భారతదేశం వందలాది బిలియనీర్లకు నిలయం. అంతేకాదు ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా. కొత్త పరిశ్రమలకు, ప్రతిభావంతులకు కొదవ లేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే 27 ఏళ్ల యువకుడి సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.వ్యాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.
బిలియనీర్లు అనగానే తక్షణమే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతోపాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడో యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యాడు పెరల్ కపూర్. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.
గుజరాత్‌కు చెందిన పెరల్ కపూర్ Zyber 365 అనే కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90 శాతం. అలాగే స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. అలా ఇండియా యునికార్న్ ర్యాంకింగ్‌లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించిన ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 , AI-ఆధారిత OS స్టార్ట్-అప్. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ అంటారు. కేవలం మూడు నెలల్లో యునికార్న్‌గా ఆవిర్భవించింది. లండన్‌లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్‌గా ప్రశంసలందుకుంటోంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తోంది.
క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్‌వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. జైబర్ 365కి ముందు, కపూర్ AMPM స్టోర్‌లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగానూ పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్న అతని బలమైన కోరిక 2022, ఫిబ్రవరిలో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి నాంది పలికింది. అలా మొదలైన ప్రయాణం స్టార్టప్ Zyber 365, బిలియనీర్ హొదా దాకా ఎదిగింది.
Comments
Please login to add a commentAdd a comment