నాన్న ముందే రొమాన్స్ చేశా! | Aishwarya Arjun with vishal in pattattuyanai movie | Sakshi
Sakshi News home page

నాన్న ముందే రొమాన్స్ చేశా!

Published Sat, Jan 21 2017 3:13 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

నాన్న ముందే రొమాన్స్ చేశా!

నాన్న ముందే రొమాన్స్ చేశా!

తన తండ్రి ముందే రొమాన్స్ సన్నివేశాల్లోనటించానని నటి ఐశ్వర్యా అర్జున్  తెలిపారు. యాక్షన్ కింగ్‌ అర్జున్  వారుసురాలైన ఈ బ్యూటీ విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా నాయకిగా రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఐశ్వర్యకు అవకాశాలు రాలేదు.అయితే తన తండ్రి చిత్రాల నిర్మాణ బాధ్యతల్లో పాలు పంచుకుంటూ వచ్చిన ఈ భామ మరో సారి హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు.అర్జున్ తన కూతురు హీరోయిన్ గా తమిళం,కన్నడం భాషల్లో స్వీయ దర్శకత్వంలో కాదలిన్  పొన్ వీధియిల్‌ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యాక్షన్  హీరోగా పేరు గాంచిన అర్జున్  ఈ చిత్రాన్ని ఫుల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించడం విశేషం.ఈ చిత్రం గురించి నటి ఐశ్వర్య మాట్లాడుతూ కాదలిన్  వీధియిల్‌ చిత్రం ప్యూర్‌ లవ్‌స్టోరీగా ఉంటుందన్నారు.ఇందులో తనకు నటుడు శాంతనుకు సమానంగా పాత్రలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఇందులో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నాన్న ముందు నటించడానికి ముందు సంకటం అనిపించిందన్నారు.అయితే తాను షూటింగ్‌ స్పాట్‌లో నాన్నను ఒక దర్శకుడుగానే చూడడం వల్ల సంకంటం అన్నది ముందు కొంత సేపే ఉందని, ఆ తరువాత శాంతనుతో కలిసి సహజంగా నటించానని తెలిపారు. తమది నట కుటుంబం కావడం కూడా ఇందుకు ఒక కారణం అని నటి ఐశ్వర్యాఅర్జున్  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement