Niveditha
-
పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే..
చందన్ శెట్టి, నివేదిత గౌడ.. కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక భార్యాభర్తలయ్యారు. 2020 ఫిబ్రవరి 6న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయారు. ఇకపై నీకు, నాకు ఏ సంబంధమూ లేదంటూ విడాకులు తీసుకున్నారు.నో 'ఇగో'తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎటువంటి ఇగో లేదు. కాకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటు ఉండేది. అలాంటప్పుడే కరోనా నాకు గుణపాఠం నేర్పింది. డబ్బును ఎలా వాడాలో తెలిసొచ్చేలా చేసింది. అప్పటివరకు పైసా అంటే లెక్క లేకుండా పోయింది. నేను చేసిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న సమయంలో ఈ మహమ్మారి వచ్చింది. అలా కోవిడ్ టైంలోనే నా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.50-60 లక్షలు ఖర్చు పెట్టాను. తెలిసొచ్చిందిఉన్నదంతా ఖర్చయ్యాక డబ్బు అవసరం తెలిసొచ్చింది. మళ్లీ చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాను. ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయంలో ఉండేవాడిని. నేను కంపోజ్ చేసిన ఏ పాట హిట్టవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అని భయంభయంగా ఉండేది. ఒకటి మాత్రం నిజం.. జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి?
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.శాండల్‌వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో క్యూటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డివోర్స్ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా.. టిక్‌టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత రాపర్‌గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్‌లోని జరిగిన దసరా వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. -
బిగ్‌బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!
బిగ్‌బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. హనీమూన్‌కు నెదర్లాండ్‌కు వెళ్లి వచ్చారు.ట్విస్ట్ ఇచ్చిన జంటసోషల్ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్, నివేదిత గౌడ స్పందించనేలేదు.బిగ్‌బాస్ షోలో..కాగా చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్లే, పొగరు, చూ మంతర్ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్‌బాస్ ఐదో సీజన్లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్లో నివేదిత కూడా పార్టిసిపేట్ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. -
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్ -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ టికెట్ మళ్లీ ఆ ఫ్యామిలీకే ?
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదివారం(ఏప్రిల్ 7) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమావేశమై కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేత హరీశ్‌రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ టికెట్ మళ్లీ దక్కడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల సాయన్న కూతురు సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో ఈ సీటు ఖాళీ అయి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే అభ్యర్థిని అధికారికంగా మంగళవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ నేతలు పలువురు ఈ ఉప ఎన్నికలోనూ టికెట్ కోసం పార్టీని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీరందరి అభ్యర్థిత్వంపై చర్చించిన తర్వాత టికెట్ సాయన్న కుటుంబానికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన గణేష్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా పార్టీ ఆయనను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు మరో షాక్ -
రెండో పెళ్లి.. కళ్యాణ మండపంలోనే ఏడ్చేసిన నటి
సీరియల్ బ్యూటీ నివేదిత పంకజ్ రెండో పెళ్లి చేసుకుంది. బుల్లితెర నటుడు సురేందర్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడింది. 'కలకాలం నీ వెంటే ఉంటాను, ఎల్లప్పుడూ నీ చేయి వదలను, ఐ లవ్ యూ..' అంటూ సురేందర్ మరోసారి తన ప్రేమను వ్యక్తం చేయడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబైన నివేదిత పెళ్లి మండపైనే ఏడ్చేసింది. చెన్నైలో శుక్రవారం (ఫిబ్రవరి 23న) ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు.. ఈ కొత్త దంపతులు కలకాలం పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతంలో నివేదిత నటుడు ఎస్ఎస్ ఆర్యన్‌ను పెళ్లాడింది. కానీ వీరి బంధం ఎంతోకాలం నిలవలేదు. కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆర్యన్ బుల్లితెర నటి శ్రీతిక సనీష్‌ను పెళ్లి చేసుకున్నాడు. నివేదితక కూడా ఆ బాధలో నుంచి బయటకు వచ్చి కొత్త తోడును వెతుక్కుంది. సురేందర్‌ను పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) చదవండి: అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టం.. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో.. -
విడాకులై మూడేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డా: బుల్లితెర నటి
బుల్లితెర నటి నివేదిత పంకజ్ మరోసారి ప్రేమలో పడిందట! సీరియల్ నటుడు సురేందర్‌ను గాఢంగా ప్రేమిస్తుందట! త్వరలోనే అతడి కలిసి ఏడడుగులు వేయనుందట! త్వరలోనే కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నానోచ్ అంటూ సంతోషంలో మునిగి తేలుతోందీ బ్యూటీ. అయితే గతంలో నివేదిత సీరియల్ నటుడు ఎస్ఎస్ ఆర్యన్‌ను పెళ్లాడింది. వీరిని అభిమానులు క్యూట్ కపుల్‌గా అభివర్ణించారు. కానీ, అంతలోనే విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న మూడేళ్లకు తనకు మరో తోడు దొరికిందని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది నివేదిత. పనికిరాని ప్రశ్నలు అడగొద్దు 'చిన్నచిన్న విషయాలు కూడా మీతో పంచుకోవడమే నాకిష్టం. నేను విడాకులు తీసుకుని మూడేళ్లవుతోంది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాను. ఓ స్పెషల్ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. ఈ విషయంపై మీరు ఎంత ఆసక్తి చూపిస్తారో నాకు తెలుసు. ఏయే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో కూడా తెలుసు. ప్లీజ్.. పనికిరాని ప్రశ్నలు వేసి విసిగించొద్దు. పాజిటివ్‌గా ఉందాం. ఒకరికొకరం మద్దతుగా నిలబడుదాం. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్' అని ఓ లేఖ షేర్ చేసింది. మాజీ భర్త రెండో పెళ్లి 'మీ అనుమానాలు, ప్రశ్నలన్నింటికి ఈ ఒక్క పోస్ట్‌తో సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను' అంటూ సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది. దీనికంటే ముందే సురేందర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ ఇతడే తన ప్రియుడు అని హార్ట్ సింబల్‌తో క్లారిటీ ఇచ్చేసింది. ఇకపోతే ఆమె మాజీ భర్త ఆర్యన్ సైతం గతేడాది మరో పెళ్లి చేసుకున్నాడు. బుల్లితెర నటి శ్రీతిక సనీష్‌ను పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Nivedhitha (@_n.i.v.e.d.h.i.t.h.a_) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) View this post on Instagram A post shared by LK Photography (@lkphotography.in) చదవండి: OTT: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. -
పంట చేలో పాల కంకి పల్లకిలో పిల్ల ఎంకి నవ్వినంత అందంగా...
చీర గురించి ఎన్ని పాటలు రాసినా రాయాల్సినవి ఎన్నో మిగిలే ఉంటాయి. అందమైన చీరకట్టును చూస్తే పంటచేలో పాలకంకి, పల్లకిలో పిల్ల ఎంకీ నవ్వినంత అందంగా, అద్భుతంగా ఉంటుంది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు వినూత్నంగా డిజైన్ చేసిన చీరల ఛాయాచిత్రాలు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. కేరళ కసువు శారీ (వైట్ కాటన్ శారీ విత్ గోల్డెన్ జరి బార్డర్) రకరకాల వేడుకలకు క్లాసిక్ ఫేవరేట్‌గా పేరు పొందింది. డిజైనర్ నివేదిత సంజయ్ ప్రభు ఈ చీరకు సంబంధించి పురాతన టెక్నిక్లను మాన్యువల్ స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా తిరిగి తీసుకువచ్చింది. ప్రతి ప్రింట్ ఒక అందమైన కథ చెబుతుంది. అరటిఆకుల నుంచి ఇంగ్లీజ్ రోజ్, చెంబూర్ ఫ్లవర్ వరకు ప్రకృతిలోని ఎన్నో అందాలు కసువు చీరెలో కనిపించి కనువిందు చేస్తాయి. -
సమంతకు ఏమైంది ..ఆమె వ్యాధి అంత తీవ్రమైందా..?
-
అర్జున్ గ్రామర్ నివేదితకి అర్థమైంది..
గ్రామర్... కష్టమైన సబ్జెక్ట్. అర్థం అయితే చాలా ఈజీ. ప్రెజెంట్లో ఉన్నా ఫ్యూచర్ కూడా అర్థమవుతుంది. పెళ్లి... ఇదో సెపరేట్ గ్రామర్. భర్తది ఒక గ్రామర్... భార్యది ఒక గ్రామర్. ఒకరి గ్రామర్ మరొకరికి అర్థమైతే ఫ్యూచర్ అర్థవంతంగా ఉంటుంది. అర్జున్ గ్రామర్ నివేదితకి అర్థమైంది.. నివేదిత గ్రామర్ అర్జున్‌కి అర్థమైంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే వివాహ బంధానికి అర్థమే లేదంటున్నారు ఇద్దరూ. ►మీ పెళ్లయి 32 ఏళ్లయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నేళ్ల జీవితం ఎలా అనిపిస్తోంది? అర్జున్: మా ఫ్రెండ్స్ ‘25 ఏళ్లకే పెళ్లి చేసుకున్నావేంటి? కొన్నాళ్లు బ్యాచిలర్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు’ అనేవాళ్లు. అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే ‘తొందరగా పెళ్లి చేసుకుని ఎంత మంచి పని చేశానా’ అనిపిస్తోంది. సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నాను. ఒంటరిగా ఉండి సాధించవచ్చు అనుకుంటారు. కానీ కలసి సాధించడంలో కిక్ వేరే ఉంటుంది. పెళ్లి చేసుకున్నవాళ్లకే అది తెలుస్తుంది. నా లైఫ్‌లో జరిగిన బెస్ట్ విషయాల్లో నివేదితతో పెళ్లి ఒకటి. నివేదిత: నా లైఫ్‌లో జరిగిన మంచి విషయం అర్జున్‌గారిని పెళ్లి చేసుకోవడమే. ఆయనతో 32 ఏళ్ల లైఫ్ చాలా చాలా బాగుంది. అర్జున్: మా ఇద్దరమ్మాయిలు (ఐశ్వర్య, అంజనా) ‘నాన్నా.. మాకు ఫ్రెండ్‌లా కనిపిస్తున్నారు’ అంటారు. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీ. నివేదిత: నన్ను కూడా ఫ్రెండ్ అనే అంటారు. ►మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం... ఆ లవ్‌స్టోరీ గురించి చెబుతారా? అర్జున్: తను కన్నడ నటి. ‘రూపతార’ అనే కన్నడ సినిమా మ్యాగజీన్లో తన ఫొటో చూశాను. ‘ఈ అమ్మాయి బావుంది’ అనుకున్నాను. అప్పుడు ‘డాక్టర్గారి అబ్బాయి’ అని తెలుగు సినిమా కమిట్ అయ్యాను. పీయన్ రామచంద్రరావుగారు డైరెక్టర్. ఆ సినిమాకి నివేదితను రికమండ్ చేశాను. వెంటనే ఓకే అన్నారు. నివేదిత నాన్నగారు (రాజేష్) కన్నడంలో పెద్ద స్టార్. అదే టైమ్‌లో మా నాన్నగారు (శక్తి ప్రసాద్) విలన్. వాళ్ల నాన్నగారు, మా నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు 86లోనే చనిపోయారు. ఇక ‘డాక్టర్గారి అబ్బాయి’ సినిమా చేస్తుండగా నివేదితకు, నాకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సినిమా క్లైమాక్స్‌లో నాకు, కోట శ్రీనివాసరావుగారికి మధ్య వెటర్నరీలో వాడే పెద్ద సిరంజీలతో ఫైట్ ఉంటుంది. టైమింగ్ మిస్ అయి, ఆ సిరంజి నా చేతికి గుచ్చుకుని చేయి మొత్తం చీలిపోయింది. దగర్లో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లాం. కుట్లు వేశారు. పక్కనే ఈ అమ్మాయి ఉంది. కళ్ల నిండా నీళ్లు. ఆ రోజే నాకు ఫీలింగ్ స్టార్టయింది. ►ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అర్జున్: ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఆ సినిమా సెట్లో అడిగా. ఓకే అంది. ►పెళ్లప్పుడు మీకు 25 ఏళ్లు. మరి ఆమెకి? అర్జున్: తనకి 17. అదేం మాకు సమస్య కాదు కానీ ఎక్కడ మిస్ కొట్టిందంటే.. ఆ వయసులో తనకు మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉండేది. నా సినిమాల ప్రివ్యూలను ఇద్దరం కలిసి చూసేవాళ్లం. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది. ఏడుస్తున్నది తనే. ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే చెప్పలేదు. ఇంటికి వచ్చాక చెప్పింది. సినిమాలో నేను హీరోయిన్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవడం తను తట్టుకోలేకపోయింది. ‘నువ్వు కూడా యాక్టరే కదా.. ఇదంతా ప్రొఫెషన్లో భాగమే’ అన్నాను. వెంటనే కన్విన్స్ కాలేదు. మెల్లిగా అర్థం చేసుకుంది. నివేదిత: 17 ఏళ్ల వయసు అమ్మాయిలు అలానే ఉంటారేమో. మాది సినిమా బ్యాగ్రౌండ్ అయినా భర్త వేరే స్త్రీతో నటన కోసం అయినా సరే క్లోజ్‌గా ఉండటాన్ని భరించలేకపోయాను (నవ్వుతూ). అర్జున్: మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఎంత బిజీగా ఉన్నా మన కుటుంబానికి, భార్యకు టైమ్ ఇవ్వాలి. ‘ఇంత ఇమ్మెచ్యుర్డ్గా ఆలోచిస్తుందేంటి’ అని కోపం తెచ్చుకోకుండా అర్థమయ్యేలా చెప్పా. అర్థం చేసుకోవడానికి టైమ్ తీసుకుంది. తర్వాత సెట్టయింది. ఆ 17 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు నేను ఎలా ఉండాలో చెబుతుంది (నవ్వుతూ). కోపం తెచ్చుకోవద్దు అని పాజిటివ్నెస్ తీసుకొస్తుంది. ఈ ఇంటర్వూ్యలో చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే... మీ ఫ్యామిలీకి టైమ్ ఇవ్వండి. నేను ఇచ్చాను కాబట్టే ఈరోజు నేను చాలా హ్యాపీ పర్సన్. నివేదిత: నా పెళ్లి సమయానికి చిన్న పిల్లని కాబట్టి కొన్ని విషయాలు అర్థం అయ్యేవి కావు. మొదట్లో కొంచెం కష్టంగా ఉండేది. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. ►ఈ 32 ఏళ్లలో మీ ఇద్దరిలో వచ్చిన మార్పేంటి? నివేదిత: చాలా మార్పులు వచ్చాయి. గొడవలు పడ్డాం. సర్దుకుపోయాం. ఇన్నేళ్లల్లో మా గొడవల్ని మేం ఎప్పుడూ మరుసటి రోజు వరకూ కొనసాగించలేదు. ఏదైనా ఆ రోజు వరకే. మా ‘మంత్ర’ ఒకటే.. ఏ గొడవ జరిగినా ‘ఫర్గెట్ అండ్ ఫర్గివ్’. ►ఇంటి పనుల్లో మీవారు హెల్ప్ చేస్తారా? నివేదిత: చేస్తారు. ఎవ్వరూ లేకపోతే గిన్నెలు క్లీన్ చేయడంలో కూడా సహాయం చేస్తుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంచడం ఆయనకు ఇష్టం. ఇద్దరమ్మాయిల రూమ్స్‌ని నీట్‌గా సర్దిపెడుతుంటారు. ►వంట చేయడం వచ్చా? అర్జున్: కాఫీ పెడతాను. ఆమ్లెట్ వేసుకోగలుగుతాను. పులిహోర బాగానే చేయగలుగుతాను. నివేదిత: పులిహోర తన ఫేవరెట్. వంటమనిషి రాకపోతే వంట ప్రయత్నిస్తారు. ఆయన పెట్టే కాఫీ నాకు చాలా ఇష్టం. ►మీ భార్యలో మీకు నచ్చిన విషయాలు? అర్జున్: ఒక్కొక్కరిదీ ఒక్కోలాంటి మనస్తత్వం, వ్యక్తిత్తం. నా భార్యలో నేను చూసింది పాజిటివిటీ. అబద్ధం చెప్పదు. నాకు ఇప్పుడు ఇద్దరు అమ్మలున్నారు. ఒకరు నా తల్లి, రెండోది నా భార్య. ►అర్జున్గారిలో మీకు నచ్చేవి? నివేదిత: కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ►మీ అమ్మాయి ఐశ్వర్యను హీరోయిన్ని చేయడానికి కారణం? అర్జున్: 35ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంతకన్నా మంచి ఇండస్ట్రీ నాకు తెలిసి లేదు. బయట నుంచి చూసేవాళ్లు చెడు ఉదాహరణలు చెబుతుంటారు. మంచీ చెడు ఎక్కడైనా ఉంటాయి. నా ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం. మా అమ్మాయిని కూడా పరిచయం చేయడం గర్వంగా ఉంది. తనకూ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. మా ఐశ్వర్యను కన్నడం, తమిళంలో హీరోయిన్గా పరిచయం చేశాను. తెలుగులో పరిచయం చేయాలనుకుంటున్నాను. 1984 నుంచి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మా అమ్మాయి కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నాను. రెండో అమ్మాయి అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేసింది. వాళ్ల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. వాళ్ల నాన్నగా అండగా నిలబడతాను. నాన్నలందరికీ నా విన్నపం ఏంటంటే మీ పిల్లల కోసం మీరు ఆరోగ్యంగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల ఉన్నవాళ్లు. ఆడపిల్లలకు తండ్రి సంరక్షణ కావాలి. ►వర్కింగ్ ఉమెన్ మీద మీ అభిప్రాయం? అర్జున్: ‘ఉమెన్హుడ్’ని నేను చాలా గౌరవిస్తాను. అమ్మ అయినా భార్య అయినా అక్క అయినా, చెల్లయినా.. వర్కింగ్ ఉమెన్ అంటే చాలా గౌరవం. మా ఇంట్లో పని చేసేవాళ్లను ‘ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు. మీ ఇంట్లో వంట చేసి మా ఇంటికి వస్తారా?’ అని అడుగుతాను. వాళ్లు చెప్పింది వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వాళ్ల కష్టం ముందు మాది పెద్ద కష్టం కాదనిపిస్తుంది. ఇంట్లో పనిచేసి, బయట పనిచేసి ఫ్యామిలీని పెంచి పెద్ద చేయడం చిన్న విషయం కాదు. వాళ్లందరికీ నా సెల్యూట్. ►మీ ఇద్దరిలో ఎవరు డామినేటింగ్? అర్జున్: నా భార్యని అడిగితే నేనే డామినేటింగ్ అంటుందేమో. ఎవరి దృష్టిలో వాళ్లు కరెక్ట్ అనుకుంటాం. నా మనసుకి ఏది అనిపిస్తే అది చెబుతాను. ఉన్నదే చెబుతున్నాం అని మనం అనుకుంటాం. కానీ చెప్పింది వినాలన్నప్పుడు ‘తను డామినేటింగ్’ అనుకోవచ్చు. డామినేటింగ్కి కరెక్ట్ గ్రామర్ తెలియదు నాకు. అయితే చాలాసార్లు తను చెప్పింది వింటాను. కానీ చెప్పే విషయంలో చిన్న లాజిక్ ఉండాలనుకుంటాను. అది లేకపోతే మా అమ్మ చెప్పినా నా భార్య చెప్పినా వినను. నాక్కూడా కరెక్ట్ అనిపించాలి. నివేదిత: విన్నారు కదా.. లాజికల్‌గా చెప్పాలంటారు. మేం కూడా చెప్పడానికి ట్రై చేస్తాం (నవ్వుతూ). అయితే కొన్నిసార్లు కొన్ని ఇష్యూల్లో నేనే స్టాండ్ తీసుకుంటాను. ►మ్యారీడ్ లైఫ్ గురించి మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. మరి.. వైవాహిక జీవితం ఇలా ఉంటే బాగుంటుంది? అని చెబుతూ ఏదైనా సినిమా తీయాలనుకుంటున్నారా? అర్జున్: మా అమ్మాయితో నేను తీయబోతున్న సినిమాలో చాలా టిప్స్ చెప్పబోతున్నాను. జనరల్‌గా చెప్పాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడమే. ఎక్కడో పుట్టి ఎక్కడో ^è దువుకొని ఒకటవుతాం. మనస్తత్వాలు వేరయినా ఒకే ఇంట్లో ఉంటాం. విబేధాలు వస్తాయి. కొంచెం ఓపిక పడదాం, అడ్జస్ట్ అవుదాం అని అనుకోగలిగితే అంతా సవ్యంగా ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నా