మాధురీ విత్ మాధురీ | madhuri dixit With madhuri Waxy sculpture | Sakshi
Sakshi News home page

మాధురీ విత్ మాధురీ

Published Sun, May 10 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

మాధురీ విత్ మాధురీ

మాధురీ విత్ మాధురీ

నైపుణ్యం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం... పేరు వినగానే మైనపుశిల్పాలు కళ్లముందు మెదలుతాయి. లండన్‌లో ఉన్న ఈ మ్యూజియానికి ఆమ్‌స్టర్‌డామ్, బ్యాంకాక్, సిడ్నీ, హాంగ్‌కాంగ్, టోక్యో, లాస్‌వేగాస్, ఆర్లాండో, శాన్‌ఫ్రాన్సిస్కో, షాంఘై, బీజింగ్, సింగపూర్, బెర్లిన్, ప్రేగ్, వియన్నా,వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, హాలీవుడ్‌లలో శాఖలు ఉన్నాయి.

ఒక మైనపు శిల్పాన్ని తయారు చేయడానికి సుమారు నాలుగు నెలలు పడుతుంది. మనిషిని 250 కొలతలు తీసుకుంటారు.

రకరకాల భంగిమల్లో ఉన్న ఫొటోలను పరిశీలిస్తూ శిల్పాన్ని తయారు చేస్తారు. వ్యక్తి జీవించి లేకపోతే ఆ వ్యక్తి వందల ఫొటోలను నిశితంగా పరిశీలించి పని మొదలు పెడతారు.
ప్రతి వెంట్రుకను విడిగా నాటుతారు. ఇందుకు ఐదు వారాలు పడుతుంది.
కంటిలోని ఎర్రజీరల కోసం ఎర్రటి పట్టుదారాలను ఉపయోగిస్తారు. దేహంలో రక్తనాళాలు ఉబ్బెత్తుగా అనిపించడానికి దారానికి ముడులు వేసి అమరుస్తారు.
మ్యూజియం నిబంధనలు కచ్చితంగా ఉంటాయి. మైనపు శిల్పం తయారీకి తీసుకున్న వ్యక్తుల దేహ కొలతలను వెలిబుచ్చరు. అత్యంత రహస్యంగా ఉంచుతారు.
 ఠి ప్రతి రోజూ రెండు మెయింటెనెన్స్ టీమ్‌లు ప్రతి మైనపు శిల్పాన్నీ పరిశీలించి అంతా బాగుందని నిర్ధారించుకున్న తరవాత మాత్రమే పర్యాటకులను లోపలికి అనుమతిస్తారు.
మైనపు శిల్పాలకు క్రమం తప్పకుండా షాంపూ చేయించి, దుస్తులు తొడగడంతోపాటు నెయిల్ పాలిష్ తుడిచి కొత్తది వేస్తారు.
ఒక్కో మైనపు శిల్పం తయారీకి నూటపాతిక డాలర్లు ఖర్చవుతుంది.
 
మైనపు శిల్పాల తయారీలో ఎక్స్‌పర్ట్ అయిన మ్యారీ టుస్సాడ్స్ పేరుతో ఈ మ్యూజియానికి ‘మేడమ్ టుస్సాడ్స్’ అనే పేరు వాడుకలోకి వచ్చేసింది. మ్యారీ తన పదహారవ యేట తొలి మైనపు శిల్పాన్ని చేశారు. ఒకానొక పరిస్థితిలో ఆమెకు చనిపోయిన వారి మాస్కులు తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రపంచదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అనేక కళాఖండాలను రూపొందించారు. వాటితో ప్రదర్శన ఏర్పాటు చేశారు. టుస్సాడ్స్ మ్యూజియం లండన్‌లో ప్రధానమైన టూరిస్ట్ అట్రాక్షన్స్‌లో ఒకటి. ఇప్పుడు మ్యూజియాన్ని మెర్లిన్ సంస్థ నిర్వహిస్తోంది.
 
ఈ మ్యూజియంలో వేలాది శిల్పాలున్నాయి. ప్రముఖ నటీనటులు, నాయకులు, క్రీడాకారులు, రచయితలు, సంగీతకారుల శిల్పాలున్నాయి. ఇందులో అడాల్ఫ్ హిట్లర్, ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్, ద బీటిల్స్, ప్రిన్స్ చార్లెస్- కెమిల్లా దంపతులు, చార్లీ చాప్లిన్, రెండవ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్, పోప్‌జాన్‌పాల్, ప్రిన్సెస్ డయానా, మార్లిన్‌మన్రో, నెల్సన్‌మండేలా వంటి ప్రపంచ ప్రముఖులతోపాటు మనదేశానికి చెందిన మహాత్మాగాంధీ, కరీనా, అమితాబ్, ఐశ్వర్యారాయ్, మాధురీదీక్షిత్, సల్మాన్‌ఖాన్ వంటి వారి మైనపు శిల్పాలున్నాయి. అలాగే మ్యారీ టుస్సాడ్స్ శిల్పం కూడా. ఈ మ్యూజియాన్ని ఏడాదికి ఐదొందల మిలియన్ల మంది సందర్శిస్తారు. వీరిలో ఎక్కువ మంది నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాల నుంచే వస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement