరీ... ఎవరి విజయగాథను వారే స్వయంగా రాసుకుని, ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. విజయం సాధించటంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రతి సవాళ్లను కూడా స్వేచ్ఛగా తెలియచేసుకోవచ్చు. ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తూ, ఉత్తేజాన్ని ఇస్తూ, ఆదర్శంగా నిలిచే ప్రదేశం ఇది. అదే –యువర్ స్టోరీ. దీని ఫౌండర్ శ్రద్ధా శర్మ. ప్రపంచంలో విజయం సాధించిన వారు చాలామంది ఉంటారు. కాని అందరి విజయగాథలు తెలుసుకునే అవకాశం ఉండదు. అటువంటి వారి గురించి అందరూ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు యువర్ స్టోరీ ఫౌండర్ అండ్ సిఈవో శ్రద్ధా శర్మ. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విజయగాథలను ప్రతి ఇంటికి చేరువ చేయాలనే లక్ష్యంతో ‘యువర్ స్టోరీ’ అనే సామాజిక మాధ్యమాన్ని స్థాపించారు శ్రద్ధా శర్మ. ఇప్పటికి ఈ మాధ్యమం ద్వారా 70,000 విజయ గాథలను పరిచయం చేశారు. ‘‘సమాజంలో మనలో ఒకరుగా, మన చుట్టూ ఉన్నవారి విజయాలను అందరికీ తెలియచేయటానికే ఈ వేదిక ఏర్పాటు చేశాను’’ అంటారు శ్రద్ధా శర్మ. ఇదే కారణం... ‘యువర్ స్టోరీ’ అంటూ ప్రారంభించిన శ్రద్ధా శర్మ సొంత స్టోరీ కూడా ఆసక్తికరమే. శ్రద్ధా పాట్నా వాస్తవ్యురాలు. ప్రాథమిక విద్య అయ్యాక ఢిల్లీలో మంచి పేరు పొందిన ‘సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ’నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, అహ్మదాబాద్ ‘ఎం.ఐ.సి.ఏ’ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువులో ముందున్న శ్రద్ధాశర్మకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘సి.ఎన్.బి.సి’ వంటి ప్రముఖ మీడియా సంస్థ లలో పనిచేసే అవకాశం వచ్చింది. సిఎన్‌బిసి లో ఉన్నత పదవిలో పనిచేశారు. ఆ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లోనే శ్రద్ధా శర్మ ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నేరుగా మాట్లాడి ఆ కథలను ప్రసారం చేశారు. అలా ఎంతోమంది సిఈవోలతో మాట్లాడే అవకాశం కలిగింది శ్రద్ధా శర్మకు. వారి విజయగాథలను నేరుగా పరిశీలించిన శ్రద్ధా శర్మకు మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే 2008లో ‘యువర్ స్టోరీ’ ప్రారంభించటానికి ముఖ్య కారణం. పెద్దల ఆదరణ.. ఇందులో వ్యాపార ధోరణి లేదు. అయితే అందరికీ ఈ విషయంలో అనుమానం కలుగుతుంది. చాలామంది ‘‘మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు. బహుశ మీ వారు మీకు ఫైనాన్స్ చేస్తున్నారేమో’’ అని శ్రద్ధాను చాలామందే ప్రశ్నించారు. అంతేకాదు, ‘ఇది ఒక సంవత్సరం కంటె నిలబడదు’ అంటూ నిరుత్సాహపరిచారు కూడా. అందరి ఆలోచనలు తప్పు అని నిరూపించారు శ్రద్ధా శర్మ. ‘యువర్ స్టోరీ’ ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈ మాధ్యమం ఎందరినో ఆకర్షించింది. ఇందులోని నిజాయితీ పెద్దలకు చేరింది. వెంటనే ‘రతన్ టాటా’ ఫండింగ్ చేయటానికి ముందుకు వచ్చారు. ఆయనతోపాటు టీవీ మోహన్ దాస్ పై, యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ వారు కూడా సహకరిస్తున్నారు. పన్నెండు భాషలలో విజయవంతంగా నడుస్తోంది. ప్రతి నెల 15 మిలియన్ల వ్యూస్‌తో పాటు, 20 మిలియన్ల మందికి చేరుతోంది. టీచర్ మాటలే నాకు బలం.. శ్రద్ధా గురించి ‘వన్ హూ హాస్ షాటర్డ్ ద గ్లాస్ సీలింగ్’ అని ది హిందూ రాసిన వ్యాసంతో శ్రద్ధా శర్మ ప్రపంచానికి పరిచితులయ్యారు. ‘నాస్కామ్’ అవార్డు అందుకున్నారు. లోరియల్ ఫెమినా అవార్డును, 2015లో అత్యంత ప్రభావితం చేసిన లింక్డ్ ఇన్ –500 లలో ఒకరుగా నిలిచారు. 2016లో ఇంటర్నెట్ కాటగిరీలో మోస్ట్ వ్యూడ్ సిఈవోగా నిలిచారు. ‘యువర్ స్టోరీ జర్మనీ’ ప్రారంభించి భారత్, జర్మనీల మధ్య వారధిగా నిలిచారు. ‘నేను ఒక బిహారీని, నేను చాలా వెనకబడ్డాను అనుకోకుండా అదే నీకు బలంగా భావించాలి’ అని తన టీచర్ చెప్పిన మాటలు విజయం సాధించటంలో పరుగులు తీయించాయని, గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నానని శ్రద్ధా శర్మ చెబుతారు. చదవండి: అమెరికన్ వాల్స్‌పై రీతూ పెయింటింగ్స్! -
వ్యాపార పద్మాలు అయిదుగురు..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి వ్యాపార, పారిశ్రామిక రంగంలో అయిదుగురికి దక్కాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్, పి. సుబ్రమణియన్, శ్రీధర్ వెంబు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరికి పద్మభూషణ్ పురస్కారం రాగా, మిగతావారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. వారి వివరాలు.. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్ (పద్మభూషణ్): పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్) వ్యవస్థాపకుడు. ఈ సంస్థ క్రిమిసంహారకాలు, విత్తనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ష్రాఫ్ 1.7 బిలియన్ డాలర్ల సంపదతో దేశీ కుబేరుల్లో 93వ స్థానంలో ఉన్నారు. రజనీ బెక్టార్ (పద్మశ్రీ): మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ అధినేత. రూ. 20,000 పెట్టుబడితో ప్రారంభించిన ఐస్–క్రీమ్స్ వ్యాపారాన్ని నేడు రూ. 1,000 కోట్ల స్థాయికి విస్తరించారు. ఇటీవలే ఇది ఐపీఓ ద్వారా విజయవంతంగా లిస్ట్ అయింది. జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్ (పద్మశ్రీ): అప్పడాల తయారీ సంస్థ లిజ్జత్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో ఒకరు. ఓ సామాజిక సేవా కార్యకర్త నుంచి అప్పుగా తీసుకున్న రూ. 80తో 1950లలో ప్రారంభమైన లిజ్జత్ ప్రస్తుతం 800 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగిస్తోంది. పి. సుబ్రమణియన్ (పద్మశ్రీ): గేర్ మ్యాన్ ఆఫ్ కోయంబత్తూర్‌గా పిల్చుకునే సుబ్రమణియన్.. 1969లో శాంతి ఇంజినీరింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది శాంతి గేర్స్గా మారింది. మురుగప్ప గ్రూప్‌నకు దీన్ని విక్రయించాక సుబ్రమణియన్ .. తను సొంతంగా ఏర్పాటు చేసిన శాంతి సోషల్ సర్వీస్ అనే సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది. శ్రీధర్ వెంబు (పద్మశ్రీ): క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో వ్యవస్థాపకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. -
శ్రమయేవ జయతే
అది పందొమ్మిది వందల తొంబై ఐదవ సంవత్సరం. పంజాబ్‌లోని లూథియానా జిల్లా, పిండ్ గ్రామం. ఆడపిల్ల అంటే... మగవాళ్ల ఎదుట పడకుండా, తల మీది గూంఘట్ సవరించుకుని, తలుపు చాటు నుంచి మాట చెప్పి, అణకువగా ఒదిగి ఉండాలని నిర్దేశించే రోజులు. ఆ రోజుల్లో అమ్మాయి చదువుకోవడమే ఒక విడ్డూరం. అలాంటి ఊరికి ఓ చదువుకున్న అమ్మాయి కోడలిగా వచ్చింది. చదువుకోవడమే విడ్డూరమైతే ఇక ఉద్యోగం, వ్యాపారం చేయడమన్నది మరీ విచిత్రం. ఆ అమ్మాయిని గ్రహాంతర వాసిని చూసినట్లు చూసేవాళ్లు. ఆ చూపులను ఎదుర్కొన్న గురుదేవ్ కౌర్‌ను ఇప్పుడు అదే ఊరి వాళ్లు ఒక సెలబ్రిటీని చూసినట్లు చూస్తున్నారు. పాతికేళ్ల నిరంతర శ్రమ ఆమెను స్టార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలబెట్టింది. తేనె రుచి గురుదేవ్ కౌర్ పెళ్లి నాటికి బీఈడీ చేస్తోంది. పెళ్లితో ఆమె చదువు ఆగిపోయింది. అయితే ఆగిపోయింది టీచర్ ట్రైనింగ్ మాత్రమే. తన వంతుగా... మహిళా సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతకు ఎటువంటి ఆటంకం కలగకూడదు అనుకుందామె. అప్పుడామె చెప్పిన మంచి మాటలేవీ ఆ గ్రామ మహిళలకు చెవికెక్కనేలేదు. అలాగని గుర్దేవ్ కౌర్ నిరాశపడనూ లేదు. ఈ ప్రయత్నం ఇలా ఉండగానే తనకు ఇష్టమైన తేనెటీగల పెంపకంతో కెరీర్‌ను ప్రారంభించింది. తన ఇంటి వెనుక ఉన్న కొద్ది స్థలంలో ఐదు బాక్సులతో మొదలు పెట్టింది. నాలుగేళ్లకు ఆమె తేనెటీగల పెంపకం 450 బాక్సులకు అభివృద్ధి చెందింది. ఒక్కొక్క బాక్సు నుంచి ఇరవై నుంచి పాతిక కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అయ్యేది. మొదట్లో ఆమె సహాయంగా ఉండడానికి కూడా మహిళలు ముందుకు రాలేదు. మగవాళ్లతోనే పని మొదలు పెట్టింది. క్రమంగా ఆమె దగ్గర పని చేయడానికి, పని నేర్చుకోవడానికి మహిళలు ముందుకొచ్చారు. మహిళలకు స్వయం స్వావలంబన అంటే ఏమిటో తెలియచేసింది గురుదేవ్ కౌర్. తేనె రుచితోపాటు సొంతంగా ఒక రూపాయి సంపాదించడంలో ఉండే సంతోషాన్ని కూడా రుచి చూపించింది. అలా ఆమె... పితృస్వామ్య సమాజం మహిళలకు విధించిన కంటికి కనిపించని లక్ష్మణరేఖలను తుడిచేయగలిగింది. ఇప్పుడు పంజాబ్‌లో గుర్దేవ్ కౌర్ ఆధ్వర్యంలో 350 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. నెలకో వంద పొదుపు గురుదేవ్ కౌర్ తన పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం... పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. ఆ మెళకువలను గ్రామీణ మహిళలకు నేర్పించింది. ఆ మహిళ చేత స్వయం సహాయక బృందాలను రిజిస్టర్ చేయించింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించి నెలకు వంద రూపాయలు పొదుపు చేసేటట్లు ప్రోత్సహించింది. ఆరు నెలల తర్వాత ఆ మహిళలకు రుణాలివ్వడానికి బ్యాంకులే చొరవ చూపించాయి. ఇప్పుడు వాళ్లు సొంతంగా ఆర్జిస్తున్నారు. సమాజంలో ధీమాగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. విజయం ఊరికే రాలేదు అయితే... గుర్దేవ్ కౌర్ వ్యాపార ప్రయాణం మనం పైన చెప్పుకున్నంత సులువుగా ఏమీ సాగలేదు. మహిళలను చైతన్యవంతం చేయడానికి ఆమె తన గ్రామంలో ఇంటింటి తలుపు తట్టింది. ఆడవాళ్లు ఇంటి బయటకు వచ్చి పని చేయడం తప్పు కాదని నచ్చచెప్పింది. అందరి సహకారంతో తేనె, పచ్చళ్లు, జామ్, మురబ్బా, షర్బత్, ఆర్గానిక్ బెల్లం, అప్పడాలు, మసాలా దినుసుల వంటి మొత్తం 32 ఉత్పత్తులను తయారు చేయగలిగింది. కానీ వాటిని మార్కెట్ చేయడం మాత్రం తయారు చేసినంత సులభంగా జరగలేదు. పెద్ద ఎగ్జిబిషన్లలో ఒక టేబుల్ వేసుకుని ‘టేబుల్‌టాప్ షాప్’లు పెట్టింది. ఎగ్జిబిషన్లు లేని రోజుల్లో రోడ్డు పక్కన టేబుల్ వేసుకుని కొనుగోలుదారుల కోసం ఎదురు చూసింది. ‘అప్నీ మండీ’ పేరుతో తన ఉత్పత్తులను మార్కెట్ చేయడం మొదలు పెట్టింది. తర్వాత ‘అప్నీ కిసాన్ మండీ’ పేరుతో తన వ్యాపారాన్ని విస్తరించింది. పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఐదు వందల కుటుంబాలు గుర్దేవ్ కౌర్ వ్యాపార సామ్రాజ్యంలో భాగమయ్యాయి. విజయం ఎవరికీ ఊరికే రాదు. దాని వెనుక కఠోరమైన శ్రమ ఉంటుంది. ఇప్పుడు గుర్దేవ్ కౌర్ అందుకుంటున్న గౌరవం... పాతికేళ్ల శ్రమ సాధించిన విజయం. ఇప్పుడామె సమావేశాల్లో అదే మాట చెబుతున్నారు. ‘‘ఇప్పుడు నాకు దక్కుతున్న ఈ గౌరవాలను మాత్రమే చూడవద్దు. నేను వేసిన తొలి అడుగును కూడా చూడండి. అనామకంగా వేసిన ముందడుగు అది. నన్ను చూసి స్ఫూర్తి పొందుతామంటే నాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అయితే మీ కెరీర్ ప్రస్థానంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకండి. రెండు దశాబ్దాల కఠోరశ్రమ తర్వాత మాత్రమే నేను ఈ దశకు చేరుకున్నాననే నిజాన్ని కూడా గుర్తు చేసుకోండి’’ అని చెబుతుంటారు గురుదేవ్ కౌర్. – మంజీర -
50లక్షలమందికి ఫేస్బుక్ ట్రైనింగ్
సాక్షి, డిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ దేశంలో 5మిలియన్లు( 50లక్షలమంది) మందికి డిజిటల్ మీడియాలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలు మెరుగు పరుచుకునేలా, బిజినెస్ చేసే విధంగా ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్బుక్ ప్రతినిథి శనివారం తెలిపారు. తమ మార్కెట్ షేర్ ఇండియాలో ఎక్కువగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇప్పటికే దాదాపు 10లక్షల మందికి ఈ తరహా శిక్షణ పూర్తి చేశామన్నారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండియా ఫేస్బుక్ ప్రతినిథి అంఖి దాస్ మాట్లాడుతూ.. ‘చిన్న స్థాయి బిజినెస్‌లను అంతర్జాతీయ స్థాయి ఎకానమీ తాకేలా మార్చడానికి ఫేస్బుక్ కట్టుబడి ఉంది. దీనికై పలు సంస్థలతో కలసి ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. 2021 కల్లా 5 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.’ అని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలతో దేశీయ చిన్న వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా ఈ శిక్షణ ఉపయోగపడనుందని తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె చెప్పారు. 50 మంది భాగస్వాములతో కలిసి సుమారు 150 నగరాలు, 48వేల గ్రామాలలో పది సంస్థల ద్వారా 10లక్షలమందికి శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. ఫేస్‌బుక్‌తో అనుసంధానమై ఉంటే కలిగే లాభాలను ప్రతీ ఒక్కరికీ తెలియజేయాలనుకుంటున్నాము. కొత్తగా సంస్థలు ప్రారంభించే వారికి ఈ ట్రైనింగ్ ద్వారా బిజినెస్‌లో ఎదిగేలా చేయాలనేది మా కల అని అన్నారు. ఈ ట్రైనింగ్‌ని విస్తృతం చేసేందుకు ఫేస్బుక్ 14 స్థానిక భాషల్లో విధివిధానాలను రూపొందించిందని, ఈ పద్దతిని ఇండియాలోని 29 రాష్ట్రాల్లో ప్రారంభించామని తెలిపారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. ఫేస్బుక్లో అప్లోడ్ అవుతున్న విద్వేషపూరిత వీడియోలు, అసాంఘిక పోస్ట్‌లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించారు. ఇప్పటివరకూ 1.5 బిలియన్ పోస్ట్‌లను ఫేస్బుక్ తొలగించిందని, ఇలాంటి వాటిని ఫేస్బుక్ సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. తమ పాలసీకి భిన్నంగా ఉన్న పోస్ట్‌లు అన్నింటినీ తొలగించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఫేస్బుక్లో పొలిటికల్ యాడ్స్ గురించిన డెవలప్మెంట్ జరుగుతోందని తెలిపారు. 2019 ఎన్నికల్లోపు ఆ ఫీచర్ తీసుకొస్తామని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ ఆలన్ అక్టోబర్‌లో చెప్పిన సంగతి తెలిసిందే... -
అంతర్జాతీయ మహిళా పారిశ్రామికాభివృద్ధి సదస్సు
-
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
సాక్షి, విశాఖపట్నం: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి రాయితీలిస్తామని, సకాలంలో అనుమతులిస్తున్నామని చెప్పారు. విశాఖలో భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలీప్), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, ఏపీ ప్రభుత్వం కలిసి మూడు రోజులపాటు నిర్వహించే అంతర్జాతీయ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఐటీ రంగంలోనూ, ఉత్పాదకతలోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా గిడిజాల వద్ద 50 ఎకరాల్లో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ఎతెలిపారు. విశాఖలో ఇప్పటికే రెండు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామని, మూడవది వచ్చే నెలలో జరుగుతుందని, ఈ సదస్సులో మహిళా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఇప్పటిదాకా రూ.30,47,801 కోట్ల విలువైన 1900 ఒప్పందాలు చేసుకున్నామని, వీటి ద్వారా 30 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని వివరించారు. ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలులోకి తెచ్చేందుకు సార్క్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యుటీవో) సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సార్క్ సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ బిసియల్ మాట్లాడుతూ ఈ సదస్సు వల్ల సార్క్ సభ్య దేశాల్లో మహిళా సాధికారిత మరింత వృద్ధి చెందుతుందన్నారు. అలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకానికి, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తమ సమాఖ్య కృషి చేస్తోందన్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్రెడ్డి, కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రత్యేక కార్యదర్శి బినయ్‌కుమార్, డబ్ల్యూటీవో ఈడీ రత్నాకర్ అధికారి, పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు జ్యోతిరావు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సార్క్ ఎనిమిది దేశాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్నాలజీ హబ్ ఏర్పాటుకు ఎంఓయూ విశాఖ జిల్లా గిడిజాలలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార, సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య, దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వంల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి అమర్నాథ్రెడ్డి, దక్షిణాసియా మహిళా అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు పరిమళా ఆచార్య రిజాల్, అలీప్ అధ్యక్షురాలు కె.రమాదేవిలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. -
ప్రపంచంలోనే తొలి వర్చువల్ నేత
మెల్బోర్న్: ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పు, సమానత్వం తదితర విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నిక్ అభిప్రాయపడ్డారు. శామ్ చట్టప్రకారం నిబంధనలకు లోబడి పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది. -
మళ్లీ ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా..
విజయవాడ: ఆంధ్ర ఎంటర్‌ప్రెన్యూర్స్ హవా మళ్లీ మొదలయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలనుంచి బయటికొచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం, లేదా ఉపాధి దక్కేలా విద్యావ్యవస్థను మార్చేందుకు సంస్కరణలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి పారిశ్రామిక సంస్థ కనీసం రెండు కళాశాలలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడ గేట్‌వే హోటల్లో ఏపీ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సీఎస్ఆర్ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని విద్యావేత్తలు, కళాశాలల ముఖ్య అధ్యాపకులతో ముచ్ఛటించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలేడ్జ్ స్టేట్‌గా, ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి వినూత్న విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. తొలివిడతగా 27 కంపెనీలు ముందుకొచ్చి రాష్ట్రంలోని 100 కళాశాలలను అభివృద్ధిచేయడానికి సంకల్పించడం శుభపరిణామమని అన్నారు.