purna
-
కుర్చీ మడతపెట్టిసి మరింత గ్లామర్‌గా మారిపోయిన 'పూర్ణ' (ఫోటోలు)
-
కంచె భామ స్టన్నింగ్ లుక్స్.. మరింత బొద్దుగా తయారైన పూర్ణ!
►హీరోయిన్ పూనమ్ కౌర్ బ్యూటిఫుల్ లుక్స్! ►కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ స్టన్నింగ్ పోజులు! ►కలర్‌ఫుల్ శారీలో యాంకర్ లాస్య లుక్స్! ►మరింత బొద్దుగా తయారైన హీరోయిన్ పూర్ణ! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
Poorna Latest Photos: కేరళ సంప్రదాయంలో పూర్ణ సీమంతం.. ఫోటోలు వైరల్
-
‘సువర్ణ సుందరి’ సరికొత్త అనుభూతిని ఇస్తుంది: దర్శకుడు సురేంద్ర
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్. మాదారపు సురేంద్ర దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ – ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిలా జయప్రదగారి పాత్ర ఉంటుంది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా లేట్‌గా విడుదలవుతోంది. విజువల్ పరంగా కావొచ్చు, కంటెంట్ పరంగా కావొచ్చు.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాత: శ్రీకాంత్ పండుగుల. -
‘పూర్ణ కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్ ఇది’
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. యువ నటుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్రలో నటించాడు. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది. పూర్ణ కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూర్ణ పెర్ఫార్మెన్స్, గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అన్నారు కర్రి బాలాజీ. పూర్ణ మాట్లాడుతూ– ‘‘బాలాజీగారు ప్రతి సీన్ ఎంతో ప్లానింగ్‌తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా బాలాజీ గారికి, నటిగా నాకు, నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డిగారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నేపథ్య సంగీతం: రవిశంకర్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో–ప్రొడ్యూసర్: ఊట శ్రీను. -
బ్యాక్‌డోర్ ఎంట్రీ
పూర్ణ ప్రధాన పాత్రలో యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్యాక్ డోర్’. కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రం పూర్ణ కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెస్తుంది’’ అన్నారు బి.శ్రీనివాస్ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు రావడం ఖాయం’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి కెమెరా: ఓంకార్ యూనిట్, సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, సహ నిర్మాత: ఊట శ్రీను. -
బ్యాక్ డోర్లో...
నంది అవార్డుగ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాక్ డోర్’. ఇందులో పూర్ణ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నది ఈరోజుల్లో అన్ని రంగాల్లో చాలా సహజం అయిపోయింది. అటువంటి ఓ ప్రత్యేకమైన బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు కర్రి బాలాజీ సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్ రెడ్డి. ‘‘చాలా రోజుల తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, కెమెరా: శ్రీకాంత్. -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
ఆరువందల సంవత్సరాల క్రితం ఒక రాజు చేసిన తప్పిదం ఏంటి? దాని వల్ల తరతరాల వాళ్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనేది ఉపశీర్షిక. జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధాన పాత్రల్లో ఎమ్.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తెలుగు, కన్నడలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌కు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్‌కి మంచి స్పందన రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. ప్రొడ్యూసర్‌తో కాస్త ఎక్కువ ఖర్చుపెట్టించావని చాలామంది అన్నారు. కానీ, స్టోరీ అలా డిమాండ్ చేసింది. ‘అరుంధతి, మగధీర’ టైప్‌లో మా సినిమా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. అవుట్ పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. కెమెరామేన్ ఈశ్వర్ ఎల్లు మహంతి, ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
సస్పెన్స్ సుందరి
జయప్రద, పూర్ణ, సాక్షీచౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అయితే సినిమా ఔట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే పాటలను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. పబ్లిసిటీ కూడా విభిన్నంగా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సాంకేతికంగా అద్భుతంగా మా సినిమా నిర్మించాం. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం’’ అని లక్ష్మి అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోటా శ్రీనివాసరావు, ముక్తర్‌ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటì ంచిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీ్తక్, కెమెరా: ఎల్లుమహంతి. -
మూడు జన్మల థ్రిల్
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.ఎన్. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొంతకాలంగా తెలుగులో స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మా సినిమాలోనూ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏడాది పట్టింది’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధమైన మా చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత లక్ష్మీ అన్నారు. ఇంద్ర, రామ్ మద్దుకూరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
మూడు జన్మల కథ
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కాన్సెప్ట్‌తో హిస్టారికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్‌కే ఏడాది పట్టింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కిన మా సినిమా ట్రైలర్‌కు పదిలక్షలు వ్యూస్‌కి పైగా లభించాయి. మార్చి తొలివారంలో పాటలను, రెండోవారంలో సినిమాను తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు’’ అన్నారు. ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి. -
బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు
‘‘నేను విజయవాడలో పుట్టాను. నటనపై ఉన్న ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాను. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారి కజిన్‌ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కానీ, నెనెప్పుడూ నా బ్యాగ్రౌండ్ చెప్పకుండానే ఆడిషన్స్‌కి వెళ్లాను. ‘వంగవీటి’ సినిమా చేస్తుండగా సూర్యగారు ‘సువర్ణసుందరి’ సినిమాకి చాన్స్ ఇచ్చారు’’ అని హీరో ఇంద్ర అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధానపాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి’. ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఇంద్ర మాట్లాడుతూ– ‘‘రామ్‌గోపాల్‌వర్మగారి దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించాను. ‘సువర్ణసుందరి’లో తొలిసారి లీడ్ రోల్ చేశా. ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి రుణపడి ఉంటాను. ఈ చిత్రంలో రెండు స్క్రీన్‌ప్లేలు నడుస్తుంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రస్తుతం. ఈ రెండు స్క్రీన్ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్. ‘సువర్ణసుందరి’ అనే ఓ విగ్రహానికి సంబంధించిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదల తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది. ప్రస్తుతం ‘రామచక్కని సీత’ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఓంకార్‌గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండాగారితో మరో సినిమా చేశాను’’ అన్నారు. -
భవిష్యత్తుని వెంటాడుతుంది
‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకులు బి.గోపాల్ విడుదల చేశారు. డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్ అయింది. అయినా అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’ ఎక్స్ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని డైరెక్టర్ సాగర్ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్, రైటర్ ప్రదీప్, స్టంట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్. -
బ్లూవేల్ చాలెంజ్
బ్లూ వేల్ చాలెంజ్ .. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండుంటే ఈ ఆట గురించి వినుంటారు. సీరియస్ రిస్కులతో కూడుకున్న ఈ గేమ్‌లో చాలామంది హానికి గురయ్యారు. 50 రోజుల పాటు సాగే ఈ చాలెంజ్‌లో చివరి వరకూ వెళ్లే ఆటగాళ్లను సూసైడ్ చేసుకొమ్మని ప్రేరేపించే భయంకరమైన గేమ్ అది. ఇప్పుడు ఆ ఆట ఆధారంగా తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘అవును’ ఫేమ్ పూర్ణ ముఖ్య పాత్రలో నూతన దర్శకుడు రంగనాథన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రంగనాథన్ మాట్లాడుతూ – ‘‘ఇప్పటి జనరేషన్ పిల్లలందరి వద్ద స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. దీని వల్లే ఇలాంటి భయంకరమైన గేమ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. రీసెంట్గా పాపులర్ అయిన గేమ్ ‘బ్లూవేల్ చాలెంజ్’. ఈ గేమ్ ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నాం. క్రిమినల్స్ ఎవరో చూపించలేం కానీ తల్లిదండ్రులు ఎలా జాగ్రత్తగా ఉండాలో మా చిత్రం ద్వారా చూపించదలిచాం’’ అని పేర్కొన్నారు. -
అంతా అమ్మ ఇష్టం
మీ పెళ్లెప్పుడు అని హీరోయిన్స్‌ని అడిగిన వెంటనే తరచుగా వినిపించే సమాధానాలు ‘నచ్చినవాడు దొరకలేదు, అప్పుడే పెళ్లేంటి? కానీ ‘అవును’ ఫేమ్ పూర్ణ మాత్రం అంతా అమ్మ ఇష్టం అంటున్నారు. పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ గురించి పూర్ణ మాట్లాడుతూ – ‘‘ఇంతకుముందు పెళ్లి అనే ప్రశ్న ఎక్కువగా మా ఇంట్లో మాత్రమే వినిపించేది ఇప్పుడు సినిమా సెట్స్, షోస్‌లో ఎక్కడికి వెళ్లినా సరే పెళ్లి ఎప్పుడు అనే అడుగుతున్నారు. ఇంట్లో అమ్మ నా పెళ్లి గురించే మాట్లాడుతుంటుంది. పెళ్లి అనేది మనం అనుకున్నప్పుడు కాదు, దేవుడు అనుకుంటే అయ్యేది. అలాగే పెళ్లి చేసుకుందాం అని వచ్చే వాళ్లందరూ యాక్టింగ్ మానేయాలి, డ్యాన్స్ వదిలేయాలి అంటూ డిమాండ్స్ పెట్టేవాళ్లే. పెళ్లి అనేది కేవలం త్యాగాలమీదే జరక్కూడదు అని నా అభిప్రాయం. అదికూడా కేవలం పెళ్లికొడుకుల తరఫు నుంచి మాత్రమే. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా, మా సంప్రాదాయలు తెలియని వారైతే మా అమ్మ అప్సెట్ అవుతుంది. అలా చేయడం ఇష్టం లేదు. అమ్మ సంతోషమే నా సంతోషం. అందుకే నా పెళ్లికి సంబంధించిన అన్ని నిర్ణయాలు మా ఫ్యామిలీకే వదిలేశాను’’ అని చెప్పారు. -
చరిత్ర వెంటాడుతోంది
జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్. టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్‌గా, విజువల్‌గా బాగా వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి. -
పూర్ణ.. బంటి... ఓ పాట
‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయిక పూర్ణ. తాజాగా ఆమె ‘అదుగో’ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నటించారు. బంటి అనే పంది పిల్ల లీడ్ రోల్లో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అభిషేక్ వర్మ, నభా, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేందర్ చౌదరి ఇతర పాత్రల్లో నటించారు. పూర్ణ నటించిన ప్రత్యేక పాటను ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాటలో పూర్ణతో పాటు టైటిల్ రోల్ చేస్తున్న బంటి అనే పందిపిల్ల కూడా కనిపించనుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ప్రశాంత్ విహారి చక్కటి సంగీతం అందించాడు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దసరా సెలవుల్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్. సుధాకర్ రెడ్డి. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
డాటర్ ఆఫ్ పూర్ణ
ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్ సంగీతం, ఎలు మహంతి విజువల్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్ నటించారు. -
ఈ సువర్ణసుందరి ఎవర్నీ వదలదు
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది. అన్నది ఉపశీర్షిక. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘ఈ సువర్ణ సుందరి ఎవర్నీ వదలదు’ అంటూ సాగే టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిస్టారికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనడానికి టీజర్ చక్కటి ఉదాహరణ. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రాండ్ లుక్‌తో హై టెక్నికల్‌గా రూపొందిస్తున్నాం. త్వరలో పాటలు రిలీజ్ చేయనున్నాం. డిసెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తీక్. -
పూర్ణ చేసిన త్యాగమేమిటో తెలుసా?
తమిళసినిమా: పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం కోసం తారలు శ్రమిస్తుంటారు. అదీ చాలా తక్కువ మందే. అలాంటిది తమ జుత్తు త్యాగం చేయడానికి ముఖ్యంగా నటీమణులు ససేమిరా అంగీకరించరు. అలాంటిది పూర్ణ కొడివీరన్ చిత్రం కోసం, అదీ హీరోయిన్ పాత్ర కోసం కూడా కాదు, ఒక ముఖ్య పాత్ర కోసం గుండు గీయించుకుని నటించింది. కథానాయకి పాత్రలే కావాలని పట్టుపట్టకుండా కొత్తదనం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ కొడివీరన్ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రలో కనిపించనుంది. నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొడివీరన్. మహిమానంబియార్ కథానాయకిగా నటించిన ఇందులో శశికుమార్‌కు చెల్లెలుగా నటి తనూజ నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి శశికుమార్ తెలుపుతూ అన్నాచెల్లెలి అనుబంధంతో కూడిన కథా చిత్రంలో నటించాలన్నది తన చాలా కాల కోరిక అని చెప్పారు. ఇదే విషయాన్ని కుట్టిపులి చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ముత్తయ్యకు చెప్పానన్నారు. అలాంటి కథా చిత్రంమే ఈ కొడివీరన్ అని చెప్పారు. ఇందులో పూర్ణది కథా నాయకి పాత్ర కాకపోయినా చాలా కీలక పాత్ర అని చెప్పారు. రెండు సన్నివేశాల కోసం ఆమె గుండు కొట్టించుకుని జుత్తును త్యాగం చేసిందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడంటూ ఎవరూ ఉండరని, పరిస్థితులు, కొన్ని పాత్రల తప్పుడు నిర్ణయాలే విలన్ అవుతాయన్నారు. శివాజీగణేÔషన్ నటించిన పాశమలర్ చిత్రం మాదిరిగా కొడివీరన్ చిత్రం అన్నాచెల్లెలి అనుభందాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
డూపు లేకుండా!
‘మౌనమేల నోయి..’ అంటూ సున్నితంగా నటించడమే కాదు.. అవసరమైతే డూప్ లేకుండా ఫైట్స్ చేసేస్తారు జయప్రద. ప్రస్తుతం నటిస్తోన్న ‘సువర్ణ సుందరి’లో క్లైమాక్స్ ఫైట్స్‌ని డూప్ లేకుండా చేశారామె. ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఆమె రిస్కీ ఫైట్ చేయడం చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచింది. జయప్రద ముఖ్య పాత్రలో రూపొందుతోన్న ఈ ‘సువర్ణ సుందరి’లో పూర్ణ, సాక్షీచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రధారులు. ‘చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుంది’ అన్నది ట్యాగ్ లైన్. సూర్య ఎమ్.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. ‘‘గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రదగారి పాత్ర ఉంటుంది. పూర్ణకి కూతురిగా ఆమె నటిస్తున్నారు. తల్లీకూతుళ్ల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు హైలైట్. జయప్రదగారిది ఛాలెంజింగ్ రోల్. ఫైట్స్‌ని సవాల్‌గా తీసుకుని చేశారు’’ అన్నారు దర్శకుడు. ‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే చిత్రమిది. త్వరలో టీజర్, నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత లక్ష్మి. -
నాలుగు శతాబ్దాల కథ!
చరిత్ర చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే హిస్టారికల్ మూవీస్‌కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శతాబ్దాల నేపథ్యంలో ‘సువర్ణ సుందరి’ అనే చిత్రం రూపొందింది. ఈ నాలుగు శతాబ్దాల చరిత్రలో బయటి ప్రపంచానికి తెలియని ఓ చీకటి కోణం ఈ చిత్రానికి ప్రధానాంశం. సూర్య దర్శకత్వంలో ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మిస్తున్నారు. పూర్ణ, సాక్షి చౌదరి, ఇంద్ర, సాయికుమార్ ముఖ్యతారలు. సూర్య మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. కాలాలకు అనుగుణంగా డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. నాటి తరాలకు, ఇప్పటి తరానికి మధ్య తేడాను చూపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. చిత్రీకరణ పూరై్తంది. హైదరాబాద్‌తో పాటు ముంబైలో కూడా గ్రాఫిక్ వర్క్స్ చేయిస్తున్నాం. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్. -
పూర్ణ అంత పని చేసిందా!
తమిళసినిమా: నటి పూర్ణ అంత పని చేసిందా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇదే. ఇంతకీ పూర్ణ ఏం చేసింది? బహుభాషా నటిగా పేరొందిన ఈ అమ్మడికి తమిళం, తెలుగు, మలయాళం ఇలా ఏ భాషలోనూ పెద్దగా అవకాశాలు లేవు. అయితే పూర్ణ మంచి నటి. అంతకంటే మంచి డాన్సర్. దీంతో నటనకు దూరం కావడం ఇష్టం లేక అంది వచ్చిన పాత్రలను చేస్తూ తన ఉనికిని చాటుకుంటోందని చెప్పవచ్చు. దర్శకుడు మిష్కిన్ నిర్మించిన సవరకట్టి చిత్రంలో దర్శకుడు రామ్‌కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించింది. ఇందులో తనది నటనకు అవకాశం ఉన్న పాత్ర అని, అంత మంచి పాత్రను తనకిచ్చినందుకు మిష్కిన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో బోరున ఏడ్చేసింది కూడా. ఆ చిత్రం విడుదల కావలసి ఉంది. తాజాగా కొడివీరన్ అనే చిత్రంలో నటిస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో శశికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మహిమా నంబియార్ కథానాయకిగా నటిస్తోంది. చెల్లెలిగా రేణుగుంట చిత్రం ఫేమ్ సనూజ నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో నటి పూర్ణ నటిస్తోంది. ఇది చాలా బలమైన పాత్ర అట. ఈ పాత్రలో నటించడానికి ఈ అమ్మడు తన జుత్తునే త్యాగం చేసిందట. అర్థం కాలా? గుండు కొట్టించుకుందట. సాధారణంగా కథానాయకులే గుండు కొట్టించుకోవడానికి సిద్ధపడరు. విగ్‌తో మ్యానేజ్ చేస్తుంటారు. అలాంటిది నటి పాత్ర కోసం గుండు గీయించుకోవడం టాక్‌గా మారింది. దీని గురించి పూర్ణను అడిగితే పాత్రకు అవసరం అయితే గుండు కొట్టించుకోవడం తప్పేంకాదు అని పేర్కొంది. కథానా యకి పాత్రలే కావాలని పట్టుపట్టి కూర్చోకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక రౌండ్ కొడుతుందేమో!