మాధురి దీక్షిత్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్.. బాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. 1984లో అబోద్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్.. శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్‌లకు కూడా అందనంత ఎత్తులో నిలబడింది. అయితే, తాజాగా ఆమె చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
ఓ కంపెనీకి చెందిన యాడ్ విషయంలో మాధురి దీక్షిత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రెహన్ సిద్ధిఖీ తన వ్యాపారా సామ్రాజ్యాన్ని పెంచుకునే క్రమంలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాడు. ఆగష్టు నెలలో తనకు చెందిన కంపెనీల ప్రమోషన్ కార్యక్రమాన్ని టెక్సాస్‌లో నిర్వహించనున్నాడు.
అయితే, ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవరించేందుకు మాధురి దీక్షిత్ టెక్సాస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిని భారతీయులు తప్పుబడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని నెట్టింట పెద్ద ఎత్తున్న కామెంట్లు చేస్తున్నారు. దీనంతటికి కారణం పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో రెహన్ సిద్ధిఖీకి సంబంధాలున్నాయంటూ.. ఆయన నిర్వహించే అన్నీ కంపెనీలను భారత్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది.
టెక్సాస్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అందులో రెహన్ సిద్ధికీ, మాధురిదీక్షిత్ ఫొటోలున్నాయి. దీంతో ఆమె ఆ కార్యక్రమానికి వెళ్తున్నట్లు తేలిపోయింది. ముందుగా రెహన్ సిద్ధిఖీ ఎలాంటి వాడో తెలుసుకొని ఆ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ వెళ్లాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే, ఈ గొడవ గురించి మాధురి దీక్షిత్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment