
ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్‌స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్‌స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు.
అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది.