Aishwarya Arjun
-
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ (ఫొటోలు)
-
ఈ చలాకీ చిన్నారి.. పెళ్లి కూతురైంది.. బంగారు బొమ్మలా! (ఫోటోలు)
-
నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా?
కూతురి ప్రేమను అర్థం చేసుకుని నచ్చినవాడితో పెళ్లి జరిపించాడు యాక్షన్ కింగ్ అర్జున్. తన పెద్ద కూతురు ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబిరామయ్య కుమారుడు ఉమాపతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆమె ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్.. తంబిరామయ్యతో మాట్లాడాడు. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో ఈ మధ్యే ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం చెన్నైలో ఎంతో వేడుకగా రిసెప్షన్ సెలబ్రేట్ చేశారు.కోట్లాది కట్నంతన గారాల కూతుర్ని అత్తారింటికి సాగనంపిన అర్జున్.. అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. వందలాది కోట్లు కట్నం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. అలాగే కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చాడట! అర్జున్‌కు మగ పిల్లలు లేరు. ఉన్న ఇద్దరూ కూతుర్లే! అందుకే తను సంపాదించిన ఆస్తులను భారీ మొత్తంలో కట్నంగా ఇచ్చేందుకు అస్సలు వెనకడుగు వేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యాక్టరే కాదు సింగర్ కూడా!అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. విరున్ను అనే ద్విభాషా(మలయాళ, తమిళ) చిత్రం చేస్తున్నాడు. అలాగే తీయవర్ కులైగళ్ నాదుంగ, విడాముయుర్చి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు, రచయిత, దర్శకనిర్మాత కూడా! అలాగే చిట్టుకురువి (పరశురామ్), కట్టున అవలా కట్టువేండ (జైసూర్య) వంటి పలు సాంగ్స్ సైతం పాడాడు. సర్వైవర్ తమిళ్ షోతో హోస్ట్‌గానూ మారాడు.చదవండి: సినిమాను మించిన స్టోరీ.. విడాకుల తర్వాత ఆరేళ్లకు..! -
కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో హీరోగా చేశాడు. ప్రస్తుతం మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు. రీసెంట్గా ఇతడి కూతురు ఐశ్వర్య పెళ్లి జరిగింది. తమిళ నటుడు తంబిరామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి పీటలు ఎక్కారు. సంగీత్, పెళ్లి, రిసెప్షన్ పూర్తయిన తర్వాత వీళ్లంతా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ 'లవ్ మీ')'తంబిరామయ్యది మంచి సంప్రదాయ కుటుంబం. ఆ మధ్య ఓ టీవీ షోకి హోస్టింగ్ చేశారు. అందులో ఉమాపతి రామయ్య ఓ కంటెస్టెంట్‌గా పోటీ చేశాడు. అప్పుడే తన నాకు నచ్చేశాడు. ఓ రోజు నా కూతురు ఐశ్వర్య నాతో విడిగా మాట్లాడాలని అడిగింది. దీంతో అది ప్రేమ వ్యవహారం అని ఊహించా. ఉమాపతి రామయ్య పేరు చెప్పడంతో నేను షాకయ్యా. ఆ తర్వాత ఉమాపతి రామయ్య ఫ్యామిలీతో నేను కట్టించిన ఆంజనేయ స్వామి ఆలయంలో మాట్లాడుకున్నాం. అలా ఐశ్వర్య, ఉమాపతి పెళ్లి జరిగిపోయింది' అని అర్జున్ చెప్పుకొచ్చారు.పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తారా అని అడుగుతున్నారనే ప్రశ్నకు బదులిచ్చిన అర్జున్.. తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్న ఆమెకు.. పెళ్లి తర్వాత నటించాలా వద్దా అనే విషయం కూడా తెలుసని అర్జున్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: దానికి నేను సరైన వ్యక్తి కాదు.. వాళ్లయితేనే: శ్రుతి హాసన్) -
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
-
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా రిసెప్షన్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, లెజెండరీ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి జూన్ 10న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇరుకుటుంబాలు సహా దగ్గరి బంధుమిత్రులు సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం (జూన్ 14న) చెన్నై లీలా ప్యాలెస్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బీజేపీి అధ్యక్షులు అన్నామలై, స్నేహ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.చదవండి: చివరిసారిగా అడుగుతున్నా.. ఒక్కసారి వచ్చిపో షారూఖ్.. -
అర్జున్ కూతురి పెళ్లి వీడియో నెట్టింట వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి కొద్దిరోజుల క్రితమే ఘనంగా జరిగింది. అయితే, తాజాగా తన ముద్దుల కూతురి పెళ్లి వేడుక వీడియోను అభిమానుల కోసం ఆయన షేర్ చేశాడు. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న వీరి ప్రేమ వివాహం జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది ప్రముఖులు పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు.అర్జున్ షేర్ చేసిన వీడియోలో ఐశ్వర్య- ఉమాపతిల పెళ్లి వేడుకను చూడొచ్చు. వీణా శ్రీవాణి అందించిన చక్కని సంగీతంతో వీడియో ప్రారంభమౌతుంది. పెళ్లి పీటలపై ఐశ్వర్యను చూసుకున్న అర్జున్ చాలా మురిసిపోతాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు వీడియోలో చాలానే ఉన్నాయి.మా ముద్దుల కూతురు ఐశ్వర్య తనకు నచ్చిన, మా ప్రియమైన ఉమాపతిని వివాహం చేసుకున్నప్పుడు మేము అనుభవించిన ఆనందం మాటల్లో చెప్పలేము. తన పెళ్లి ఎన్నో మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. వారిద్దరూ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టడం చూస్తుంటే మా హృదయాలు గర్వంతో నిండిపోయాయి. 'జీవితకాలం పాటు మీ ప్రేమకు తోడు ఆనందం కూడా జతకూడాలని వేల కోట్ల ఆశీర్వాదాలు అందిస్తున్నాము. మీరు పంచుకునే ప్రేమలాగే మీ ప్రయాణం కూడా అందంగా ఉండాలి. ఎప్పటికీ మేము మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాము.' అని అర్జున్ ఎమోషనల్‌గా ఒక పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Arjun Sarja (@arjunsarjaa) -
కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి(ఫోటోలు)
-
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు, హీరోయిన్ ఐశ్వర్య మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. కోలీవుడ్ లెజెండరీ నటుడు, దర్శకుడు తంబి రామయ్య ఇంటికి కోడలిగా వెళ్లనుంది. తంబి రామయ్య కుమారుడు, యంగ్ హీరో ఉమాపతితో జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేయనుంది. ఆప్యాయంగా ముద్దాడిన తండ్రిఇప్పటికే పెళ్లి పనులు జోరందుకోగా తాజాగా హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దాడాడు. కాగా ఇది లవ్ మ్యారేజ్.. ఐశ్వర్య- ఉమాపతి ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా గతేడాదే వారు పచ్చజెండా ఊపారు. అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిపారు.కెరీర్..సినిమాల విషయానికి వస్తే.. ఐశ్వర్య కెరీర్ అనుకుంత సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సినిమా తీయగా అది కూడా ఆశించినంత ఫలితం అందుకోలేకపోయింది. మరోవైపు ఉమాపతి అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా? -
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్‌లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్‌లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వరుడు ఎవరంటే?కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
గ్రాండ్‌గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా
కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్నదే నిజమైంది. ఆ హీరోహీరోయిన్ ఒకటయ్యారు. పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) ఎవరా జోడీ? కర్ణాటకకు చెందిన అర్జున్ సర్జా.. సొంత భాషలో కంటే తెలుగు, తమిళంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జెంటిల్‌మేన్, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రీసెంట్గా 'లియో'లో హరోల్డ్ దాస్ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇతడి కూతురు ఐశ్వర్య అర్జున్.. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె నిశ్చితార్థమే ఇప్పుడు జరిగింది. తమిళంలో కామెడీ తరహా పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కొడుకు ఉమాపతి.. హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇతడితోనే అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ జరిగింది. చెన్నైలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబరులోనే పెళ్లి కూడా ఉండొచ్చని అంటున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ 'మ్యాడ్' సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) View this post on Instagram A post shared by Dhruvasarja_fans_adda🔵 (@dhruvasarja_fans_adda) -
హీరోతో ప్రేమలో అర్జున్ సర్జా కూతురు.. త్వరలోనే నిశ్చితార్థం!
అర్జున్ సర్జా.. సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషల్లో నటించి యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు. చాలా ఏళ్లపాటు హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఈయనకు డైరెక్షన్‌లోనూ అనుభవం ఉంది. అర్జున్ సర్జాకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సినీరంగ ప్రవేశం చేసి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన హిట్ మాత్రం తన ఖాతాలో పడలేదు. కూతురి కోసం నటుడి విశ్వ ప్రయత్నాలు కూతురి కోసం అర్జున్ డైరెక్టర్‌గా మారి సొల్లితరవా సినిమా తీశాడు. ఇది కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. దీంతో మరోసారి తన కూతురిని హీరోయిన్గా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్య చాలాకాలంగా ప్రముఖ నటుడి తనయుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. లెజెండరీ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఉమాపతి కూడా హీరోయే! వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారని, త్వలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి! ఇకపోతే ఉమాపతి కూడా కోలీవుడ్‌లో హీరోగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అడగప్పట్టత్తు మగజనంగళే, మనియార్ కుటుంబం, తిరుమనం, థానే వాడి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. చదవండి: నన్ను చూసి ఈమె హీరోయినేంటి? అని ఓ లుక్కిచ్చారు -
కూతురి కోసం యాక్షన్ కింగ్ మరో ప్రయత్నం, ఈసారైనా వర్కవుట్ అయ్యేనా?
యాక్షన్ కింగ్‌గా గుర్తింపు పొందిన నటుడు అర్జున్. ఈయనలో మంచి దర్శకుడూ ఉన్నాడనే విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు హీరోగా నటించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో విశాల్ సరసన మదయానై చిత్రంలో కథానాయకిగా నటించారు. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్‌కు ఏమాత్రం సాయం చేయలేదు. దీంతో అర్జున్ తన కూతురు ఐశ్వర్య కథానాయికగా సొల్లితరవా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తమిళం, కన్నడం భాషల్లో నిర్మించారు. ఆ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ ఆయన కూతుర్ని కథానాయికగా నిలబెట్టడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. తన సొంత బ్యానర్.. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కూడా ఆయనే చేపట్టారు. ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటుడు సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, జయరాం తదితరులతో పాటు అర్జున్ కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ హిన్దేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్ -
చాలా సార్లు కాల్ చేశా.. పట్టించుకోలేదు: విశ్వక్సేన్పై అర్జున్ ఫైర్
యంగ్ హీరో విశ్వక్సేన్పై సీనియర్ హీరో అర్జున్ ఫైర్ అయ్యాడు. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. అందులో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విశ్వక్ సేన్‌పై ఫైర్ అయ్యాడు. ‘నేను చెప్పిన కథ విశ్వక్సేన్కి బాగా నచ్చిందని చెప్పాడు. రెమ్యునరేషన్ విషయంలోనూ అతను చెప్పిన విధంగానే అగ్రిమెంట్ జరిగింది.