విడాకులై మూడేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డా: బుల్లితెర నటి | TV Actress Niveditha Announce She Is In A Relationship With Actor Surender | Sakshi
Sakshi News home page

Niveditha: మాజీ భర్త రెండో పెళ్లి.. నటి కూడా అదే దారిలో..

Published Thu, Feb 8 2024 3:27 PM | Last Updated on Thu, Feb 8 2024 3:48 PM

TV actress Niveditha Announce She is In a Relationship With Actor Surendar - Sakshi

బుల్లితెర నటి నివేదిత పంకజ్‌ మరోసారి ప్రేమలో పడిందట! సీరియల్‌ నటుడు సురేందర్‌ను గాఢంగా ప్రేమిస్తుందట! త్వరలోనే అతడి కలిసి ఏడడుగులు వేయనుందట! త్వరలోనే కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానోచ్‌ అంటూ సంతోషంలో మునిగి తేలుతోందీ బ్యూటీ. అయితే గతంలో నివేదిత సీరియల్‌ నటుడు ఎస్‌ఎస్‌ ఆర్యన్‌ను పెళ్లాడింది. వీరిని అభిమానులు క్యూట్‌ కపుల్‌గా అభివర్ణించారు. కానీ, అంతలోనే విడాకులు తీసుకున్నారు. డివోర్స్‌ తీసుకున్న మూడేళ్లకు తనకు మరో తోడు దొరికిందని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది నివేదిత.

పనికిరాని ప్రశ్నలు అడగొద్దు
'చిన్నచిన్న విషయాలు కూడా మీతో పంచుకోవడమే నాకిష్టం. నేను విడాకులు తీసుకుని మూడేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాను. ఓ స్పెషల్‌ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. ఈ విషయంపై మీరు ఎంత ఆసక్తి చూపిస్తారో నాకు తెలుసు. ఏయే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో కూడా తెలుసు. ప్లీజ్‌.. పనికిరాని ప్రశ్నలు వేసి విసిగించొద్దు. పాజిటివ్‌గా ఉందాం. ఒకరికొకరం మద్దతుగా నిలబడుదాం. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్‌' అని ఓ లేఖ షేర్‌ చేసింది.

మాజీ భర్త రెండో పెళ్లి
'మీ అనుమానాలు, ప్రశ్నలన్నింటికి ఈ ఒక్క పోస్ట్‌తో సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను' అంటూ సదరు పోస్ట్‌కు క్యాప్షన్‌ జోడించింది. దీనికంటే ముందే సురేందర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో వదులుతూ ఇతడే తన ప్రియుడు అని హార్ట్‌ సింబల్‌తో క్లారిటీ ఇచ్చేసింది. ఇకపోతే ఆమె మాజీ భర్త ఆర్యన్‌ సైతం గతేడాది మరో పెళ్లి చేసుకున్నాడు. బుల్లితెర నటి శ్రీతిక సనీష్‌ను పెళ్లాడాడు.

చదవండి: OTT: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement