ఏక్ దో తీన్, వన్ టూ త్రీ.. ఏంటి ఈ హిందీ, ఇంగ్లీష్ అంకెల గోల! అనుకుంటున్నారా..!! విషయం ఏంటంటే..1998లో తేజాబ్ సినిమాలోని ఈ పాటలో అందాల నటి మాధురీ దీక్షిత్ ఏక్ దో తీన్ అంటూ అదిరిపోయే స్టెప్పులతో దుమ్ములేపిన విషయం తెలిసిందే.సినీ ప్రియులకు మళ్లీ ఆ పాటను తెరపై చూసే అవకాశం వచ్చింది. కుర్రకారుకు మతి పోగొడుతున్న ‘కిక్’ స్టార్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఈ పాట రీమిక్స్‌లో తన స్టెప్పులతో మనందరి చేత మళ్లీ ఏక్ దో తీన్ అనిపించబోతోంది.
త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ‘భాగీ 2’ చిత్రంలో ఫెర్నాండెజ్ అతిథి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో దిగ్గజ నటి మాధురి దీక్షిత్ ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్ సాంగ్ ఏక్‌దో తీన్ పాట రీమిక్స్‌ను చేస్తున్నారు. మాధురి దీక్షిత్ సూపర్‌హిట్ సాంగ్ ఏక్ దో తీన్ పాటలో నటిస్తున్నానంటూ ఈ శ్రీలంక అందాల తార అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది. 25 సెకన్ల నిడివి గల ఈ సాంగ్ టీజర్‌ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment