
వైరల్
చూపు లేకపోయినా అంట్రప్రెన్యూర్‌గా విజయం సాధించిన మన తెలుగువాడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఫస్ట్‌లుక్ వైరల్ అయ్యింది. రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. పుట్టుకతో అంధత్వం వెంటాడినా విజయాలు అందుకోవడానికి అది అడ్డుకాదని నిరూపించిన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ‘శ్రీకాంత్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంచి నటుడిగా పేరు గడించిన రాజ్‌కుమార్ రావు శ్రీకాంత్ పాత్రను పోషిస్తుండటం విశేషం.
మచిలీపట్నంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదువు విషయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నాడు. అంధుడైన కారణాన ఐఐటీలో సీటు ΄÷ందలేకపోయాడు. అయితే పట్టుదలతో మసాచూసెట్స్ యూనివర్సిటీలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా దఖలయ్యి చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చి పారిశ్రామిక రంగంలో కీర్తి గడించాడు. బొల్లా జీవితం ఇప్పటికే ఎందరికో ఆదర్శం అయ్యింది. వెండితెర మీద ఆయన జీవితం చూసి మరెందరో స్ఫూర్తి ΄÷ందుతారు. తుషార్ హీరానందాని ఈ సినిమా దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment