తమిళసినిమా: పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం కోసం తారలు శ్రమిస్తుంటారు. అదీ చాలా తక్కువ మందే. అలాంటిది తమ జుత్తు త్యాగం చేయడానికి ముఖ్యంగా నటీమణులు ససేమిరా అంగీకరించరు. అలాంటిది పూర్ణ కొడివీరన్ చిత్రం కోసం, అదీ హీరోయిన్ పాత్ర కోసం కూడా కాదు, ఒక ముఖ్య పాత్ర కోసం గుండు గీయించుకుని నటించింది. కథానాయకి పాత్రలే కావాలని పట్టుపట్టకుండా కొత్తదనం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న పూర్ణ కొడివీరన్ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రలో కనిపించనుంది. నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొడివీరన్. మహిమానంబియార్ కథానాయకిగా నటించిన ఇందులో శశికుమార్‌కు చెల్లెలుగా నటి తనూజ నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి శశికుమార్ తెలుపుతూ అన్నాచెల్లెలి అనుబంధంతో కూడిన కథా చిత్రంలో నటించాలన్నది తన చాలా కాల కోరిక అని చెప్పారు.
ఇదే విషయాన్ని కుట్టిపులి చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ముత్తయ్యకు చెప్పానన్నారు. అలాంటి కథా చిత్రంమే ఈ కొడివీరన్ అని చెప్పారు. ఇందులో పూర్ణది కథా నాయకి పాత్ర కాకపోయినా చాలా కీలక పాత్ర అని చెప్పారు. రెండు సన్నివేశాల కోసం ఆమె గుండు కొట్టించుకుని జుత్తును త్యాగం చేసిందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడంటూ ఎవరూ ఉండరని, పరిస్థితులు, కొన్ని పాత్రల తప్పుడు నిర్ణయాలే విలన్ అవుతాయన్నారు. శివాజీగణేÔషన్ నటించిన పాశమలర్ చిత్రం మాదిరిగా కొడివీరన్ చిత్రం అన్నాచెల్లెలి అనుభందాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు.
పూర్ణ చేసిన త్యాగమేమిటో తెలుసా?
Published Wed, Oct 18 2017 3:35 AM | Last Updated on Wed, Oct 18 2017 3:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment