బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే
నివాసం ఉంటున్న ఇల్లు కళ, సాంకేతికతల మేళవింపులా
ఉంటుంది. దీనిని డిజైనర్ అపూర్వ ష్రాఫ్ రూపోందించారు.
ముంబై అపార్ట్‌మెంట్‌లోని 53వ అంతస్తులో మాధురీ దీక్షిత్ ఇంటి నుంచి ఒక ట్యూన్ వినిపిస్తుంటుంది. అది ఆమె నడక, హుందాతనం, అందాన్ని కూడా కళ్లకు కట్టేలా చేస్తుంది అంటారు ఆ ట్యూన్ విన్నవాళ్లు. బాలీవుడ్‌లో 90ల నాటి సినిమా హిట్‌లలో తేజాబ్ లో మోహిని, దిల్ లో మధు, అంజామ్ లో శివాని, హమ్ ఆప్కే హై కౌన్ లో నిషా, దిల్ తో పాగల్ హై లో పూజ ... వంటి. ఇంకా ఎన్నో పాత్రలతో ఆమె నటన నేటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. మాధురి ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే ముంబైలోని ఎతై ్తన భవనంలో తమ అధునాతన నివాసాన్ని రూపోందించడానికి ప్రఖ్యాత లిత్ డిజైన్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్‌ను పిలిచారు.
సింప్లిసిటీ
ఈ జంట కోరిన వాటిని సరిగ్గా అందించడంలో వారు చెప్పిన స్పష్టమైన సంక్షిప్త వివరణ ష్రాఫ్‌కు బాగా సహాయపడింది: ‘సమకాలీన సౌందర్యాన్ని మినిమలిస్ట్ అండర్ టోన్ తో మిళితం చేసేలా సరళ రేఖలు, అందమైన రూపాలు, హుందాతనాన్ని కళ్లకు కట్టే అభయారణ్యం...’ ఇవి ఇంటి యజమానుల శక్తివంతమైన వ్యక్తిత్వాలను చూపుతుందని వారిని ఒప్పించింది ష్రాఫ్. మాధురి, డాక్టర్ మాధవ్ ‘సింప్లిసిటీ’ని కోరుకున్నారు. ఇది ఇల్లులాగా అనిపించే టైమ్‌లెస్ టెంప్లేట్. మాధురి ఈ విషయాలను షేర్ చేస్తూ, ‘ప్రశాంతత, స్పష్టత, సౌకర్యాన్ని రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక ఆర్ట్’ అంటారామె.
హుస్సేన్ కళాకృతి
40 సంవత్సరాల సినీ కెరీర్‌లో మాధురీ దీక్షిత్ లక్షలాది మంది ఆరాధకులతో పాటు, ఎంతో మంది ఊహాలోకపు రారాణి. వారిలో ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఒకరు. భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ మాధురి కోసం ప్రత్యేకంగా చిత్రించిన విసెరల్ వైబ్రెంట్ పెయింటింగ్‌లు ఇంటి డిజైన్ భాషకు అద్దంలా నిలిచాయి. విక్రమ్ గోయల్ వియా హోమ్ ద్వారా అలంకరించిన ప్రవేశ ద్వారం, హుస్సేన్ పవిత్రమైన గణేషులచే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మాధురి వినయపూర్వకమైన ్రపారంభాన్ని గుర్తుచేసే స్వాగతతోరణంలా భాసిల్లుతుంది. ఇంట్లో ప్రతిచోటా హుస్సేన్ కళాకృతి సంభాషణలనుప్రోత్సహిస్తుంది. మాధురి వాటి గురించి మరింత వివరింగా చెబుతూ ‘హుస్సేన్ జీ మా ఇంటి గోడలకు రంగులతో కళ తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను వద్దాన్నాను. దీంతో నాకు అత్యుత్తమ చిత్రాలను చిత్రించి, ఇచ్చాడు. అతను ఉపయోగించిన రంగులను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఆ కళ ఇలా బయటకు కనిపిస్తుంది’ అని వెల్లడించింది మాధురి.
Comments
Please login to add a commentAdd a comment