బేస్ క్యాంపునకు చేరుకున్న పూర్ణ, ఆనంద్
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్. ఆనంద్‌కుమార్‌లు తిరుగుప్రయాణంలో భాగంగా మంగళవారం సాయంత్రం బేస్‌క్యాంప్‌నకు చేరుకున్నారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్) నేతృత్వంలో వీరు ఎవరెస్ట్‌ను అధిరోహించగా, తిరుగుప్రయాణంలో భాగంగా అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్(ఏబీసీ) నుంచి ఆదివారమే తిరుగుపయనమయ్యారు. అయితే, సోమవారం అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారడంతో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కిందికి దిగుతున్నారు.
ఎవరెస్ట్ శిఖరం ఆఖరి పాయింట్‌గా పరిగణించే 8,848 మీటర్లు (సముద్రమట్టానికి 29,029 అడుగులు) నుంచి ఈ సాహసికులు దిగుతున్నారు. అక్కడ నుంచి కిందికి వస్తూ సముద్ర మట్టానికి 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెత్ జోన్ (లీథల్ పాయింట్), 8,230 మీటర్లు ఎత్తులో ఉన్న క్యాంప్-6 (ఎల్లో బ్యాండ్), 7,775 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-5, 7,100 మీటర్ల ఎత్తున ఉన్న క్యాంప్-4 (నార్త్ కోల్) మీదుగా 6,500 మీటర్ల వద్ద ఉన్న అడ్వాన్డ్స్ బేస్ క్యాంప్ (ఏబీసీ)కు చేరుకున్నారు.