
పూర్ణ, ఆనంద్‌లకు నేపాల్‌లో సత్కారం
కఠ్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు మాలావత్ పూర్ణ(13), ఎస్. ఆనంద్ కుమార్(16)లకు ఆదివారం నేపాల్‌లో ఘన సత్కారం లభించింది. నేపాల్‌లో దళితుల హక్కుల కోసం పోరాడే జాగరణ్ మీడియా సెంటర్‌వారు కఠ్మాండులో ఈ ఇద్దరు టీనేజర్లనూ ఘనంగా సన్మానించారు.
కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌లు చైనా వైపు నుంచి ఇటీవల ఎవరెస్టును అధిరోహించారు. వీరిలో పూర్ణ.. ఎవరెస్టును ఎక్కిన అతిపిన్న మహిళగా కూడా కొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.