
వైరల్
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్‌షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది.
‘మాధురి అంటే డ్యాన్స్‌కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment