బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (Madhuri Dixit)- డాక్టర్ శ్రీరామ్ నేనే సంక్రాంతి పండక్కి కొత్త కారు కొనుగోలు చేశారు. ఫెరారి 296 జీటీఎస్ మోడల్‌ను తమ గ్యారేజీకి తెచ్చుకున్నారు. దీని విలువ రూ.6 కోట్ల పైనే ఉంటుందని అంచనా. మాధురి దీక్షిత్ దంపతులు ఈ ఫెరారీ కారులో షికారుకు వెళ్లారు. ఎరుపు రంగు ఫెరారీ కారును భర్త నడుపుతుంటే మాధురి పక్కన కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినిమా
మాధురి దీక్షిత్ చివరగా భూల్ భులయ్యా 3 సినిమా (Bhool Bhulaiyaa 3 Movie)లో కనిపించింది. ఈ మూవీలో విద్యా బాలన్, తృప్తి డిమ్రి, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా, అశ్విని కల్సేకర్, రాజేశ్ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన భూల్ భులయ్యా మొదటి భాగం సూపర్ హిట్ అయింది. దీంతో 2022లో దీనికి సీక్వెల్ తెరకెక్కింది. కార్తీక్ ఆర్యన్, కియరా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా సక్సెస్ అందుకుంది. దీంతో గతేడాది మూడో పార్ట్ రిలీజ్ చేశారు. ఇది కూడా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.
చదవండి: థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
Comments
Please login to add a commentAdd a comment