
జై హనుమాన్. ప్రస్తుతం ఇదే మంత్రాన్ని జపిస్తోంది యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలీ. కన్నడ బిగ్ బాస్ విన్నర్ చందన్ హీరోగా, కుమార్తె ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్‌గా అర్జున్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రేమ బరహ’. ఈ సినిమాతో తన కుమార్తెను కన్నడ ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్నారు అర్జున్.
ఈ సినిమాలో వచ్చే హనుమాన్ చాలీసా సాంగ్ కోసం అర్జున్ తన మేనల్లుళ్లు ధ్రువ్ సర్జా, చిరంజీవి సర్జా మరియు చాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో కలిసి కాలు కదపబోతున్నారు. వీళ్ళంతా ఆంజనేయ స్వామి భక్తులు కావటం విశేషం. ఈ హనుమాన్ చాలీసా సాంగ్‌ను జెస్సీ గిఫ్ట్ కంపోజ్ చేయగా యస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు.
Comments
Please login to add a commentAdd a comment