Chandan
-
పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే..
చందన్ శెట్టి, నివేదిత గౌడ.. కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక భార్యాభర్తలయ్యారు. 2020 ఫిబ్రవరి 6న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయారు. ఇకపై నీకు, నాకు ఏ సంబంధమూ లేదంటూ విడాకులు తీసుకున్నారు.నో 'ఇగో'తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎటువంటి ఇగో లేదు. కాకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటు ఉండేది. అలాంటప్పుడే కరోనా నాకు గుణపాఠం నేర్పింది. డబ్బును ఎలా వాడాలో తెలిసొచ్చేలా చేసింది. అప్పటివరకు పైసా అంటే లెక్క లేకుండా పోయింది. నేను చేసిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న సమయంలో ఈ మహమ్మారి వచ్చింది. అలా కోవిడ్ టైంలోనే నా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.50-60 లక్షలు ఖర్చు పెట్టాను. తెలిసొచ్చిందిఉన్నదంతా ఖర్చయ్యాక డబ్బు అవసరం తెలిసొచ్చింది. మళ్లీ చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాను. ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయంలో ఉండేవాడిని. నేను కంపోజ్ చేసిన ఏ పాట హిట్టవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అని భయంభయంగా ఉండేది. ఒకటి మాత్రం నిజం.. జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
బిగ్‌బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!
బిగ్‌బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. హనీమూన్‌కు నెదర్లాండ్‌కు వెళ్లి వచ్చారు.ట్విస్ట్ ఇచ్చిన జంటసోషల్ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్, నివేదిత గౌడ స్పందించనేలేదు.బిగ్‌బాస్ షోలో..కాగా చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్లే, పొగరు, చూ మంతర్ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్‌బాస్ ఐదో సీజన్లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్లో నివేదిత కూడా పార్టిసిపేట్ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. -
రాష్ట్రంలో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో
-
హనీమూన్‌కు నెదర్లాండ్స్ వెళ్లాం
సాక్షి, మండ్య: హనీమూన్‌కు ‘మేము వెళ్లింది ఇటలీ కాదు.. నెదర్లాండ్‌కు’ అని నటుడు చందన్ శెట్టి తెలిపారు. తాము హనీమూన్‌కు ఇటలీ వెళ్లినట్లు అబద్ధపు వార్తలు సృష్టించారని ఆయన శనివారం తెలిపారు. కాగా, ఇటీవల నివేదితా, చందన్ శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం హనీమూన్‌కు వెళ్లారు. అయితే నూతన వధూవరులు ఇటలీకి హనీమూన్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మండ్యలో వారిరువురు మీడియాతో మాట్లాడుతూ... ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి వెళ్లిన విషయం అధికారుల వద్ద ఉందని చెప్పారు. తాము ఈ నెల 3న నెదర్లాండ్స్‌కు వెళ్లినట్లు, అప్పుడు అక్కడ కరోనా వైరస్ భయం లేదని తెలిపారు. ప్రస్తుతం తామిరువురం ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. రక్తపరీక్షలతో పాటు అన్ని వైద్య పరీక్షలు చేశారని తెలిపారు. కరోనా వెళ్లిపోయాక మళ్లీ హనీమూన్‌కు వెళ్తామని చెప్పారు. చదవండి: కరోనాతో హనీమూన్ రద్దు! నివేదితను పెళ్లాడిన చందన్ శెట్టి -
కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు!
కర్ణాటక,మైసూరు: కరోనా ఎఫెక్ట్ కన్నడ గాయకుడు చందన్‌శెట్టికి కూడా తాకింది. ఇటీవల మైసూరులో చందన్‌శెట్టి, నివేదితా గౌడల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం తరువాత వీరిరువురు హనీమూన్‌కు ఇటలీకి వెళ్లారు. కానీ ప్రస్తుతం ఇటలీలో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో తమ ప్రయాణాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకుని తిరిగి రానున్నారు. అయితే వారిరువురికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లేదని నిర్ధారించాకే నగరంలోకి అనుమతించాలని కొందరు సంఘ నేతలు జిల్లా కలెక్టర్‌కు మనవి చేశారు. అందరూ సామాన్యుల తరహాలోనే వారికి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కాగా, మైసూరులో ఇప్పటివరకు ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు. -
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం
మైసూరు : కన్నడ బిగ్‌బాస్ కంటెస్టంట్లు చందన్‌శెట్టి, నివేదిత గౌడ సోమవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నిశ్చితార్థం చేసుకొని బిగ్‌బాస్ హౌస్‌లో తమ మధ్య చిగురించిన ప్రేమను మరోమెట్టుకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొన్న గాయకుడు చందన్‌శెట్టి, నివేదిత గౌడ షో ముగిశాక బయట కూడా చెట్టపట్టాలేసుకొని తిరగడంతో ఇరువురి మధ్య ప్రేమాయణం జరుగుతోందని వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా దసరా ఉత్సవాల్లో పాల్గొన్న చందన్‌శెట్టి అదే కార్యక్రమంలో పాల్గొన్న నివేదితకు ప్రేమ వ్యక్తపరచగా దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. -
క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్ విజేత
కర్ణాటక ,మైసూరు : దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన యువ దసరా వేదికపై తన ప్రేమను వ్యక్తపరచినందుకు సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బిగ్‌బాస్ విజేత, గాయకుడు చందన్ శెట్టి క్షమాపణలు కోరారు. నగరంలోని మహరాజ కాలేజీ మైదానంలో నిర్వహించిన యువ దసరా వేదికపై గత సీజన్ బిగ్‌బాస్ విజేత చందన్‌శెట్టి అదే షోలో పాల్గొన్న నివేదిత గౌడకు ప్రేమను వ్యక్తపరచి నిశ్చితార్థం ఉంగరాన్ని బహుకరించాడు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలతో పాటు నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహావేశాలు, విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో చందన్‌శెట్టి శనివారం మీడియా ఎదుట క్షమాపణలు చెప్పాడు. నివేదితకు ప్రేమ వ్యక్తపరచడం వ్యక్తిగత నిర్ణయమని అయితే బహిరంగ వేదికపై అలా ప్రేమను వ్యక్తపరచడం తప్పేనని అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై మంత్రి సోమణ్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి దసరా ఉత్సవ సమితి చందన్‌శెట్టికి నోటీసులు జారీ చేయడానికి నిర్ణయించుకుంది. -
చందన్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: చందన్ సహాని (220 బంతుల్లో 283; 33 ఫోర్లు, 15 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు విక్రమ్ నాయక్ (351 బంతుల్లో 185; 21 ఫోర్లు) భారీ శతకం బాదడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎంపీ కోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవర్గ్రీన్ జట్టు 123 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ కోల్ట్స్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మొహుల్ భూమిక్ (50; 11 ఫోర్లు), వైష్ణవ్ రెడ్డి (56; 11 ఫోర్లు), మొహమ్మద్ అసదుద్దీన్ (49; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. ప్రస్తుతం నిఖిలేశ్ సురేంద్రన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు), అభినవ్ తేజ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఎవర్గ్రీన్ బౌలర్లలో సుఖైన్ జైన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 391/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఎవర్గ్రీన్ జట్టు చందన్ చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. 155 పరుగులతో రెండో రోజు మైదానంలోకి వచ్చిన చందన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజు అతను 12 ఫోర్లు, 10 సిక్స్‌ల సాయంతో 128 పరుగులు చేయడం విశేషం. అతనికి మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విక్రమ్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 441 బంతుల్లో 430 పరుగులు జోడించారు. అనంతరం చందన్, విక్రమ్, ప్రణీత్ రెడ్డి (0), శ్యామ్ (6) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో రిత్విక్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: ఎస్సీఆర్సీఏ: 364 (ఎమ్. సురేశ్ 57, బి. సుధాకర్ 38; సాకేత్ సాయిరామ్ 6/117), జై హనుమాన్: 119/6 (రోహిత్ రాయుడు 30, ఎస్కే ఖమ్రుద్దీన్ 3/15). ఇన్‌కంట్యాక్స్: 556 (షాదాబ్ తుంబి 188, విదాత్ 3/92, భగత్ వర్మ 3/137), దయానంద్ సీసీ: 228/6 (అన్షుల్ లాల్ 100, చైతన్య కృష్ణ 104). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 232; (సంతోష్ గౌడ్ 31 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 320 (రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ 92, టి. రవితేజ 60, నీరజ్ బిష్త్ 36; గన్ను సధన్ 5/114, తేజోధర్ 3/64); బీడీఎల్ రెండో ఇన్నింగ్స్: 98/4. ఎస్బీఐ: 342, ఈఎంసీసీ: 244 (మిఖిల్ జైస్వాల్ 39, షేక్ సోహైల్ 83, అంకిత్ అగర్వాల్ 30, అజయ్ దేవ్ గౌడ్ 37 నాటౌట్; అశ్విన్ యాదవ్ 5/34, ఆకాశ్ భండారి 3/82). గ్రూప్ బి: ఏఓసీ: 436 (ఇర్ఫాన్ ఖాన్ 31, ఆశిష్ 5/111); కేంబ్రిడ్జ్ ఎలెవన్: 116 (రాహుల్ చహర్ 4/24); ఏఓసీ రెండో ఇన్నింగ్స్: 75/4. ఎన్స్‌కాన్స్: 393 (అస్కారి 104, అజహరుద్దీన్ 32), కాంటినెంటల్ సీసీ: 139/3 (అనిరుధ్ సింగ్ 67 బ్యాటింగ్). జెమిని ఫ్రెండ్స్: 429 ( కౌషిక్ యాదవ్ 118, రచనేశ్ యాదవ్ 88, మల్లికార్జున్ 4/74, మీర్ ఒమర్ ఖాన్ 3/113), ఇండియా సిమెంట్స్: 115/8 (రోహాన్ 30). -
తడ్రి డైరెక్షన్, కుమార్తె యాక్షన్
జై హనుమాన్. ప్రస్తుతం ఇదే మంత్రాన్ని జపిస్తోంది యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలీ. కన్నడ బిగ్ బాస్ విన్నర్ చందన్ హీరోగా, కుమార్తె ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా అర్జున్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రేమ బరహ’. ఈ సినిమాతో తన కుమార్తెను కన్నడ ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్నారు అర్జున్. ఈ సినిమాలో వచ్చే హనుమాన్ చాలీసా సాంగ్ కోసం అర్జున్ తన మేనల్లుళ్లు ధ్రువ్ సర్జా, చిరంజీవి సర్జా మరియు చాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో కలిసి కాలు కదపబోతున్నారు. వీళ్ళంతా ఆంజనేయ స్వామి భక్తులు కావటం విశేషం. ఈ హనుమాన్ చాలీసా సాంగ్‌ను జెస్సీ గిఫ్ట్ కంపోజ్ చేయగా యస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. -
పేరు మారింది!
తమిళసినిమా: సినిమాలకు మొదట పెట్టిన పేర్లను ఆ తరువాత మార్చడం అన్నది సాధారణ విషయమే. అదే విధంగా ఇప్పుడు నటుడు అర్జున్ వారసురాలు ఐశ్వర్యాఅర్జున్ నాయకిగా నటిస్తున్న చిత్రం పేరు మారింది. యాక్షన్‌కింగ్‌గా పేరొందిన అర్జున్ తన కూతురు ఐశ్వర్యను నాయకిగా ప్రమోట్ చేసే విధంగా కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలతో పాటు, నిర్మాణ బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుని శ్రీరామ్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి కాదలిన్ పొన్ వీధియిల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్‌కు జంటగా చందన్ అనే నూతన నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. కే.విశ్వనాథ్, నటి సుహాసిని, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి ద«శకు చేరుకున్నాయి. ఇప్పుడీ చిత్రానికి సొల్లివిడవా అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే చిత్ర ఆడియో, చిత్ర విడుదల తేదీల గురించి వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.ఈ చిత్రానికి జెస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా ఉంటుందట.అందులోనూ మంచి కామెడీ, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. కాగా ఐశ్వర్యాఅర్జున్ ఇంతకు ముందు విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా నాయకిగా పరిచయమైందన్నది గమనార్హం.అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో సొల్లివిడవా చిత్రం ఐశ్వర్యాఅర్జున్కు చాలా కీలకం అవుతుందని చెప్పవచ్చు.