Madhuri Dixit
-
ఓటీటీలో భయపెడుతూ నవ్వించే సినిమా
సాధారణంగా సినిమాలలో ఓ రెండింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకటి హ్యూమర్ అయితే మరొకటి హారర్ జోనర్. కానీ ఆ రెండూ కలిపి సినిమా తీస్తే అదే ఈ సినిమా ‘భూల్ భులయ్యా 3’(Bhool Bhulaiyaa 3). ఇది ‘భూల్ భులయ్యా’ సిరీస్‌లో వచ్చిన మూడవ సినిమా. నిజానికి మొదటి భాగానికి, మిగతా రెండు భాగాలకి కథతో పాటు పాత్రధారులలో కూడా తేడా ఉంది. ‘భూల్ భులయ్యా’ మొదటి భాగం ‘చంద్రముఖి’ సినిమా ఆధారంగా తీసింది. కానీ మిగతా రెండు భాగాలను మాత్రం అదే థీమ్‌తో కాస్త విభిన్నంగా రూపొందించారు. ఇప్పుడు ‘భూల్ భులయ్యా 3’ సినిమా కథ విషయానికి వస్తే... 200 సంవత్సరాల క్రితం రక్తఘాట్ రాజ్యంలో జరిగిన కథ. అప్పటి రాజ కుటుంబం వల్ల జరిగిన సంఘటనలో మంజులిక అనే ఓ దెయ్యం కనిపిస్తుంది. ఈ దెయ్యాన్ని అదే రాజ్యంలోని అంతఃపుర గదిలో భద్రంగా బందిస్తారు ఆ రాజ్యానికి చెందిన రాజగురువు. 2024లో వారసత్వ సంపదగా ఆ అంతఃపురాన్ని ఓ హోటల్‌గా మార్చాలని రాజకుటుంబం వారసులు ప్రయత్నించగా బందీగా ఉన్న మంజులిక దెయ్యం బయటపడి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ విషయం చూసే ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిస్తుంది. ఈ మంజులికను కట్టడి చేయడానికి ఫేక్ మాంత్రికుడైన రూహాన్ను ఆ రాజ్యానికి తెప్పించుకుంటారు. రూహాన్ రక్తఘాట్కు వచ్చినప్పటి నుండి కథ అనేక మలుపులు తిరగుతూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. అందులో మొదటగా హీరో రోల్ వేసిన కార్తీక్ ఆర్యన్(Kartik Aaryan)... తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్‌తో హారర్ ఎమోషన్ని కూడా హ్యూమర్ ఎమోషన్‌తో చక్కగా పలికించాడు. ఇక విశేష పాత్రలలో నటించిన నాటి తార మాధురీ దీక్షిత్(Madhuri Dixit), నేటి వర్ధమాన తార విద్యాబాలన్(Vidya Balan) వారి నటనతోనే కాదు అద్భుత నాట్యంతోనూ సినిమాని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. దర్శకుడు అనీస్ ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఓ పక్క భయపెడుతూ మరో పక్క గిలిగింతలు పెడుతూ ప్రేక్షకులను కదలనివ్వకుండా స్క్రీన్‌ప్లే నడిపించాాడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ ‘భూల్ భులయ్యా 3’ వీకెండ్ వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
సంక్రాంతికి కొత్త కారు కొన్న బ్యూటీ.. భర్తతో జాలీగా..
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (Madhuri Dixit)- డాక్టర్ శ్రీరామ్ నేనే సంక్రాంతి పండక్కి కొత్త కారు కొనుగోలు చేశారు. ఫెరారి 296 జీటీఎస్ మోడల్‌ను తమ గ్యారేజీకి తెచ్చుకున్నారు. దీని విలువ రూ.6 కోట్ల పైనే ఉంటుందని అంచనా. మాధురి దీక్షిత్ దంపతులు ఈ ఫెరారీ కారులో షికారుకు వెళ్లారు. ఎరుపు రంగు ఫెరారీ కారును భర్త నడుపుతుంటే మాధురి పక్కన కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమామాధురి దీక్షిత్ చివరగా భూల్ భులయ్యా 3 సినిమా (Bhool Bhulaiyaa 3 Movie)లో కనిపించింది. ఈ మూవీలో విద్యా బాలన్, తృప్తి డిమ్రి, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా, అశ్విని కల్సేకర్, రాజేశ్ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన భూల్ భులయ్యా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దీంతో 2022లో దీనికి సీక్వెల్ తెరకెక్కింది. కార్తీక్ ఆర్యన్, కియరా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా సక్సెస్ అందుకుంది. దీంతో గతేడాది మూడో పార్ట్ రిలీజ్ చేశారు. ఇది కూడా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే! -
ఇది కదా సొగసు.. బంగారం వెలుగు కొద్దిసేపే! (ఫోటోలు)
-
ఏక్..దో..తీన్..అన్‌స్టాపబుల్ అంటున్న స్టార్ హీరోయిన్ను గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
మాధురీ నవ్వులతో పోటీ పడే ఇంటి కళ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే నివాసం ఉంటున్న ఇల్లు కళ, సాంకేతికతల మేళవింపులా ఉంటుంది. దీనిని డిజైనర్ అపూర్వ ష్రాఫ్ రూపోందించారు.ముంబై అపార్ట్మెంట్లోని 53వ అంతస్తులో మాధురీ దీక్షిత్ ఇంటి నుంచి ఒక ట్యూన్ వినిపిస్తుంటుంది. అది ఆమె నడక, హుందాతనం, అందాన్ని కూడా కళ్లకు కట్టేలా చేస్తుంది అంటారు ఆ ట్యూన్ విన్నవాళ్లు. బాలీవుడ్లో 90ల నాటి సినిమా హిట్లలో తేజాబ్ లో మోహిని, దిల్ లో మధు, అంజామ్ లో శివాని, హమ్ ఆప్కే హై కౌన్ లో నిషా, దిల్ తో పాగల్ హై లో పూజ ... వంటి. ఇంకా ఎన్నో పాత్రలతో ఆమె నటన నేటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. మాధురి ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే ముంబైలోని ఎతై ్తన భవనంలో తమ అధునాతన నివాసాన్ని రూపోందించడానికి ప్రఖ్యాత లిత్ డిజైన్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్‌ను పిలిచారు.సింప్లిసిటీఈ జంట కోరిన వాటిని సరిగ్గా అందించడంలో వారు చెప్పిన స్పష్టమైన సంక్షిప్త వివరణ ష్రాఫ్‌కు బాగా సహాయపడింది: ‘సమకాలీన సౌందర్యాన్ని మినిమలిస్ట్ అండర్ టోన్ తో మిళితం చేసేలా సరళ రేఖలు, అందమైన రూపాలు, హుందాతనాన్ని కళ్లకు కట్టే అభయారణ్యం...’ ఇవి ఇంటి యజమానుల శక్తివంతమైన వ్యక్తిత్వాలను చూపుతుందని వారిని ఒప్పించింది ష్రాఫ్. మాధురి, డాక్టర్ మాధవ్ ‘సింప్లిసిటీ’ని కోరుకున్నారు. ఇది ఇల్లులాగా అనిపించే టైమ్‌లెస్ టెంప్లేట్. మాధురి ఈ విషయాలను షేర్ చేస్తూ, ‘ప్రశాంతత, స్పష్టత, సౌకర్యాన్ని రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక ఆర్ట్’ అంటారామె.హుస్సేన్ కళాకృతి40 సంవత్సరాల సినీ కెరీర్లో మాధురీ దీక్షిత్ లక్షలాది మంది ఆరాధకులతో పాటు, ఎంతో మంది ఊహాలోకపు రారాణి. వారిలో ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఒకరు. భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ మాధురి కోసం ప్రత్యేకంగా చిత్రించిన విసెరల్ వైబ్రెంట్ పెయింటింగ్‌లు ఇంటి డిజైన్ భాషకు అద్దంలా నిలిచాయి. విక్రమ్ గోయల్ వియా హోమ్ ద్వారా అలంకరించిన ప్రవేశ ద్వారం, హుస్సేన్ పవిత్రమైన గణేషులచే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మాధురి వినయపూర్వకమైన ్రపారంభాన్ని గుర్తుచేసే స్వాగతతోరణంలా భాసిల్లుతుంది. ఇంట్లో ప్రతిచోటా హుస్సేన్ కళాకృతి సంభాషణలనుప్రోత్సహిస్తుంది. మాధురి వాటి గురించి మరింత వివరింగా చెబుతూ ‘హుస్సేన్ జీ మా ఇంటి గోడలకు రంగులతో కళ తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను వద్దాన్నాను. దీంతో నాకు అత్యుత్తమ చిత్రాలను చిత్రించి, ఇచ్చాడు. అతను ఉపయోగించిన రంగులను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఆ కళ ఇలా బయటకు కనిపిస్తుంది’ అని వెల్లడించింది మాధురి. -
Bhool Bhulaiyaa 3 X Review: భూల్ భూలయ్యా టాక్ ఎలా ఉందంటే.. ?