కానీ కొన్ని వెబ్‌సైట్స్‌లో మా సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో తెలియదు. నా లైఫ్‌లో విశ్వక్ సేన్‌కి చేసినన్ని కాల్స్ ఎవరికి చేయలేదు. ప్రతిసారి షూటింగ్ వస్తానని చెప్పి డుమ్మా కొడతాడు. కేరళలో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైమ్ కావాలి అన్నాడు. నేను కూడా ఆర్టిస్ట్‌నే కదా.. అర్థం చేసుకొని ఓకే చెప్పి ఆ షేడ్యూల్ని కాన్సిల్ చేసుకున్నాం. దాని వల్ల జగపతి బాబు లాంటి పెద్ద నటుల డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి. అయినా పర్లేదు అనుకున్నాను. ఆ తర్వాత విశ్వక్‌కి నేను చాలా సార్లు కాల్ చేశాను.. అతను పట్టించుకోలేదు. ఇటీవల నా దగ్గర వచ్చి మళ్లీ కథ చెప్పమన్నాడు. చెప్పాను సూపర్ అని అన్నాడు. దీంతొ ఈ నెల 3న షూట్ పెట్టుకున్నాం. రాత్రి 2 గంటల వరకు నాతో టచ్‌లో ఉన్నాడు. ఈ రోజు షూట్ అనగా.. ఉదయం ‘నేను రావడం లేదు.. నాకు టైమ్ కావాలి’అని మెసేజ్ చేశాడు. కథ నచ్చింది ప్రొడక్షన్ నచ్చింది అని చెప్పిన విశ్వాక్ సేన్ కి ఇంకా ఏమి నచ్చలేదు? సీనియర్ హిరోలు ఎంతో కమిట్ మెంట్‌తో ఉంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు.. వాళ్లకు ఏమి తక్కువ? మన వర్క్ కి మనం సిన్సియర్ గా ఉండాలి అని చెపుతున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో టీమ్ వర్క్ ప్రధానం. ఇలాంటి వాతావరణంలో విశ్వక్‌తో నేను సినిమా చేయలేను. ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను. ఇక్కడ ఒక పద్దతి ఉంటుంది .. అందరూ ఆ పద్ధతిని పాటించాలి. కుదరదు అంటే ఇంట్లో కూర్చోవాలి. అనూప్ మ్యూజిక్ , బుర్ర సాయిమాదవ్ డైలాగ్స్ , చంద్రబోస్ పాటల విషయంలో విశ్వక్ నాతో విభేదించారు. విశ్వక్ ప్రవర్తన వల్ల నేను ప్రస్తుతం సినిమా ఆపేశాను. వందకోట్లు వచ్చినా నేను విశ్వక్ తో సినిమా చేయను. త్వరలోనే కొత్త హీరో, టైటిల్ తో సినిమాను ప్రకటిస్తాను. విశ్వక్ ప్రవర్తనను ప్రొడ్యూసర్ గిల్డ్ దృష్టికి తీసుకెళ్తాను’అని అన్నారు. -
మరో వివాదంలో ఇరుక్కున్న విశ్వక్ సేన్.. ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్?
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతున్నాడు. రీసెంట్గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా పూర్తిచేశారు. ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన అర్జున్ సర్జా విశ్వక్ సేన్ మీద ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళుతుందన్నది చూడాల్సి ఉంది. -
ఐశ్వర్య అర్జున్ స్టయిలిష్ ఫోజులు (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ మూవీకి క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్ (ఫొటోలు)
-
యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు
Vishwak Sen Movie With Aishwarya Arjun In Arjun Sarja Direction: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న విడుదలై సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఈ సినిమా హిట్‌తో మంచి జోష్ మీదు ఉన్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో కొత్త ప్రాజెక్టులో విశ్వక్ సేన్ జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మూవీకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఐశ్వర్య. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై అర్జున్ నిర్మిస్తున్నఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. రోడ్ ట్రిప్ కథాంశంగా సాగే ఈ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చదవండి: 👇 సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ -
హీరోయిన్ ఐశ్వర్య అర్జున్‌కు కరోనా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఐశ్వర్య తెలిపారు. ఇక ఐశ్వర్య అర్జున్ 2013లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. (24 గంటల్లో 40 వేల పాజిటివ్ కేసులు) నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో తను హోం క్వారంటైన్‌కు పరిమితమైనట్లు తెలిపారు. ఇక కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్త ఉండాలన్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో పంచుకుంటానని ఆమె తెలిపారు. (తెలుగు పాఠాలు) -
తెలుగు పాఠాలు
యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు ఓ పెద్ద ప్లాన్‌లో ఉన్నారు. తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగుకి పరిచయం చేయాలన్నదే ఆ ప్లాన్. అర్జున్ కన్నడ అయినప్పటికీ తెలుగులోనూ మంచి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ తెలుగు సినిమాలు చేస్తున్నారాయన. తెలుగు ఇండస్ట్రీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అంటున్న అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యా అర్జున్‌ని తెలుగులోకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఐశ్వర్య హీరోయిన్గా అర్జున్ తెలుగులో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఓ అగ్ర తెలుగు నిర్మాతతో కలిసి ఆయన ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ సినిమా కోసమే ఐశ్వర్య తెలుగు నేర్చుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే తమిళ, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించి, మంచి నటి అనిపించుకున్న ఐశ్వర్య ఇప్పుడు టాలీవుడ్లో తనను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం మలయాళ ‘ఇష్క్’ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నారు ఐశ్వర్య. ఇక టాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారట. -
సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు
‘మీరెలాంటి ఫాదర్’ అంటే ‘మా నాన్నంత బెస్ట్ నేను కాదు’ అంటారు అర్జున్. ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో తన తండ్రిని చూసి నేర్చుకున్నాను అంటున్నారు. ఇంకా అర్జున్ చెప్పిన విశేషాలు. ► ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి? ఒక మంచి తండ్రి అనిపించుకోవాలంటే మా నాన్నలా ఉండాలి. ఏ తండ్రి అయినా పిల్లలకు కొంచెం సంస్కారం ఇవ్వాలి. అది నా తండ్రి నాకు ఇచ్చారు. పిల్లలకు ఆస్తులు కూడబెట్టి ఇస్తారు కొందరు. లేనివాళ్లు ఇవ్వలేరు. అయితే సంస్కారం అనేదానికి డబ్బు అక్కర్లేదు. ఆ తండ్రి సంస్కారవంతుడు అయితే బిడ్డలకు కూడా అదే నేర్పిస్తాడు. నా తండ్రి (అర్జున్ తండ్రి జేసీ రామస్వామి నటుడు – ఆయన స్క్రీన్ నేమ్ శక్తిప్రసాద్) మాకు సంపద కాదు.. సంస్కారం ఇచ్చారు. ► సంస్కారం ఉన్నవాళ్లు తమ సంసారం విషయంలో చాలా బాధ్యతగా కూడా ఉంటారు. కుటుంబం విషయంలో మీ తండ్రి తీసుకున్న కేర్ గురించి? పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే తండ్రి అయిపోడు. పెళ్లంటే పెద్ద బాధ్యత. భార్యని తన తల్లిలా చూసుకునేవాడే నిజమైన తండ్రి.. బిడ్డల్ని కూడా తల్లిలా చూసుకోవాలి. భార్యని, పిల్లలను సరిగ్గా చూసుకోలేనివాళ్లు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి మగవాళ్లకు పెళ్లి చేసుకునే అర్హత లేదని నా అభిప్రాయం. ఎఫెక్షన్, కేరింగ్ అనేవి చాలా ముఖ్యం. మా నాన్న చనిపోయి దాదాపు 30 ఏళ్లు అయింది. ఇప్పటికీ ఆయన తాలూకు జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉన్నాయి. అంతలా మీ నాన్నగారు మీకోసం ఏం చేశారంటే ఒకటి, రెండు, మూడు... అని లెక్కేసి ఇన్సిడెంట్స్ చెప్పలేను. అదొక ఫీలింగ్. నేను స్కూల్ నుంచి ఇంటికి రావడానికి అరగంట లేటైతే చాలు కంగారుపడేవారు. 5:30 గంటలకు రావాల్సింది 6 గంటలకు వస్తే నేను వచ్చేవరకూ బయట నిలబడి వెయిట్ చేస్తుండేవారు. అంత కేరింగ్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. అయితే చెప్పాను కదా.. నాన్న అంటే ఓ ఫీలింగ్ అని. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో తెలియడంలేదు. ► జనరల్‌గా అమ్మ దగ్గర చనువు ఉంటుంది. నాన్నకు భయపడతాం. మరి మీరు? మా నాన్న అంటే నాకు భయం. అయితే నేను తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడేవాడిని. లేకుంటే ఆయన మెడపై కూర్చునేటంత చనువు ఉంది. ఎప్పుడూ నన్ను భయపెట్టాలని ఓ టీచర్‌లాగా ‘ఏయ్’ అంటూ అరిచేవారు కాదు. నాతో మామూలుగా మాట్లాడేవారు. అయితే తప్పు చేస్తే నాన్నకు కోపం వస్తుంది అనే ఫీల్‌ని పిల్లలకు కలిగేలా చేయగలిగారు. ► మీ నాన్నగారు మీకు నేర్పించిన విషయాల్లో ముఖ్యమైనవి ఏమైనా? దేశభక్తి, దైవభక్తి... రెండూ నేర్పించారు. ఈరోజు ఆధ్యాత్మికంగా ఓ గుడి (ఆంజనేయ స్వామి) కడుతున్నానంటే భక్తి అనే విత్తనాన్ని నా మైండ్‌లో చిన్నప్పుడే నాటారు నాన్న. దేశం పట్ల ప్రేమ, భక్తి ఉండాలని నా గుండెల్లో పెట్టుకునేలా చేసింది కూడా ఆయనే. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి చెప్పారు. వారి త్యాగాల గురించి చెప్పారు. ఆయన చెప్పినప్పుడు తెలియకుండానే ‘ఓహో... దేశం అంటే ఇది. మన స్వాతంత్య్రం వెనక ఇంతమంది త్యాగం ఉంది’ అనేది మనసులో నాటుకుపోయింది. దేశభక్తి భావం పెంపొందింది. దేశాన్ని నువ్వు ఎంతో ప్రేమించాలని చెప్పేది కూడా నాన్నే అయ్యుండాలి. ఇలాంటి అర్హతలన్నీ ఉంటేనే ఫాదర్.. లేకుంటే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లనేది ఓ బాధ్యత.. ఓ కర్తవ్యం. ► అర్జున్ వాళ్ల తండ్రి గొప్పా? లేక ఐశ్వర్య (అర్జున్ కూతురు) తండ్రి గొప్పా? ప్రపంచంలో నా తండ్రే గొప్ప అని ప్రతి పిల్లలు చెప్పుకుంటారు. నిజంగా నేను కూడా అలాగే ఫీలవుతాను.. అలాగే నేను గొప్ప తండ్రిని అనుకుంటున్నాను. మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా, చాలా సెక్యూర్డ్ ఫాదర్‌ని.. నా కూతురు పక్కన నేనుంటే తనని చూడటానికి కూడా భయపడతారు. ఇవన్నీ ఓకే.. కానీ మనం ప్రేమ ఇవ్వాలి. ప్రతి తండ్రీ ‘ఐ యామ్ ది బెస్ట్’ అంటుంటారు. మా అమ్మాయి ‘మా నాన్న బెస్ట్’ అంటుంది. అప్పుడు నేనేమన్నానంటే.. ‘నీకు నేను బెస్ట్ అయితే.. మా నాన్న నీ బెస్ట్ ఇంటూ వెయ్యి రెట్లు’ అన్నాను. మా నాన్న అంత గుడ్ ఫాదర్‌లా ఉండటానికి ట్రై చేస్తున్నాను. ► మీ నాన్నగారు సంస్కారం ఇచ్చారు. మీ పిల్లలకు మీరు అది ఇవ్వడంతోపాటు బాగా ఆస్తులు కూడా ఇచ్చారు కదా? యస్. నా వద్ద డబ్బు ఉంది.. స్టేటస్ ఉంది. బాగా ఖర్చు పెట్టగలుగుతాను.. మా అమ్మాయి ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగలను. ఫారిన్ పంపించగలను. అప్పట్లో మా నాన్నకి అంత స్తోమత లేదు.. అయినా మా నాన్నగారు బెస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఎబౌట్ మనీ, నాట్ స్టేటస్.. ఇట్స్ ఎ ఫీలింగ్. మనం పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు. సమాజంలో వాళ్లు ఓ మంచి వ్యక్తిగా బతికేలా తీర్చిదిద్దుతున్నామా? లేదా? అన్నదే ముఖ్యం. ► ఇంతకీ మీ నాన్నగారు మీకు జీవితం గురించి పదే పదే చెప్పేవారా? జస్ట్ ఆయన్ని చూసి నేర్చుకోమనేవారా? లైఫ్ అంటే ఒక ‘ఫ్లేవర్’. ఆ సువాససను మనం ఆస్వాదించగలుగుతాం తప్ప చూడలేం. వేరేవాళ్లు అడిగేటప్పుడే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. మీ ఫాదర్‌తో ఎప్పుడెప్పుడు మీకు అలా అనిపించింది? అని అడిగితే.. ఉదాహరణకి.. చిన్నప్పుడు హెయిర్ కటింగ్ షాప్‌కి నాన్న తీసుకెళ్లారు. అక్కడ కుర్చీలో ఎత్తు కోసం మరొక స్పాంజ్ సీట్ వేశారు. కటింగ్ చేసేటప్పుడు అలా నిద్రపోతూ తల కిందికి ఓ వైపు వాల్చేసేవాడిని. అప్పుడు కటింగ్ చేసే ఆయన తలని సరిగ్గా పెడతాడు. అయితే అతని చర్య సున్నితంగా ఉండదు. తలను అలా లాగి పక్కకి పెట్టినట్లు పెడతాడు. అది మా నాన్నకు నచ్చేది కాదు. అందుకని నా పక్కనే కూర్చుని నేను నిద్రపోకుండా కథలు చెబుతూ కటింగ్ చేయించేవారు.. ఇదొక సంఘటన. ఈ విషయంలో మీకు ఏం తెలుస్తుంది.. కేరింగ్, అఫెక్షన్ తెలుస్తున్నాయి కదా. ఇంకొక్కటి చెబుతా.. ఇవన్నీ నిజాలు.. ఒకరోజు నాన్న నన్ను ఎత్తుకుని రోడ్డు మీద వెళుతున్నప్పుడు పెద్ద ఎద్దు మీదకు వచ్చేసింది.. మా నాన్న పహిల్వాన్.. అంత స్ట్రాంగ్‌గా ఉండేవారు. కొంచెం అయ్యుంటే అది పొడిచేసేది. దాని ముక్కుతాడుని పట్టుకుని కంట్రోల్ చేశారు.. దాని యజమాని వచ్చేవరకూ అలాగే పట్టుకుని ఉన్నారు. ఇదంతా ఒక సినిమాటిక్‌గా ఉంటుంది. ► అప్పుడు మీ నాన్నని హీరో అనుకున్నారా? అంతేకదా! ఆయన కాకుంటే ఇంకెవరుంటారు? మా నాన్నది పల్లెటూరు. నాకూ చాలా ఇష్టం. అక్కడికి వెళ్లాలనిపిస్తుంటుంది? చెట్లు పెంచాలనిపిస్తుంది.. ఆవులు ఉండాలనిపిస్తుంటుంది. ఎందుకంటే అది నా రక్తంలోనే ఉంది. పనసపండు ఉంటుంది కదా.. దాన్ని మా నాన్నే కోసి మా అందరికీ ఇచ్చేవారు. పిల్లలందరం కావాల్సినవి తీసుకునేవాళ్లు. మా నాన్నకి ఒక్కటే మిగిలేది. ఏమీ అనేవారు కాదు. అదే తినేవారు. అప్పుడు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే.. ఇలాంటి ఎన్నో త్యాగాలు చేశారాయన. అందుకే ‘మై డాడ్ ఈజ్ మై హీరో’. ► హీరోగా మీ విజయాన్ని మీ నాన్నగారూ చూశారా? చూశారు. పిల్లల సక్సెస్‌ని తల్లిదండ్రులు తమ విజయంగా భావిస్తారు. నేను హీరోగా నటించిన సినిమాల వంద రోజుల వేడుకలకు నాన్న వచ్చారు. వాటిలో తెలుగు సినిమా ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమా ఫంక్షన్ ఒకటి. మరణం మన చేతుల్లో లేదు. నాన్న చనిపోయినప్పుడు నాకు పాతికేళ్లు కూడా ఉండవనుకుంటా. ఆయన జ్ఞాపకాలు పదిలంగా మనసులో దాచుకున్నాను. కుమార్తె ఐశ్వర్య, భార్య నివేదితాతో అర్జున్ -
నా కూతుర్ని నేనెందుకు అడ్డుకోవాలి?
సౌత్‌తోపాటు నార్త్ మొత్తం అన్ని భాషల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు నటుడు అర్జున్ సార్జా. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి అడుగుపెట్టినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. దీంతో ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే హాట్ టాపిక్ ‘కాస్టింగ్ కౌచ్’ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ స్పందించారు. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే. ప్రతీ ఫీల్డ్‌లోనూ అది ఉంది. ఇండస్ట్రీపై చాలా మందికి చెడు అభిప్రాయం ఉండొచ్చు. కానీ, మంచి చెడుల ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడూ ఎవరూ అడ్డుకోరు. చెడు రూట్లో వెళ్తే అది వాళ్ల దురదృష్టం. ఏదో జరుగుతుందని నా కూతురిని సినిమాల్లోకి రానీయకుండా నేను అడ్డుకోవాలా? అలాగైతే మిగతా వాళ్ల సంగతి ఏంటి? వాళ్లూ వాళ్ల కూతుళ్లను రానిస్తున్నారు కదా. స్టార్లు కూడా అందుకు మినహాయింపు కాదు. నేను ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా ఉన్నా. అలాంటప్పుడు అన్నీ తెలిసి నేనెందుకు భయపడాలి. నా కూతురిని నేనెందుకు అడ్డుకోవాలి’ అని యాక్షన్ కింగ్ కుండబద్ధలు కొట్టేశారు. -
తడ్రి డైరెక్షన్, కుమార్తె యాక్షన్
జై హనుమాన్. ప్రస్తుతం ఇదే మంత్రాన్ని జపిస్తోంది యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలీ. కన్నడ బిగ్ బాస్ విన్నర్ చందన్ హీరోగా, కుమార్తె ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా అర్జున్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రేమ బరహ’. ఈ సినిమాతో తన కుమార్తెను కన్నడ ఇండస్ట్రీకు పరిచయం చేస్తున్నారు అర్జున్. ఈ సినిమాలో వచ్చే హనుమాన్ చాలీసా సాంగ్ కోసం అర్జున్ తన మేనల్లుళ్లు ధ్రువ్ సర్జా, చిరంజీవి సర్జా మరియు చాలెంజింగ్ స్టార్ దర్శన్‌తో కలిసి కాలు కదపబోతున్నారు. వీళ్ళంతా ఆంజనేయ స్వామి భక్తులు కావటం విశేషం. ఈ హనుమాన్ చాలీసా సాంగ్‌ను జెస్సీ గిఫ్ట్ కంపోజ్ చేయగా యస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. -
నేర్పించవా అంటున్న ఐశ్వర్యా అర్జున్
తమిళసినిమా: యాక్షన్‌కింగ్ అర్జున్ నటించిన చిత్రాలు గానీ, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు గానీ వైవిధ్యంతో పాటు దేశానికి సంబంధించిన ఒక మంచి సందేశంతో కూడి ఉంటాయి. వాటిలో కమర్షియల్ అంశాలకు కొదవ ఉండదు. అలాంటి అర్జున్ తాజాగా తన వారసురాలు ఐశ్వర్యా అర్జున్ నట కెరీర్‌ను నిలబెట్టే విధంగా సొల్లితరవా ( నేర్పించవా) పేరుతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి తన శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఐశ్వర్య అర్జున్‌కు జంటగా నవ నటుడు శాంతన్‌కుమార్ నటిస్తున్న ఇందులో నటి సుహాసిని, దర్శకుడు కే.విశ్వనాథ్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యభూమికల్ని నాన్ కడవుల్ రాజేంద్రన్, సతీష్, యోగిబాబు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. చిత్ర వివరాలను అర్జున్ తెలుపుతూ సొల్లితరవా చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. దేశానికి సంబంధించిన ఒక అంశంతో ప్రేమను జోడించి జనరంజకంగా రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. విధి నిర్వహణలో ఒక యువతీయువకుడు తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొని తమ ప్రేమను గెలిపించుకున్నారన్నదే సొల్లితరవా చిత్ర కథ అన్నారు. జెస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని చెన్నై, ధర్మస్థల, హైదరాబాద్, కేరళ, ఉత్తర భారతదేశంలోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రాన్ని దీపావళి సందర్భంగా తమిళం, కన్నడం భాషల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘నేర్పించవా’ అంటున్న ఐశ్వర్య అర్జున్
తమిళసినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన, దర్శకత్వం వహించిన చిత్రాలు గానీ వైవిధ్యంతోపాటు ఒక మంచి సందేశంతో కూడి ఉంటాయి. వాటిలో కమర్షియల్ అంశాలకు కూడా కొదువ ఉండదు. అలాంటి అర్జున్ తాజాగా తన వారసురాలు ఐశ్వర్యా అర్జున్ నట కెరీర్‌ను నిలబెట్టే విధంగా సొల్లితరవా (నేర్పించవా) పేరుతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి తన శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఐశ్వర్య అర్జున్‌కు జంటగా నవ నటుడు శాంతన్‌కుమార్ నటిస్తున్న ఇందులో నటి సుహాసిని, దర్శకుడు కె.విశ్వనాథ్, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్య భూమికల్ని నాన్ కడవుల్ రాజేంద్రన్, సతీష్, యోగిబాబు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సొల్లితరవా చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని అర్జున్ తెలిపారు. దేశానికి సంబంధించిన ఒక అంశంతో ప్రేమను జోడించి జనరంజకంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో ఒక యువతీయువకుడు తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొని తమ ప్రేమను గెలిపించుకున్నారన్నదే చిత్ర కథ అన్నారు. జెస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని చెన్నై, ధర్మస్థల, హైదరాబాద్, కేరళ, ఉత్తర భారతదేశంలోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రాన్ని దీపావళి సందర్భంగా తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.