
వైరల్
సంజయ్‌లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్‌తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది.
‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్‌తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్‌జనులను బాగా కదిలించింది.
Comments
Please login to add a commentAdd a comment