Base Camp
-
మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
సాక్షి, ములుగు: సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేస్ క్యాంప్‌లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ జాతరకు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు అమల్లో ఉందని, మహిళలు పైసా ఖర్చు లేకుండా తల్లులను దర్శించుకోవచ్చన్నారు. గతంలో భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన మేడారం జాతరకు వచ్చే వారని, ఉచిత ప్రయాణం వల్ల సురక్షింతంగా బస్సుల్లో వస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతరకు బస్సుల్లో వచ్చే భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్దత, క్రమ శిక్షణతో పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ రఘునాథ రావు, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్‌కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్‌ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ నిలిచాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా టాట్ కార్టర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఈ ఘనత సాధించేందుకు టాట్ కార్టర్‌కు శ్వాస సంబంధిత శిక్షణ అందించామన్నారు. దీనికితోడు టాట్ కార్టర్‌కు ఎవరెస్టు అధిరోహణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందించామన్నారు. టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023, అక్టోబర్ 25న తమతోపాటు ఎవరెస్టును అధిరోహించాడని తెలిపారు. తాను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివాసముంటున్నానని, ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. తాము శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలను సందర్శించామని, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. -
లద్దాఖ్ పోదాం... పాలపుంతను చూద్దాం!
లద్దాఖ్: ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దేశ ఉత్తరాగ్రాన జమ్మూ కశ్మీర్‌లోని లద్దాఖ్ దాకా వెళ్తే చాలు. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఐదు గ్రామాల సమాహారమైన హాన్లేలో ఉన్న ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ) బేస్ క్యాంప్ నుంచి కనిపించే అద్భుతమిది. దీన్ని చూసేందుకు ఇక్కడికి కొన్నాళ్లుగా పర్యాటకుల రాక బాగా పెరుగుతోంది. దీన్ని మరింత వ్యవస్థీకృతం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ముందుకొచ్చింది. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్డీసీ), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని దేశంలోనే తొలి డార్క్ స్కై రిజర్వ్‌గా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా పరిసర గ్రామాలకు చెందిన 24 మందిని అంతరిక్ష రాయబారులుగా ఎంపిక చేసి వారికి 8 అంగుళాల డోబ్సోనియన్ టెలిస్కోపులు అందజేశారు. ఔత్సాహిక పర్యాటకులు వాటిద్వారా అంతరిక్షంలోకి తొంగిచూడవచ్చు. పాలపుంత తాలూకు వింతలను కళ్లారా చూసి ఆనందించొచ్చు. మేఘరహిత వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం కారణంగా ఇక్కణ్నుంచి అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తుందట. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెబుతున్నారు. ఈ డార్క్ స్కై రిజర్వ్‌ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. -
సెలవుల విషయంలో గొడవ.. జవాన్ల పరస్పర కాల్పులు..నలుగురు మృతి
సుక్మా(ఛత్తీస్‌ఘడ్): ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాను తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన సుకుమాజిల్లా లింగపల్లి బేస్ క్యాంప్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బేస్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల మధ్య దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ జవాను.. తోటి జవాన్లపై కాల్పులకు తెగ బడ్డాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. మృతులలో.. బిహర్‌కు చెందిన రాజమణియాదవ్, డంజి, బెంగాల్ కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సియాచిన్‌లో కోవింద్
సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం సందర్శించారు. ఇక్కడ పర్యటించిన రెండో రాష్ట్రపతి కోవిందే కావడం విశేషం. ఇంతకు ముందు 2004లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సైనికులను ఉద్దేశించి కోవింద్ ప్రసంగిస్తూ..గత 34 ఏళ్లుగా సియాచిన్‌లో సేవలందిస్తున్న జవాన్ల అసమాన ధైర్య సాహసాలే మన సరిహద్దులు సురక్షితమన్న విశ్వాసాన్ని భారతీయుల్లో నింపాయని అన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు భారత ప్రభుత్వం, ప్రజలు అండగా ఉన్నారని చెప్పడానికే తానిక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందిస్తున్న జవాన్లందరికీ ఆర్మీ సుప్రీం కమాండర్, రాష్ట్రపతి హోదాలో భారత ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వీలు చిక్కినప్పుడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. సియాచిన్ బేస్ క్యాంపునకు సమీపంలోని కుమార్ పోస్ట్‌ను కూడా కోవింద్ సందర్శించారు. రాష్ట్రపతి వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, లెఫ్టినెంట్ జనరల్ డి. అన్బు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో 2 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 52 డిగ్రీల వరకు పడిపోతాయి. -
ఎవరెస్ట్‌పై అదనపు నిచ్చెనలు, తాళ్లు
కఠ్మాండు: గతేడాది సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఎవరెస్ట్ శిఖరంపై అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లను బిగిస్తున్నట్లు నేపాల్ పర్వతారోహణ అసోసియేషన్ తెలిపింది. పర్వతంపై వాలులో పగుళ్లు, రంధ్రాలు ఏర్పడడంతో పర్వతారోహణకు ఎక్కువ సమయం పడుతోందని అసోషియేషన్ ఛైర్మన్ అంగ్ షేరింగ్ షేర్పా చెప్పారు. పగుళ్ల వల్ల ఈ సారి మరిన్ని నిచ్చెనల అవసరముందని అడ్డంకుల్ని తొలగించే బృందాలు చెప్పాయన్నారు. ప్రతి ఏటా అల్యూమినియం నిచ్చెనలు, తాళ్ల ఏర్పాటుకు ఆరుగురి బృందం పనిచేసేదని, ఈ సారి పదిమంది అవసరమయ్యారన్నారు. పర్వతారోహకుల కోసం ప్రతి ఏడాది మరమ్మతుల బృందం బేస్ క్యాంప్ నుంచి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లు అమరుస్తుంది. -
మహా పర్వతంపై మంచు చరియలు
-
ఎవరెస్టు వద్ద 217 మంది గల్లంతు?
మహా పర్వతంపై మంచు చరియలు విరిగిపడి 22 మంది మృతి ⇒ 60 మందికి గాయాలు.. సహాయం కోసం వందల మంది నిరీక్షణ ⇒ ఆదివారం నాటి భూ ప్రకంపనలతో మళ్లీ కూలిన మంచుదిబ్బలు కఠ్మాండు: భూగోళంపై మహా పర్వతమైన ఎవరెస్ట్ సైతం శనివారం నాటి పెను భూకంపానికి వణికిపోయింది. పర్వతం పై నుంచి భారీ మంచు చరియలు విరిగిపడటంతో.. నేపాల్ వైపున గల బేస్ క్యాంపుల్లో ఉన్న పర్వతారోహకుల్లో 22 మంది ప్రాణాలు కోల్పాయారు. మరో 217 మంది ఆచూకీ తెలియటం లేదు.విదేశీయలతో సహా వందలాది మంది పర్వతారోహకులు అక్కడ చిక్కుబడి ఉన్నారు. ఆదివారం నాటి తీవ్ర భూప్రకంపనల కారణంగా కూడా ఎవరెస్ట్‌పై మళ్లీ మంచుచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ చిక్కుబడి ఉన్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. వారిని రక్షించటానికి, తరలించటానికి మరికొంత సమయం పడుతుందని నేపాల్ మౌంటెయినీరింగ్ అసోసియేషన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. అయితే.. ఎవరెస్ట్ పర్వతానికి టిబెట్ వైపున బేస్ క్యాంపుల్లో 400 మంది పర్వతారోహకులు క్షేమంగా ఉన్నారని చైనా అధికారులు తెలిపారు. వారిలో చాలా మంది పర్వతం దిగిపోయారని, ఇంకొంత మంది దిగుతున్నారని చెప్పారు. మొత్తం 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఎవరెస్ట్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పర్వత శిఖరం. ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా వందలాది మంది ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు వస్తుంటారు. నేపాల్ పర్యాటక మంత్రిత్వశాఖ అధికారుల అంచనా ప్రకారం.. శనివారం నాటి పెను భూకంపం వచ్చి, ఎవరెస్ట్‌పై మంచు చరియలు విరిగిపడినప్పుడు.. నేపాల్ వైపు బేస్ క్యాంప్ వద్ద 400 మంది విదేశీయులతో సహా దాదాపు 1,000 మంది పర్వతారోహకులు ఉన్నారు. మంచు చరియలు బేస్ క్యాంపులోని ఒక భాగాన్ని ముంచేశాయి. బేస్ క్యాంప్ వద్ద 17 మంది చనిపోగా.. క్యాంపు దిగువు ప్రాంతాల్లో మరో ఐదుగురు చనిపోయారు. ఈ విపత్తులో 60 మంది పర్వతారోహకులు గాయపడ్డారు. ఇంకా చాలా మంది విదేశీ పర్వతారోహకులు, వారి సహాయకులు, మార్గదర్శకులు ఈ మంచు కింద సమాధి అయివుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్రంగా గాయపడ్డ వారిలో 22 మందిని భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు ఐదు విడతల్లో తరలించాయి. కొందరిని కఠ్మాండుకు తరలించారు. ఎవరెస్ట్ వద్ద బస చేసివున్న భారత సైనిక పర్వతారోహణ బృందం బేస్ క్యాంప్ వద్ద (17,500 అడుగుల ఎత్తులో) క్షేమంగా ఉందని.. శనివారం మంచు చరియల్లో చనిపోయిన 13 మంది మృతదేహాలను వెలికి తీసేందుకు సాయపడిందని భారత సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు.ఏడు ఖండాల్లోని అన్ని అతి పెద్ద పర్వతాలనూ అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ పర్వతారోహకుడు అంకుర్ బహల్ (54), ఆయన సహ పర్వతారోహకులు మరో 15 మంది ఎవరెస్ట్ పర్వతంపై రెండో క్యాంపు వద్ద చిక్కుకుపోయారు. ఎవరెస్ట్‌పై గూగుల్ ఉద్యోగి మృతి ఎవరెస్ట్ పర్వతంపై మంచుచరియలు విరిగిపడడంతో గూగుల్ ఉద్యోగి డాన్ ఫ్రెడిన్బర్గ్ శనివారం మరణించారు. ఈయన గూగుల్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డ్రైవర్ లేని కారు’ ప్రాజెక్టులో కీలక సభ్యుడిగా ఉన్నారు. ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ప్రాజెక్టులో కూడా పనిచేస్తున్నారు. ఈయనతోపాటున్న మరో ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. -
ధ్వంసమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్, 13మంది మృతి
-
బేస్ క్యాంపునకు చేరుకున్న పూర్ణ, ఆనంద్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్. ఆనంద్‌కుమార్‌లు తిరుగుప్రయాణంలో భాగంగా మంగళవారం సాయంత్రం బేస్‌క్యాంప్‌నకు చేరుకున్నారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్) నేతృత్వంలో వీరు ఎవరెస్ట్‌ను అధిరోహించగా, తిరుగుప్రయాణంలో భాగంగా అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్(ఏబీసీ) నుంచి ఆదివారమే తిరుగుపయనమయ్యారు. అయితే, సోమవారం అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారడంతో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కిందికి దిగుతున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఆఖరి పాయింట్‌గా పరిగణించే 8,848 మీటర్లు (సముద్రమట్టానికి 29,029 అడుగులు) నుంచి ఈ సాహసికులు దిగుతున్నారు. అక్కడ నుంచి కిందికి వస్తూ సముద్ర మట్టానికి 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెత్ జోన్ (లీథల్ పాయింట్), 8,230 మీటర్లు ఎత్తులో ఉన్న క్యాంప్-6 (ఎల్లో బ్యాండ్), 7,775 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-5, 7,100 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-4 (నార్త్ కోల్) మీదుగా 6,500 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్ (ఏబీసీ)కు చేరుకున్నారు. -
వాట్ ఎన్ ఐడియా
లింగంపేట, న్యూస్‌లైన్ : అడవులు అంతరించిపోతుండడం, అటవీ భూములు ఆక్రమణలకు గురవుతుండడం, వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ శాఖ అధికారులపై అనేక విమర్శలు వచ్చాయి. ఎక్కువగా గిరిజనులే అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. వారు చెట్లను నరికి, భూములను చదు ను చేసి పంటలు పండిస్తున్నారు. అధికారులు కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. అటవీ శాఖ అధికారులకు గిరిజనుల భాష రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు ఏం చెబుతున్నారో.. గిరిజనులు ఏం సమాధానం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. దీంతో గిరిజనులు అధికారులపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు కసరత్తు చేశారు. వారికి ఓ ఐడియా తట్టింది. అడవులను ఆక్రమిస్తున్న గిరిజనులకే అటవీ భూముల సంరక్షణ బాధ్యత అప్పగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించారు. వెంటనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంపులో ఐదుగురు నిరుద్యోగ గిరిజనులను ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పించారు. జనవరి నుంచి బేస్ క్యాంపులు పనిచేస్తున్నాయి. గతేడాది అటవీ భూముల ఆక్రమణలు ఎక్కువగా జరిగిన లింగంపేట మండలం ఎక్కపల్లి తండా(ఎల్లారెడ్డి రేంజ్‌లోని బొల్లారం సెక్షన్లో ఉంది)లో అదే తండాకు చెందిన మున్యానాయక్ అనే యువకుడిని టీంలీడర్‌గా నియమించి బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇలా జిల్లాలో ఏడు క్యాంపులు పనిచేస్తున్నాయి. అదే విధంగా అటవీ శాఖలో కొత్తగా స్ట్రైకింగ్ ఫోర్స్ పేరిట మరికొన్ని బృందాలను కూడా నియమించారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు అడవులను, అటవీభూములను, వన్యప్రాణులను సంరక్షించవచ్చన్నది అటవీ అధికారుల ఆలోచన. -
మరిన్ని బేస్ క్యాంపులు
=ఎర్రచందనం చెట్లను నరకక ముందే అడ్డుకుంటాం =త్వరలో రెండంచెలుగా ఎర్రచందనం వేలం =‘సాక్షి’తో అటవీశాఖ కన్సర్వేటర్ రవికుమార్ సాక్షి, తిరుపతి: వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లోంచి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరి న్ని బేస్‌క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవికుమార్ తెలిపారు. దీని ద్వారా అడవిలో చెట్లను నరకక ముందే ఎర్రచందనం కూలీలను పట్టుకోవచ్చన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా, జరిమానాను లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎర్ర కూలీలకు డబ్బు ఆశ చూపించి తీసుకుని వస్తున్నారన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు కూలీ ఇస్తున్నారని, ఒక వేళ పట్టుబడినా, వదిలి పెట్టేస్తున్నారనే ఉద్దేశంతో ఎక్కువ మంది కూలీలు వస్తున్నారన్నారు. కఠిన శిక్షలు అమలు చే స్తే ఎర్రకూలీలు వచ్చేందుకు జంకుతారన్నారు. నిల్వ ఉన్న ఎర్రచందనం త్వరలో వేలం వివిధ సందర్భాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను త్వరలోనే వేలం వేస్తామన్నారు. తమవద్ద ఐదువేల టన్నుల ఎర్రచందనం నిల్వ ఉందని, దీనిని రెండు దఫాలుగా వేలం వేస్తామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ఏడాదికి రెండు వేల టన్నుల అవసరం ఉందన్నారు. తమ వద్ద ఉన్న ఐదువేల టన్నులను వేలం వేయడం ద్వారా అక్రమ రవాణా తగ్గే అవకాశం ఉందన్నారు. నెలకు సరాసరి 70 నుంచి వంద టన్నుల ఎర్రచందనం పట్టుబడుతోందని చెప్పారు. ప్రతి రోజూ దాదాపు 80 మంది టాస్క్ఫోర్సు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. 40 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశామని వీటిల్లో 200 మందికి పైగా ఉన్నారన్నారు. దీంతో ఎర్ర కూలీలు అడవి లోపలికి వెళ్లలేకున్నారని తెలిపారు. అప్పుడప్పుడు వారు అసహనంతో సిబ్బందిపై దాడికి దిగుతున్నారని అటువంటి సమయంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసుల సాయం తీసుకుంటున్నామన్నారు. తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఏడాదికి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం వేలం ప్రారంభమయితే, అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ జల్లెడ
పులిబోను(భాకరాపేట), న్యూస్‌లైన్ : శేషాచల అడవుల్లో ‘ఎర్ర’ కూలీల కోసం వుువ్ముర గాలింపు చర్యలు చేపట్టినట్టు టాస్క్‌ఫోర్స్ వోఎస్డీ ఉదయ్‌కువూర్, ఏఆర్ డీఎస్పీ దేవదాసులు తెలిపారు. శనివారం శేషాచల అ టవీ ప్రాంతంలోని పులిబోను బేస్‌క్యాంపు వద్ద విలేకరులతో వారు వూట్లాడారు. వుూడు రోజు లుగా శేషాచల అడవుల్లో పోలీసులు, ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి గాలిం పు చేపట్టావున్నారు. 50 ఎర్రచందనం దుం గలు, గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శనివారం రాత్రి ఎర్రచందనం కూలీలు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి బేస్‌క్యాంప్‌లో ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులపై రాళ్లవర్షం కురిపించి కూలీలు చీకట్లో అటవీ ప్రాంతంలోకి జారుకున్నారని తెలిపారు. ‘ఎర్ర’ కూలీలు హద్దుమీరితే కాల్పులకూ వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు శేషాచల అడవుల్లో జల్లెడపడుతున్నట్టు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలోకి వచ్చే దారులన్నీ మూసివేశామన్నారు. అనంతరం పులి బోను నుంచి కరివేపాకు కోనకు వెళ్లి ఎర్రచందనం దుంగలు నరికిన ప్రాంతాన్ని పరిశీలిం చారు. ప్రస్తుతం ఎర్రచందనం దుంగలను రెండు, మూడు అడుగుల పొడవు, చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి దుండగులు తరలిస్తున్నట్టు తెలిపారు. చంద్రగిరి, కొటాల, పనబాకం రైల్వేస్టేషన్ల నుంచి సంచుల్లో తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ గాలింపుల్లో భాకరాపేట ఎస్ఐ నెట్టికంఠయ్యు, ఏఆర్ ఎస్ఐ వుదు, భాకరాపేట పీఎస్ఐ రహీవుుల్లా, పోలీసులు, ఫారెస్టు అధికారులు కన్నయ్యు పాల్గొన్నారని వివరించారు.