అంగీకరిస్తాను అని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈగో, పొసెసివ్‌నెస్ ఉంటాయి. అప్పుడు మనల్ని అపరిమితంగా ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. నేను హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండేది నటనే అయినా తను భరించలేకపోయింది. అది నా మీద తనకున్న ప్రేమ అని అర్థం చేసుకున్నాను. నివేదిత: ఒకరికి ఒకరు స్పేస్ ఇవ్వాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. నమ్మకం, అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈగో అనేది దాంపత్యంలో అస్సలు వర్కౌట్ అవ్వదు. నా వరకూ నేను చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాను. ఈ ఇంట్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. అర్జున్: పెళ్లయ్యాక తన కుటుంబం, నా కుటుంబం అని ఉండకూడదు. మాకు ఆ భేదం లేదు. మా అమ్మగారు వాళ్ల అమ్మగారు ఇద్దరూ నాకు సమానమే. తనకూ అంతే. అత్తింటిని పుట్టిల్లు అని అమ్మాయి అనుకోవాలి. అబ్బాయి కూడా అలానే అనుకోవాలి. మేం అలానే అనుకున్నాం. నివేదిత: అది చాలా ఇంపార్టెంట్. అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు ఓ కారణం భర్త ఇంటివాళ్లను భార్య తనవాళ్లు అనుకోకపోవడం, భార్య కుటుంబాన్ని తన కుటుంబంలా భర్త అనుకోకపోవడమే. మా ఇద్దరికీ ఆ ప్రాబ్లమ్ లేదు. మాకు అందరూ సమానమే. – డి.జి. భవాని ►ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి. ఇద్దరు ఆడపిల్లల తల్లిదండ్రులుగా భయంగా ఉంటుందా? అర్జున్: అందరి తల్లిదండ్రులకు ఉన్నట్టే నాకూ భయం ఉంటుంది. మంచీ చెడూ అన్ని చోట్లా ఉన్నాయి. ఆడపిల్లలకు ప్రతిదీ చెబుతూ పెంచాలి. సెక్స్ అంటే వివరంగా చెప్పాలి. అందులో మంచి చెడ్డలు వివరించాలి. అప్పుడు అదేంటో తెలుసుకోవాలనే కంగారు ఉండదు. జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులకు ఇది కూడా ఓ బాధ్యతే. ప్రస్తుతం ఈ పాయింట్‌తోనే ఓ సినిమా చేస్తున్నాను. ఆడపిల్లలు ఆత్మరక్షణ నేర్చుకోవాలి. కరాటే నేర్చుకోవాలి. పెప్పర్ స్ప్రే ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. మనల్ని కాపాడటానికి ఎవరో వస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. నివేదిత: తల్లిదండ్రులు ఫ్రెండ్స్‌లా ఉన్నప్పుడే వాళ్లతో ఏదైనా మాట్లాడగలం. పేరెంట్స్‌కి పిల్లలు భయపడాలని కాదు. గౌరవం ఉండాలి. భయం కన్నా గౌరవం ఉన్నచోట తప్పులు చేయరని నా ఫీలింగ్. అందుకే మా పిల్లల్ని భయపెట్టం. స్నేహితుల్లా ఉంటాం. పిరికిగా ఉండకూడదని చెబుతుంటాం. ►ట్రిప్స్‌కి వెళ్తుంటారా? నివేదిత: చాలా ట్రిప్స్‌కి వెళ్లాం. తన షూటింగ్స్‌కి బ్రేక్ ఉన్నా, పిల్లలకి సెలవులొచ్చినా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాం. ఆయన ఫారిన్లో షూటింగ్ చేసినప్పుడల్లా ఆయనతో కలిసి వెళ్లాం. ఈ మధ్య వెళ్లిన హాలిడే అంటే.. మాల్డీవ్స్. ఇప్పుడైతే ట్రావెల్ చేసే ఆలోచన లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి బాలేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. అందరూ వాటిని ఫాలో అవ్వాలి. పరిస్థితులన్నీ కుదుటపడే వరకూ జాగ్రత్తగా ఉందాం. అర్జున్: అవును.. వీలైనంతవరకూ ఇంట్లోనే ఉందాం. సమాజం మేలు కోసం మన వంతు సహాయం చేయాలి. ►అర్జున్‌గారు నటించిన చిత్రాల్లో ‘జెంటిల్‌మేన్’ ఒకటి. రియల్ లైఫ్‌లో ఆయన..? నివేదిత: నిజజీవితంలో వెరీ వెరీ జెంటిల్‌మేన్. మా పెళ్లైన కొత్తలో నా అభిప్రాయాలను ఎంత గౌరవించారో ఇప్పుడూ అంతే గౌరవిస్తున్నారు. స్వేచ్ఛ ఇస్తారు. నాకు కావల్సినవి వెంటనే సమకూరాయో లేదో చూసుకుంటారు. భర్తల్లో తక్కువమందికి ఈ క్వాలిటీ ఉంటుంది. స్త్రీల క్షేమం కోసం తన పరిధి దాటి సహాయం చేయడానికి వెనకాడరు. ►మరి మీ ఆవిడ గురించి? అర్జున్: షీ ఈజ్ బెస్ట్. బ్యూటిఫుల్, డ్యూటిఫుల్, రెస్పాన్సిబుల్ పర్సన్. నా జీవితంలో నేను కలిసిన ఏకైక నిజాయితీ గల వ్యక్తి. కుమార్తెలు అంజనా, ఐశ్వర్యలతో అర్జున్, నివేదిత -
హనీమూన్‌కు నెదర్లాండ్స్ వెళ్లాం
సాక్షి, మండ్య: హనీమూన్‌కు ‘మేము వెళ్లింది ఇటలీ కాదు.. నెదర్లాండ్‌కు’ అని నటుడు చందన్ శెట్టి తెలిపారు. తాము హనీమూన్‌కు ఇటలీ వెళ్లినట్లు అబద్ధపు వార్తలు సృష్టించారని ఆయన శనివారం తెలిపారు. కాగా, ఇటీవల నివేదితా, చందన్ శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లారు. అయితే నూతన వధూవరులు ఇటలీకి హనీమూన్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మండ్యలో వారిరువురు మీడియాతో మాట్లాడుతూ... ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి వెళ్లిన విషయం అధికారుల వద్ద ఉందని చెప్పారు. తాము ఈ నెల 3న నెదర్లాండ్స్‌కు వెళ్లినట్లు, అప్పుడు అక్కడ కరోనా వైరస్ భయం లేదని తెలిపారు. ప్రస్తుతం తామిరువురం ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. రక్తపరీక్షలతో పాటు అన్ని వైద్య పరీక్షలు చేశారని తెలిపారు. కరోనా వెళ్లిపోయాక మళ్లీ హనీమూన్‌కు వెళ్తామని చెప్పారు. చదవండి: కరోనాతో హనీమూన్ రద్దు! నివేదితను పెళ్లాడిన చందన్ శెట్టి -
నివేదితను పెళ్లాడిన చందన్ శెట్టి
మైసూరు: కన్నడ బిగ్‌బాస్ 5వ సీజన్ విన్నర్, కన్నడ ప్రముఖ ర్యాపర్ గాయకుడు చందన్‌శెట్టి, నివేదితా గౌడ బుధవారం మూడుముళ్లతో ఒక్కటయ్యారు. మైసూరులోని హుణసూరు రోడ్డులో ఉన్న హినకల్‌లోని ఫంక్షన్ హాల్లో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది. నివేదితా తల్లిదండ్రులు హేమా, రమేష్, దంపతులు, చందన్‌శెట్టి తల్లిదండ్రులు ప్రేమలతా, పరమేష్‌లు, బంధుమిత్రులు, పలువురు సినీనటులు కొత్త జంటను ఆశీర్వదించారు. కన్నడ ప్రముఖ సినినటుడు పవర్ స్టార్ పునిత్ రాజ్‌కుమార్ దంపతులు కొత్త జంటను ఆశీర్వదించారు. చందన్‌శెట్టి మాట్లాడుతూ ‘పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. ఇక పైన నాతో పాటు నా భార్య నివేదితా కూడా ఉంటుంది’ అని సంతోషంగా తెలిపారు. వధువు నివేదితా గౌడ మాట్లాడుతూ తన జీవితంలో చాలా గొప్ప రోజు అని, ఈ శుభదినాన్ని ఎప్పుడు కూడా మరిచిపోనని అన్నారు. సుదీప్.. జూదం ఆడమంటావా? ప్రముఖ నటుడు సుదీప్ ఇస్పేట్ జూదం ప్రకటనల్లో కనిపించటంపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. జూదాన్ని సుదీప్ ప్రోత్సహించేలా చేస్తున్నట్లు ఆరోపిస్తూ వివిధ కన్నడ సంఘలు బుధవారం బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. జూదం ఆడండి, డబ్బులు సంపాదించండి అని ఆన్లైన్లో సుదీప్ ప్రకటనలు చేయడం తగదన్నారు. యువతను తప్పుదారి పట్టించేలా ఉందని, ఆయన కన్నడ సినిమాల నుండి నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ ఇలాంటి ప్రకటనల్లో నటించడం సబబు కాదని హితవు పలికారు. -
భర్త హత్య.. సహకరించిన ప్రియుడు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితిలో ప్రజలంతా మంగళవారం అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమై ఉండగా, ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసిందో ప్రబుద్ధురాలు. మునిగుడ సమితి ఆఫీస్‌లో తాత్కాలిక డ్రైవరుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ చంటి జీరో నైట్ ముగించుకుని రాత్రి 2 గంటలకు సొంతింటికి చేరుకున్నాడు. అదే సమయంలో తన భార్య నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి ఉండడాన్ని చూశాడు. దీంతో కోపోద్రేకుడైన రాజ్‌కుమార్ భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగి తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేశారు. వంటింట్లో ఉన్న రొట్టెలకర్ర, పీఠ చెక్కతో రాజ్‌కుమార్ చంటిపై ఇద్దరూ కలిసి దాడి చేసి చంపేశారు. హత్య అనంతరం అతడి మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, ప్రియుడి కారులో గజపతి జిల్లాలోని ఒడవ ప్రాంతానికి తరలించారు. అక్కడి రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి ఇద్దరు కలిసి తిరిగి కారులో ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. మునిగుడ తహసీల్దారు కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న నివేదిత తన భర్త కనిపించడం లేదంటూ మునిగుడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఒడవ ప్రాంతంలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించి, పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలతో నివేదిత నాయక్‌ను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజ్‌కుమార్ చంటి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం
మైసూరు : కన్నడ బిగ్‌బాస్ కంటెస్టంట్లు చందన్‌శెట్టి, నివేదిత గౌడ సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిశ్చితార్థం చేసుకొని బిగ్‌బాస్ హౌస్‌లో తమ మధ్య చిగురించిన ప్రేమను మరోమెట్టుకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న గాయకుడు చందన్‌శెట్టి, నివేదిత గౌడ షో ముగిశాక బయట కూడా చెట్టపట్టాలేసుకొని తిరగడంతో ఇరువురి మధ్య ప్రేమాయణం జరుగుతోందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా దసరా ఉత్సవాల్లో పాల్గొన్న చందన్‌శెట్టి అదే కార్యక్రమంలో పాల్గొన్న నివేదితకు ప్రేమ వ్యక్తపరచగా దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. -
క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్ విజేత
కర్ణాటక ,మైసూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ దసరా వేదికపై తన ప్రేమను వ్యక్తపరచినందుకు సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బిగ్‌బాస్ విజేత, గాయకుడు చందన్ శెట్టి క్షమాపణలు కోరారు. నగరంలోని మహరాజ కాలేజీ మైదానంలో నిర్వహించిన యువ దసరా వేదికపై గత సీజన్ బిగ్‌బాస్ విజేత చందన్‌శెట్టి అదే షోలో పాల్గొన్న నివేదిత గౌడకు ప్రేమను వ్యక్తపరచి నిశ్చితార్థం ఉంగరాన్ని బహుకరించాడు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలతో పాటు నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో చందన్‌శెట్టి శనివారం మీడియా ఎదుట క్షమాపణలు చెప్పాడు. నివేదితకు ప్రేమ వ్యక్తపరచడం వ్యక్తిగత నిర్ణయమని అయితే బహిరంగ వేదికపై అలా ప్రేమను వ్యక్తపరచడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై మంత్రి సోమణ్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి దసరా ఉత్సవ సమితి చందన్‌శెట్టికి నోటీసులు జారీ చేయడానికి నిర్ణయించుకుంది. -
తెలీక చేశాను.. సారీ!
సాక్షి, బెంగళూరు: కీకీ ఛాలెంజ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న శాండల్‌వుడ్ నటి నివేదిత గౌడ ఎట్టకేలకు స్పందించారు. ఆ ఛాలెంజ్‌ను నిషేధించిన విషయం తెలీక తాను తప్పు చేశానని ఆమె క్షమాపణలు చెప్పారు. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో కీకీ ఛాలెంజ్ వీడియో చూసి సరదాగా ప్రయత్నించా. అంతేగానీ దాన్ని నిషేధించారన్న విషయం నాకు తెలీదు. నాపై విమర్శలు వెల్లువెత్తిన సమయంలో నన్ను కావాలని టార్గెట్ చేశారేమో అనిపించింది. విషయం తెలిశాక వేరే వాళ్లు ప్రయత్నించకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోను తొలగించా. ప్రాణాల మీదకు తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పేంత మూర్ఖురాలిని కాదు కదా!. క్షమించండి’ అని ఓ జాతీయ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యానించారు. (కీకీ ఛాలెంజ్.. దమ్ముంటే ఇలా చేయండి) 18 ఏళ్ల నివేదిత గౌడ కన్నడ బిగ్‌బాస్ 5వ సీజన్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. కీకీ ఛాలెంజ్ విమర్శల నేపథ్యంలో ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. నివేదితపై బెంగళూరు పోలీసులకు ఓ ఉద్యమవేత్త ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే కీకీ డాన్స్‌తో డాన్స్ కిక్ రాదని, కటకటాల కిక్ మాత్రమే వస్తుందని బెంగళూరు పోలీసులు నెటిజన్లను హెచ్చరించారు. నటి రెజీనా కికి వీడియో వైరల్.. విమర్శలు -
వివాదంలో బిగ్‌బాస్ నివేదిత
యశవంతపుర : ఇప్పటికే పలు రాష్ట్రాలలో నిషేధించిన కికీ (రోడ్డుపై డ్యాన్స్ చేయటం) చాలెంజ్‌ను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసిన కన్నడ బిగ్‌బాస్ పారిసిపేట్ నివేదిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిత ఇటీవల కారులో వెళ్తూ ఒక ట్రాఫిక్ ప్రాంతంలో దిగి డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్లోడ్ చేసి కికీ చాలెంజ్‌కు పిలుపునిచ్చారు. ఈ కికీ చాలెంజ్‌ను పలు రాష్ట్రాలు నిషేధించాయి. భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కారు దిగి డ్యాన్ చేయటాన్ని కికీ చాలెంజ్‌గా పిలుస్తారు. బిగ్‌బాస్‌లో పాల్గొన్న నివేదిత గౌడ నగరంలోని రోడ్డుపై కారు దిగి 15 సెకండ్ల పాటు డ్యాన్స్ చేసి అది అప్లోడ్ చేశారు. నడి రోడ్డుపై ఇలా డ్యాన్స్ చేయటం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా జరుగతాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కూడా కికీ చాలెంజ్‌ను నిషేధించాలని కన్నడిగులు కోరుతున్నారు. -
స్పీడ్ బ్రేకరే ప్రమాదానికి కారణం
చెన్నై(తిరువొత్తియూరు): భారత ప్రొఫెషనల్ రేసర్ అశ్విన్ సుందర్, అతని భార్య నివేదిత దుర్మరణం పాలవ్వడానికి కారణం ఓ స్పీడ్ బ్రేకరే అని వారు ప్రయాణించిన కారు ఇంజినీర్ ఆర్.రాజా తెలిపారు. అతి వేగంగా వెళుతున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ కారు కింది భాగం రాసుకుని కారు అదుపు తప్పి ఉంటుందని చెప్పారు. అశ్విన్ సుందర్ నడిపిన బీఎం డబ్ల్యూ కారులో ఇద్దరు మాత్రమే కూర్చొని ప్రయాణించేందుకు వీలుంది. ఈ కారు ధర రూ.70 లక్షల నుంచి కోటి వరకు ఉంటుంది. సాధారణంగా ఇసె ట్ 4 రకం కార్లలో ఎక్కువ భద్రత ఏర్పాట్లు ఉంటాయని, స్పీడ్ బ్రేకర్ రాసుకోవడంతో నిప్పు అంటుకుని ఉండవచ్చునని రాజా తెలి పారు. -
దంపతుల సజీవదహనం
►పెళ్లయిన ఏడాదికే కానరాని లోకాలకు ►కారు ప్రమాదంలో దంపతుల సజీవదహనం ►భర్త కారు రేసర్, భార్య వైద్యురాలు ప్రేమించి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఏడాదికే ఆ దంపతులకు నూరేళ్లు నిండాయి. నాతి చరామీ అంటూ సంసార జీవితం వైపు ఏడడుగులు నడిచిన చూడముచ్చటైన ఆ జంట పెట్టుకున్న గంపెడాశలు కారు మంటల్లో కాలిబూడిదయ్యాయి. చెన్నైలో శనివారం తెల్లవారుజామున ఈ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు.. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై వలసరవాక్కం సమీపం ఆలపాక్కం అష్టలక్ష్మీనగర్కు చెందిన సుందర్ కుమారుడు అశ్విన్ సుందర్ (27) అంతర్జాతీయ కార్ల పోటీలో పాల్గొనే ఫార్ములా 4 రేసర్. దేశ విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో చాంపియన్‌గా నిలిచారు. ఇతని భార్య నివేదిత (26) చెన్నై పోరూరులోని రామచంద్ర ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అశ్విన్ సుందర్ వద్ద రెండే సీట్లు కలిగిన బీఎండబ్ల్యూ కారు ఉంది. శుక్రవారం రాత్రి ఆశ్విన్ తన భార్యతో కలిసి ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో తన స్నేహితుడు ఇచ్చే పార్టీకి హాజరయ్యారు. అర్ధరాత్రి వరకు స్నేహితునితో గడిపి శనివారం తెల్లవారుజాము 1.30 గంటల ప్రాంతంలో భార్యతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. చెన్నై అడయారు సమీపం రాజా అన్నామలైపురం డీజీఎస్ దినకరన్ రోడ్డు మీదుగా ఎంఆర్సీ నగర్, అంబేడ్కర్ మణిమండపం సమీపం మలుపు వద్ద అతివేగంగా వస్తున్న అశ్విన్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయి అశ్విన్, నివేదిత అందులో ఇరుక్కుపోయారు. ఆ వైపుగా వెళుతున్న వాహనాల వైపు చూస్తూ రక్షించాలని కేకలు వేసినా ఎవ్వరూ నిలపలేదు. ఈలోపు కారు ముందు భాగం నుంచి మంటలు చెలరేగి కొద్ది క్షణాల్లో పూర్తిగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న దంపతులు సహాయం కోసం అర్ధిస్తూ ఆర్తనాదాలు చేశారు. ఆ సమయంలో ఆ వైపుగా వస్తున్న ఉషారాణి అనే మహిళా కానిస్టేబుల్ వారి దయనీయ స్థితిని చూసినా కారు వద్దకు వెళ్ల లేక సెల్‌ఫోన్ నుంచి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మైలాపూరు, తేనాంపేటల నుంచి రెండు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కారులో దంపతులు సజీవదహనమై ఎముకల గూడుగా, బొగ్గు ముద్దలుగా మారిపోయారు. అడయారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో రేసర్ అశ్విన్ తన కారును వంద కిలోమీటర్ల వేగంతో నడిపి అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమని తేలింది. గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన ఆశ్విన్కు వివాహం కాగా భార్య నివేదిత గర్భంతో ఉన్నట్లు తెలిసింది. చిరు ప్రాయం నుంచే రేసులపై ఆసక్తి: అశ్విన్‌కు 14 ఏళ్ల ప్రాయంలో బైక్, కారు రేసులపై ఆసక్తిని తండ్రి, మేనత్త గుర్తించారు. కారు రేసులో తగిన శిక్షణ ఇప్పించి తొలిసారిగా ‘మాగాన్ మోటార్ స్పోర్టు’ అనే జర్మనీ కారు పందెం బృందంలో చేర్పించారు. ఆ తరువాత జర్మని ఫార్ములా వోక్స్వాగన్ అటాక్ చాంపియన్ షిప్ పోటీలో ఆశ్విన్ పాల్గొన్నారు. అయితే కారు రేస్ కంటే కూడా బైక్ రేసులంటే ఎక్కువ ఇష్టపడేవారు. ప్రమాదకరమని తెలిసినా ఎక్కువ వేగాన్ని బైక్‌లోనే ఆస్వాదించగలమని భావించేవాడు. 2003లో జరిగిన కారు రేసులో తొలిసారిగా జాతీయస్థాయి చాంపియన్ షిప్‌ను అందుకున్నారు. 2004లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచారు. 2006లో ఆసియా దేశాల స్థాయి పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. 2010 నుంచి 2013 వరకు వరుసగా ప్రతి ఏడాది అంతర్జాతీయ చాంపియన్ షీల్డ్‌ను అందుకున్నారు. 36 సార్లు చాంపియన్–నివేదితతో ప్రేమ వివాహం: అశ్విన్ సుందర్‌కు రేస్‌బైక్‌ను తయారుచేసి ఇచ్చిన అమీన్ అనే వ్యక్తి కన్నీరుమున్నీరై విలపిస్తూ చెప్పిన మాటలు ఇవి. అశ్విన్ కారు రేసుల్లో పాల్గొనడానికి ముందు బైక్ రేసులపై ఆసక్తి చూపేవాడు. రేసుల్లో ఆశ్విన్ వినియోగించే బైక్‌ను నేనే చేసి ఇచ్చాను. అశ్విన్‌కు మద్యం సేవించే అలవాటు లేదు. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారని చెప్పాడు. అశ్విన్ స్నేహితుడు కిరణ్ మాట్లాడుతూ, తెల్లవారుజామున పోలీసులు ఫోన్ చేసి ఒక కారు మంటల్లో తగులబడిపోతోంది, వారు మీకు తెలిసినవారు అనుకుంటా వెంటనే రండి అని చెప్పారు. దీంతో ఆఘమేఘాలపై అక్కడికి చేరుకోగా కారు నిలువునా కాలిపోతోంది. కారులో ఉన్న వారిని గుర్తించలేక పోయాను. ఇంతలో పోలీసులు ఒక సిమ్‌కార్డును ఇచ్చి కారు వద్ద దొరికిందని చెప్పారు. ఆ సిమ్‌కార్డును నా ఫోన్లో వేసి చూడగా అశ్విన్ భార్య నివేదితదని తెలిసింది. కారు, బైక్ రేసుల్లో 36 చాంపియన్‌గా నిలిచిన అశ్విన్ అగ్నికి ఆహుతైపోయాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని కన్నీళ్లుపెట్టుకున్నాడు.అశ్విన్ పినతండ్రి గణేష్ మాట్లాడుతూ, అశ్విన్, నివేదిక ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాడని తెలిపారు. వచ్చే వారం హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఇంతలో ఘోరం జరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
హేయ్.. హాయ్.. అయామ్ విల్..
నయా సాల్.. నయా జోష్.. నయా హోప్స్ Do not seek to follow in the footsteps of the men of old.. seek what they sought.. అన్న జపాన్ కవి బషో మాటను పాటించాలనుకుంటోంది ఈతరం!. తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటోంది. ఆ సృజనకు 2015ను వేదికగా మలచుకుంటోంది. ప్రియాంక, నివేదిత, సూర్య, వీళ్ల రంగాలు వేరు. ఆశయాలు కొత్తవి. సాధించాలన్న తపన మెండు.. అదే స్ఫూర్తితో వాళ్ల వాళ్ల రంగాల్లో ‘హేయ్. హాయ్, ఐయామ్ విల్’ అంటూ నయాసాల్‌లో యువోత్సాహంతో ముందుకు సాగుతున్న వారి ‘న్యూ’ స్టోరీస్ ఇవి.. - సరస్వతి రమ/ కళ హేయ్.. ప్రియాంక ఏలె. కళా ప్రపంచంలో సుపరిచితమైన పేరు! తండ్రి లక్ష్మణ్ ఏలె నుంచి వారసత్వంగా అబ్బిన చిత్రకళకు తన రంగులద్దే ప్రయత్నం చేస్తున్న యువ కళాకారిణి. ఈ నెల 3న ‘జ్ఛిడ. జిజీ, జ్చీఝ ఠీజీ’ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో షో ప్రారంభించనున్నారు. పెర్ఫార్మెన్స్, వీడియో ఇన్స్టలేషన్, చిత్రాలు.. ఇదీ ‘హేయ్.. హాయ్.. ఐయామ్ విల్’ సంపూర్ణ రూపం!. మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రీదాకాలే తనకు స్ఫూర్తి అని చెప్పే ప్రియాంక.. చిత్రకారిణిగా తన ప్రయాణాన్ని రెండు రకాలుగా విభజిస్తారు. ‘అన్వేషి’ వాళ్ల ‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ పుస్తకం చదవడానికి ముందు, చదివిన తర్వాత అని!. పుస్తకం చదివాకే స్త్రీ సమస్యలపై ఫోకస్ స్టార్ట్ చేశారు ప్రియాంక. హాయ్.. సాధారణంగా ఏ షోకైనా ఒక పదంతోనే శీర్షిక ఉంటుంది. కానీ ప్రియాంక ‘హేయ్.. హాయ్.. ఐయామ్ విల్’.. అంటూ మూడు పదాలతో శీర్షిక పెట్టి తన ప్రత్యేకతను చూపించాలనుకున్నారు. పేరుతోనే ఆ తరాన్ని, ఈ తరాన్ని షోకి దగ్గర చేయాలని ఆమె ఉద్దేశం. స్త్రీ, ప్రకృతి.. పురుషుడు.. ఈ షో కాన్సెప్ట్! నిజానికి ఈ షోలో తన పెయింటింగ్స్ కన్నా వీడియో ఇన్స్టలేషన్, పెర్ఫార్మెన్స్‌కే ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నారామె. ఇక డ్రాయింగ్స్.. అవి వాటంతటవే మాట్లాడుతాయి. ద్వాపరయుగంలోని ద్రౌపది నుంచి కలియుగంలోని నిర్భయ వరకు.. ఆయా కాలాలకు చెందిన అయిదుగురు మహిళలు.. వాళ్లను సమాజం చూసిన తీరును గీతల్లో.. కదిలే బొమ్మల్లో.. కదలని బొమ్మల్లో (మెనిక్వీన్) ఒకేసారి ప్రదర్శించనున్నారు. పెర్ఫార్మెన్స్.. ఒక్కో క్యారెక్టర్ తనను పరిచయం చేసుకునే వాయిస్‌ఓవర్‌తో మొదలవుతుంది. కుంచెతో గీసిన చిత్రాల్లో ప్రకృతి.. కదిలే బొమ్మల్లో స్త్రీ..కదలని బొమ్మతో సమాజం వైఖరి.. ‘హేయ్, హాయ్, ఐయామ్ విల్’లో ఆర్ట్ లవర్స్‌ను ఆకట్టుకోనున్నాయి!. అయామ్ విల్.. ఆర్ట్ షో విత్ పెర్ఫార్మెన్స్ అనేది కచ్చితంగా హైదరాబాద్‌కు కొత్తే. బయటి దేశాల్లో ఆర్టిస్టులు చాలా బోల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తారు. మన దగ్గర ఇంకా ఆ కల్చర్ లేదు. హైదరాబాద్‌లాంటి చోటైతే మరీ కష్టం. మెనిక్వీన్తో పెర్ఫార్మెన్స్ చేస్తానంటే క్యురేటర్స్ కొన్ని జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. నిస్సందేహంగా ఇదో సాహసమే. ఇకపై నా ప్రతి షోలోనూ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేదాన్ని. కూచిపూడి, భరతనాట్యం, గిటార్, వయోలిన్ నేర్చుకున్నాను. మోడలింగ్ చేసేదాన్ని. ఈ ఎక్స్‌పీరియన్సే ఇప్పుడీ షోలో పెర్ఫార్మెన్స్కి ఉత్సాహాన్నిస్తోంది. నా ఈ ఆలోచనకి ప్రోత్సాహమిచ్చి నన్ను ముందుకు నడిపిస్తోంది మాత్రం నాన్నే. ఆర్టిస్ట్‌గా నేను డిఫరెంట్ పాత్ని ఏర్పరచుకోవాలనే నా తపనకూ ఆయనే స్ఫూర్తి!. - ప్రియాంక ఏలె హేయ్.. రెడ్ ఎఫ్ఎం ఆర్జే సూర్య... సిటీలో వన్ ఆఫ్ ద యంగ్ ఆర్జే. వీకెండ్స్‌లో సండే-ఫండేతో ఏడాదిగా అలరిస్తున్న సూర్య ఈ మధ్యే వీజేగా మారాడు. తన ఆర్జేయింగ్కు మిమిక్రీ జోడించి వారం వారం నవ్వించే సూర్య న్యూ ఇయర్‌తో తన పంథాలో కొత్త మార్పులు చేయనున్నాడు. హాయ్.. తనకొచ్చిన మిమిక్రీతో చిన్నా చితకా షోలు చేస్తూ.. వచ్చిన డబ్బులతో చదువుసాగించాడు. ఆంధ్రా యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో మిమిక్రీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అనుకోకుండా రెడ్ ఎఫ్ఎం ఆడిషన్స్‌లో పాల్గొని తన గళంతో మెప్పించాడు. రేడియోలో ఎలా మాట్లాడుతారో తెలియని ఇతగాడు తనకొచ్చిన మిమిక్రీకి స్పాంటేనిటీ మిక్స్ చేసి సక్సెస్ కొట్టాడు. కామ్‌గా ఎంకామ్ చదువుకుంటూనే ఆర్జేగా అదరగొడుతున్నాడు. అయామ్ విల్.. ఈ తరం అనుకున్నది సాధించగలదు. అయితే వాళ్ల ముందున్న అవకాశాలను, టెక్నాలజీని.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసిన రీతిలో వాళ్లకు చెప్తాను. ఇంత వరకూ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేసిన నా షోస్ ద్వారా, ఇలాంటి మెసేజ్ నా ఫన్ స్టైల్లోనే అందించాలనుకుంటున్నాను. అలాగే ఈ ఏడాది, ఆర్జే, వీజేయింగ్తో పాటు ఆడియో లాంచ్‌లు, ఈవెంట్స్ ద్వారా కూడా వీలైనంత ఎక్కువగా ఎంటర్టైన్ చెయ్యాలనుకుంటున్నాను. యాక్టర్ కావాలనే నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నా. - సూర్య హేయ్.. నివేదిత.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చిన్నప్పటి నుంచి ఉన్న రీడింగ్ హాబీ ఆమెకో కొత్త ఐడియానిచ్చింది. దాంతో ఆమె జీవితమే మారిపోయింది. క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకొని రాయిటర్స్‌లో జర్నలిస్ట్‌గా చేరి తర్వాత పబ్లిషర్ అయ్యారు. హాయ్ ఈ నెల 10, 11 తేదీల్లో రెండురోజుల రైటర్స్ కార్నివాల్ నిర్వహించబోతున్నారు నివేదిత. దీనికి హైదారబాద్‌లోని రసన, జ్యోత్స్న ఫనాజి లాంటి రచయితలే కాక ముంబై నుంచి రొషల్ పోత్కర్లాంటి పదిమంది ప్రముఖ రచయితలు హాజరవుతున్నారు. రచనా వ్యాసంగంలోని అన్ని అంశాలపై ఇందులో చర్చ ఉంటుంది. చిల్డ్రన్ ఆథర్స్, చిల్డ్రన్ కోసం ఒకరోజు కేటాయించారు. అయామ్ విల్ ‘లుంబినీ పార్క్‌లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు నేను నా స్నేహితులతో కలిసి అక్కడే ఉన్నాను. బేసిగ్గా హైదరాబాద్ లవర్ని. నేనెంతగానో ప్రేమించే హైదరాబాద్కైన ఆ గాయం చూశాక చాలా కలత చెందాను. చదివే అలవాటు, ఆ గాయం.. నేను బ్లాగ్ రాసేలా ప్రేరేపించాయి. అందుకే ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ఉద్యోగాన్నీ కాదనుకున్నాను. మాస్ కమ్యూనికేషన్లో పీజీ డిప్లమా చేసి రాయటర్స్‌లో చేరాను. అమ్మ ప్రోత్సాహంతో పబ్లిషర్నయ్యాను. డాలర్ నా డ్రీమ్ కాదు.. నేనుంటున్న ప్రదేశం గొప్పదనాన్ని చాటడమే నా ఎయిమ్. ఏ ప్రాంతానికైనా ఆ ప్రాంతం లిటరేచర్ కన్నా గొప్ప సంపద ఇంకేమీ ఉండదు. అందుకే పబ్లిష్ చేస్తున్నాను. చిన్నపిల్లల సాహిత్యం, చిల్డ్రన్ ఆథర్స్, ఇప్పటి వరకు వెలుగులోకి రాని రైటర్స్‌కి ఒక డయాస్ ఇవ్వడమే మా నివాసిని పబ్లిషర్స్ లక్ష్యం. - నివేదిత -
బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
బెంగళూరు: బీఎంటీసీ బస్సు ఢీకొని మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన ఇక్కడి వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక సర్జాపుర మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇంజినీరు నివేదిత (28) నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. మార్గంలో వైట్‌ఫీల్డ్ సమీపంలోని ఐటీపీఎస్ మెయిన్ రోడ్డులోక వస్తుండగా వెనుక నుంచి బీఎంటీసీ బస్సు డ్రైవర్ స్కూటర్‌ను ఓవర్టేక్ చేయడానికి యత్నించారు. ఆ క్రమంలో బస్సు... స్కూటర్‌ను ఢీకొట్టింది. దాంతో నివేదిత కింద పడిపోయింది. ఆమె తలపై నుంచి బస్సు వెళ్లి పోయింది. దీంతో నివేదిత అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.