మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్‌కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్‌ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ నిలిచాడు. గతంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా టాట్ కార్టర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఈ ఘనత సాధించేందుకు టాట్ కార్టర్‌కు శ్వాస సంబంధిత శిక్షణ అందించామన్నారు. దీనికితోడు టాట్ కార్టర్‌కు ఎవరెస్టు అధిరోహణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందించామన్నారు.
టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023, అక్టోబర్ 25న తమతోపాటు ఎవరెస్టును అధిరోహించాడని తెలిపారు. తాను స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో నివాసముంటున్నానని, ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. తాము శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలను సందర్శించామని, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment