హీరోయిన్ ఛాన్స్‌ కొట్టేసిన బుల్లితెర నటి! | Sakshi
Sakshi News home page

Radhika Preethi: హీరోయిన్ ఛాన్స్‌ కొట్టేసిన బుల్లితెర నటి!

Published Sun, Jun 18 2023 8:12 AM

Kollywood TV Actress Radhika Preethi Gets Heroine Chance - Sakshi

బుల్లితెర నటిమణులు వెండి తెరకు పరిచయం కావడం కొత్తేమీ కాదు. ఆ మధ్య నటి ప్రియా భవానీశంకర్‌, వాణి భోజన్‌ బుల్లితెర నుంచి వచ్చి సినిమాలో సక్సెస్‌ అయిన వారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వరుసలో చాలామందే ఉన్నారు. ఇకపోతే నటుడు శశికుమార్‌ కొత్త హీరోయిన్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. 'కారి' చిత్రంలో పార్వతి అరుణ్‌ అనే కొత్త నటికి అవకాశం కల్పించారు. ఇటీవల అయోత్తి చిత్రంలో ప్రీతి ఇస్రాణి అనే నూతన నటి శశికుమార్‌తో జత కట్టిన విషయం తెలిసిందే. 

( ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్‌)

తాజాగా శశికుమార్‌ హీరోగా నటించనున్న చిత్రంలో బుల్లితెర నటి రాధిక ప్రీతి కథానాయకిగా పరిచయం కానున్నట్లు సమాచారం. ఈమె పూవే ఉనక్కాగ సీరియల్‌ ద్వారా పరిచయమైన కన్నడం నటి కావడం గమనార్హం. ఆ సీరియల్‌లో పూవరసీ అనే పాత్రలో నటించి బుల్లి తెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే ఆ సీరియల్‌లో ప్రస్తుతం ఆమె నటించడం లేదు. కారణం సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ప్రయత్నించడమేనట.

అలా అని ప్రయత్నం ఫలించి శశికుమార్‌ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రంతో రాధిక ప్రీతి సినీ కథానాయకిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

( ఇది చదవండి: నాకు కలర్‌ తక్కువని హీరోయిన్స్‌ దూరం పెట్టారు: సీనియర్‌ హీరో)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement