చందన్ శెట్టి, నివేదిత గౌడ.. కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక భార్యాభర్తలయ్యారు. 2020 ఫిబ్రవరి 6న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయారు. ఇకపై నీకు, నాకు ఏ సంబంధమూ లేదంటూ విడాకులు తీసుకున్నారు.
నో 'ఇగో'
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎటువంటి ఇగో లేదు. కాకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటు ఉండేది. అలాంటప్పుడే కరోనా నాకు గుణపాఠం నేర్పింది. డబ్బును ఎలా వాడాలో తెలిసొచ్చేలా చేసింది. అప్పటివరకు పైసా అంటే లెక్క లేకుండా పోయింది. నేను చేసిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న సమయంలో ఈ మహమ్మారి వచ్చింది. అలా కోవిడ్ టైంలోనే నా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.50-60 లక్షలు ఖర్చు పెట్టాను.
తెలిసొచ్చింది
ఉన్నదంతా ఖర్చయ్యాక డబ్బు అవసరం తెలిసొచ్చింది. మళ్లీ చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాను. ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయంలో ఉండేవాడిని. నేను కంపోజ్ చేసిన ఏ పాట హిట్టవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అని భయంభయంగా ఉండేది. ఒకటి మాత్రం నిజం.. జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్
Comments
Please login to add a commentAdd a comment