apoorva
-
మాధురీ నవ్వులతో పోటీ పడే ఇంటి కళ
బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే నివాసం ఉంటున్న ఇల్లు కళ, సాంకేతికతల మేళవింపులా ఉంటుంది. దీనిని డిజైనర్ అపూర్వ ష్రాఫ్ రూపోందించారు.ముంబై అపార్ట్మెంట్లోని 53వ అంతస్తులో మాధురీ దీక్షిత్ ఇంటి నుంచి ఒక ట్యూన్ వినిపిస్తుంటుంది. అది ఆమె నడక, హుందాతనం, అందాన్ని కూడా కళ్లకు కట్టేలా చేస్తుంది అంటారు ఆ ట్యూన్ విన్నవాళ్లు. బాలీవుడ్లో 90ల నాటి సినిమా హిట్లలో తేజాబ్ లో మోహిని, దిల్ లో మధు, అంజామ్ లో శివాని, హమ్ ఆప్కే హై కౌన్ లో నిషా, దిల్ తో పాగల్ హై లో పూజ ... వంటి. ఇంకా ఎన్నో పాత్రలతో ఆమె నటన నేటికీ ప్రశంసించబడుతూనే ఉంటుంది. మాధురి ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ నేనే ముంబైలోని ఎతై ్తన భవనంలో తమ అధునాతన నివాసాన్ని రూపోందించడానికి ప్రఖ్యాత లిత్ డిజైన్ సంస్థకు చెందిన ఆర్కిటెక్ట్ అపూర్వ ష్రాఫ్‌ను పిలిచారు.సింప్లిసిటీఈ జంట కోరిన వాటిని సరిగ్గా అందించడంలో వారు చెప్పిన స్పష్టమైన సంక్షిప్త వివరణ ష్రాఫ్‌కు బాగా సహాయపడింది: ‘సమకాలీన సౌందర్యాన్ని మినిమలిస్ట్ అండర్ టోన్ తో మిళితం చేసేలా సరళ రేఖలు, అందమైన రూపాలు, హుందాతనాన్ని కళ్లకు కట్టే అభయారణ్యం...’ ఇవి ఇంటి యజమానుల శక్తివంతమైన వ్యక్తిత్వాలను చూపుతుందని వారిని ఒప్పించింది ష్రాఫ్. మాధురి, డాక్టర్ మాధవ్ ‘సింప్లిసిటీ’ని కోరుకున్నారు. ఇది ఇల్లులాగా అనిపించే టైమ్‌లెస్ టెంప్లేట్. మాధురి ఈ విషయాలను షేర్ చేస్తూ, ‘ప్రశాంతత, స్పష్టత, సౌకర్యాన్ని రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించడం కూడా ఒక ఆర్ట్’ అంటారామె.హుస్సేన్ కళాకృతి40 సంవత్సరాల సినీ కెరీర్లో మాధురీ దీక్షిత్ లక్షలాది మంది ఆరాధకులతో పాటు, ఎంతో మంది ఊహాలోకపు రారాణి. వారిలో ఎమ్.ఎఫ్.హుస్సేన్ ఒకరు. భారతదేశపు ప్రసిద్ధ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ మాధురి కోసం ప్రత్యేకంగా చిత్రించిన విసెరల్ వైబ్రెంట్ పెయింటింగ్‌లు ఇంటి డిజైన్ భాషకు అద్దంలా నిలిచాయి. విక్రమ్ గోయల్ వియా హోమ్ ద్వారా అలంకరించిన ప్రవేశ ద్వారం, హుస్సేన్ పవిత్రమైన గణేషులచే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మాధురి వినయపూర్వకమైన ్రపారంభాన్ని గుర్తుచేసే స్వాగతతోరణంలా భాసిల్లుతుంది. ఇంట్లో ప్రతిచోటా హుస్సేన్ కళాకృతి సంభాషణలనుప్రోత్సహిస్తుంది. మాధురి వాటి గురించి మరింత వివరింగా చెబుతూ ‘హుస్సేన్ జీ మా ఇంటి గోడలకు రంగులతో కళ తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను వద్దాన్నాను. దీంతో నాకు అత్యుత్తమ చిత్రాలను చిత్రించి, ఇచ్చాడు. అతను ఉపయోగించిన రంగులను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఆ కళ ఇలా బయటకు కనిపిస్తుంది’ అని వెల్లడించింది మాధురి. -
Apoorva Srinivasan Wedding: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
World Health Day: ఏయే వయసుల్లో.. ఏయే వ్యాక్సిన్లు! ఏయే వైద్య పరీక్షలు..?
ఆరోగ్య సమస్య ఏమైనా వస్తే చికిత్స తప్ప ప్రత్యామ్నాయం లేదు. కానీ సమస్య రాకుండా ముందే నివారించుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదు. చికిత్స కంటే నివారణే మేలు అనే సూక్తి మేరకు వ్యాధుల నివారణకు ఉపయోగపడే అంశాల్లో మొట్టమొదటి అంశం టీకాలు (వ్యాక్సిన్లు). రెండో అంశం.. లక్షణాలు కనిపించగానే చేయించాల్సిన వైద్యపరీక్షలు. నేడు ‘వరల్డ్ హెల్త్ డే’. ఈ సందర్భంగా ఏ వయసులో. వారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలన్న అంశంపై అవగాహన కోసం ఈ కథనం. టీకాలు.. చిన్నారి పుట్టిన వెంటనే.. ఓపీవీ, బీసీజీలతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లో ఇస్తారు). ఆరు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా ఫస్ట్ డోస్ హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా ఫస్ట్ డోస్ ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా ఫస్ట్ డోస్ పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) ఫస్ట్ డోస్ రొటావైరస్ టీకా మొదటి డోస్ (ఇది నోటిద్వారా ఇస్తారు) హెపటైటిస్–బి వ్యాక్సిన్ రెండో డోస్. పది వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా రెండో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా రెండో మోతాదు ఐపీవీ / ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా రెండోడోస్ పీసీవీ 13 రెండో మోతాదు నోటిద్వారా ఇచ్చే రొటావైరస్ టీకా రెండో డోస్ హెపటైటిస్–బి మూడో డోస్. పద్నాలుగు వారాలప్పుడు: డీ–ట్యాప్ (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్) / డీపీటీ టీకా మూడో మోతాదు హెచ్ఐబీ (హిబ్) (హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి) టీకా మూడోమోతాదు ఐపీవీ (ఇనాక్టివేటెడ్ పోలియో వైరస్)/ ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) టీకా మూడో మోతాదు పీసీవీ 13 (న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా) మూడో మోతాదు రొటావైరస్ టీకా మూడో డోస్ (ఇది నోటిద్వారా ఇచ్చే డోస్) హెపటైటిస్–బి వ్యాక్సిన్ నాలుగో మోతాదు. ఆరు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా మొదటి మోతాదు ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) మొదటి మోతాదు ఏడు నెలల వయసప్పుడు: ఇన్ఫ్లుయెంజా టీకా రెండో మోతాదు తొమ్మిది నెలల వయసప్పుడు: ఓపీవీ (ఓరల్ పోలియో వ్యాక్సిన్) రెండో మోతాదు ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఫస్ట్ డోస్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తారు. పన్నెండు నుంచి 15 నెలల వయసప్పుడు: ఎమ్ఎమ్ఆర్ (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా రెండో మోతాదు వారిసెల్లా (చికెన్‌పాక్స్) టీకా మొదటి మోతాదు హెపటైటిస్–ఏ టీకా మొదటి మోతాదు (దీని రెండో డోస్ సాధారణంగా 18 నెలలప్పుడు ఇస్తారు) పీసీవీ (ప్యాక్డ్ సెల్ వాల్యూమ్) బూస్టర్. పద్దెనిమిది నెలల వయసప్పుడు: డీట్యాప్ టీకా మొదటి బూస్టర్ డోస్ హెచ్ఐబీ (హిబ్) టీకా మొదటి బూస్టర్ డోస్ ఐపీవీ లేదా ఓపీవీ టీకా హెపటైటిస్–ఏ రెండో డోస్. మూడేళ్ల వయసప్పుడు: వారిసెల్లా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా. ఐదేళ్లప్పుడు: డీ–ట్యాప్ టీకా రెండో బూస్టర్ ఐపీవీ టీకా ∙ఎమ్ఎమ్ఆర్ టీకా మూడో డోస్. పది నుంచి పన్నెండేళ్ల వయసప్పుడు: హెచ్‌పీవీ టీకా మొదటి డోస్ (దీని రెండు, మూడు డోసులు 9 నుంచి 18 ఏళ్ల వయసప్పుడు) టీడ్యాప్ టీకా బూస్టర్ డోస్ ∙మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ (దీని బూస్టర్ 16 ఏళ్ల వయసప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది). పదిహేను నుంచి 16 ఏళ్ల వయసప్పుడు: మెనింగోకోకల్ కాంజుగేట్ టీకా బూస్టర్ డోస్ టీడీ / డీటీ టీకా. 18 నుంచి 65 ఏళ్ల వరకు: ఈ వయసులో ఎవరికైనా మంచి వ్యాధి నిరోధకత ఉంటుంది. గతం లో ఏదైనా వ్యాక్సిన్ తీసుకోకపోతే... డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ గుర్తులేనప్పుడు డాక్టర్‌కు ఆ విషయం చెబితే... వారు కొన్ని పరీక్షల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్నదీ లేనిదీ నిర్ధారించి అవసరమైతే ఇస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి: ఈ వయసు దాటాక కొన్ని వ్యాక్సిన్లు తప్పనిసరిగాను, మరికొన్ని అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పీసీవీ–13 అండ్ పీపీఎస్వీ 23 అనే వ్యాక్సిన్లను సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికి ఇస్తుంటారు. ఇవి నిమోనియాను నివారించే నిమోకోకల్ వ్యాక్సిన్స్‌లు. ఇందులో తొలుత పీసీవీ–13 ఇస్తారు. ఆ తర్వాత రెండు నెలలకు పీపీఎస్వీ–23 ఇస్తారు టీ–డ్యాప్ వ్యాక్సిన్: చిన్నప్పుడు తీసుకున్న టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ వ్యాధులను నివారించే వ్యాక్సిన్ తాలూకు బూస్టర్ డోసులను 65 ఏళ్లు పైబడ్డ తర్వాత ప్రతి పదేళ్లకోమారు తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ బీవీఎస్ అపూర్వ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. పరీక్షలు.. ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించడం వల్ల కొన్ని వ్యాధుల్ని కనుగొని సంపూర్ణంగా నయం చేసుకోవచ్చు. ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యాధికి సుదీర్ఘమైన ముందస్తు వ్యవధి ఉంటుంది. అంటే అసలు వ్యాధి రావడానికి పదేళ్ల ముందునుంచే ‘ప్రీ–సర్వైకల్ పీరియడ్’ ఉంటుంది. పాప్ స్మియర్ అనే పరీక్ష ద్వారా వ్యాధి రాబోయే దశాబ్దకాలం ముందుగానే దాన్ని కనుగొనవచ్చు. క్యాన్సర్ ను ఎంత త్వరగా కనుగొంటే అంత తేలికగా నయమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ముందస్తుగా ఏయే వయసుల్లో ఏయే వైద్యపరీక్షలు ఉపకరిస్తాయో తెలుసుకుందాం. 0 – 10 ఏళ్ల వయసులో: ఈ వయసులో అవసరం అయితే తప్ప పెద్దగా వైద్యపరీక్షలు అవసరం లేదు. 11 – 20 ఏళ్లు: ఇది యుక్తవయసులోకి మారే దశ. నిర్దిష్టంగా ఏవైనా వైద్యసమస్యలు ఉండటం లేదా లక్షణాలు కనిపించడం వంటి సమయాల్లో తప్ప... ఈ వయసులోనూ పెద్దగా వైద్యపరీక్షలు అవసరం పడవు. 20 – 30 ఏళ్లు: ఈ వయసులో కొన్ని లైంగిక సాంక్రమిక వ్యాధులు (ఎస్టీఐ’స్) కోసం మరీ ముఖ్యంగా హెపటైటిస్–బీ నిర్ధారణ పరీక్షలు చేయించి హెచ్‌బీఐజీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే అమ్మాయిలైతే పాప్‌స్మియర్ వంటి గైనిక్ పరీక్ష లు చేయించుకుని, 12 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకాలంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రయోజనకరం. 30 నుంచి 40 ఏళ్లు: ఈ వయసు నుంచి డయాబెటిస్ కోసం హెచ్‌బీఏ1సీ అనే రక్తపరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా తేడాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఈసీజీ, టూ డీ ఎకో, అవసరాన్ని బట్టి ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలూ మంచిదే. మహిళలైతే డాక్టర్ సలహా మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. 40 – 50 ఏళ్లు: ఈ వయసు నుంచి దేహంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అందుకే ఈ వయసులో పరీక్షలు తరచూ చేయిస్తుండటం మేలు. రక్తపోటును తెలుసుకోవడం కోసం సిస్టోల్, డయాస్టోల్ ప్రెషర్స్, రక్తలో చక్కెర మోతాదుల కోసం హెచ్‌బీఏ1సీతో పాటు అవసరమైతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), పొద్దున్నే పరగడుపున, ఏదైనా తిన్న తర్వాత చేసే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ్రపాండియల్ వైద్య పరీక్షలతోపాటు అవసరాన్ని బట్టి కొన్నిరకాల క్యాన్సర్ పరీక్షలు చేయించడం మంచిది. అలాగే మహిళలైతే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ డెన్సిటీ పరీక్ష చేయించాలి. దాంతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలను డాక్టర్ చెప్పిన వ్యవధుల్లో చేయించాలి. ఇక పురుషులైతే ఈ వయసు నుంచి ్రపోస్టేట్ స్పెసిఫిక్ ఏంటీజెన్... సంక్షిప్తంగా పీఎస్ఏ అనే పరీక్షను డాక్టర్లు చెప్పిన వ్యవధుల్లో చేయించుకుంటూ ఉండాలి. 50 – 60 ఏళ్లు: చాలామంది 50 ఏళ్ల వరకు ఎలాంటి పరీక్షలు చేయించకపోవచ్చు. అయితే అలాంటివాళ్లంతా ఈ 50 – 60 ఏళ్ల మధ్యవయసులో తప్పక వైద్యపరీక్షలు చేయించాల్సిన అవసరం తప్పక వస్తుంది. ముందు నుంచి పరీక్షలు చేయించని వాళ్లతోపాటు ఈ వయసులోని అందరూ ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండె జబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతో పాటు లక్షణాలను బట్టి ఇతర వైద్యపరీక్షలు చేయిస్తుండాలి. మహిళలకు 50 ఏళ్ల వయసు తర్వాత మెనోపాజ్ రావడంతో గుండెకు ఉండే ఒక సహజ రక్షణ తొలగిపోతుంది. అందువల్ల గతంలో చేయించినా, చేయించక పోయినా ఈ వయసు నుంచి మహిళలు గుండెకు సంబంధించిన అన్ని స్క్రీనింగ్ పరీక్షలు అంటే ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించాలి. 60 నుంచి 70 ఏళ్లు: ఈ వయసులో వాళ్లనే సీనియర్ సిటిజెన్‌గా పరిగణిస్తుంటారు. పురుషులూ మహిళలు అన్న తేడాలేకుండా... ఈ వయసు నుంచి అందరూ... ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ కోసం బోన్ స్కాన్, కోలన్ క్యాన్సర్ నిర్ధారణ కోసం కొలనోస్కోపీ, గుండెజబ్బుల కోసం తరచూ ఈసీజీ, టూ డీ ఎకో, ట్రెడ్మిల్ పరీక్షలతోపాటు లక్షణాలను బట్టి మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు అవసరమవుతాయి. 70+ పైబడ్డాక.. ఆపైన కూడా.. ఈ వయసు నుంచి లక్షణాలను బట్టి ఓ వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు పైన పేర్కొన్న వైద్యపరీక్షలతో పాటు కొన్ని వ్యాక్సిన్లు, మరికొన్ని మందులు తీసుకోవాలి. ఒకవేళ పోషకాహార లోపం ఉంటే, తగిన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు అవసరం అయితే మరికొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ హరికిషన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్. ఇవి చదవండి: మన తెలుగువాడి బయోపిక్ -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్‌పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్‌ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్‌చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్‌స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది. -
కరోనా హీరో డాక్టర్ అపూర్వ
ప్రాణాలను కాపాడే శక్తి డాక్టర్ల చేతిలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ శక్తి అందరి చేతుల్లోకి వచ్చింది.కరోనా మీద పోరాటం డాక్టర్లుగా మాకు పెద్ద చాలెంజ్. ఈ చాలెంజ్‌లో మమ్మల్ని గెలిపించగలిగింది మీరే. బాధ్యతాయుతమైన పౌరులని నిరూపించుకోండి. స్నేహితులకు చెప్పండి... ఇంట్లో వాళ్లకు చెప్పండి. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పండి. మనల్ని మనం కాపాడుకుందాం. మన తోటి వారిని కాపాడుదాం. ఇది ఒక డాక్టర్ చేస్తున్న విన్నపం. డాక్టర్ అపూర్వ చేస్తున్న అపూర్వమైన విన్నపం. డాక్టర్ అపూర్వ చేసిన మూడున్నర నిమిషాల వీడియో పది రోజులుగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ కంటే వేగంగా విస్తరిస్తోంది. జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ నేపథ్యంలో రూపొందించిన వీడియోను ఫేస్బుక్లో లక్షమందికి పైగా వీక్షించారు. యూట్యూబ్‌లో ఇరవై గంటల్లో నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి. జనమంతా ఇంత ఘనం చూడడానికి అందులో ఏముంది? అంటే... కరోనా గురించిన పూర్వాపరాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయి. వాట్సాప్ యూనివర్సిటీ వెదజల్లుతున్న సొంత పరిజ్ఞానాన్ని, ఇతర సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేక్ న్యూస్ సునామీని అదుపు చేయడం కోసమే ఆ వీడియో చేశానన్నారు గైనకాలజీ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ అపూర్వ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్ల సందేహాలకు సమాధానాలే తన వీడియోలని చెప్పారు అపూర్వ. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకయితే ఒక్కొక్కరికీ ఓపిగ్గా ఆద్యంతం వివరించడం సాధ్యమవుతోంది. తరచూ డాక్టర్ దగ్గరకు రాలేని గర్భిణులు మనదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్లకు అందుబాటులో ఉన్న డాక్టర్లకు ఈ మహిళల సందేహాలన్నింటికీ సమాధానం చెప్పే సమయం, సహనం ఉన్నాయో లేదో కూడా అనుమానమే. అందుకే తానే వాళ్లందరి దగ్గరకు వెళ్లాలనుకున్నారు డాక్టర్ అపూర్వ. కాలనీకు వెళ్లి, గర్భిణుల కోసం అవగాహన సదస్సులు పెట్టి స్వయంగా మాట్లాడవచ్చు. ఇప్పుడా పరిస్థితి లేదు, అంత సమయమూ లేదు. అందుకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకూ చేరుకున్నారు. ఆ వీడియోల్లో ఆమె కరోనా మొదట ఎలా బయటపడింది అనే వివరాల నుంచి, ఎలా విస్తరించింది, ప్రభుత్వాలు కట్టడి చేసినప్పుడు ఎంత అదుపులో ఉండింది? దక్షిణ కొరియా మహిళ బాధ్యతరాహిత్యం వల్ల ఎంత మందికి ఎంత త్వరగా వ్యాధి వ్యాప్తి చెందిందనే వివరాలతోపాటు, వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐసోలేషన్ ఆవశ్యకత, ఈ విపత్కాలంలో ఇంట్లోనే ఉండడాన్ని మించిన మంచిపని మరొకటి లేదనే సూచనలతో ‘స్టే హోమ్... బీ సేఫ్’ అనే సందేశంతో ముగుస్తుందీ వీడియో. చివరగా మలయాళం, తమిళ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో డాక్టర్ల సూచనలు కూడా ఉన్నాయి. ఆమె సేవలకు డబ్లు్యహెచ్‌వో ‘రికార్డ్ ఆఫ్ అచీవ్మెంట్’ సర్టిఫికేట్ ప్రదానం చేసింది. నెలలు నిండక ముందే ప్రసవం ‘‘కరోనా తొలిదశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి గర్భిణులకు సోకదనే అనుకున్నారు. కానీ విదేశాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారక వైరస్ స్వరూపం మార్చుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మార్పులకు అనుగుణంగా వీడియోలు చేస్తున్నాను. గర్భిణులకు వ్యాధి సోకితే ప్రీ టర్మ్ డెలివరీలయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కానీ ప్రైవేట్ హాస్పిటళ్లు మాత్రం ముందస్తు డెలివరీలను దృష్టిలో పెట్టుకుని బెడ్లను సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. ఒక కరోనా పాజిటివ్ పేషెంట్‌ను పరీక్షించిన డాక్టర్, ఇతర పారా మెడికల్ స్టాఫ్ ఇతర రోగులను పరీక్షించకుండా ఉండేటట్లు మా డాక్టర్లం కూడా కేటగిరైజ్ చేసుకుని పని చేస్తున్నాం. పాజిటివ్ పేషెంట్లను చూసిన మెడికల్ టీమ్ ఒక వారం డ్యూటీ చేసి, రెండు వారాలు క్వారంటైన్లో ఉంటోంది. ఈ డిసీజ్‌కి సరిహద్దుల్లేవు, మన జాగ్రత్తలతోనే దీనికి అడ్డుకట్ట వేయాలి’’ అని డాక్టర్లుగా తాము కరోనా వ్యాధిని ఎదుర్కొంటున్న తీరును వివరించారామె. వీడియో సందేశం కరోనా వీడియోని మొదట ఇంగ్లిష్ వెర్షన్ చేశాను. అది చూసి మా అమ్మ ‘తెలుగమ్మాయివై ఉండి, తెలుగు వాళ్లను ఎడ్యుకేట్ చేయకుండా ప్రపంచమంతటినీ ఎడ్యుకేట్ చేస్తావా? తెలుగులో కూడా చెయ్యి’ అన్నారు. ఆ మాటతో నాకు మనసులో ఏదో గుచ్చుకున్నట్లయింది. వెంటనే తెలుగులో స్క్రిప్టు రాసుకుని తెలుగులో షూట్ చేశాను. మా అమ్మ ఆ మాట అన్న మూడు గంటల్లో తెలుగు వెర్షన్ చేసి అమ్మకి చూపించాను. ఆశ్చర్యం ఏమింటే... ఇంగ్లిష్ వెర్షన్ ఎంత వేగంగా విస్తరించిందో, అంతే వేగంగా తెలుగు వెర్షన్ కూడా విస్తరించింది. సింగపూర్, యూఎస్‌లో ఉన్న తెలుగు వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘స్వయంగా డాక్టర్ మాటల్లోనే వినడంతో మాకు ధైర్యంగా ఉంది. మీరు చెప్పినట్లు వ్యాధి అదుపులోకి వచ్చే వరకు ఇంట్లోనే ఉంటాం’ అని హామీ కూడా ఇస్తున్నారు. – డాక్టర్ అపూర్వ పల్లంరెడ్డి, ఫీనిక్స్ క్లినిక్, బెంగళూరు – వాకా మంజులారెడ్డి -
చాంపియన్స్ అపూర్వ, అహ్మద్
సాక్షి, హైదరాబాద్: వి–10 తెలంగాణ రాష్ట్ర ర్యాం కింగ్ క్యారమ్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన ఎస్. అపూర్వ విజేతగా నిలిచింది. చిక్కడపల్లిలోని పోస్టల్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో అపూర్వ, పురుషుల సింగిల్స్ విభాగంలో మొహమ్మద్ అహ్మద్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) 25–7, 25–1తో పి. నిర్మల (ఎల్ఐసీ)పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో మొహమ్మద్ అహ్మద్ (హెచ్‌ఎంసీసీ) 25–7, 20– 10తో మొహమ్మద్ వసీమ్ (ఏసీసీఏ)ను ఓడించాడు. అంతకుముందు జరిగిన పురుషుల సెమీస్ మ్యాచ్‌ల్లో వసీమ్ 23–18, 25– 12తో ఎస్. రమేశ్‌పై, అహ్మద్ 10–25, 22–19, 25–13తో ఎంఏ హకీమ్‌పై నెగ్గారు. మహిళల సెమీస్ మ్యాచ్‌ల్లో పి. నిర్మల 25–2, 25–0తో స్వాతిపై, అపూర్వ 25–4, 25–4తో కార్తీక వర్షపై విజయం సాధించారు. మరోవైపు జూనియర్ బాలబాలికల విభాగంలో సీహెచ్ సాయి చరణ్, సి. కార్తీక వర్ష విజేతలుగా నిలిచారు. ఫైనల్లో సాయి చరణ్ (మంచిర్యాల) 25–14, 18–17తో ఆసిఫ్ అలీ (నిజామాబాద్)పై గెలుపొందగా, కార్తీక వర్ష (ఎన్ఏఎస్ఆర్) 24–4, 25–0తో నందినిని ఓడించింది. -
ఇంత జరుగుతున్నా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సినీ మహిళా ఆర్టిస్టుల డిమాండ్లకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలుగు వారికే 90శాతం అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాస్టింగ్ కౌచ్, కోఆర్డినేటర్ల విధానాన్ని రద్దు చేసి తమకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జూనియర్ ఆర్టిస్టులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఫ్యూడల్ వ్యవస్థను గుర్తుకు తెస్తోందన్నారు. ‘సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శంగా నిలవాలి. సినీ పరిశ్రమ పట్ల సమాజంలో గౌరవం పోతుంది. మొన్న మాదకద్రవ్యాల ముద్ర, ఇప్పుడు లైంగిక వేధింపుల ముద్ర సినిమా ఇండస్ట్రీపై పడింది. చిత్ర పరిశ్రమ నాగరిక విలువలకు కట్టుబడి ఉండాలి. ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. వేధింపులకు పాల్పడ్డ వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేయాల’ని కోదండరాం అన్నారు. తెలుగు సినిమా హీరోల వద్ద వందల ఎకరాల భూములున్నాయని.. మర్యాదగా ఇవ్వకుంటే వాటిని బలవంతంగా లాక్కుమంటామని బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. సినీ పరిశ్రమ తిరోగమన దిశగా వెళ్తోందని విమర్శించారు. సినీ పరిశ్రమలో తమకు రక్షణ కరువైందని మహిళా ఆర్టిస్టులు వాపోయారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, వేషాలు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు చెందిన అపూర్వ, శ్రీరెడ్డితో పాటు పలువురు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు..!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో శ్రీరెడ్డి లాగే చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. సినిమాలో చిన్న చిన్న పాత్రలు పొందేందుకు కూడా మహిళలు లైంగిక ఒత్తిడులకు గురి కావాల్సి రావడం దారుణమని మహిళా కార్యచరణ ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నటి శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరిట వేధింపులు) ఆరోపణలపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బుధవారం కలిసిన ఐక్యవేదిక ప్రతినిధులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సినీ నటి అపూర్వ మీడియాతో మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) శ్రీరెడ్డిని బ్యాన్ చేయడం సరికాదన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మమ్మల్ని అడగకుండానే ఆమెపై నిషేధం విధించారు. ఇంకా చెప్పాలంటే శ్రీరెడ్డిని ఈ విషయంపై సంప్రదించకుండా, ఆమె అభిప్రాయం తీసుకోకుండానే బ్యాన్ చేశారు. దీనికి నేను వ్యతిరేకం. అందుకే ’మా’ నుంచి బయటకొచ్చానని, ఇండస్ట్రీ పూర్తిగా మారాల్సి ఉందని’ అపూర్వ అభిప్రాయపడ్డారు. శ్రీరెడ్డికి న్యాయం చేయాలంటూ మహిళా కార్యచరణ ఐక్య వేదిక సభ్యులు తలసానికి మెమోరాండంను అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు చాలా ఉన్నాయి. శ్రీరెడ్డి ఘటన తర్వాత అనేకమంది బాధితులతో మాట్లాడి తెలుసుకున్నాం. చిన్న చిన్న పాత్రలకు కూడా లైంగిక ఒత్తిడికి మహిళలు, యువతులు గురి కావాల్సి వస్తోంది. హెల్ఫ్‌లైన్, టోల్ ఫ్రీ నెంబర్ సినీ ఇండస్ట్రీకి ఉండాలి. అవుట్ డోర్‌కి వెళ్లినప్పుడు మహిళలకు బాత్రూమ్లు కూడా ఉండవని, అనేక అవమానాలు మహిళా ఆర్టిస్టులకు జరుగుతున్నాయని మెమోరాండంలో పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త దేవి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి లాగ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో క్యాష్ కమిటీ వెయ్యాలి. ఇండస్ట్రీలో స్త్రీల మీద అత్యాచారాలు, ఇతర రకాలుగా దోపిడీ జరుగుతుంది. సినిమా రంగంలో పనిచేస్తున్న వారి బాధలను తెలియపరిచేలా కమిటీని వేయాలి. సినీ ఇండస్ట్రీ మహిళల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. శ్రీరెడ్డిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. శ్రీరెడ్డి కేవలం ఆరోపణలు మాత్రమే చేయలేదన్నది గుర్తించాలి. ఆధారాలతో శ్రీరెడ్డి బయటపెడుతున్నఅందరిపై చర్యలు తీసుకొని అలాంటి వారిని ప్రజల ముందు నిలబెట్టాలని కోరారు. -
చాంప్స్ కార్తీక్, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో వడ్డేపల్లి కార్తీక్ నీల్, అపూర్వ వేమూరి సత్తా చాటారు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీ అండర్–14 బాలబాలికల విభాగంలో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన అండర్–14 బాలుర ఫైనల్లో కార్తీక్ నీల్ 6–3, 4–6, 6–2తో రోహన్ కావలిపై గెలుపొందగా, బాలికల విభాగంలో అపూర్వ 6–2, 6–1తో ఐరా షా (మహారాష్ట్ర)ను ఓడించింది. డబుల్స్ విభాగంలోనూ అపూర్వ జోడి విజేతగా నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అపూర్వ–అభయ వేమూరి ద్వయం 6–0, 6–1తో మలిష్క (తెలంగాణ)–జ్యోతిష (తమిళనాడు) జంటపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర డబుల్స్ టైటిల్ పోరులో కహిర్ వరిక్ (మహారాష్ట్ర)–సి.ఆర్యంత్ (తెలంగాణ) జోడీకి వాకోవర్ లభించింది. అండర్–12 బాలికల ఫైనల్లో ఐరా (మహారాష్ట్ర) 7–5, 6–1తో సౌమ్య (తెలంగాణ)పై, బాలుర తుదిపోరులో మోహి త్ సాయిచరణ్ రెడ్డి (తెలంగాణ) 6–3, 4–6, 6–3తో శ్రీశరణ్ (తెలంగాణ)పై గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. -
క్వార్టర్స్‌లో అభయ, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో అభయ, అపూర్వ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని డీఆర్సీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో శనివారం జరిగిన అండర్–12 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ మ్యాచ్‌ల్లో అభయ వేమూరి 8–2తో తన్వి రెడ్డిపై గెలుపొందగా... అపూర్వ వేమూరి 8–0తో శ్రీనిధి రెడ్డిని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో సౌమ్య 8–5తో రిధి చౌదరీపై, సాయి బృంద 8–3తో లక్ష్మీశ్రీపై, సమీనా 8–7 (5)తో శ్రీవల్లి వర్మపై, రత్న సహస్ర 8–0తో దివ్యపై, తిరుమల శ్రీయ 8–0తో ఖుషిరెడ్డిపై, మలిష్క 8–0తో త్రిభువనిపై విజయం సాధించారు. బాలుర తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీశరణ్ రెడ్డి 8–2తో త్రిశాంత్ రెడ్డిపై, శ్రీహరి 8–0తో సాకేత రామపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలుర తొలిరౌండ్: కోట శ్రీనాథ్ 8–3తో హృషిక్‌పై, ధరణి దత్త 8–0తో ధీరజ్ రెడ్డిపై, వినీత్ 8–5తో మొహమ్మద్ జైద్ జిహార్‌పై, రాజు 8–5తో రోహిత్ సాయిపై, వేదాంత్ మిశ్రా 8–3తో ఆర్మాన్ మిశ్రాపై, శౌర్య 8–5తో హేమంత్‌సాయిపై, తన్మయ్‌రెడ్డి 8–5తో అనిరుధ్‌పై, మోహిత్ సాయి 8–1తో అనీశ్ జైన్‌పై, అభిషేక్ కొమ్మినేని 8–3తో శాండిల్య పుల్లెలపై, త్రిశూల్8–6తో రోహన్‌పై, సిద్ధార్థ 8–4తో ఆదిత్య రెడ్డిపై, అనీశ్ రెడ్డి 8–3తో ధనుష్ వర్మపై విజయం సాధించారు. బాలికల తొలిరౌండ్: రిధి చౌదరీ 8–7 (1)తో వెన్నెలపై, సాయిబృంద 8–0తో పూజితపై, లక్ష్మీశ్రీ 8–1తో శ్రీమన్య రెడ్డిపై, సమీనా 8–1తో రిషికపై, అభయ 8–0తో తేజ శ్రీవిద్యపై, శ్రీనిధి రెడ్డి 8–6తో మేధశ్రీపై, అపూర్వ 8–0తో సన లతీఫ్‌పై, తిరుమల శ్రీయ 8–4తో జి. శివానిపై, ఖుషిరెడ్డి 8–6తో భారతిపై, త్రిభువని 8–2తో తానియాపై గెలుపొందారు. -
విజేతలు అపూర్వ, శ్రీనివాస్
స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, ఇందిరాంబ స్మారక క్యారమ్ చెస్ టోర్నమెంట్లో అపూర్వ, శ్రీనివాస్ సత్తా చాటారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ చాంపియన్ అపూర్వ విజేతగా నిలవగా... పురుషుల విభాగంలో శ్రీనివాస్ సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 20-11, 25-9తో సవితా దేవి (పోస్టల్)పై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన గేమ్‌లో జి. మాధవి 23-15, 15-13తో బి. సునీతా దేవిపై గెలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీనివాస్ 5-21, 25-16, 15-1తో మూడో సీడ్ మొహమ్మద్ అహ్మద్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో మొహమ్మద్ అహ్మద్ 18-9, 15-25, 20-10తో దినేశ్ బాబుపై, కె. శ్రీనివాస్ 2-25, 22-14, 25-16తో ఎస్. ఆదిత్యపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. డబుల్స్ విభాగంలో కె. శ్రీనివాస్-బాసిల్ ఫిలిప్స్ జంట 24-25, 17-24, 25-15తో వి. శ్రీనివాస రెడ్డి-ఎస్. ఆదిత్య జోడీని ఓడించి టైటిల్‌ను కై వసం చేసుకుంది. -
క్వార్టర్స్‌లో అపూర్వ, అనిల్
క్యారమ్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: వీఏ శర్మ, ఇందిరాంబ స్మారక క్యారమ్స్ టోర్నమెంట్లో అపూర్వ, అనిల్ కుమార్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో వరల్డ్ చాంపియన్ అపూర్వ (ఎల్ఐసీ) 25-0, 25-0తో శ్రీవాణిపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో టాప్ సీడ్ అనిల్ కుమార్ (ఏజీఏపీ) 13-25, 21-13, 25-14తో కె. కృష్ణపై గెలుపొందగా... రెండో సీడ్ వి. శివానంద రెడ్డి 16-19, 25-23, 15-25తో మొహమ్మద్ వసీమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నందిని (డెలారుుట్) 25-0, 25-0తో తేజస్వి (వీపీజీ)పై, బి. సునీత 25-0, 15-24, 19-16తో రుక్సర్ (డెలారుుట్)పై, బి. శ్రీవిద్య 25-9, 25-4తో జ్యోతిపై, తేజస్వి (ఆక్సెంచర్) 25-0, 25-8తో ఉమాదేవి (ఏఎంసీ)పై, మాధవి 25-0, 25-17తో రమశ్రీ (పోస్టల్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు ఆదిత్య 13-25, 25-15, 25-13తో హకీమ్‌పై, శ్రీనివాస్ 25-3, 25-4తో జుబేర్ ఖాన్‌పై, ప్రసాద్ 18-12, 25-1తో మునావర్‌పై, మొహమ్మద్ అహ్మద్ 25-11, 25-2తో రాణాపై, గోపీకృష్ణ 22-20, 10-25, 24-23తో సూర్యప్రకాశ్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మూడోరౌండ్ ఫలితాలు సందీప్- కృష్ణ జోడీ 25-12, 25-14తో శశి-కల్యాణ్ జంటపై, మునీర్ అహ్మద్-సాహిల్ జోడీ 25-12, 25-5తో రమేశ్-సుమన్ జంటపై, నరేశ్- సారుు జోడీ 25-8, 25-10తో జుబేర్- ఖదీర్ జంటపై, వసీమ్-ఎస్.కే. జఫర్ జోడీ 1-25, 25-11, 25-4తో హకీమ్- సుహృత్ జంటపై, నవీన్- నందకుమార్ జోడీ 25-1, 25-10తో స్వామి- పవన్ జంటపై, శివానంద రెడ్డి-ఆదిత్య జోడీ 25-0, 25-0తో శ్యామ్- రఘు జంటపై, జైకుమార్-సూర్యప్రకాశ్ జోడీ 25-4, 25-0తో వెంకటేశ్-అనంత నారాయణ్ జంటపై, అహ్మద్-మొహమ్మద్ జోడీ 25-9, 25-1తో తాల్-షఫీక్ జంటపై, అబ్దుల్-ఖైజర్ జోడీ 21-7, 23-9తో హరి-శ్రీకాంత్ జంటపై, వినోద్-శ్రీనివాస్ జోడీ 25-6, 25-17తో నాగభూషణం-ప్రసాద్ జంటపై గెలుపొందారు. -
వరల్డ్ చాంపియన్ అపూర్వ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్లేయర్ అపూర్వ మరోసారి క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ‘వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్’ సింగిల్స్ ఫైనల్లో అపూర్వ 10-25, 25-10, 25-15తో భారత్‌కే చెందిన పరిమళా దేవిని ఓడించి రెండోసారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె 2004లో తొలిసారి ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత్ స్వర్ణం, రజత పతకాలను సాధించింది. ఫైనల్లో ప్రశాంత్ మోరే (భారత్) 25-22, 11-25, 25-12తో రియాజ్ అక్బర్ అలీ (భారత్)ను ఓడించి విజేతగా నిలిచాడు. -
ఆదిత్య, అపూర్వలకు క్యారమ్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ ఇంటర్ ఇన్స్టిట్యూషన్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఆదిత్య, అపూర్వ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదిత్య (వీ10) 25-8, 25-17తో హకీమ్ (బీఎస్ఎన్ఎల్)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో అపూర్వ (ఎల్ఐసీ) 25-10, 25-8తో తేజస్వి (ఆక్సెంచర్)ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆదిత్య 13-14, 19-2, 25-6తో సూర్యప్రకాశ్‌పై, హకీమ్ 25-0, 25-12తో శివానంద రెడ్డిపై గెలుపొందారు. మహిళల సెమీస్‌లో అపూర్వ 18-4, 29-24, 25-14తో సవితా దేవిపై, తేజస్వి 19-6, 25-0తో నేహారెడ్డిపై పైచేయి సాధించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఆర్.గోవిందరావు, బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అజిత్, హెచ్ఆర్ఎండీ జనరల్ మేనేజర్ పి.కె.రౌత్, ఆర్బీఐ స్పోర్ట్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సుధాకర్, కార్యదర్శి మనోజ్ కులకర్ణి పాల్గొన్నారు. -
చాంప్స్ శ్రీనివాస్, అపూర్వ
హైదరాబాద్: ప్రశాంత్ రణడే స్మారక స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్లో జాతీయ చాంపియన్ కె. శ్రీనివాస్ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను అపూర్వ చేజిక్కించుకుంది. రాంకోఠిలోని మహారాష్ట్ర మండల్ కార్యాలయంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీనివాస్ (ఇండియన్ ఆయిల్) 9-25, 25-0, 18-16తో వి. అనిల్ కుమార్ (ఏజీ ఆఫీస్)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ఓటమి ఎదురైనా తర్వాతి గేముల్లో విజయంతో శ్రీనివాస్ టైటిల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎం.డి. అహ్మద్ (హైదరాబాద్) 20-12, 8-21, 25-10తో సూర్యప్రకాశ్ (ఆర్బీఐ)పై గెలుపొందాడు. దీంతో అహ్మద్‌కు కాంస్య పతకం లభించింది. సింగిల్స్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న అనిల్... రవీందర్ గౌడ్‌తో కలిసి డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఈ జోడి 22-16, 15-4తో సూర్యప్రకాశ్-ఆదిత్య జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ ఎస్. అపూర్వ (ఎల్ఐసీ) 25-1, 24-6తో సవితా దేవి (పోస్టల్)పై అలవోక విజయం సాధించింది. కాంస్య పతకపోరులో ఎస్. నందిని (డెలాయిట్) 25-5, 25-0తో శ్రీచందన (నిజామాబాద్)పై నెగ్గింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎన్టీపీసీ సదర్న్ రీజియన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ వి.బి.ఫడ్నవిస్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు వివేక్ దేశ్‌పాండే, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు బి.కె.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.