బాలీవుడ్లో ఈ శుక్రవారం రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి సింగమ్ ఎగైన్. మరొకటి భూల్ భూలయ్యా 3. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, విద్యాబలన్, మాధూరీ దీక్షిత్ కీలక పాత్రలు పోషించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. గతంలో ఈ సీరిస్ నుంచి వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, రెండు, మూడో భాగాల్లో కార్తీక్ ఆర్యన్ హీరో పాత్రను పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ఇటీవల బాలీవుడ్లో భారీ చిత్రాలేవి లేకపోవడంతో ‘భూల్ భూలయ్యా 3’పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలతో ఈ చిత్రం నేడు(నవంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 కథేంటి? ఈ సారి ఏమేరకు భయపెట్టింది? కార్తిక్ ఆర్యన్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి.ట్విటర్లో భూల్ భూలయ్యా 3 చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది అంచనాలకు తగ్గట్టుగా లేదని ట్వీట్ చేస్తున్నారు. #OneWordReview...#BhoolBhulaiyaa3: OUTSTANDING.Rating: ⭐️⭐️⭐️⭐️Entertainment ka bada dhamaka... Horror + Comedy + Terrific Suspense... #KartikAaryan [excellent] - #AneesBazmee combo hits it out of the park... #MadhuriDixit + #VidyaBalan wowsome. #BhoolBhulaiyaa3Review pic.twitter.com/t2GbQIAfri— taran adarsh (@taran_adarsh) November 1, 2024ప్రముఖ సీనీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమా అదిరిపోయిందంటూ ఏకంగా నాలుగు స్టార్స్(రేటింగ్) ఇచ్చాడు. హారర్, కామెడీ, సస్పెన్స్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనం సాగుతుందని చెప్పారు. కార్తీక్ అద్భుతంగా నటించాడని, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటన బాగుందని ట్వీట్ చేశాడు. #BhoolBhulaiyaa3 first half... Full on cringe... Unnecessary songs and whatsapp forward jokes... @vidya_balan has the least screen presence but she stole the show... Hoping for a better second half... Pre-Interval block is interesting...— Anish Oza (@aolostsoul) November 1, 2024 ఫస్టాఫ్‌లో వచ్చే పాటలు కథకి అడ్డంకిగా అనిపించాయి. జోకులు కూడా అంతగా పేలలేదు. వాట్సాఫ్‌లలో పంపుకునే జోకుల్లా ఉన్నాయి. విద్యాబాలన్ తెరపై కనిపించేదది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇది ఓ యావరేజ్ మూవీ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.The first one was a classic; this is just a disaster. #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review pic.twitter.com/e3VWavE9iB— Ankush Badave. (@Anku3241) November 1, 2024భూల్ భూలయ్యా మూవీ క్లాసికల్ హిట్ అయితే భూల్ భూలయ్యా 3 డిజాస్టర్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.#BhoolBhulaiyaa3 might've been highly anticipated, but the script feels completely off-track. It's almost as if someone unfamiliar with the franchise wrote it. Disappointing execution and weak storyline! #BhoolBhulaiyaa3Review.pic.twitter.com/yvZGfTSNp9— Utkarsh Kudale 18 (@BOss91200) November 1, 2024The third installment of Bhool Bhulaiyaa is here to give us a Diwali filled with excitement and surprises. A cinematic delight that keeps you hooked! #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review"— itz Joshi (@ItzKulkarni) November 1, 2024#BhoolBhulaiyaa3Review: ⭐⭐⭐⭐A thrilling blend of laughs, chills, and an unexpected twist! #BhoolBhulaiyaa3 is a wild horror-comedy ride. @TheAaryanKartik nails it with his flawless comic timing, while @tripti_dimri23 lights up the screen. @vidya_balan and @MadhuriDixit… pic.twitter.com/aoHA2OBVbs— Manoj Tiwari (@ManojTiwariIND) November 1, 2024There is no mosquito repellent in the hall! The theatre is empty, watching a movie is no fun #BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Harish raj (@Harishraj162409) November 1, 2024Bhool Bhulaiyaa 3 is a spine-chilling delight!The plot twists are just mind-blowing.Kartik Aaryan owns every scene he’s in.It's a film that’ll have you laughing and screaming!#BhoolBhulaiyaa3 #BhoolBhulaiyaa3Review— Dattaraj Mamledar (@DattarajMamled) November 1, 2024 -
57 ఏళ్ల వయసులో మరింత యంగ్‌గా కనిపిస్తున్న మాధురీ దీక్షిత్ (ఫోటోలు)
-
పాకిస్తాన్ వ్యాపారి కోసం 'మాధురి దీక్షిత్' వివాదాస్పద నిర్ణయం
మాధురి దీక్షిత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. 1990ల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్.. బాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. 1984లో అబోద్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్.. శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లకు కూడా అందనంత ఎత్తులో నిలబడింది. అయితే, తాజాగా ఆమె చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.ఓ కంపెనీకి చెందిన యాడ్ విషయంలో మాధురి దీక్షిత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రెహన్ సిద్ధిఖీ తన వ్యాపారా సామ్రాజ్యాన్ని పెంచుకునే క్రమంలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాడు. ఆగష్టు నెలలో తనకు చెందిన కంపెనీల ప్రమోషన్ కార్యక్రమాన్ని టెక్సాస్‌లో నిర్వహించనున్నాడు. అయితే, ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవరించేందుకు మాధురి దీక్షిత్ టెక్సాస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిని భారతీయులు తప్పుబడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని నెట్టింట పెద్ద ఎత్తున్న కామెంట్లు చేస్తున్నారు. దీనంతటికి కారణం పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో రెహన్ సిద్ధిఖీకి సంబంధాలున్నాయంటూ.. ఆయన నిర్వహించే అన్నీ కంపెనీలను భారత్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. టెక్సాస్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అందులో రెహన్ సిద్ధికీ, మాధురిదీక్షిత్ ఫొటోలున్నాయి. దీంతో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్తున్నట్లు తేలిపోయింది. ముందుగా రెహన్ సిద్ధిఖీ ఎలాంటి వాడో తెలుసుకొని ఆ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే, ఈ గొడవ గురించి మాధురి దీక్షిత్ ఇంకా స్పందించలేదు. -
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
-
ఆ సినిమా షూటింగ్లో ఏడ్చిన హీరోయిన్.. చివరకు తప్పలేదు!
ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక కొన్ని ఇష్టం ఉన్నా, లేకపోయినా చేయక తప్పదు. అలా హీరోయిన్ మాధురి దీక్షిత్ గతంలో ఒక అత్యాచార సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ ఆ సీన్ చేయడం ఇష్టం లేక ఆమె ఎంతగానో ఏడ్చిందట! ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ విలన్ రంజీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రంజీత్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ పరిత్యాగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆరోజు అత్యాచార సీన్ చిత్రీకరించాలి. నేను రెడీగా ఉన్నాను. ఎందుకింత ఆలస్యం? ఇంతలో మాధురి ఆ సీన్ చేయనని ఏడుస్తూ ఉందట. ఈ విషయం నాకెవరూ చెప్పలేదు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారా? అని అనుకుంటూ ఉండగా ఓ ఆర్ట్ డైరెక్టర్ తను ఏడుస్తుందని అసలు విషయం చెప్పాడు. అతడొక బెంగాలీవాసి. మా డైరెక్టర్ పేరు బాపు. తను దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇకపోతే సినిమాలో మాధురి తండ్రి చాలా పేదవాడు. తోపుడుబండి నడుపుతూ ఉంటాడు. ఆ బండిపైనే హీరోయిన్‌తో నా సీన్ చిత్రీకరించాల్సి ఉంది. చాలాసేపటి తర్వాత ఆమె ఆ సీన్ చేసేందుకు ఒప్పుకుంది. కట్ చెప్పకుండా.. ఫైట్ మాస్టర్ వీరు దేవ్‌గణ్.. ఎక్కడా సీన్‌కు కట్ చెప్పకుండా చూసుకోండి.. మేము కెమెరాను తిప్పుతూనే ఉంటామని చెప్పాడు. అత్యాచార సన్నివేశాల్లో నటించడమనేది మా పని. కానీ విలన్లమైన మేము మరీ అంత చెడ్డవాళ్లమైతే కాదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రేమ్ పరిత్యాగ్ 1989లో రిలీజైంది. మిథున్ చక్రవర్తి, మాధురి దీక్షిత్, రంజీత్ సహా దివంగత నటులు వినోద్ మెహ్రా, సతీశ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. రంజీత్ విషయానికి వస్తే ఈయన కెరీర్లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. చదవండి: తొలిసారి తండ్రి ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరోయిన్ -
Madhuri Dixit Photos: కుర్ర హీరోయిన్లకు కుళ్ళు పుట్టిస్తున్న ఈ స్టార్ ఎవరు?
-
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
డెబ్బై మూడేళ్ల బామ్మ... మాధురితో పోటీపడి డ్యాన్స్ చేసింది!
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది. ఛోబీ అనే బామ్మ ‘దేవదాస్’ సినిమాలోని మాధురి దీక్షిత్ పాపులర్ పాట ‘మార్ డాలా’కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. రియాల్టీ షో జడ్జీలు మాధురి దీక్షిత్, సునీల్షెట్టీలకు ఛోబీ డ్యాన్స్ బాగా నచ్చింది. ‘మనసులో ఏది అనిపిస్తే అది చేయాలి. భయం అవసరం లేదు... అని మీరు మాకు చెబుతున్నట్లుగా ఉంది’ అని బామ్మను ప్రశంసించింది మాధురి. ఆ తరువాత బామ్మతో కలిసి మాధురి దీక్షిత్ డ్యాన్స్ చేసింది. ‘మాధురి అంటే డ్యాన్స్‌కు మరో పేరు. ఆమె పాపులర్ పాటకు డ్యాన్స్ చేయాలంటే సాహసం మాత్రమే కాదు. ప్రతిభ కూడా ఉండాలి. ప్రతిభ, సాహసం మూర్తీభవించిన ఛోబీజీకి అభినందనలు’. ‘మాధురితో పోటీపడి డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో సోషల్ మీడియాలో కనిపించాయి. -
పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా?
వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం ఆమె. వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకున్న బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ మాధురీ దీక్షిత్ లివింగ్ లెజెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంప్రదాయ దుస్తులలో, ముఖ్యంగా చీరలలో మెరిసిపోతూ ఉంటుంది ఈ ఎవర్గ్రీన్ దివా. పాప్ ఆఫ్ పింక్, ఏ డ్యాష్ ఆఫ్ గ్రేస్ అంటూ తన అందాన్ని పొగడకుండానే తెగ పొగిడేసుకుంది. తన బ్యూటిఫుల్ స్మైల్‌తో పాటు, చక్కటి డ్యాన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఆమె అందమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా మాధు దీక్షిత్ గుజరాత్ బంధాని (బంధేజీ) పట్టుచీరలో మెరిసిపోతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్రైట్ కలర్ ఆరు గజాల చీరలో మాధురి లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. పింక్, పర్పుల్ కాంబినేషన్లో బంగారు రంగు అంచు చీరలో అద్భుతంగా కనిపించింది. పర్పుల్ హ్యూడ్ బ్లౌజ్, చక్కటి మేకప్, సాధారణ హెయిర్ బన్, యాంటిక్ జ్యూయల్లరీతో మరింత ఫ్యాషన్‌ను జోడించింది. దీంతో ఈ చీర ఎంత అనే ఆసక్తి నెలకొంది. గ్రాండ్ పీస్ ధర 75వేల రూపాయలట. కాగా జవనరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి భర్త శ్రీరామ్ తో కలిసి హజరైంది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
ఎంపీగా పోటీచేయనున్న ప్రముఖ హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై నిత్యం చర్చలు జరుగుతున్నాయి. ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా, మహారాష్ట్రలోని ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేందుకు బీజేపీ సీనియర్ నేతలతో ఆమె టచ్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను నటికి షా బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత మాధురీ దీక్షిత్ బీజేపీలో చేరుతారనే చర్చకు మరింత బలం చేకూరింది. కాబట్టి ఆమె ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం దాదాపు ఖాయం అయినట్లే. ఈ విషయంపై ఇప్పటి వరకు మాధురి ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ పాలిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 2014, 2019లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం సాయిబాబ వార్షిక ఉత్సవాల సందర్భంగా ఈ ప్రాంతమంతా నటి మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. ఇందులో విశేషమేమిటంటే.. అక్కడ మాధురీ దీక్షిత్ బ్యానర్ లేదా ఫ్లెక్స్ బహిరంగంగా పెట్టడం ఇదే తొలిసారి. ముంబైలోని మొత్తం 6 లోక్‌సభ నియోజకవర్గాల్లో నార్త్-ముంబై, నార్త్ సెంట్రల్ ముంబైలు బీజేపీకి అత్యంత బలమైన రెండు నియోజకవర్గాలు. వీటిలో పూనమ్ మహాజన్ నియోజకవర్గం నార్త్ సెంట్రల్ ముంబై. ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మొత్తం లోక్‌సభ నియోజకవర్గం ఎక్కువగా బీజేపీ, షిండే గ్రూపు ఆధిపత్యంలో ఉంది. పూనమ్ మహాజన్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. కాబట్టి ఈ నియోజకవర్గం ప్రస్తుతం బీజేపీకి అనుకూలమైనదిగా చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో నటి మాధురీ దీక్షిత్ బీజేపీ నుంచి ముంబైలో పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని నటి మాత్రమే కాదు బీజేపీ పార్టీ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర బావాంకులే మాట్లాడినా ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రతిపాదన జరగలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో పార్టీ నేతల నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. నటి మాధురీ దీక్షిత్‌కు సంబంధించిన ఆ బ్యానర్స్‌తో బీజేపీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదని అక్కడి నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రముఖులకు, వ్యాపారులకు, సినీ పరిశ్రమకు చెందిన వారికి చేరవేసే పని కొన్ని నెలలుగా అక్కడి పార్టీలో సాగుతోంది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నటి మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లారు. అయితే మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
'హీరోయిన్‌తో అలాంటి సీన్.. ఒక గొడవతో ఆగిపోయింది'
బాలీవుడ్లో కాలియా, షాహెన్షా వంటి చిత్రాలను రూపొందించిన నటుడు,దర్శకుడు అయిన టిన్ను ఆనంద్, 1989లో మాధురీ దీక్షిత్- అమితాబ్ బచ్చన్ల కాంబినేషన్లో 'శనఖత్' అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయయడంతో పాటు ఐదురోజులు షూట్ చేసి సినిమాను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన కారణాలను సుమారు మూడు దశాబ్ధాల తర్వాత దర్శకుడు టిన్ను ఆనంద్ ఇలా తెలిపాడు. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) 'సినిమాకు చెందిన ఒక సన్నివేశం ఇలా ఉంటుంది. ఒక గ్యారేజ్‌లో అమితాబ్‌ను విలన్లు గొలుసులతో కట్టిపడేస్తారు. ఆ సమయంలో మాధురిని రక్షించడానికి ఆమితాబ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఆ గూండాలచే దెబ్బలు తిని హీరోయిన్ను రక్షిస్తాడు. అలాంటి సమయంలో హీరోకు అన్నివిదాలుగా హీరోయిన్ దగ్గర కావాలనేది సీన్. సినిమాలోని కీలకమైన ఈ సన్నివేశాల్లో హీరోయిన్ను లోదుస్తులు చూపించాలనుకున్నా. దానికి మాధురి దీక్షిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌లో 'జవాన్' నిషేధం.. ఎందుకో తెలుసా?) అందుకు నచ్చిన దుస్తువులను తెచ్చుకోవచ్చని కూడా ఆమెకు చెప్పాను. దీంతో మాధురి కూడా ఓకే అన్నారు. తీరా షూటింగ్ సమయానికి ఇలా లోదుస్తులతో నటించడం ఇష్టం లేదని చెప్పింది. ఆప్పుడు ఆమెతో గొడవ జరిగింది. ఈ సీన్ చేయకుంటే ఈ సినిమా నుంచి వెళ్లిపోండని చెప్పడంతో ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అలా ఆ సినిమా ప్రారంభం అయిన ఐదురోజులకే ఆగిపోయింది.' అని టిన్ను ఆనంద్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మధ్య విడుదలైన గ్లింప్స్ ఆయన డైలాగ్‌లతోనే ప్రారంభం అవుతాయి. -
బాలీవుడ్ క్వీన్.. సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!
మాధురి దీక్షిత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది. 1990ల్లో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 1967 మే 15న ముంబయిలో జన్మించింది. మైక్రో బయాలజిస్ట్ కావాలనుకున్న మాధురి దీక్షిత్.. మూడేళ్ల వయసులోనే డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల వయసులోనే కథక్ నృత్యాన్ని నేర్చుకుంది. బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్‌గా పేరు సంపాదించింది. బాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఇవాళ ఆమె 56వ బర్త్ డే సందర్బంగా ప్రత్యేక కథనం. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?) 1984లో అబోద్ అనే సినిమాతో మాధురి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిసినిమాల్లో సహాయ నటిగా చేసిన మాధురి..తేజాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పొషించారు. ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రమం మొదటి ఫిలింఫేర్ నామినేషన్‌కు కూడా ఎంపికైంది. ఆ తర్వాత రాం లఖాన్ (1989), పరిందా (1989), త్రిదేవ్ (1989), కిషన్ కన్హయ్యా (1990) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్లో శ్రీదేవి కంటే ఎక్కువగా మాధురి పాపులారిటీ సాధించింది. (ఇది చదవండి: ఏజెంట్‌పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..) 1990లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన దిల్ అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించారు. ఈ సినిమా ఆమె కెరీర్లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సాజన్ (1991), బేటా(1992), ఖల్ నాయక్ (1993), హం ఆప్కే హై కౌన్ (1994), రాజా (1995) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బేటా చిత్రంలో చదువురాని అమాయకుడికి భార్యగా నటించిన పాత్రకి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. 1999లో డాక్టర్ శ్రీరామ్ నేనేను మాధురి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. దాదాపు ఓ దశాబ్దానికి పైగా అక్కడే నివసించారు. ఈ జంటకు అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం మాధురి దీక్షిత్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ది నేమ్ ఫేమ్‌తో అభిమానులను పలకరించింది. బాలీవుడ్లో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించిన మాధురికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ముంబైలో సందడి చేశారు. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్‌ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో భారతీయులు అమితంగా ఇష్టపడే వడపావ్‌ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్‌తో కలిసి యాపిల్ సీఈవో టిమ్‌కుక్ రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్‌తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Can’t think of a better welcome to Mumbai than Vada Pav! pic.twitter.com/ZA7TuDfUrv — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 17, 2023 -
మాధురి దీక్షిత్‌పై అవమానకర కామెంట్స్.. నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్ ప్రస్తుతం బి-టౌన్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులోని ఓ ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్‌ను కించపరిచారంటూ ఇప్పటికే ఎంపీ, బాలీవుడ్ నటి జయబచ్చన్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మరో పొలిటిషియన్ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపి షాకిచ్చాడు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్లో మాధురీ దీక్షిత్‌ను సూచించేందుకు అవమానకరమైన పదాన్ని వినియోగించారని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడ్డారు. చదవండి: బిగ్‌బాస్ 7లోకి బుల్లితెర హీరో అమర్దీప్.. క్లారిటీ ఇచ్చిన నటుడు వెంటనే ఆ ఎపిసోడ్‌ను తొలగించాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేశారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నటించిన రాజ్ షెల్డన్ కూపర్‌గా నటించిన జిమ్ పార్సన్స్ ఐశ్వర్యరాయ్‌ని మాధురి దీక్షిత్‌తో పోలుస్తాడు. ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’ అని పేర్కొంటాడు. దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్‌ను పోషించిన కునాల్ నయ్యర్.. కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్‌తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై మిథున్ కుమార్ స్పందిస్తూ.. ఈ సిరీస్‌లో స్త్రీ ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని.. వ్యక్తులను కించపరిచే భాష వాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అదే విధంగా ఆయన ఓ ప్రకటన ఇచ్చారు. చదవండి: బిగ్‌బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ ‘‘తాము చేసే పనులకు జవాబుదారీగా ఉండడం, స్ట్రీమింగ్‌లో సామాజిక, సాంస్కృతిక విలువలను కించపరచకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలకు ఇది చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించి ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అవమానకరమైన, అభ్యంతరకరమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదని నిర్ధారించాకే స్ట్రీమింగ్ చేయాలి. నెట్‌ఫ్లిక్స్ - ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని షోలలో ఒకదానిలో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పదాన్ని ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు, భారీగా అభిమానులు ఉన్న నటి మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరం, తీవ్రంగా బాధించేది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ గౌరవాన్ని, పరువును కించపరిచేలా ఉంది’’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. మరి నెట్ ప్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మాధురి దీక్షిత్‌పై అసభ్య పదజాలం.. తీవ్రస్థాయిలో మండిపడ్డ జయాబచ్చన్
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' షోపై బాలీవుడ్ నటి జయాబచ్చన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ షోలోని ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంక్ లోరె, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ టెలివిజన్ షోలో మాధురి దీక్షిత్‌పై చేసిన కామెంట్స్‌పై ఆమె జయాబచ్చన్ ఫైరయ్యారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ షోలో పాల్గొన్న కునాల్ నయ్యర్ ఐశ్యర్యారాయ్‌తో పోలుస్తూ మాధురీ దీక్షిత్‌ను వేశ్య అని సంభోదించారు. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల జయా బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడికేమైనా పిచ్చి పట్టిందా? అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రికి తరలించాలని అన్నారు. అతని వ్యాఖ్యల పట్ల వారి కుటుంబ సభ్యులను నిలదీయాలని మండిపడ్డారు. ఈ షోలో షెల్డన్ కూపర్ పాత్రను పోషిస్తున్న జిమ్ పార్సన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను పొగిడారు. అదే సమయంలో మాధురీ దీక్షిత్‌ను పోలుస్తూ కునాల్ నయ్యర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలతో ఇండియాలో జనాదరణ పొందిన అమెరికన్ సిట్కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' భారతీయుల ఆగ్రహానికి గురవుతోంది. కునాల్ నయ్యర్ వ్యాఖ్యల పట్ల నటి ఊర్మిళ మటోండ్కర్ ఇది అత్యంత దారుణమని అన్నారు. ఇది వారి చీప్ మెంటాలిటీని చూపిస్తోందని మండిపడ్డారు. ఇలా మాట్లాడటం అత్యంత అసహ్యంగా ఉందని దియా మీర్జా అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు నోటీసులు అయితే ఈ ఎపిసోడ్‌ను తొలగించాలని రచయిత, రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ స్ట్రీమింగ్ దిగ్గజాన్ని కోరుతూ నెట్‌ఫ్లిక్స్‌కి లీగల్ నోటీసులు పంపారు. సీజన్ టూ మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌పై కునాల్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అతని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయిని.. పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నోటీసులో పేర్కొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీ 'బిగ్ బ్యాంగ్ థియరీ' అనేది చక్ లోర్రే, బిల్ ప్రాడీ రూపొందించిన అమెరికన్ సిట్కామ్. ఇది 2007లో ప్రారంభం కాగా.. 12 సీజన్ల తర్వాత చివరి ఎపిసోడ్ 2019లో ప్రసారమైంది. -
స్టార్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం
అలనాటి స్టార్ హీరోయిన్, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత (90) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. 'మేము ఎంతగానో ప్రేమించే ఆయి(అమ్మ) ఈ రోజు ఉదయం తనకు ఇష్టమైన వారి మధ్య ఉన్నప్పుడు స్వర్గస్తులయ్యారు' అని రాసుకొచ్చారు. మాధురి తల్లి మరణవార్తపై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. గతేడాది జూన్‌లో తల్లి పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తూ ఎమోషనలైంది మాధురి. హ్యాపీ బర్త్‌డే ఆయి. 'ప్రతి అమ్మాయికి తన తల్లే బెస్ట్ ఫ్రెండ్ అంటుంటారు. నువ్వు నాకోసం ఎంతో చేశావు. నువ్వు చేసిన త్యాగాలు, నాకు నేర్పిన పాఠాలు.. అవే నాకు పెద్ద బహుమతులు. నువ్వు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది. -
ఇతడిని పెళ్లి చేసుకుంటే కష్టమే అనుకున్నా: మాధురీ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా ఓ వైద్యుడిని పెళ్లాడింది. శ్రీరామ్ నేనే అనే డాక్టర్‌ను 1999లో పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిలైపోయింది. తాజాగా శ్రీరామ్ నేనే యూట్యూబ్ ఛానల్లో వీరి కష్టసుఖాల గురించి మాట్లాడారు. ముందుగా నటి మాట్లాడుతూ.. 'ఇతడిని పెళ్లాడితే కష్టాలు ఖాయమనుకున్నా. ఎందుకంటే తనకు పగలూరాత్రి తేడా లేకుండా షెడ్యూల్స్ ఉంటాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు పిల్లల్ని చూసుకోవడం కష్టంగా ఉంటుంది. వారిని స్కూల్‌కు తీసుకెళ్లడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం వంటి చాలా పనులు ఉంటాయి. మరికొన్నిసార్లు ఏవైనా ముఖ్యమైన పనులు కూడా పడుతుంటాయి. కానీ తను అందుబాటులో ఉండడు. హాస్పిటల్లో పేషెంట్స్‌ను చూసుకుంటూ ఉంటాడు. కానీ నేను అనారోగ్యానికి గురైనప్పుడు ఆ పనులు ఇంకెవరు చూసుకుంటారు? ఇలా కొన్ని విషయాలు ఆలోచిస్తే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అదే సమయంలో తనను చూస్తుంటే గర్వంగానూ అనిపిస్తుంది. ఎందుకంటే పేషెంట్స్ కోసం ఎంతగానో తపిస్తాడు, వారి వైపు నిలబడతాడు. తను చాలా మంచివాడు. ఏదేమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మన పార్ట్నర్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం' అని చెప్పుకొచ్చింది. మాధురి గురించి శ్రీరామ్ మాట్లాడుతూ.. 'ఇలా అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా కష్టం. తను నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంది' అని తెలిపాడు. చదవండి: ఫస్ట్ డే కలెక్షన్ రూ.10 లక్షలు.. నాపై విరుచుకుపడ్డవారు ఇప్పుడు మాట్లాడరే? -
అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట!
ప్రస్తుత సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్, లిప్ లాక్ సీన్స్ సాధారణం అయిపోయాయి. కానీ 80, 90లో మాత్రం ఇలాంటి సన్నివేశం అంటే సంచలనం. హీరోహీరోయిన్ల మధ్య ఇలాంటి సన్నివేశాలు ఉంటే చాలు దానిపై విపరీతమైన చర్చ జరిగేది. ఎక్కడికి వెళ్లిన ఆ నటీనటులకు దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉండేవి. టీవీల్లో, వార్తల్లో ఎక్కడ చూసిన దీనిపైనే రచ్చ. అలా ఇప్పటికీ తాను చేసిన లిప్‌లాక్ సీన్‌పై ప్రశ్నలకు ఎదుర్కొంటూనే ఉంటుంది అలనాటి బ్యూటీ క్వీన్, సీనియర్ హీరోయిన్ మాధురీ ధీక్షిత్. చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే.. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్, కానీ అవసరం లేకున్నా ఓ సినిమాలో హీరోతో డీప్ లిప్‌లాక్ సీన్ చేసి వార్తల్లోకి ఎక్కింది. అప్పుట్లో దీనిపై పెద్ద రచ్చే జరిగిందట. అసలు మాధురీ ఆ సన్నివేశం ఎందుకు చేసింది? తనకు అంత అవసరం ఏమొచ్చిందని అంతా చర్చించుకున్నారట. అయితే ఈ సీన్ కోసం మాధురీ కోటి రూపాయల పారితోషికం తీసుకున్న అంశం అప్పట్లో బచర్చనీయాంశమైంది. అంతేకాదు అంత్యంత విలువైన ముద్దు ఏదంటే మాధురిది అనేంతగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. డబ్బు కోసం ఇంత దిగజారాలా! అని ఫ్యాన్స్ సైతం ఆమెను విమర్శించారట. ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ డైరెక్షన్లో 1988లో విడుదలైన ‘దయావన్’ చిత్రంలో వినోద్ ఖన్నా-మాధురీ దీక్షిత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: లవ్‌టుడే హీరోపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం! ట్వీట్‌కి లైక్ కొడతావా? అంటూ ఫైర్ ఇందులో అవసరం లేకున్నా హీరోహీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సీన్‌తో పాటు లిప్‌కిస్ పెట్టారట. అయితే మొదట మాధురీ చేయనని చెప్పడంతో దర్శక-నిర్మాతలు ఆమెకు కోటీ రూపాయలు ఆఫర్ చేశారట. దీంతో ఆమె అయిష్టంగానే ఒకే చేప్పిందని సమాచారం. ఇక రీసెంట్గా ఓ మూవీ ఈవెంట్లో మీడియా నుంచి మాధురీకి ఈ లిప్‌కిస్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ఆ సన్నివేశంలో నటించాల్సి ఉండకూడదు. ఇంపార్టెంట్ కాకపోయినా సరే ఆ సీన్ పెట్టారనిపిస్తుంది. నేను దానికి నో చెప్పి ఉండాల్సింది’ అని వివరణ ఇచ్చింది. దీంతో 35 ఏళ్ల నాటి ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. -
మాపై అలాంటి ముద్ర వేస్తారు..హీరోలను అలా అనరెందుకు: నటి
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో రవీనా ఒకరు. అందం, అభినయంతో రవీనా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.90ల్లో స్టార్ హీరోయిన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్లే. దీంతో ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు ఉండేవారు. ఇక తెలుగులోనూ సత్తా చాటిన రవీనా టాండన్ ఇటీవలె కెజిఎఫ్-2 సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె హీరో, హీరోయిన్ల విషయంలో తేడాలు చూపిస్తుండటంపై మండిపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోలు ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల గ్యాప్ తీసుకుంటారు. కానీ హీరోయిన్స్ కొద్ది రోజులు కనిపించకున్నా…సెకండ్ ఇన్నింగ్స్ అని ముద్ర వేస్తారు. మాధురీ దీక్షిత్‌ను 90ల కాలం నాటి సూపర్ స్టార్ అని మీడియాలో కథనాలు వేస్తారు. మరి అప్పటి నుంచి పని చేస్తున్న సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల గురించి అలా అనరెందుకు? హీరో, హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి అంటూ వాపోయింది రవీనా.